బక్కన్న కేసిఆర్ బిక్క చచ్చిపోయాడట, ఆయనకు ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి నెలకొందట, ఏం మాట్లాడితే సోనియాగాంధి ఏ కొరివి పెడుతుందో అన్న ఆందోళనలో కేసిఆర్ పడ్డాడని రాజకీయ వర్గాలకు అందుతున్న తాజా సమాచారం. కారణం కాంగ్రెస్ తో విలీనమే లేదు అని ప్రకటించిన కొద్ది సేపటికే తామడిగిన తెలంగాణ ఇస్తే విలీనం గూర్చి ఆలోచిస్తానన్నాడు. అంతకు ముందు సిద్దిపేటలో మాట్లాడుతూ సోనియా ఉత్తిగనే తెలంగాణ ఇవ్వలేదు, ఎందరో ప్రాణాలు అర్పించుకుంటే భయపడి ఇచ్చింది అని తాము విలీనం అయ్యే ప్రసక్తి లేదని చెప్పాడు. అంతే కాదు తాను తెలంగాణ ముఖ్యమంత్రిని అయ్యానన్న లెవల్లో మాట్లాడాడు. ఇలా ఆయన మాటల తీరును చూసి బక్కన్న కేసిఆర్ బిక్కచచ్చిపోయాడు అన్న వాదన రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. తెలంగాణ సాదించామన్న ఆనందం టిఆర్ఎస్ అధినేతకు ఇప్పటికి లేదట, సోనియాగాంధీ ఏ క్షణంలోనైనా ఏమైనా చేస్తుంది అన్న భయం ఆయనను ఇప్పటికి నిద్రపోనివ్వడం లేదంటున్నారు టిఆర్ఎస్ కే చెందిన కొందరు నేతలు. కారణం సిడబ్ల్యూసి తెలంగాణ ప్రకటించిన తర్వాత కేసిఆర్ లో అనూహ్యమైన మార్పు వచ్చింది. ఇక తెలంగాణకు శాశ్వత ముఖ్యమంత్రిని నేనే, నాదే తెలంగాణ అన్న ధోరణిలో కొత్తగా ఏర్పడే బోయే తెలంగాణ ఇలా ఉంటుందన్నారు. తెలంగాణలో ఈ ప్రాజెక్టులు పెడతామని జాబితా చదివారు. ఈ పథకాలు ప్రవేశపెడతామని లిస్ట్ డిక్లేర్ చేసారు. ఇలా ఒకటా రెండా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారు కూడా మరుక్షణమే ఇలా మాట్లాడరు. తెలంగాణా ఇచ్చాం కదా, మీరిచ్చిన మాట ప్రకారం పార్టీని విలీనం చేయండి అని కాంగ్రెస్ కోరగానే మాట మార్చారు, అమ్మో మిమ్మలను నమ్మడం ఎవరి తరం, అదేదో పూర్తిగా తెలంగాణ అయ్యాక విలీనం చేస్తాం అన్నాడు.
ఈ లోపు తెలంగాణ ఏర్పాటుకు మొందుకు పోతూ ఇక విభజించక తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ పడిందని భావించాడు కేసిఆర్. ఈ మద్య కాలంలో తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చినప్పటికి ప్రజల్లో ఆ క్రెడిట్ టిఆర్ఎస్ కే దక్కుతోందని, మంచి మెజారిటి టిఆర్ఎస్ కు వస్తోందని తెలియడంతో కేసిఆర్ మళ్లీ రివర్స్ గేర్ వేయడం మొదలు పెట్టారు. తాజాగా సిద్దిపేటలో ఆయన మాట్లాడిన తీరు దీనికి నిదర్శనం, ముఖ్యమంత్రి హోదాలో ఆయన ప్రసంగిచ్చినట్టుంది ఆయన ప్రసంగం. సిద్దిపేటను జిల్లా చేస్తానన్నాడు. సిద్దిపేట ప్రజలకోసం గోదావరి ఏకంగా 35 టిఎంసిల సామర్థ్యం గల ప్రాజెక్టును గోదావరిపై నిర్మిస్తాం అని చెప్పారు. అంతే కాదు తాము పార్టీని విలీనం చేస్తానన్నప్పుడు తెలంగాణ ఇచ్చి ఉంటే బాగుండేదని సోనియాకు చురకలంటించాడు. అలా ఇయ్యక పోవడం వల్ల ఆ తర్వాత తెలంగాణలో 400మంది మరణించారని చెప్పారు. సోనియా తెలంగాణ ఊరికే ఇవ్వలేదని, 1000 మంది బలిదానాలు చేసుకుంటే ఇచ్చిందని చెప్పి తమ పార్టీ విలీనం ఉత్తిమాటే అన్నట్టు మాట్లాడారు. ఇంతలో సోనియా నుంచి షాక్ మొదలయింది. హైదరాబాద్ విషయంపై తీవ్ర మంతనాలు జరుగుతున్నాయని, ఢిల్లీ తరహా పాలనలోకి హైదరాబాద్ ను తెచ్చే పనికి శ్రీకారం చుడుతున్నారన్న వార్తలను లీక్ చేసింది కాంగ్రెస్ హైకమాండ్. అంతే కాదు రాయల సీమకు చెందిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని కిరణ్ స్థానంలో ముఖ్య మంత్రిగా పెట్టి, తెలంగాణకు బదులు రాయల తెలంగాణ ఏర్పాటు చేసే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది అన్న సూచనలు జారి అయ్యాయి. దీంతో లబోదిబో మనడం కేసిఆర్ వంతయింది, వెంటనే మాట మార్చి సిడబ్ల్యూసి ప్రకటించిన విధంగా ఎలాంటి కొండి పెట్టకుండా, తామడిగిన విదంగా హైదరాబాద్ తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ లో టిఆర్ఎస్ విలీనం గూర్చి ఆలోచిస్తానని కేసిఆర్ ప్రకటించారు. అంటే భయపెడుతూ, భయపడుతూ కాంగ్రెస్ తెలంగాణపై ఏదో చేస్తుంది అన్న అనుమానంతో కేసిఆర్ గించుకుంటున్నాడు అన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. Monday, 4 November 2013
బక్కన్న కేసిఆర్ బిక్కచచ్చిపోయాడు
బక్కన్న కేసిఆర్ బిక్క చచ్చిపోయాడట, ఆయనకు ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి నెలకొందట, ఏం మాట్లాడితే సోనియాగాంధి ఏ కొరివి పెడుతుందో అన్న ఆందోళనలో కేసిఆర్ పడ్డాడని రాజకీయ వర్గాలకు అందుతున్న తాజా సమాచారం. కారణం కాంగ్రెస్ తో విలీనమే లేదు అని ప్రకటించిన కొద్ది సేపటికే తామడిగిన తెలంగాణ ఇస్తే విలీనం గూర్చి ఆలోచిస్తానన్నాడు. అంతకు ముందు సిద్దిపేటలో మాట్లాడుతూ సోనియా ఉత్తిగనే తెలంగాణ ఇవ్వలేదు, ఎందరో ప్రాణాలు అర్పించుకుంటే భయపడి ఇచ్చింది అని తాము విలీనం అయ్యే ప్రసక్తి లేదని చెప్పాడు. అంతే కాదు తాను తెలంగాణ ముఖ్యమంత్రిని అయ్యానన్న లెవల్లో మాట్లాడాడు. ఇలా ఆయన మాటల తీరును చూసి బక్కన్న కేసిఆర్ బిక్కచచ్చిపోయాడు అన్న వాదన రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. తెలంగాణ సాదించామన్న ఆనందం టిఆర్ఎస్ అధినేతకు ఇప్పటికి లేదట, సోనియాగాంధీ ఏ క్షణంలోనైనా ఏమైనా చేస్తుంది అన్న భయం ఆయనను ఇప్పటికి నిద్రపోనివ్వడం లేదంటున్నారు టిఆర్ఎస్ కే చెందిన కొందరు నేతలు. కారణం సిడబ్ల్యూసి తెలంగాణ ప్రకటించిన తర్వాత కేసిఆర్ లో అనూహ్యమైన మార్పు వచ్చింది. ఇక తెలంగాణకు శాశ్వత ముఖ్యమంత్రిని నేనే, నాదే తెలంగాణ అన్న ధోరణిలో కొత్తగా ఏర్పడే బోయే తెలంగాణ ఇలా ఉంటుందన్నారు. తెలంగాణలో ఈ ప్రాజెక్టులు పెడతామని జాబితా చదివారు. ఈ పథకాలు ప్రవేశపెడతామని లిస్ట్ డిక్లేర్ చేసారు. ఇలా ఒకటా రెండా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారు కూడా మరుక్షణమే ఇలా మాట్లాడరు. తెలంగాణా ఇచ్చాం కదా, మీరిచ్చిన మాట ప్రకారం పార్టీని విలీనం చేయండి అని కాంగ్రెస్ కోరగానే మాట మార్చారు, అమ్మో మిమ్మలను నమ్మడం ఎవరి తరం, అదేదో పూర్తిగా తెలంగాణ అయ్యాక విలీనం చేస్తాం అన్నాడు.
ఈ లోపు తెలంగాణ ఏర్పాటుకు మొందుకు పోతూ ఇక విభజించక తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ పడిందని భావించాడు కేసిఆర్. ఈ మద్య కాలంలో తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చినప్పటికి ప్రజల్లో ఆ క్రెడిట్ టిఆర్ఎస్ కే దక్కుతోందని, మంచి మెజారిటి టిఆర్ఎస్ కు వస్తోందని తెలియడంతో కేసిఆర్ మళ్లీ రివర్స్ గేర్ వేయడం మొదలు పెట్టారు. తాజాగా సిద్దిపేటలో ఆయన మాట్లాడిన తీరు దీనికి నిదర్శనం, ముఖ్యమంత్రి హోదాలో ఆయన ప్రసంగిచ్చినట్టుంది ఆయన ప్రసంగం. సిద్దిపేటను జిల్లా చేస్తానన్నాడు. సిద్దిపేట ప్రజలకోసం గోదావరి ఏకంగా 35 టిఎంసిల సామర్థ్యం గల ప్రాజెక్టును గోదావరిపై నిర్మిస్తాం అని చెప్పారు. అంతే కాదు తాము పార్టీని విలీనం చేస్తానన్నప్పుడు తెలంగాణ ఇచ్చి ఉంటే బాగుండేదని సోనియాకు చురకలంటించాడు. అలా ఇయ్యక పోవడం వల్ల ఆ తర్వాత తెలంగాణలో 400మంది మరణించారని చెప్పారు. సోనియా తెలంగాణ ఊరికే ఇవ్వలేదని, 1000 మంది బలిదానాలు చేసుకుంటే ఇచ్చిందని చెప్పి తమ పార్టీ విలీనం ఉత్తిమాటే అన్నట్టు మాట్లాడారు. ఇంతలో సోనియా నుంచి షాక్ మొదలయింది. హైదరాబాద్ విషయంపై తీవ్ర మంతనాలు జరుగుతున్నాయని, ఢిల్లీ తరహా పాలనలోకి హైదరాబాద్ ను తెచ్చే పనికి శ్రీకారం చుడుతున్నారన్న వార్తలను లీక్ చేసింది కాంగ్రెస్ హైకమాండ్. అంతే కాదు రాయల సీమకు చెందిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని కిరణ్ స్థానంలో ముఖ్య మంత్రిగా పెట్టి, తెలంగాణకు బదులు రాయల తెలంగాణ ఏర్పాటు చేసే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది అన్న సూచనలు జారి అయ్యాయి. దీంతో లబోదిబో మనడం కేసిఆర్ వంతయింది, వెంటనే మాట మార్చి సిడబ్ల్యూసి ప్రకటించిన విధంగా ఎలాంటి కొండి పెట్టకుండా, తామడిగిన విదంగా హైదరాబాద్ తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ లో టిఆర్ఎస్ విలీనం గూర్చి ఆలోచిస్తానని కేసిఆర్ ప్రకటించారు. అంటే భయపెడుతూ, భయపడుతూ కాంగ్రెస్ తెలంగాణపై ఏదో చేస్తుంది అన్న అనుమానంతో కేసిఆర్ గించుకుంటున్నాడు అన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment