Tuesday, 15 October 2013

చాలా దూరం వెళ్లాల్సి ఉంది: లక్ష్మీ ప్రసన్న


దూసుకెళ్తా’ మూవీ టాక్ తెలిసిపోయిందోచ్!


హైదరాబాద్: మంచు విష్ణు, లావణ్య త్రిపాఠి జంటగా వీరు పోట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దూసుకెళ్తా'. అక్టోబర్ 17న ఈచిత్రం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ దర్శకులైన దాసరి నారాయణరావు, నాగేశ్వరరెడ్డి, శ్రీను వైట్ల, శ్రీవాస్, బి.గోపాల్‌ తదితరులకు స్పెషల్ షో ఏర్పాటు చేసారు. ఈ సినిమా చూసిన దర్శక ప్రముఖులు సినిమా చాలా బాగా వచ్చిందని, మంచు విష్ణు కెరీర్లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన ‘ఢీ'ని మించిపోయేలా సినిమా ఉంటుందని అంటున్నారు. పలు సీన్లలో విష్ణు అశ్చర్య పరిచాడని, బ్రహ్మానందంతో కలిసి కడుపుబ్బా నవ్వుకునేలా కామెడీ పండించాడని, క్లైమాక్స్‌లో స్టంట్ సీన్లు ఇరగ దీసాడని అంటున్నారు. గతంలో మంచు విష్ణుతో ‘ఢీ' చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీను వైట్ల ‘దూసుకెళ్తా' సినిమా గురించి మాట్లాడుతూ.....హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని, కామెడీ సీన్లు, యాక్షన్ సీన్లు బాగా వచ్చాయని, ప్రేక్షకులకు వినోదం పంచే విధంగా ఉందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా విష్ణు కెరియర్‌లోనే అత్యథిక థియేటర్‌లలో భారీ ఎత్తున విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఢీ, దేనికైనా రెడీ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాల తరువాత అదే తరహాలో విష్ణు నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. వీరూ పోట్ల డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రం లో మంచు విష్ణు పాత్రకేయుడుగా కనిపిస్తారు. అలాగే డాక్టర్‌ అలేఖ్యగా లావణ్య కనిపిస్తుంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, కోట శ్రీనివాసరావు, రావు రమేష్, పంకజ్ త్రిపాఠి, పోసాని, రఘుబాబు, భరత్, అన్నపూర్ణమ్మ, రజిత, సురేఖావాణి, హేమ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:సర్వేష్ మురరి, ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:ఆర్.విజయకుమార్.

అఖిల్ పై ట్రెయిల్ షూట్ చేస్తున్న దర్శకుడు?


హైదరాబాద్ : అక్కినేని అఖిల్ అరంగేట్రం ఎప్పుడాఎప్పుడా అని తెలుగు చిత్ర పరిశ్రమతోపాటుగా అక్కినేని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. సరైన కథ దొరికితే అఖిల్ ఎంట్రీ ఖాయమేనని నాగార్జున ఓసారి చెప్పారు. ఇప్పటివరకూ అఖిల్‌కోసం నాగార్జున విన్న కథలు ఏవీ ఆయనకు నచ్చలేదని ఫిల్మ్ నగర్ సమాచారం. అయితే పూణె ఫిలిమ్ ఇనిస్టిట్యూట్ నుండి వచ్చిన ఓ కుర్రాడు అఖిల్‌ చెప్పిన కథ నచ్చిందని వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇక ఇంతకుముందు అమీర్‌ఖాన్‌కు కథ వినిపించిన పూణె కుర్రాడు అఖిల్‌తో కూడా ఓ చిత్రం చేయాలని టాలీవుడ్‌కు వచ్చారట. అఖిల్ ను తన చిత్రంలో వారియర్‌గా చూపే ప్రయత్నం చేస్తున్నాడని, ఇందుకోసం 7 విభిన్నమైన గెటప్స్‌లో ట్రయిల్‌షూట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. యోధుడు కథ అంటేనే భారీ వ్యయం తప్పదు కనుక అంత పెట్టుబడి ఎవరు పెడతారు, అన్నపూర్ణ బ్యానర్ పైనే చేస్తారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అతి త్వరలోనే ట్రయిల్ షూట్ పూర్తిచేస్తారని సమాచారం ట్రయిల్ షూట్ సక్సెస్ అయితే అఖిల్ ఎంట్రీ త్వరలో జరుగుతుందని అంటున్నారు. అఖిల్ మాట్లాడుతూ... "నేను ఇప్పటిదాకా ఎటువంటి సినిమాను అంగీకరించలేదు. నా మొదటి సినిమాకు సిద్ధపడుతున్నాను" అని తెలిపాడు. ఇప్పటికే రాజమౌళి కుమారుడు కార్తీక్... అఖిల్ తో ఓ షార్ట్ ఫిల్మ్ రూపొందించారు. మాటీవీ షార్ట్ ఫిలింస్ కంటెస్ట్ లో ఆ షార్ట్ ఫిలిం ప్రదర్శిస్తారని చెప్పుకుంటున్నారు. నాగచైతన్య ఎంట్రీ విషయంలో నాగార్జున అంచనాలు తారుమారయ్యాయి. చైతన్య తొలి చిత్రం‘జోష్' అపజయాన్ని మూటగట్టుకుంది. ఈనేపథ్యంలో అఖిల్ విషయంలో అలా జరుగకూడదని నాగార్జున భావిస్తున్నారు. ఇక మరో దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా అఖిల్ తో చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఆయన ఈ విషయమై మాట్లాడుతూ... "అక్కినేని అఖిల్‌తో నా సినిమా ఉండొచ్చు. కానీ ఇప్పుడే కాదు. ఇప్పుడే అఖిల్‌తో నేను సినిమా చేయబోతున్నానన్న వార్త రూమరే. అయినా ముందు కథ దొరకాలి కదా. తనకు ఇప్పటికే ఓ స్టార్ సన్‌గా, క్రికెటర్‌గా ఓ క్రేజ్ ఉంది. చేస్తే ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే సినిమా చేయాలి. తను ఆల్రెడీ క్రికెట్‌తో స్టార్ అయ్యాడు అన్నారు శేఖర్ కమ్ముల.

కుట్రకి 50 రోజుల ముందు ఏం జ‌రిగిందంటే..?


ద‌ర్శకుడు మూడు సంవ‌త్సరాలు క‌ష్టప‌డి డెవ‌లప్ చేసిన ఓ స్ర్కిప్ట్‌, అలాగే సంవ‌త్సరం పాటు వంద‌ల మంది టెక్నీష‌న్లు, న‌టుల‌ శ్రమతో తెర‌కెక్కిన ఏ మూవీ అయినా, రిలీజ్‌కు ముందే వీడియో బ‌య‌ట‌కు రావ‌డం అనేది మామూలు విష‌యం కాదు. ఇంతకాలం వారు ప‌డ్డ శ్రమ బూడిద‌మ‌యం అయిన‌ట్టే. ఇదంతా రీసెంట్‌గా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ న‌టించిన అత్తారింటికి దారేది మూవీకు జ‌రిగింది. యావ‌త్ సినీ ఇండ‌స్ట్రీను ఉలిక్కిప‌డేలా చేసిన సంఘ‌ట‌న ఇది. ఈ మూవీ ఆగ‌ష్టు7 న రిలీజ్ కావ‌ల్సి ఉండ‌గా ఆ లోపే రాష్ట్ర విభ‌జ‌న వ్యవ‌హారంతో, మూవీ రిలీజ్‌ను పోస్ట్ పోన్ చేసుకునేలా చేసింది. ఒకవేళ అత్తారింటికి దారేది మూవీ ఆగ‌ష్టు 7న రిలీజ్ అయినా, దానికి రెండు రోజుల ముందే లీక్డ్ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చేది.

 ఎందుకంటే ఆ వీడియోను బ‌య‌ట‌కు రిలీజ్ చేసేందుకు, దానికి సంబంధించిన కుట్రపూరిత‌మైన ప్లానింగ్ అప్పటికే రెడీగా ఉంది. ప‌వ‌న్‌క‌ళ్యాన్ ఈ విష‌యంపై క్లారిటి ఇచ్చాడు. 'ఈ లీక్డ్ వీడియోను కేవ‌లం ఒక్కరు చేసింది కాదు, వెన‌కనుండి చేయించింది, చేయ‌మ‌ని ప్రొత్సాహ‌ప‌రిచింది. పూర్తి మూవీ డి.వి.డి యూబై రోజుల ముందుగానే వాళ్ళ ద‌గ్గర ఉంది. రిలీజ్‌కి రెండు రోజుల ముందుగానే దాన్ని బ‌య‌ట పెట్టడానికి ఎదురుచూస్తున్నార‌ని' అత్తారింటికి దారేది థ్యాంక్యూ మీట్‌లో ప‌వ‌న్ వివ‌రించారు.

 ఇదిలా ఉంటే ఒక పూర్తి మూవీను రిలీజ్‌కి ముందుగానే ఎవ‌రి చేతిల్లోకి వెళుతుందంటే, పెద్ద మొత్తంలో మూవీను రిలీజ్ చేసే ఏరియా డిస్ట్రిబ్యూట‌ర్లకు డి.వి.డిను న‌మ్మకంతో ఇచ్చేస్తారు. అయితే ఆ డి.వి.డిను అందుకున్న వాళ్ళకు సిని ఇండ‌స్ట్రీలో భారీ ఎత్తున ప‌రిచ‌యాలు ఉంటాయి. వాళ్ళకు క‌నీస నైతిక విలువ‌లు తెలుసు కాబట్టి ఆ ప్రి రిలీజ్డ్ డి.వి.డిను ద్రోహుల చేతిలో ప‌డ‌కుండా చూసుకుంటారు. కాని ఇప్పుడు ఆ ఫుల్ లెన్త్ డి.వి.డిను తీసుకున్న అతి కొద్ది మంది వ్యక్తుల్లో ఒక‌రే ఈ త‌ర‌హా కుట్రకు పాల్పడ్డారు. వాళ్ళను పోలీసులు చాలా ఈజీగా క‌నిపెట్టేశారు. వాళ్ళు ఎవ‌ర‌నేది ప‌వ‌న్‌కీ తెలిసిపో యింది. ఆ వ్యక్తులు చాలా ద‌గ్గరి వారే కావ‌డంతో ఇది న‌మ్మక‌ద్రోహంగా ప‌వ‌న్ ప‌రిగ‌ణిస్తున్నాడు. కావాల‌ని చేసిన ప‌ని కాబ‌ట్టి, ఆ త‌ప్పుడు వ్యక్తుల ప‌నిప‌ట్టే ప‌నిలో ప‌వ‌న్ సిద్ధమ‌య్యాడు. ఇప్పుడు ఈ విధ‌మైనా టాక్స్ టాలీవుడ్‌లో చ‌క్కెర్లు కొడుతున్నాయి.

ప‌వ‌న్ వార్నింగ్‌పై చిరు ఎంక్వైరి..!


ఈ మ‌ధ్య కాలంలో ప‌వ‌న్ చాలా మృధు స్వభావంగా కనిపిస్తూ, ఎక్కడా వివాదాస్పదాల‌కు ద‌గ్గర కాలేదు. ప‌వ‌న్ రూటే స‌ప‌రేటు అన్న టాక్ టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఉంది. అందుకే అంద‌రి హీరోల‌కంటే ప‌వ‌న్ చాలా డిప్రెంట్‌. ఎప్పుడూ సైలెంట్‌గా క‌నిపించే ప‌వ‌న్ ఒక్కసారిగా ప్రత్యుర్ఠల‌పై విరుచుకుప‌డ‌టంతో, అస‌లు ఇండ‌స్ట్రీలో ఏం జ‌రుగుతుందో ఎవ్వరికి అర్ధం కావ‌డం లేదు. మెగా ప్యామిలిను విచ్ఛిన్నం చేసేందుకు ఏదో జ‌రుగుతుంది అనేది మాత్రం అర్ధం అవుతుంది. టాలీవుడ్ ఇండ‌స్ట్రీకు మెగాస్టార్ చిరంజీవి దూరం అయిన త‌ర్వాత నుండి, ఇక్కడో ఎన్నో మార్పులు జ‌రుగుతున్నాయి.

 మెగా ప్యామిలిలో చిరంజీవి త‌ర్వాత పొజిష‌న్ ఎవ‌రు తీసుకోవాలి అన్న దానిపైనా టాలీవుడ్ పెద్దల్లోనూ చ‌ర్చలు జ‌రిగాయి. వాట‌న్నింటికి స‌మాధానంగా అత్తారింటికిదారేది థ్యాంక్యూ మీట్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌మాధానం చెప్పాడు. మెగా ఫ్యామిలిలో ఛాలెంజ్ విసిరే స‌త్తా ఉన్న మ‌రో హీరో ప‌వ‌న్ క‌ళ్యాణే. చిరంజీవి మీద కోపంతోనే, మెగా ప్యామిలి మీద ఉన్న ప‌గ‌తోనో అత్తారింటికిదారేది మూవీకు న‌ష్టం చేకూర్చే ప్రయ‌త్యాన్ని కొంత‌మంది సినీ పెద్దల స‌మక్షంలో జ‌రిగిందనేది ప‌వ‌న్ వాద‌న‌. వారెవ‌రో తెలుసున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వాళ్ళకు గ‌ట్టిగానే స‌మాధానం ఇచ్చాడు. అలా చెప్పడ‌మే కాకుండా తాటాతీస్తాను అంటూ వార్నింగ్ కూడ ఇచ్చాడు.

 త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంత ఆవేశంగా మాట్లాడ‌టం చాలా అరుదు అని చిరంజీవికి తెలుసు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ఇంత‌టి కుట్ర ప‌న్నిన వారెవ‌రో తెలుసుకోవడానికి చిరంజీవి ఆస‌క్తి చూపించాడు. వెంట‌నే దానికి సంబంధించిన పూర్తి ఎంక్వైరీ ప్రారంభించాడ‌ని టాలీవుడ్ స‌మాచారం. ప‌వ‌న్ ప్రత్యర్ధులు అంటే చిరుకి కూడ ప్రత్యుర్ధులే. త‌మ్ముడు క‌ళ్యాణ్ రివేంజ్ తీర్చుకోవ‌డం అంటే అది రచ్ఛర‌చ్ఛగా మారి, గొడ‌వ ఎక్కడ‌కో వెళుతుంది. అందుకే ఆ మేట‌ర్‌ను చిరు డీల్ చేసి, వాళ్ళకు స‌రైన ప‌ద్ధతిలో స‌మాధానం చెప్పడానికే చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగిన‌ట్టు టాలీవుడ్ అంటుంది.

కుట్రలో కీల‌క వ్యక్తులు బ‌హిర్గతం


ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన అత్తారింటికిదారేది మూవీకు సంబంధించిన‌ ప్రి రిలీజ్డ్ లీక్డ్ వీడియోపై ప‌లు అనుమానాల‌ను ప‌వ‌న్ వ్యక్తప‌రిచాడు. 'పోలీసులు ప‌ట్టుకున్నది మామూలు వ్యక్తుల‌ను, వాళ్ళను ప్రోత్సహించింది ఇంకొరు. వాళ్ళేవ‌రో మాకు బాగా తెలుసు. వారికి న్యాయం చేకూరేలా ప్రయ‌త్నిస్తాం' అని పేర్లు బ‌య‌ట‌కు చెప్పక‌పోయినా, వార్నింగ్‌ను మాత్రం స్ట్రాంగ్‌గా ఇచ్చాడు. ప‌వ‌న్‌కి ప్రత్యుర్ధులు ఉంటారా అనే డౌట్ నిన్నటి థ్యాంక్యూ మీట్‌లో వెల్లడైంది. ఇది ప‌వ‌న్‌పై కోపంతో చేసిందా, మెగా ఫ్యామిలీ యూనిటిను తూట్లు పొడ‌వాల‌ని చేసిందా అనే ఆలోచ‌న‌లు టాలీవుడ్‌లో చ‌క్కెర్లు కొడుతున్నాయి.

 ఇంత‌కీ అత్తారింటికిదారేది మూవీను లీక్ చేసింది ఎవ‌రో అంద‌రికి తెలిసిపోయింది. ఎంతో కాన్ఫిడెన్షియ‌ల్‌గా ఉండే ఈ మేట‌ర్‌ ఇప్పుడు టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ప‌వ‌న్‌ను టార్గెట్ చేసుకొని, అత్తారింటికిదారేది మూవీను ఎంత వీలైతే అంత న‌ష్టప‌ర‌చాల‌ని కుట్రప‌న్నిన‌ ఆ వ్యక్తుల పేర్లు టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఓపెన్ అయ్యాయి. మొత్తంగా ఇందులో న‌లుగు వ్యక్తులు కీల‌కంగా ఉన్నార‌ని తెలిసింది టాలీవుడ్ స‌మాచారం. వీరిలో టాలీవుడ్ ప్రముఖులు ఉన్నార‌ని తెలియ‌డంతో, ఎవ‌రూ దీని గురించి పైకి మాట్లాడానికి ఆస‌క్తి చూప‌డంలేదు. ఇండ‌స్ట్రీలోని రెండు బ‌ల‌మైన వ‌ర్గాల మ‌ధ్య ఇప్పుడు ఆస‌క్తిక‌రమైన పోటీ జ‌రుగుతుండంతో, ఏ క్షణం ఏం జ‌రుగుతుందోన‌ని ఎవ్వరికీ అర్ధంకాకుండా ఉంది. ఈ విష‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏవిధంగా ముందుకు వెళ‌డ‌నేది కీల‌కంగా ఉంది. ఏదేమైనా ప‌వ‌న్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దాని వెనుక ప‌వ‌నిజం అనే బ‌ల‌మైన అండ శ్రీరామ‌ర‌క్షగా ఉంటుంద‌ని అంటున్నారు.

Monday, 14 October 2013

సీమాంధ్ర ఎంపీల రాజీనామా తిరస్కరణ


న్యూఢిల్లీ, అక్టోబర్ 14 : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సీమాంధ్ర ఎంపీలు చేసిన రాజీనామాలను లోక్‌సభ స్పీకర్ కార్యాలయం తిరస్కరించింది. రాజీనామలు చేసిన సీమాంధ్ర ఎంపీలు వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పీకర్ కార్యాలయం కోరింది. ఎంపీలు రాయపాటి,బాపిరాజు,మాగుంట, హర్షకుమార్, కొనకళ్ల, జగన్‌లు, మరికొంత మంది ఎంపీలు వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పీకర్ కార్యాలయం పేర్కొంది. ఎంపీల రాజీనామాలపై ఒత్తిడులు ఉన్నాయా అని స్పీకర్ కార్యాలయం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

 ఎంపీలు రాజీనామా చేయాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు చేసిన వ్యాఖ్యల సీడీని కార్యాలయం పరిశీలిస్తోంది. రాజీనామలు ఇచ్చిన వెంటనే ఆమోదించాల్సిన అవసరం లేదని, ఆర్టికల్ 101(3బి) ప్రకారం పూర్తి స్థాయి విచారణ జరపొచ్చని, సమాచార సేకరణ కూడా చేయొచ్చని స్పీకర్ కార్యాలయం పేర్కొంది. గతంలోనే స్పీకర్ మీరాకుమార్‌ను ఎంపీలు ఎస్పీవైరెడ్డి, సాయిప్రతాప్,లగడపాటి,అనంత,సబ్బంహరి,మేకపాటి, ఉండవల్లి కలిసిని విషయం తెలిసిందే.

మోఢీపై గురి పెట్టిన షారుక్…


బాలీవుడ్ కింగ్ షారుక్ ఈ సారి మోఢీ స్టేట్ ను గురి పెట్టాడండోయ్.ఇదేంటి షారుక్ కాంగ్రెస్ పార్టీలో చేరి.. మోఢీకి వ్యతిరేకంగా ప్రచారం చేయ‌బోతున్నాడ‌నుకుంటున్నారా..? అదేమి లేదండి. మ‌రి అయితే నరేంద్ర మోడిని టార్గెట్ ఎలా చేశాడ‌ని సందేహా ప‌డుతున్నారా..? సినిమా వాళ్లు క‌దండీ ఎలాగైనా టార్గెట్ చేయ‌గ‌ల‌రు క‌దా. అస‌లే ఈ మ‌ధ్య “చెన్నై ఎక్స్ ప్రెస్” సినిమాతో బాలీవుడ్ ఆల్ టైమ్ బాక్సాఫీస్ రికార్డ్ క్రియేట్ చేసిన జోష్ లో ఉన్నాడు.

. ఎంత జోష్ లో వున్నా న‌రేంద్ర మోఢీని ఢీ కొట్టడం అంటే అంత తేలికైన విష‌యం కాదు. అస‌లే మోడి ప్రభంజ‌నం న‌డుస్తుంది.మ‌రి అస‌లు మ్యాట‌రేంటో చెప్పిండిరా బాబు అంటారా.. ఇప్పటి వ‌ర‌కు షారుక్ ఖాన్ డాన్ గా ఎన్ని సార్లు చేశాడు గుర్తు చేసుకోండి. డైరెక్టర్ ఫ‌రాన్ అక్తర్ ఇప్పటికి రెండు సార్లు షారుక్ ను డాన్ గా చూపించాడు. “డాన్”, ఈసినిమా సీక్వెల్ రెండు షారుక్ తో నే చేసిన విష‌యం తెలిసిందే. ఈ రెండింటిలో షారుక్ డాన్ గా క‌నిపించాడు. ఇక తాజా విశేషం ఏమిటంటే.. ముచ్చట‌గా మూడోసారి షారుక్ ను డాన్ గా చూపించ‌డానికి ఫరాన్ అక్తర్ ప్రయ‌త్నాలు చేస్తున్నాడు. అయితే ఈ సారి షారుక్ ఖాన్ ఈ చిత్రంలో గుజ‌రాత్ డాన్ గా క‌నిపించ‌నున్నాడ‌ట‌.అయితే ఈ సినిమాకు ఫరాన్ అక్తర్ ప్రొడ్యూస‌ర్ గా వ్యవ‌హ‌రిస్తుండ‌గా.. రాహుల్ డొలాకియ డైరెక్షన్ చేస్తారు. మ‌రి గుజ‌రాత్ డాన్ గా షారుక్ ఏం చేస్తాడో చూడాలి.