యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన రామయ్యవస్తావయ్యా మూవీ ముఫ్పై థియోటర్లకే పరిమితం అయింది. ఈ లెక్క మన ఆంద్రప్రదేశ్‌ది కాదు. అక్టోబర్ 11న ఘనంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న రామయ్యవస్తావయ్యా మూవీకు, తమిళనాడులో చుక్కెదురయ్యింది. తమిళనాడులో మన తెలుగు మూవీలకు బాగానే ఆధరణ ఉంటుంది.రామయ్యవస్తావయ్యా మూవీను తమిళనాడులో అరవైకు పైగా థియోటర్లలో రిలీజ్ చేయాలనుకున్నారు. కాని చివరకు ముఫై థియోటర్లతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఈ ప్రభావం బాక్సాపీస్ కలెక్షన్స్‌పై పడే అవకాశం ఉందంటున్నారు. అక్టోబర్ 11న రెండు పెద్ద మూవీలు తమిళనాడులో రిలీజ్‌కు సిద్దంగా ఉన్నాయి. దీంతో రామయ్యవస్తావయ్యా మూవీకు థియోటర్లను సమకూర్చలేకపోయారు.
కోళీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన నైయాంది మూవీ, అలాగే స్టార్ కమెడియన్ సంతానం నటించిన వణక్కం చెన్నై మూవీలు అక్టోబర్ 11న రిలీజ్ అవుతున్నాయి. దీంతో ఎన్టీఆర్ మూవీకు థియోటర్ల కరువయ్యాయి. అతి కష్టం మీద దాదాపు ముఫ్పై థియోటర్లను యంగ్ టైగర్ మూవీ కోసం సంపాదించగలిగారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది మూవీ, తమిళనాడులో చెప్పుకోదగ్గ కలెక్షన్స్‌ను తెచ్చుకుంది. అత్తారింటికిదారేది మూవీ తమిళనాడులో పదిరోజుల కలెక్షన్స్ దాదాపు అయిదు కోట్ల వరకూ వచ్చాయి. అసలే యంగ్‌టైగర్ మూవీ పవన్ మూవీ కలెక్షన్స్‌ను తిరగరాయాలని విశ్వ ప్రయత్నం చేస్తుంటే, తమిళనాడులోథియోటర్లు తక్కువ కావడంతో, దీన్ని అధిగమించేందుకు దిల్‌రాజు మరో రకంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.
No comments:
Post a Comment