
న్యూయార్క్ : అమెరికాలో నెలకొన్న ప్రస్తుత రుణ సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా పరిణమిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) హెచ్చరించింది. అమెరికా వ్యవహారం ఇప్పుడు 'సంక్లిష్ట యాత్ర'గా దాపురిం చిందని ఐఎంఎఫ్ సంచాలకులు క్రిస్టిని లాగార్డే వ్యాఖ్యానించారు. రాజకీయ కారణాలు, ఇతరత్రా ప్రాబల్య అంశాలతో అక్కడ నెలకొన్న పరిస్థితితో కేవలం ఆ దేశానికే కాకుండా ప్రపంచానికి ప్రత్యే కించి ఆర్థిక రంగానికి ఇబ్బందిగా మారు తుందని ఆమె తెలిపారు. ఈ సంక్లిష్టమైన అంశాన్ని అమెరికా తేలిగ్గా కొట్టిపారే యడానికి వీల్లేదని, ఎక్కువ కాలం నాన్చి ఉంచితే, ముప్పుగా మారుతుందని, షట్‌డౌన్‌ను అడ్డుకోవాలని ఆమె అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అమెరికాలో బడ్జెట్, రుణ పరిమితి, చెల్లింపులకు సంబంధించి ఇప్పుడు ఏర్పడ్డ రాజకీయ అనిశ్చితి, క్రియాశూన్యత చాలా చెడు పరిణామమని విమర్శించారు. రుణ పరిమితిని పెంచడంలో విఫలం కావడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. కేవలం అమెరికాకే కాకుండా ఇతర దేశాలపై కూడా దీని ప్రభావం పడుతుందని తెలిపారు. అమెరి కాలో ఆర్థిక పరిణామాలపై ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్పందించడం ఇటీ వలి కాలంలో ఇదే తొలిసారి. సమస్యను సాగదీయడం వల్ల ప్రయోజనం ఉండదని జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీలో జరిగిన ఓ సభలో ఆమె స్పష్టం చేశారు.
అంతా పట్టుదలకు పోకుండా నెమ్మదించాలి. అయితే సమస్య పరిష్కారాన్ని వేగవంతం చేసుకోవాలని కోరారు. రికవరిలకు ఇబ్బంది కల్గించని రీతిలో వ్యయకోతలను ఎత్తివేయాల్సి ఉంటుందని, దీనికి తగు విధమైన మద్దతు చర్యలు తీసుకోవాలని అమెరికా ప్రభుత్వానికి మిస్ లాగార్డే సూచించారు.
కేవలం అమెరికాలోనే కాకుండా జపాన్‌లోనూ ఆర్థిక చిక్కు సమస్యలు ఉన్నాయని అక్కడి రుణ భారం తగ్గించేందుకు జపాన్ ఆర్థిక సాయం కోరుతోందని తెలిపారు. జపాన్ జిడిపి విలువతో చూస్తే అక్కడ సగటు రుణభారం దాదాపు 90వేల డాలర్ల స్థాయికి చేరిందని ఐఎంఎఫ్ ఎండి చెప్పారు. ఆర్థిక భారాలను తగ్గించు కోవడానికి పలు దేశాలు సవ్యమైన దిశలో వ్యవహరించాల్సి ఉందన్నారు. విధానపరమైన మౌలిక సూత్రాలు సవ్యంగా లేకపోతే ఎలాంటి ప్రయోజనా లైనా శాశ్వతం కాజాలవని హెచ్చరిం చారు. సంస్కరణలు నిర్మాణాత్మకంగా ఉండాలని, ఆర్థిక, ద్రవ్య విధానాలకు చేయూత నిచ్చేవిగా నిలవాలని పిలుపు నిచ్చారు. అమెరికాలో ఇప్పుడు రాజకీయ ప్రాబల్యం కోసం సాగుతోన్న రాజకీయ అసహన ధోరణి చివరికి అక్కడి ప్రజలకు ఇబ్బందిగా మారుతుందని, ఇప్పటికే అక్కడి వేతనజీవులు దీని ఫలితాలను అనుభవిస్తున్నారని ఐఎంఎఫ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. రిపబ్లికన్లను కాదని ప్రెసిడెంట్ ఒబామా చేపట్టిన ఆరోగ్య పరిరక్షణ పథకం ...ఒబామా హెల్త్‌కేర్‌గా మారిందని, దీనికి ఇబ్బడి ముబ్బడిగా నిధులు కేటాయించడం అసాధ్యమని తేల్చి చెప్పిన ప్రతిపక్షాలు తమకు పట్టున్న చట్టసభలో బిల్లును పెండింగ్‌లోకి నెడుతూ తీర్మానం చేశారు. దీనిని ఒబామా వర్గం వీటో చేయడం దరిమిలా రాజకీయ సంక్షోభం ముదిరి షట్‌డౌన్ పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే సంక్షోభ నివారణకు అమెరికాలోని ప్రతిపక్షాలు కానీ, అధికార పక్షం కానీ తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్న దాఖలాలు కన్పించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఐఎంఎఫ్ నుంచి తీవ్ర స్పందన వెలువడింది.