Tuesday, 15 October 2013

కుట్రకి 50 రోజుల ముందు ఏం జ‌రిగిందంటే..?


ద‌ర్శకుడు మూడు సంవ‌త్సరాలు క‌ష్టప‌డి డెవ‌లప్ చేసిన ఓ స్ర్కిప్ట్‌, అలాగే సంవ‌త్సరం పాటు వంద‌ల మంది టెక్నీష‌న్లు, న‌టుల‌ శ్రమతో తెర‌కెక్కిన ఏ మూవీ అయినా, రిలీజ్‌కు ముందే వీడియో బ‌య‌ట‌కు రావ‌డం అనేది మామూలు విష‌యం కాదు. ఇంతకాలం వారు ప‌డ్డ శ్రమ బూడిద‌మ‌యం అయిన‌ట్టే. ఇదంతా రీసెంట్‌గా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ న‌టించిన అత్తారింటికి దారేది మూవీకు జ‌రిగింది. యావ‌త్ సినీ ఇండ‌స్ట్రీను ఉలిక్కిప‌డేలా చేసిన సంఘ‌ట‌న ఇది. ఈ మూవీ ఆగ‌ష్టు7 న రిలీజ్ కావ‌ల్సి ఉండ‌గా ఆ లోపే రాష్ట్ర విభ‌జ‌న వ్యవ‌హారంతో, మూవీ రిలీజ్‌ను పోస్ట్ పోన్ చేసుకునేలా చేసింది. ఒకవేళ అత్తారింటికి దారేది మూవీ ఆగ‌ష్టు 7న రిలీజ్ అయినా, దానికి రెండు రోజుల ముందే లీక్డ్ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చేది.

 ఎందుకంటే ఆ వీడియోను బ‌య‌ట‌కు రిలీజ్ చేసేందుకు, దానికి సంబంధించిన కుట్రపూరిత‌మైన ప్లానింగ్ అప్పటికే రెడీగా ఉంది. ప‌వ‌న్‌క‌ళ్యాన్ ఈ విష‌యంపై క్లారిటి ఇచ్చాడు. 'ఈ లీక్డ్ వీడియోను కేవ‌లం ఒక్కరు చేసింది కాదు, వెన‌కనుండి చేయించింది, చేయ‌మ‌ని ప్రొత్సాహ‌ప‌రిచింది. పూర్తి మూవీ డి.వి.డి యూబై రోజుల ముందుగానే వాళ్ళ ద‌గ్గర ఉంది. రిలీజ్‌కి రెండు రోజుల ముందుగానే దాన్ని బ‌య‌ట పెట్టడానికి ఎదురుచూస్తున్నార‌ని' అత్తారింటికి దారేది థ్యాంక్యూ మీట్‌లో ప‌వ‌న్ వివ‌రించారు.

 ఇదిలా ఉంటే ఒక పూర్తి మూవీను రిలీజ్‌కి ముందుగానే ఎవ‌రి చేతిల్లోకి వెళుతుందంటే, పెద్ద మొత్తంలో మూవీను రిలీజ్ చేసే ఏరియా డిస్ట్రిబ్యూట‌ర్లకు డి.వి.డిను న‌మ్మకంతో ఇచ్చేస్తారు. అయితే ఆ డి.వి.డిను అందుకున్న వాళ్ళకు సిని ఇండ‌స్ట్రీలో భారీ ఎత్తున ప‌రిచ‌యాలు ఉంటాయి. వాళ్ళకు క‌నీస నైతిక విలువ‌లు తెలుసు కాబట్టి ఆ ప్రి రిలీజ్డ్ డి.వి.డిను ద్రోహుల చేతిలో ప‌డ‌కుండా చూసుకుంటారు. కాని ఇప్పుడు ఆ ఫుల్ లెన్త్ డి.వి.డిను తీసుకున్న అతి కొద్ది మంది వ్యక్తుల్లో ఒక‌రే ఈ త‌ర‌హా కుట్రకు పాల్పడ్డారు. వాళ్ళను పోలీసులు చాలా ఈజీగా క‌నిపెట్టేశారు. వాళ్ళు ఎవ‌ర‌నేది ప‌వ‌న్‌కీ తెలిసిపో యింది. ఆ వ్యక్తులు చాలా ద‌గ్గరి వారే కావ‌డంతో ఇది న‌మ్మక‌ద్రోహంగా ప‌వ‌న్ ప‌రిగ‌ణిస్తున్నాడు. కావాల‌ని చేసిన ప‌ని కాబ‌ట్టి, ఆ త‌ప్పుడు వ్యక్తుల ప‌నిప‌ట్టే ప‌నిలో ప‌వ‌న్ సిద్ధమ‌య్యాడు. ఇప్పుడు ఈ విధ‌మైనా టాక్స్ టాలీవుడ్‌లో చ‌క్కెర్లు కొడుతున్నాయి.

No comments:

Post a Comment