Saturday, 19 October 2013

దిల్ రాజ్ కు క్లాస్ పీకిన జూనియర్ !


యంగ్ టైగర్ ఎన్టీఆర్ దిల్ రాజ్ ను తన ఇంటికి పిలిచి క్లాస్ తీసుకున్నట్లుగా ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. గతంలో దిల్ రాజ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ‘బృందావనం’ సినిమా నిర్మాణ సమయంలోనే వీరిద్దరి మధ్యా బేధాభిప్రయాలు వచ్చినట్లు ప్రచారం జరిగింది. దీనికి కారణం ఆ చిత్రం షూటింగ్‌లో ఉండగానే జూనియర్ ఎన్టీఆర్ తన పారితోషికాన్ని 9 కోట్లు వరకు దిల్ రాజ్ నుండి ముక్కుపిండి మరీ వసూలు చేశాడని దిల్‌రాజు తన సన్నిహితులతో వ్యాఖ్యానించినట్లు అప్పట్లో కథనాలు వచ్చాయి. ఆ దెబ్బతో ఇకపై దిల్ రాజ్ ఎన్టీఆర్ తో సినిమాలు కూడా చేయకూడదు అని అనుకుంటున్నాడు అంటూ రకరకాల కధనాలు చక్కర్లు కొట్టాయి. కానీ ఏమి జరిగిందో తెలియదు కాని అదే దిల్ రాజ్ జూనియర్ తో ‘రామయ్య’ ను తీసాడు. అయితే తను తీసిన 'రామయ్యా వస్తావయ్యా' పెద్దగా సక్సెస్‌ కాకపోయేసరికి దిల్ రాజ్ చాల షాక్ అయ్యాడట. అంతేకాదు రామయ్య సినిమా పై మీడియా అంత విపరీతంగా నెగెటివ్‌గా ఎందుకు రాసింది అని అడిగాడట జూనియర్ ఎన్టీఆర్.

 అంతేకాదు మీరు గతంలో మీడియాతో మీరు ఎందుకు గొడవ పెట్టుకున్నారు అని జూనియర్ దిల్ రాజ్ ను ప్రశ్నించాడట. ఈ విషయాన్ని దిల్‌ రాజు ఘాటుగా తీసుకుని తన పై ఎవరో ఎన్‌టిఆర్‌కు లేనిపోని విషయాలు నూరిపోస్తున్నారు అంటూ దిల్ రాజ్ తన సన్నీహితుల దగ్గర బాధ పడుతున్నాడట. ఇదే సందర్భంలో దిల్ రాజ్ జూనియర్ తో సినిమాలో సరుకుంటే చూస్తారు లేకుంటే లేదు సినిమా ఫెయిల్ అవ్వడానికి తాను ఒక్కడినే కారణం కాదు కదా అని చురక అంటించేసరికి మన జూనియర్ మైండ్ బ్లాంక్ అయింది అని అంటున్నారు. రామయ్య సినిమా విడుదల అయి పదిరోజులు గడిచి పోతున్నా ఆ చేదుజ్ఞాపకాలను ఎన్టీఆర్ ఇంకా మరిచి పోనట్లే కనిపిస్తోం ది...

న‌న్ను క‌ల‌వొద్దూ, మాట్లాడొద్దు, రావొద్దు :అక్కినేని నాగేశ్వర‌రావు


అక్కినేని నాగేశ్వర‌రావు చాలా కాలం తరువాత మీడియా ముందుకు వ‌చ్చాడు. ఇది పూర్తిగా త‌న వ్యక్తిగత మీటింగ్ అని చెప్పాడు. నాగేశ్వర్వరరావు ప్రస్తుతం మ‌నం మూవీ షూటింగ్‌లో బిజిబిజిగా గుడుపుతూ కొడుకు,మ‌న‌వుడితో క‌లిసి న‌ట‌న‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. అక్కినేని మూడు త‌ర‌వాల న‌టులు క‌లిసి ఒకే తెర‌పై క‌నిపించ‌డం అనేది టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోనే చాలా అరుదుగా జ‌రుగుతుంది. ఇదిలా ఉంటే నాగేశ్వర‌రావుకి క్యాన్సర్ క‌ణాలు ఉన్నట్టు గ్యాస్ట్రో ఎంట‌రాల‌జిస్ట్ నిపుణులు గుర్తించారు. ఈ విష‌యం టాలీవుడ్ సెల‌బ్రిటీల‌కూ తెలిసింది. దీంతో నాగేశ్వర‌రావు ఆరోగ్యంపై ర‌క‌ర‌కాలు వార్తలు చ‌క్కెర్లు కొడుతున్నాయి. వీట‌న్నింటికి స‌మాధానంగా అంద‌రికి ఈ విష‌యాన్ని స్పష్టంగా తెలియ‌జేయాల్సి అవ‌స‌రం త‌న‌కు ఉంద‌ని నాగేశ్వర‌రావు మీడియా మీటింగ్ పెట్టి, అభిమానుల‌కు త‌న ఆరోగ్య స‌మాచారాన్ని తెలియ‌ప‌రిచాడు.

 'క్యాన్సర్ క‌ణాలు ఉన్నాయి అనేది నిజ‌మే కాని, మ‌నో నిబ్బరంతో ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నంత కాలం నాకు ఏమి కాదు అని డాక్టర్లు చెప్పారు. మీరు కూడ ఏ మాత్రం చింతించ‌కుండా ఉండండి.మీరు నా కోసం చేయాల్సింది ఒక్కటే. న‌న్ను ఎవ‌రూ క‌ల‌వాటానికి కాని, మాట్లాడ‌టానికి కాని, ఎక్కడిఎక్కడి నుండో ఇక్కడ‌కు రావ‌ద్దు. నా గురించిన స‌మాచారాన్ని తెలియ‌ప‌ర‌చటానికి ప్రతి నిముషం మీడియా ద్వార అందుబాటులో ఉంటాను. మీరు సంతోషంగా ఉండి, నేనే ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకోండి, ఖ‌చ్ఛితంగా నేను 94 ఏళ్ళ వ‌ర‌కూ ఉంటాను.' అని మ‌రికొద్ది నిముషాలు మాట్లాడాడు.

Nageswara Rao Family Press Meet


మోహన్ బాబు ఇమేజ్ ని దెబ్బతీస్తున్న మనోజ్ ..


మంచు వారి కుటుంబ హీరో మంచు మనోజ్ కు రకరకాల ప్రయోగాలూ చేసి తన తండ్రి లాగే పేరు తెచ్చుకోవాలని కోరిక. దీనికోసం రకరకాల ప్రయోగాలూ చేస్తూ ఉంటాడు మనోజ్. మోహన్ బాబు కెరియర్ లో క్లాసిక్ సినిమా గా మిగిలిపోయిన ‘పెదరాయుడు’ సినిమాను S/O ‘పెదరాయుడు’ గా మంచు మనోజ్ సీక్వెల్ చేస్తాడు అనే వార్త చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది.

 కామెడి పాత్రలుచేస్తూ బాగా ఫైట్స్ చేస్తాడు అని పేరున్న మనోజ్ నిడిన విగ్రహం తో కండువా, పంచే తో అందరి మనస్సులలో నిండిపోయిన పెదరాయుడు పాత్రను చేయడం సాహసం. సాగర్ పసల అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తాడట. పూర్తి కామెడి ఎంటర్ టైనర్ గా ఈసినిమాను పూర్తిగా అమెరికాలో నిర్మిస్తారట. డబుల్ మీనింగ్ డైలాగ్స్ కు హీరోయిన్స్ స్కిన్ షోస్ కు మారుపేరు గా ఉండే మనోజ్ సినిమాలు ఉంటాయని తెలిసిన విషయమే. ఈ పరిస్థుతుల నేపధ్యంలో ‘పెదరాయుడు’ పాత్రను మనోజ్ ఎందుకు కామెడి చేస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..

మీడియా మీట్ లో అక్కినేని చెప్పిన సంచలన వార్త..!!


నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తన ఆరోగ్యానికి సంబంధించి ఒక ముఖ్య విషయం ఈ రోజు ఉదయం అన్నపూర్ణా స్టూడియోస్ లో తన కుటుంబ సభ్యులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన ఆరోగ్యానికి సంబంధించి కొన్ని కీలక విషయాలు తెలియ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. తనకు అక్టోబర్ 8న కడుపు నొప్పి వచ్చిందనీ దానికి, డాక్టర్లు వివిధ రకాల పరీక్షలు చేసిన అనంతరం క్యాన్సర్ కణాలు ఉన్నట్లు గుర్తించారని అక్కినేని చెప్పినట్లుగా వార్తలు వినపడుతున్నాయి.

 అయితే వృద్ధాప్యంలో క్యాన్సర్ కణాలు చురుకుగా ఉండవని వైద్యులు చెప్పారట. తను నటించిన సినిమాల్లో చూపినట్లు ఇదేమీ భయంకరమైన జబ్బు కాదు అని అంటూ ప్రపంచంలో క్యాన్సర్‌ను జయించిన వాళ్లు చాలా మంది ఉన్నారు అని అక్కినేని అన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు తాను ఎక్కువ కాలం బ్రతకాలంటే మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు బాధపడకుండా తనను ఈ విషయమై తరచి తరచి అడిగి ఇబ్బంది పెట్టకుండా తనతో ఎప్పటిలాగే నవ్వుతూ పలకరించాలని కోరుకుంటున్నానని అక్కినేని అన్నారట.

 తన ఆరోగ్యం గురించి ఎవరో ఎదో గాలి వార్తలు రాయకుండా తన పరిస్థితి తానే మీడియా ద్వారా తెలియచేయ కలిగిన మనో నిబ్బరం ఒక్క అక్కినేని లాంటి వారికే చెల్లుతుంది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో బిరుదులూ బహుమానాలు గౌరవాలు పొందిన అక్కినేని ఈ అనారోగ్యాన్ని కూడా ఎదిరించి నిండు నూరేళ్ళు ఆరోగ్యం తో ఉండాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగు హృదయం మనసారా కోరుకుంటోంది.

Friday, 18 October 2013

అజిత్ సినిమాకు క్లీన్ యు స‌ర్టిఫికెట్ ..


త‌మిళ్ హీరో అజిత్ ఆరంభం సినిమాతో ఆడియెన్స్ ను అల‌రించ‌డానికి సిద్ద‌మ‌వుతున్నాడ‌నే విష‌యం తెలిసిందే క‌దా…? అయితే ఈసినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ వ‌ర్క్ పూర్తి కావ‌డం అంటే సినిమా విడుద‌ల‌కు సిద్ద‌మైన‌ట్లే. అన్న‌ట్లుగానే ఈ నెల 31న త‌మిళ నాట విడుద‌ల చేయ‌డానికి డేట్ టెంట‌టీవ్ గా ఫిక్స్ చేశారు. అయితే విశేషం ఏమిటంటే.. తాజాగా అజిత్ చేసిన ఆరంభం సినిమా కు క్లీన్ యు స‌ర్టిఫికెట్ ఇచ్చారు . ఒక యాక్ష‌న్ హీరో సినిమాకు క్లీన్ యు స‌ర్టిఫికెట్ రావ‌డం అంటే..ఇది చిన్న పిల్ల‌ల‌తో చూడత‌గ్గ చిత్ర‌మ‌ని చెప్ప‌క‌నే చెబుతుంది.

 అయితే గ‌తంలో అజిత్ న‌టించిన అస‌ల్.. మంగ‌త్తా.. బిల్లా సినిమాల‌కు మాత్రం ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చారు. మంగ‌త్తాకు ఎ యు ఇవ్వ‌గా.. బిల్లా కు ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చారు. మ‌రి తాజాగా ఆరంభం మాత్రం క్లీన్ యు కొట్టి.. ట్యాక్స్ మిన‌హాయింపు కొట్టెసింది. ఈ చిత్రంలో అజిత్ కి జోడిగా న‌య‌న‌తార హీరోయిన్ గా చేస్తుండ‌గా.. ఆర్యా స‌ర‌స‌న తాప్సీ చేస్తుంది. చూడ‌బోతే ఇది మ‌న ఎన్టీఆర్ న‌టించిన బృందావ‌నం త‌ర‌హా సినిమా మాదిరి ఉందంటున్నారు టాలీవుడ్ ప‌రిశీల‌కులు. క్లీన్ యు వ‌చ్చిందంటే దాదాపు క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ కావోచ్చు .అయితే తెలుగులో విడుద‌ల చేసే ప్ర‌య‌త్నాలు ఏవి లేక‌పోవ‌డం విశేషం. బహుశా అక్క‌డ స‌క్సెస్ అయితే మాత్రం వెంట‌నే తెలుగు లో కూడా విడుద‌ల చేస్తారంటున్నారు కోలీవుడ్ వ‌ర్గాలు.

18 షరతులతో జగన్ సమైక్యాంధ్ర సభకు పర్మిషన్


హైదరాబాద్: ఈ నెల 26వ తేదీన హైదరాబాదులో వైయస్ జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తలపెట్టిన సమైక్యాంధ్ర సభకు 18 షరతులతో అనుమతి లభించింది. రాష్ట్ర హైకోర్టు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఈ నెల 19వ తేదీన హైదరాబాదులో సమైక్యాంధ్ర సభను పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు నగర పోలీసులు కూడా దానికి అనుమతి ఇచ్చారు. ఈ నెల 16వ తేదీన హైకోర్టు ఆ మేరకు ఆదేశాలు ఇచ్చింది. అయితే సమయం సరిపోదనే ఉద్దేశంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమైక్యాంధ్ర సభను వాయిదా వేసుకుంది. హైకోర్టు ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని వైయస్సార్ కాంగ్రెసు ఈ నెల 26వ తేదీన తలపెట్టిన సభకు హైదరాబాద్ పోలీసు కమిషనర్ నుంచి అనుమతి లభించింది. షరతులను కచ్చితంగా పాటించాలని పోలీసులు వైయస్సార్ కాంగ్రెసును ఆదేశించారు. హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఆ సభ జరగనుంది. సభను మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభించి సాయంత్రం ఐదు గంటలకు పూర్తి చేయాలని పోలీసులు ఓ ప్రటనలో తెలిపారు.

 సమైక్యాంధ్ర సభ సందర్భంగా ఏవైనా విధ్వంసం, అవాంఛనీయ సంఘటనలు జరిగితే నిర్వాహకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పద్ధతి ప్రకారం సభను నిర్వహించుకోవాలని చెప్పారు. రెచ్చగొట్టే ప్రకటనలు చేయబోమని, అవాంఛనీయ సంఘటనలకు ప్రేరేపించబోమని నిర్వాహకులు ముందస్తుగా హామీ ఇవ్వాల్సి ఉంటుంది. సభకు వచ్చేవారిలో సంఘ వ్యతిరేక శక్తులు చేరే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. సభకు వచ్చేవారిని గుర్తించడానికి తగిన విధంగా వ్యవహరించాలని పోలీసులు నిర్వాహకులకు సూచించారు.

ప్రభాస్ బర్త్ డేకు...‘బాహుబలి’ మేకింగ్ వీడియో!


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘బాహుబలి'. తన సినిమాలకు ప్రచారం కల్పించడానికి వెరైటీ మార్గాలను అన్వేషించే దర్శకుడు రాజమౌళి బాహుబలి విషయంలోనూ అదే ఫాలో అవుతున్నాడు. గతంలో విడుదలకు ముందే ‘ఈగ' మూవీ స్టోరీని లీక్ చేసిన రాజమౌళి ఈ సారి బాహుబలి చిత్రం మేకింగ్ వీడియోలను దఫదఫాలుగా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చాడట. ‘బాహుబలి' చిత్రం తొలి మేకింగ్ వీడియోను అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారట. ఈ మేకింగ్ వీడియో ఒక నిమిషం నిడివితో ఉంటుందని సమాచారం. సినిమాపై అంచాలు పెంచే విధంగా ఈ మేకింగ్ వీడియో ఉంటుందని అంటున్నారు. సినిమా షూటింగ్ పూర్తయి ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో.....అప్పటి వరకు సినిమాపై ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి తగ్గకుండా ఉండటానికే ఈ ప్లాన్ చేసాడట రాజమౌళి. మరి రాజమౌళి ప్లాన్ ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తుందో చూడాలి.


 తన కెరీర్లో ఏ సినిమాకు పడనంత కష్టం ఈ సినిమా కోసం పడుతున్నాడు ప్రభాస్. యుద్ద విద్యలు, గుర్రం స్వారీలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నాడు. ఈ చిత్రం ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. దీని తర్వాత తన దశ తిరుగుతుందనే నమ్మకంతో ఉన్నాడు ప్రభాస్. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు రాణా, అనుష్క, రమ్యకృష్ణ ముఖ్య పాత్ర పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సినిమా కోసం ఫిల్మ్ సిటీలో దాదాపు రూ. 2.5 కోట్ల ఖర్చుతో భారీ దర్బార్ సెట్ వేసినట్లు తెలుస్తోంది. అవార్డ్ విన్నింగ్ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ వాస్తవికత ఉట్టిపడేలా ఈ సెట్ డిజైన్ చేసారు. ఇంకా సత్యరాజ్, నాజర్, అడవి శేషు, సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్కా మీడియా బేనర్‌పై శోభు యార్లగడ్డ, కె. రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో షూట్ చేస్తున్నారు. హిందీ, విదేశీ బాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది. దాదాపు రూ. 80 కోట్ల నుంచి రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే ‘ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది.