Monday, 4 November 2013

బక్కన్న కేసిఆర్ బిక్కచచ్చిపోయాడు


బక్కన్న కేసిఆర్ బిక్క చచ్చిపోయాడట, ఆయనకు ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి నెలకొందట, ఏం మాట్లాడితే సోనియాగాంధి ఏ కొరివి పెడుతుందో అన్న ఆందోళనలో కేసిఆర్ పడ్డాడని రాజకీయ వర్గాలకు అందుతున్న తాజా సమాచారం. కారణం కాంగ్రెస్ తో విలీనమే లేదు అని ప్రకటించిన కొద్ది సేపటికే తామడిగిన తెలంగాణ ఇస్తే విలీనం గూర్చి ఆలోచిస్తానన్నాడు. అంతకు ముందు సిద్దిపేటలో మాట్లాడుతూ సోనియా ఉత్తిగనే తెలంగాణ ఇవ్వలేదు, ఎందరో ప్రాణాలు అర్పించుకుంటే భయపడి ఇచ్చింది అని తాము విలీనం అయ్యే ప్రసక్తి లేదని చెప్పాడు. అంతే కాదు తాను తెలంగాణ ముఖ్యమంత్రిని అయ్యానన్న లెవల్లో మాట్లాడాడు. ఇలా ఆయన మాటల తీరును చూసి బక్కన్న కేసిఆర్ బిక్కచచ్చిపోయాడు అన్న వాదన రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. తెలంగాణ సాదించామన్న ఆనందం టిఆర్ఎస్ అధినేతకు ఇప్పటికి లేదట, సోనియాగాంధీ ఏ క్షణంలోనైనా ఏమైనా చేస్తుంది అన్న భయం ఆయనను ఇప్పటికి నిద్రపోనివ్వడం లేదంటున్నారు టిఆర్ఎస్ కే చెందిన కొందరు నేతలు. కారణం సిడబ్ల్యూసి తెలంగాణ ప్రకటించిన తర్వాత కేసిఆర్ లో అనూహ్యమైన మార్పు వచ్చింది. ఇక తెలంగాణకు శాశ్వత ముఖ్యమంత్రిని నేనే, నాదే తెలంగాణ అన్న ధోరణిలో కొత్తగా ఏర్పడే బోయే తెలంగాణ ఇలా ఉంటుందన్నారు. తెలంగాణలో ఈ ప్రాజెక్టులు పెడతామని జాబితా చదివారు. ఈ పథకాలు ప్రవేశపెడతామని లిస్ట్ డిక్లేర్ చేసారు. ఇలా ఒకటా రెండా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారు కూడా మరుక్షణమే ఇలా మాట్లాడరు. తెలంగాణా ఇచ్చాం కదా, మీరిచ్చిన మాట ప్రకారం పార్టీని విలీనం చేయండి అని కాంగ్రెస్ కోరగానే మాట మార్చారు, అమ్మో మిమ్మలను నమ్మడం ఎవరి తరం, అదేదో పూర్తిగా తెలంగాణ అయ్యాక విలీనం చేస్తాం అన్నాడు. ఈ లోపు తెలంగాణ ఏర్పాటుకు మొందుకు పోతూ ఇక విభజించక తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ పడిందని భావించాడు కేసిఆర్. ఈ మద్య కాలంలో తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చినప్పటికి ప్రజల్లో ఆ క్రెడిట్ టిఆర్ఎస్ కే దక్కుతోందని, మంచి మెజారిటి టిఆర్ఎస్ కు వస్తోందని తెలియడంతో కేసిఆర్ మళ్లీ రివర్స్ గేర్ వేయడం మొదలు పెట్టారు. తాజాగా సిద్దిపేటలో ఆయన మాట్లాడిన తీరు దీనికి నిదర్శనం, ముఖ్యమంత్రి హోదాలో ఆయన ప్రసంగిచ్చినట్టుంది ఆయన ప్రసంగం. సిద్దిపేటను జిల్లా చేస్తానన్నాడు. సిద్దిపేట ప్రజలకోసం గోదావరి ఏకంగా 35 టిఎంసిల సామర్థ్యం గల ప్రాజెక్టును గోదావరిపై నిర్మిస్తాం అని చెప్పారు. అంతే కాదు తాము పార్టీని విలీనం చేస్తానన్నప్పుడు తెలంగాణ ఇచ్చి ఉంటే బాగుండేదని సోనియాకు చురకలంటించాడు. అలా ఇయ్యక పోవడం వల్ల ఆ తర్వాత తెలంగాణలో 400మంది మరణించారని చెప్పారు. సోనియా తెలంగాణ ఊరికే ఇవ్వలేదని, 1000 మంది బలిదానాలు చేసుకుంటే ఇచ్చిందని చెప్పి తమ పార్టీ విలీనం ఉత్తిమాటే అన్నట్టు మాట్లాడారు. ఇంతలో సోనియా నుంచి షాక్ మొదలయింది. హైదరాబాద్ విషయంపై తీవ్ర మంతనాలు జరుగుతున్నాయని, ఢిల్లీ తరహా పాలనలోకి హైదరాబాద్ ను తెచ్చే పనికి శ్రీకారం చుడుతున్నారన్న వార్తలను లీక్ చేసింది కాంగ్రెస్ హైకమాండ్. అంతే కాదు రాయల సీమకు చెందిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని కిరణ్ స్థానంలో ముఖ్య మంత్రిగా పెట్టి, తెలంగాణకు బదులు రాయల తెలంగాణ ఏర్పాటు చేసే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది అన్న సూచనలు జారి అయ్యాయి. దీంతో లబోదిబో మనడం కేసిఆర్ వంతయింది, వెంటనే మాట మార్చి సిడబ్ల్యూసి ప్రకటించిన విధంగా ఎలాంటి కొండి పెట్టకుండా, తామడిగిన విదంగా హైదరాబాద్ తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ లో టిఆర్ఎస్ విలీనం గూర్చి ఆలోచిస్తానని కేసిఆర్ ప్రకటించారు. అంటే భయపెడుతూ, భయపడుతూ కాంగ్రెస్ తెలంగాణపై ఏదో చేస్తుంది అన్న అనుమానంతో కేసిఆర్ గించుకుంటున్నాడు అన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.

అభిమానుల కోసం....అనుష్క పుట్టినరోజు గిఫ్ట్


సౌతిండియా హాట్ హీరోయిన్ అనుష్క ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ 7న అనుష్క పుట్టినరోజును పురస్కరించుకుని బాహుబలి టీం ఆమె ఫ్యాన్స్‌ను సంతోష పెట్టడానికి ప్లాన్ చేసారు. బాహుబలి సినిమాకు సంబంధించిన అనుష్క స్పెషల్ వీడియోను పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ వీడియోలో అనుష్క లుక్ మునుపెన్నడూ లేని విధంగా అద్భుతంగా ఉండనుందని తెలుస్తోంది. మరి అందాల సుందరి అనుష్కను రాజమౌళి ఇంకెంత అందంగా చూపెట్టాడో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.ఇటీవల ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా కూడా ఫస్ట్ లుక్‌తో పాటు మేకింగ్ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. మంచి స్పందన రావడంతో పాటు సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇపుడు అనుష్కపై స్పెషల్ వీడియో విడుదల చేస్తుండటం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

 ‘బాహుబలి' సినిమా పూర్తయి 2015లో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో.....ఈ భారీ గ్యాప్‌లో ప్లాన్ ప్రకారం సినిమాను ప్రమోట్ చేస్తూ ముందుకుసాగుతున్నాడు రాజమౌళి. అప్పటి వరకు సినిమాపై ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి తగ్గకుండా ఉండటానికే ఈ ప్లాన్ చేసాడట రాజమౌళి. మరి రాజమౌళి ప్లాన్ ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తుందో చూడాలి. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు రాణా, అనుష్క, రమ్యకృష్ణ ముఖ్య పాత్ర పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇంకా సత్యరాజ్, నాజర్, అడవి శేషు, సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

అవార్డ్ విన్నింగ్ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ వాస్తవికత ఉట్టిపడేలా ఈ సెట్ డిజైన్ చేసారు. ఆర్కా మీడియా బేనర్‌పై శోభు యార్లగడ్డ, కె. రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో షూట్ చేస్తున్నారు. హిందీ, విదేశీ బాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది. దాదాపు రూ. 80 కోట్ల నుంచి రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే ‘ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు.

వోల్వో బస్సు ప్రమాదం: రసాయనాల వల్లే మంటలు?


మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలెం దగ్గర వోల్వో బస్సు దగ్ధమైన ప్రమాదానికి గల కారణాలు బయటకు వస్తున్నాయి. ప్రత్యేక పరిశీలన బృందాలు రెండు, మూడు రోజుల నుండి తరచుగా ప్రమాద స్థలాన్ని నిశితంగా పరిశీలించి ప్రమాదానికి గురైన బస్సు క్షణాల్లోనే దగ్ధం కావడానికి గల కారణాలను కనుక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు. సోమవారం వనపర్తి సిఐ గిరిబాబుతో పాటు మరికొందరు పోలీసులు బెంగుళూర్‌కు వెళ్లారు. జబ్బార్ ట్రావెల్స్ నిర్వాహకులను విచారించారు. అదేవిధంగా ప్రయాణికుల వివరాలను, వారి దగ్గర ఉన్న సామాగ్రిపై కూడా విచారణ మొదలుపెట్టారు. జబ్బార్ ట్రావెల్స్ నిర్వాహకులు మరికొందరిని మహబూబ్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినట్లు సమాచారం. ఇప్పటికే జబ్బార్ ట్రావెల్స్ డైరెక్టర్ షకీల్, డ్రైవర్ ఫిరోజ్‌పాషలను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ముఖ్యంగా బస్సులో ఆరు క్యాన్లలో ప్రమాదకర రసాయన పదార్థాలను కూడా తరలిస్తున్నట్లు పరిశీలనలో వెల్లడైంది. అదేవిధంగా ఆరు విగ్గులు (తల వెంట్రుకలు) కూడా ఉన్నట్లు గుర్తించారు. అగ్నికి మరింత ఆజ్యంపోసే ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా బస్సులో ఉన్నట్లు దర్యాప్తులో తేలినట్లు చెబుతున్నారు. ఏ ప్రమాదం జరిగినా క్షణాల్లో బస్సు దగ్ధం కావడం, అందులో 45 మంది ప్రయాణికులు సజీవదహనం కావడం బట్టి చూస్తే బస్సులో రసాయన పదార్థాలు ఉన్నందువల్లే బస్సుకు మంటలు త్వరగా వ్యాపించి ఉంటాయని కూడా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. డివైడర్‌ను ఢీకొని వోల్వో బస్సు డీజిల్ ట్యాంకర్ పగిలిపోవడం జరిగినప్పటికీ బస్సు పూర్తిగా దగ్ధం కావడం మంటలు బస్సు మొత్తానికి వ్యాపించడం రసాయన పదార్థాలే ముఖ్య కారణమని పరిశీలన బృందాలు భావిస్తున్నాయి. డ్రైవర్ నిర్లక్ష్యంతో బస్సు ప్రమాదానికి గురైంది నిజమని కూడా తేల్చేశారు. అయితే ఈ ప్రమాదం ఈ స్థాయిలో జరగడానికి, ఏకంగా 45 మంది సజీవదహనం కావడానికి బస్సులోని ప్రమాదకర రసాయన పదార్థాలు కారణమని అంటున్నారు. 19 మృతదేహాల గుర్తింపు ప్రమాదంలో మరణించిన 45 మందిలో ఇప్పటివరకు 22 మృతదేహాలను గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలోనే ముగ్గురి మృతదేహాలను గుర్తించగా, సోమవారం మరో 19 మృతదేహాలను గుర్తించినట్లు మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ గిరిజాశంకర్ తెలిపారు. హైదరాబాద్‌లో డిఎన్‌ఎ పరీక్షలు నిర్వహించిన అనంతరం 19 మృతదేహాలను గుర్తించడం జరిగిందని కలెక్టర్ వెల్లడించారు. మృతదేహాలను సోమవారం బంధువులకు అప్పగించినట్లు చెప్పారు. మిగతా మృతదేహాలను కూడా గుర్తించే ప్రక్రియ చురుకుగా కొనసాగుతుందని, వాటిని ఒకటి, రెండు రోజుల్లో బంధువులకు అప్పగిస్తామని అన్నారు. గుర్తించిన మృతదేహాలలో ప్రశాంత్‌గుప్త, శివకిరణ్, వేదావతి, రవి, ఎండి సర్ధార్, అశుతోష్ పాండా, అక్షయ్‌సింగ్, ఎం. ఫణికుమార్, ఎన్‌ఎస్ గిరిధర్, జి.బాలసుందర్‌రాజ్, జి.మర్రి విజయకుమారి, జ్యోతి రంజాన్‌సాహు, సయ్యద్ మహ్మద్ జమాలోద్దీన్, ఎన్.రోహియా, వెంకటేష్, మోసిన్‌పాష, రఘువీర్, కె.రమ్య, సాకిబ్ ఆహ్మద్ ఉన్నాయి.

త్రివిక్రమ్‌తో సినిమా గురించి అక్కినేని అఖిల్ కామెంట్


ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ రేంజిలో ఉన్న దర్శకుల్లో ఒకరు దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్. అలాంటి దర్శకుడితో కలిసి పని చేసే అవకాశం రావడం అంటే మామూలు విషయం కాదు. నాగార్జున తనయుడు అఖిల్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తన నట జీవితాన్ని ప్రారంభించబోతున్నారంటూ ఇటీవల వార్తలు వెలువడ్డాయి. ఆ వార్తలతో అక్కినేని అభిమానులంతా ఎంతో సంబర పడ్డారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో అఖిల్ ఎంట్రీ అంటే ఎంతో గ్రాండ్‌గా ఉంటుందని....తొలి సినిమాతోనే అఖిల్ స్టార్ హీరో అవుతాడని ఆశ పడ్డారు. అయితే వారి సంతోషం ఎంతో సేపు నిలవలేదు. ఈ వార్తలపై అఖిల్ స్పందిస్తూ అవన్నీ కేవలం పుకార్లే అని తేల్చి చెప్పారు. ఈ వార్తలపై అఖిల్ తన సోషల్ నెట్వర్కింగ్ వెబ్ సైట్లో స్పందిస్తూ...‘ఇప్పటి వరకు తాను ఏ సినిమాకు కూడా సైన్ చేయలేదు. ఒక్క స్ర్కిప్టు కూడా వినలేదు' అని వెల్లడించారు. త్రివిక్రమ్ గురించి మాట్లాడుతూ...‘త్రివిక్రమ్ గారితో కలిసి పని చేయడం అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన దర్శకత్వంలో చేయడం అంటే ఎంతో ప్రత్యేకమైన విషయం. అది త్వరలోనే నెరవేరుతుందని ఆశిస్తున్నాను' అని అఖిల్ చెప్పుకొచ్చారు. ‘అత్తారింటికి దారేది' చిత్రం భారీ విజయం సాధించడంతో పాటు తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టి నెం.1 స్థానంలో నిలవడంతో త్రివిక్రమ్ ప్రస్తుతం అంతరి కంటే టాప్ పొజిషన్‌కు చేరుకున్నారు. త్రివిక్రమ్ తన తర్వాతి సినిమాను అల్లు అర్జున్‌తో చేయబోతున్నారు.

Sunday, 3 November 2013

Pawan Kalyan Premalo Paddadu - Telugu Short Film


తన ‘స్క్రిప్ట్’ కాపీ కొట్టారంటూ కోర్టుకు...


మరో కాపీ వివాదం భారీ బడ్జెట్ సినిమాకు తగులుకుంది. గతంలో తాను ఇచ్చిన స్క్రిప్ట్ ఆధారంగా ‘క్రిష్ 3' నిర్మించారని, తనకు ఎలాంటి పారితోషికం ఇవ్వలేదని, సినిమా టైటిల్స్‌లో తన పేరు కూడా వేయలేదని మధ్యప్రదేశ్‌కు చెందిన ఉదయ్‌సింగ్ రాజ్‌పుట్ అనే రచయిత ముంబై హైకోర్టును ఆశ్రయించాడు. కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు సినిమా విడుదలను నిలిపివేయాలని ఆయన పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కోర్టు అందుకు అంగీకరించలేదు. 2008లో ‘క్రిష్ 2' పేరిట తాను రాసిన స్క్రిప్ట్‌ను సినీ రచయితల సంఘంలో రిజిస్టర్ చేయించానని, దాని ప్రతిని నిర్మాత, దర్శకుడు రాకేష్ రోషన్‌కు పంపానని ఉదయ్‌సింగ్ చెబుతున్నారు. క్రిష్ 3' సినిమాకు తన స్క్రిప్ట్‌ను వాడుకోవడమే గాక, రాబిన్ భట్ అనే వ్యక్తికి పారితోషికం చెల్లించారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.

 తనకు నష్టపరిహారంగా రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలని, కేసు విచారణ ప్రారంభించగానే తాత్కాలికంగా కొంత మొత్తం చెల్లించేలా ఆదేశించాలని ఆయన కోరారు. అయితే, రాకేష్ రోషన్ తరఫున న్యాయవాదులు కూడా కోర్టుకు హాజరై సినిమా విడుదలకు ఆటంకం లేకుండా చూడాలని అభ్యర్థించారు. సినిమాను నిలిపివేసే విషయంలో కోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేనందున, నవంబర్ 1న దేశవ్యాప్తంగా ‘క్రిష్ 3'ని విడుదల చేసారు. అయితే సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కానీ పండగ ప్రబావంతో కలెక్షన్స్ బాగానే ఉన్నాయి.

విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం, ఎనిమిది మంది మృతి


విజయనగరం జిల్లాలోని గొట్లాం రైవ్వే స్టేషన్ వద్ద శనివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. బొకారో ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ కోచ్‌లో మంటలు వచ్చాయన్న వదంతి ప్రచారం కావడంతో ఆందోళన పడిన ప్రయాణికులు రైలును ఆపి కిందికి దిగి పరుగులు తీయడం మొదలు పెట్లారు. కోందరు మాత్రం పక్కనే ఉన్న ట్రాక్‌పై నిలబడ్డారు. వరిని ఆ ట్రాక్‌పై వస్తున్న విజయవాడ ప్యాసింజర్ రైలు ఢీకొట్టడంతో ఎనిమిది మంది మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది . ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిగ్బాృంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ తోనూ మాట్లాడి వెంటానే సహాయం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

దివ్వి దివ్వి దీపావళి


‘చీకటి వెలుగుల రంగేళి... జీవితమే ఒక దీపావళి’ అని ఓ సినిమా కవి అన్నారు. ఇది లక్ష ప్రమిదల వెలుతురులాంటి నిజం. దీపావళి అంటేనే సంతోషాల సంరంభం. పెద్దవాళ్లు కూడా తమ వయసు మరచిపోయి టపాసులు కాలుస్తూ ఆనంద సాగరంలో మునిగి తేలుతారు. మరి... మన అభిమాన తారల దీపావళి సంరంభం ఎలా ఉంటుందో ఓసారి తెలుసుకుందాం...

నాగార్జున:-

  నాకెందుకో చిన్నప్పట్నుంచీ టపాసులు కాల్చడం అంత ఆసక్తి అనిపించేది కాదు. కానీ, ఫ్రెండ్స్ అందరూ కాలుస్తుంటే నేనూ కొన్ని కాల్చేవాణ్ణి. ఇప్పుడైతే టపాసుల జోలికి అస్సలు వెళ్లడంలేదు. ముఖ్యంగా పర్యావరణం మీద అవగాహన పెరిగిన తర్వాత టపాసులు కాల్చకపోవడమే బెటర్ అని ఫిక్స్ అయిపోయాను. దీపావళినాడు శబ్ద కాలుష్యం ఎక్కువ. అందుకే, శబ్దం రాని టపాసులతో సరిపెట్టుకోవాలి. అయితే, దీపావళి పండగ వల్ల కూడా ప్లస్సులున్నాయి. టపాసులు కాల్చడం వల్ల దోమల బెడద తగ్గడం ఓ ప్లస్ (నవ్వుతూ). ఈ దీపావళిని అందరూ ఎంజాయ్ చేయాలని, అందరికీ శుభం చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను.అప్పట్నుంచీ టపాసులు కాల్చడం మానేశాను.

అనుష్క:-

  అసలు సిసలైన పండగ సంబరం కొత్త బట్టల ద్వారా వస్తుంది. చిన్నప్పుడైతే కంపల్సరీగా కొత్త డ్రెస్ కొనుక్కునేదాన్ని. ఉదయం తలంటు స్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకుని సందడి చేసేదాన్ని. ఫ్రెండ్స్‌తో పోటీపడి టపాసులు కాల్చేదాన్ని. ఇప్పుడు అంత ఆసక్తి లేదు. ఎవరైనా ఎంజాయ్ చేస్తుంటే చూడటమే తప్ప పెద్దగా సెలబ్రేట్ చేసుకోను. ఇప్పుడు ఒకేసారి బాహుబలి, రుద్రమదేవిలాంటి భారీ చిత్రాల్లో నటిస్తున్నాను కాబట్టి... నాకెందుకో దీపావళి ముందే వచ్చేసిందనిపిస్తోంది. ఈ పండగను అందరూ ఎంజాయ్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.ఒకప్పుడు సందడే సందడి .

 వెంకటేష్:-

  చిన్నప్పుడు నాకు దీపావళి అంటే చాలా సరదా. బీభత్సంగా టపాసులు కాల్చేవాణ్ణి. ఇదిగో ఈ చెయ్యి చూశారు కదా. ఈ మచ్చ నా ఆరేళ్ల వయసులో పడింది. దీపావళి పండగ మిగిల్చిన గుర్తు ఇది. ఆ వయసులో అంత పెద్ద దెబ్బ తగిలినా ఆ తర్వాత చాలా సంవత్సరాల వరకు నా సరదాని మానుకోలేదు. కానీ, ఇప్పుడు మాత్రం పొల్యూషన్ అంటూ... టపాసుల జోలికి దాదాపు వెళ్లడం మానేశాను. నా సంగతెలా ఉన్నా...

నాని:-


దీపావళిని చిన్నతనం నుంచి బాగా ఎంజాయ్ చేసేవాణ్ణి. దాదాపు ప్రతిసారీ ఏదో ఒక దెబ్బ తగిలేది. ఈ దీపావళి మా కుటుంబానికి చాలా స్పెషల్. అంజనాతో నా పెళ్లయిన తర్వాత వచ్చిన మొదటి దీపావళి ఇది. ఈ పండగను అమ్మా నాన్న, అంజనాతో జరుపుకుంటాను. శబ్దం వల్ల పెద్దవాళ్లకి చాలా ఇబ్బంది. అందుకని  భూచక్రాలు, మతాబులు... ఇలా సౌండ్ లేని టపాసులు కాల్చాలని మనవి చేసుకుంటున్నాను. అలాగే, మనం టపాసులు కాల్చడం మొదలుపెట్టిన తర్వాత మొదటి అరగంట జాగ్రత్తగా కాల్చాలనుకుంటాం. ఆ తర్వాత ఆ జాగ్రత్తను మర్చిపోతాం. కానీ, కాలుస్తున్నంతసేపూ జాగ్రత్తగా ఉండాలి.