Tuesday, 15 October 2013

ప‌వ‌న్ వార్నింగ్‌పై చిరు ఎంక్వైరి..!


ఈ మ‌ధ్య కాలంలో ప‌వ‌న్ చాలా మృధు స్వభావంగా కనిపిస్తూ, ఎక్కడా వివాదాస్పదాల‌కు ద‌గ్గర కాలేదు. ప‌వ‌న్ రూటే స‌ప‌రేటు అన్న టాక్ టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఉంది. అందుకే అంద‌రి హీరోల‌కంటే ప‌వ‌న్ చాలా డిప్రెంట్‌. ఎప్పుడూ సైలెంట్‌గా క‌నిపించే ప‌వ‌న్ ఒక్కసారిగా ప్రత్యుర్ఠల‌పై విరుచుకుప‌డ‌టంతో, అస‌లు ఇండ‌స్ట్రీలో ఏం జ‌రుగుతుందో ఎవ్వరికి అర్ధం కావ‌డం లేదు. మెగా ప్యామిలిను విచ్ఛిన్నం చేసేందుకు ఏదో జ‌రుగుతుంది అనేది మాత్రం అర్ధం అవుతుంది. టాలీవుడ్ ఇండ‌స్ట్రీకు మెగాస్టార్ చిరంజీవి దూరం అయిన త‌ర్వాత నుండి, ఇక్కడో ఎన్నో మార్పులు జ‌రుగుతున్నాయి.

 మెగా ప్యామిలిలో చిరంజీవి త‌ర్వాత పొజిష‌న్ ఎవ‌రు తీసుకోవాలి అన్న దానిపైనా టాలీవుడ్ పెద్దల్లోనూ చ‌ర్చలు జ‌రిగాయి. వాట‌న్నింటికి స‌మాధానంగా అత్తారింటికిదారేది థ్యాంక్యూ మీట్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌మాధానం చెప్పాడు. మెగా ఫ్యామిలిలో ఛాలెంజ్ విసిరే స‌త్తా ఉన్న మ‌రో హీరో ప‌వ‌న్ క‌ళ్యాణే. చిరంజీవి మీద కోపంతోనే, మెగా ప్యామిలి మీద ఉన్న ప‌గ‌తోనో అత్తారింటికిదారేది మూవీకు న‌ష్టం చేకూర్చే ప్రయ‌త్యాన్ని కొంత‌మంది సినీ పెద్దల స‌మక్షంలో జ‌రిగిందనేది ప‌వ‌న్ వాద‌న‌. వారెవ‌రో తెలుసున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వాళ్ళకు గ‌ట్టిగానే స‌మాధానం ఇచ్చాడు. అలా చెప్పడ‌మే కాకుండా తాటాతీస్తాను అంటూ వార్నింగ్ కూడ ఇచ్చాడు.

 త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంత ఆవేశంగా మాట్లాడ‌టం చాలా అరుదు అని చిరంజీవికి తెలుసు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ఇంత‌టి కుట్ర ప‌న్నిన వారెవ‌రో తెలుసుకోవడానికి చిరంజీవి ఆస‌క్తి చూపించాడు. వెంట‌నే దానికి సంబంధించిన పూర్తి ఎంక్వైరీ ప్రారంభించాడ‌ని టాలీవుడ్ స‌మాచారం. ప‌వ‌న్ ప్రత్యర్ధులు అంటే చిరుకి కూడ ప్రత్యుర్ధులే. త‌మ్ముడు క‌ళ్యాణ్ రివేంజ్ తీర్చుకోవ‌డం అంటే అది రచ్ఛర‌చ్ఛగా మారి, గొడ‌వ ఎక్కడ‌కో వెళుతుంది. అందుకే ఆ మేట‌ర్‌ను చిరు డీల్ చేసి, వాళ్ళకు స‌రైన ప‌ద్ధతిలో స‌మాధానం చెప్పడానికే చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగిన‌ట్టు టాలీవుడ్ అంటుంది.

కుట్రలో కీల‌క వ్యక్తులు బ‌హిర్గతం


ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన అత్తారింటికిదారేది మూవీకు సంబంధించిన‌ ప్రి రిలీజ్డ్ లీక్డ్ వీడియోపై ప‌లు అనుమానాల‌ను ప‌వ‌న్ వ్యక్తప‌రిచాడు. 'పోలీసులు ప‌ట్టుకున్నది మామూలు వ్యక్తుల‌ను, వాళ్ళను ప్రోత్సహించింది ఇంకొరు. వాళ్ళేవ‌రో మాకు బాగా తెలుసు. వారికి న్యాయం చేకూరేలా ప్రయ‌త్నిస్తాం' అని పేర్లు బ‌య‌ట‌కు చెప్పక‌పోయినా, వార్నింగ్‌ను మాత్రం స్ట్రాంగ్‌గా ఇచ్చాడు. ప‌వ‌న్‌కి ప్రత్యుర్ధులు ఉంటారా అనే డౌట్ నిన్నటి థ్యాంక్యూ మీట్‌లో వెల్లడైంది. ఇది ప‌వ‌న్‌పై కోపంతో చేసిందా, మెగా ఫ్యామిలీ యూనిటిను తూట్లు పొడ‌వాల‌ని చేసిందా అనే ఆలోచ‌న‌లు టాలీవుడ్‌లో చ‌క్కెర్లు కొడుతున్నాయి.

 ఇంత‌కీ అత్తారింటికిదారేది మూవీను లీక్ చేసింది ఎవ‌రో అంద‌రికి తెలిసిపోయింది. ఎంతో కాన్ఫిడెన్షియ‌ల్‌గా ఉండే ఈ మేట‌ర్‌ ఇప్పుడు టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ప‌వ‌న్‌ను టార్గెట్ చేసుకొని, అత్తారింటికిదారేది మూవీను ఎంత వీలైతే అంత న‌ష్టప‌ర‌చాల‌ని కుట్రప‌న్నిన‌ ఆ వ్యక్తుల పేర్లు టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఓపెన్ అయ్యాయి. మొత్తంగా ఇందులో న‌లుగు వ్యక్తులు కీల‌కంగా ఉన్నార‌ని తెలిసింది టాలీవుడ్ స‌మాచారం. వీరిలో టాలీవుడ్ ప్రముఖులు ఉన్నార‌ని తెలియ‌డంతో, ఎవ‌రూ దీని గురించి పైకి మాట్లాడానికి ఆస‌క్తి చూప‌డంలేదు. ఇండ‌స్ట్రీలోని రెండు బ‌ల‌మైన వ‌ర్గాల మ‌ధ్య ఇప్పుడు ఆస‌క్తిక‌రమైన పోటీ జ‌రుగుతుండంతో, ఏ క్షణం ఏం జ‌రుగుతుందోన‌ని ఎవ్వరికీ అర్ధంకాకుండా ఉంది. ఈ విష‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏవిధంగా ముందుకు వెళ‌డ‌నేది కీల‌కంగా ఉంది. ఏదేమైనా ప‌వ‌న్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దాని వెనుక ప‌వ‌నిజం అనే బ‌ల‌మైన అండ శ్రీరామ‌ర‌క్షగా ఉంటుంద‌ని అంటున్నారు.

Monday, 14 October 2013

సీమాంధ్ర ఎంపీల రాజీనామా తిరస్కరణ


న్యూఢిల్లీ, అక్టోబర్ 14 : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సీమాంధ్ర ఎంపీలు చేసిన రాజీనామాలను లోక్‌సభ స్పీకర్ కార్యాలయం తిరస్కరించింది. రాజీనామలు చేసిన సీమాంధ్ర ఎంపీలు వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పీకర్ కార్యాలయం కోరింది. ఎంపీలు రాయపాటి,బాపిరాజు,మాగుంట, హర్షకుమార్, కొనకళ్ల, జగన్‌లు, మరికొంత మంది ఎంపీలు వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పీకర్ కార్యాలయం పేర్కొంది. ఎంపీల రాజీనామాలపై ఒత్తిడులు ఉన్నాయా అని స్పీకర్ కార్యాలయం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

 ఎంపీలు రాజీనామా చేయాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు చేసిన వ్యాఖ్యల సీడీని కార్యాలయం పరిశీలిస్తోంది. రాజీనామలు ఇచ్చిన వెంటనే ఆమోదించాల్సిన అవసరం లేదని, ఆర్టికల్ 101(3బి) ప్రకారం పూర్తి స్థాయి విచారణ జరపొచ్చని, సమాచార సేకరణ కూడా చేయొచ్చని స్పీకర్ కార్యాలయం పేర్కొంది. గతంలోనే స్పీకర్ మీరాకుమార్‌ను ఎంపీలు ఎస్పీవైరెడ్డి, సాయిప్రతాప్,లగడపాటి,అనంత,సబ్బంహరి,మేకపాటి, ఉండవల్లి కలిసిని విషయం తెలిసిందే.

మోఢీపై గురి పెట్టిన షారుక్…


బాలీవుడ్ కింగ్ షారుక్ ఈ సారి మోఢీ స్టేట్ ను గురి పెట్టాడండోయ్.ఇదేంటి షారుక్ కాంగ్రెస్ పార్టీలో చేరి.. మోఢీకి వ్యతిరేకంగా ప్రచారం చేయ‌బోతున్నాడ‌నుకుంటున్నారా..? అదేమి లేదండి. మ‌రి అయితే నరేంద్ర మోడిని టార్గెట్ ఎలా చేశాడ‌ని సందేహా ప‌డుతున్నారా..? సినిమా వాళ్లు క‌దండీ ఎలాగైనా టార్గెట్ చేయ‌గ‌ల‌రు క‌దా. అస‌లే ఈ మ‌ధ్య “చెన్నై ఎక్స్ ప్రెస్” సినిమాతో బాలీవుడ్ ఆల్ టైమ్ బాక్సాఫీస్ రికార్డ్ క్రియేట్ చేసిన జోష్ లో ఉన్నాడు.

. ఎంత జోష్ లో వున్నా న‌రేంద్ర మోఢీని ఢీ కొట్టడం అంటే అంత తేలికైన విష‌యం కాదు. అస‌లే మోడి ప్రభంజ‌నం న‌డుస్తుంది.మ‌రి అస‌లు మ్యాట‌రేంటో చెప్పిండిరా బాబు అంటారా.. ఇప్పటి వ‌ర‌కు షారుక్ ఖాన్ డాన్ గా ఎన్ని సార్లు చేశాడు గుర్తు చేసుకోండి. డైరెక్టర్ ఫ‌రాన్ అక్తర్ ఇప్పటికి రెండు సార్లు షారుక్ ను డాన్ గా చూపించాడు. “డాన్”, ఈసినిమా సీక్వెల్ రెండు షారుక్ తో నే చేసిన విష‌యం తెలిసిందే. ఈ రెండింటిలో షారుక్ డాన్ గా క‌నిపించాడు. ఇక తాజా విశేషం ఏమిటంటే.. ముచ్చట‌గా మూడోసారి షారుక్ ను డాన్ గా చూపించ‌డానికి ఫరాన్ అక్తర్ ప్రయ‌త్నాలు చేస్తున్నాడు. అయితే ఈ సారి షారుక్ ఖాన్ ఈ చిత్రంలో గుజ‌రాత్ డాన్ గా క‌నిపించ‌నున్నాడ‌ట‌.అయితే ఈ సినిమాకు ఫరాన్ అక్తర్ ప్రొడ్యూస‌ర్ గా వ్యవ‌హ‌రిస్తుండ‌గా.. రాహుల్ డొలాకియ డైరెక్షన్ చేస్తారు. మ‌రి గుజ‌రాత్ డాన్ గా షారుక్ ఏం చేస్తాడో చూడాలి.

పైరసీ కాదు… కుట్ర : పవన్ కళ్యాణ్


అత్తారింటికి దారేది సినిమా ‘థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్’ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ బావోద్వేగానికి గురి అయ్యారు. సినిమా రిలీజ్ 50 డేస్ ముందే కుట్ర జరిగిందని, పైరసీ కాపీ ముందే తమ దగ్గర పెట్టుకుని, సమయం చూసి నెట్ లో పెట్టారని పవన్ అన్నారు. కుట్రను మర్చిపోలెం, పేరు పేరునా గుర్తుపెట్టుకుటాం. దీని వెనక ఎవరు వున్నారో నాకు తెలుసు, కుట్ర దారులు ఎంతటి వాళ్ళు అయిన వదలం, అన్ని భరిస్తాం… తేడ వస్తే తాట తీస్తాం… నిగ్రహాన్ని చేతకానితనంగా చూడొద్దని అన్నారు. పైరసీ ని అభిమానులు ప్రోత్సహించలేదు, సినిమా పెద్దలే ప్రోత్సహిస్తున్నారు. చాలా మంది సిని పరిశ్రమలోని వారు పైరసీ కాపీ చూసి సినిమా బాగుందని చెప్పారు. ఒకరిద్దరు అయితే పేర్లు చెప్పేవాడిని అని ఆవేశంగా చెప్పారు.

 ఇదిలా వుండగా విడుదలకు ముందే పైరసీ సీడీ మార్కెట్లోకి రావడం, మరోవైపు సినిమా అడ్డుకుంటామన్న హెచ్చరికలు…. ఇలా క్లిష్ట పరిస్థితుల్లో విడుదలైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా ‘అత్తారింటికి దారేది’ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. 2 వారాల లో 59 కోట్లు పైగా షేర్ రాబట్టినట్టు సమాచారం. ఈ సక్సెస్ తో పవన్ కు ఎక్కువ పారితోషకం ఇచ్చి కాల్షీట్స్ తీసుకోటానికి నిర్మాతలు క్యూ కట్టేస్తున్నారు.

అత్తారింటికి దారేది థ్యాంకు మీట్ లో పవన్ ఉద్వేగ ప్రసంగం


పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాసుల వర్షం కురిపిస్తోన్న ఈ సినిమా బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొట్టేదిశగా దూసుకుపోతోంది. అయితే, తమ సినిమాను ఆదరించినందుకుగానూ, కృతజ్ఞతలు తెలిపేందుకు చిత్ర బృందం హైదరాబాదు శిల్ప కళా వేదికలో థాంక్స్ గివింగ్ ఫంక్షన్ నిర్వహిస్తోంది. ఈ మూవీకి తివిక్రమ్ దర్శకత్వం వహించగా.. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. దీనిలో పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. ఇంత పెద్ద సక్సెస్ చేసిన తన అభిమానులకు అభినందనలు చెప్పడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యాడు.

 ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.... ఈ పైరసీని ఇండస్ట్రీ పెద్దలే ప్రోత్సహిస్తున్నారు...ఎన్ని సినిమాలు చేశానో గుర్తుపెట్టుకోలేదు. సినిమాలు చేయడమే కానీ ఇలా సక్సెస్ మీట్ లు ఏర్పాటు చేసుకోవడం ఆసక్తి ఉండదు. కానీ ఈ సినిమాకు పంక్షన్ ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యాను. నేను సినిమాలకు రావడానికి ప్రేక్షకులు చూపే ప్రేమే కారణం. జయాలకు ఎప్పుడూ పొంగిపోలేదు. అపజయాలు ఎప్పుడూ.. లొంగిపోలేదు. ఈ సినిమాను పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పడానికి ఈ మీట్ ఏర్పాటు చేశాం.

స్టేజ్ మీద డాన్స్ వేద్దామనుకున్నా: నాగార్జున


హైదరాబాద్: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'అత్తారింటికి దారేదీ' సినిమా పరిశ్రమకు ఒక దారి చూపించిందని 'కింగ్' నాగార్జున అన్నారు. మంచి సినిమాను పైరసీ ఆపలేదని ఈ చిత్రం నిరూపించిందన్నారు. నేడు జరిగిన 'భాయ్' సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. 'భాయ్' ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను భారీగా చేయాలనుకున్నా కుదరలేదని చెప్పారు. ఇందుకు కొంచెం బాధగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని ధూం ధాంగా చేద్దామనుకున్నామని, స్టేజ్ మీద డాన్స్ వేద్దామనుకున్నానని వెల్లడించారు.

హీరోయిన్లు కూడా రెడీ అయ్యారని అన్నారు. అయితే సమయాభావం వల్ల ఇవన్నీ చేయలేకపోయామని వివరించారు. 'భాయ్' సినిమాను 25న విడుదల చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. ఈ సినిమాకు సంగీతం అందించిన దేవీశ్రీ ప్రసాద్.. బ్యాంకాక్ లో మ్యూజిక్ సిట్టింగ్ లో ఉండడం వల్ల ఆడియో ఫంక్షన్ రాలేకపోయాడని తెలిపారు. అత్తారింటికి దారేదీలో దేవీశ్రీ ప్రసాద్ ఒక పాటలో బాగా నటించాడని నాగార్జున కితాబిచ్చారు. ఆడియో విడుదల కార్యక్రమంలో దర్శకుడు వీరభద్రమ్, హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ, పాటల రచయిత అనంత్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు

క‌రీనా క‌పూర్‌ కూతురి గ్రాండ్ ఎంట్రి !


క‌రీనా క‌పూర్‌కి మ్యారేజ్ జ‌రిగి ఈ నెల ప‌ద‌హారుకి స‌రిగ్గా ఒక సంవ‌త్సరం పూర్తవుతుంది. ఈ లోపే క‌రీనా క‌పూర్ కూతురి బాలీవుడ్ గ్రాండ్ ఎంట్రికు భారీగా క‌స‌ర‌త్తులు జ‌రుగుతున్నాయి. అదేంటి, కరీనాకు పెళ్ళి అయితే జ‌రిగింది కాని, పిల్లలు ఎక్కడి నుంచి వ‌చ్చారు అని అనుకుంటున్నారా? ఇందులో ఆశ్యర్యప‌డాల్సిన అవ‌స‌రం ఏమి లేదు. సైఫ్ అలీ ఖాన్‌ని పెళ్ళి చేసుకున్న క‌రీనా, ఆనాడే ఒక మాట ఇచ్చింది. 'మాకు పిల్లలు వ‌ద్దూ, సైఫ్‌కు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడ నా బిడ్డల‌తోనే స‌మానం. నేనూ వాళ్ళకూ త‌ల్లినే' అని ఓ సెంటిమెంట్ స్టేట్‌మెంట్ ఇచ్చింది.

 దాని ప్రకార‌మే సైఫ్ అలీఖాన్ మొద‌టి భార్య కూత‌రు స‌రా ఖాన్, క‌రీనాక‌పూర్‌కీ కూతురు అయింది. ఇప్పుడు స‌రా ఖాన్ వ‌య‌స్సు ఇర‌వై సంవ‌త్సరాలు. ఈ అమ్మడి బాలీవుడ్ ఎంట్రి కోసం పెద్ద పెద్ద ప్రొడ‌క్షన్ సంస్థలు కూడ క్యూ క‌డుతున్నాయి. స‌రాఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలే కాని బాలీవుడ్ కుర్ర హీరోలు సైతం ఆమెతో న‌టించ‌డానికి రెడీ అవుతున్నారు. స‌రాఖాన్ బాలీవుడ్‌లోకి ఎప్పుడు ఎంట్రి ఇచ్చినా అది య‌ష్‌రాజ్ ప్రొడ‌క్షన్ నుండే అని ఖారారైంది. ఈ మ‌ధ్య కాలంలో స‌రాఖాన్ కొన్ని స్టోరీల‌ను వింటుద‌ని స‌మాచారం. దీంతో ప‌టౌడి హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు, బాలీవుడ్ గ్రాండ్ ఎంట్రి అంటూ వార్తలు షురూ అందుకున్నాయి.