అత్తారింటికి దారేది సినిమా ‘థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్’ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ బావోద్వేగానికి గురి అయ్యారు. సినిమా రిలీజ్ 50 డేస్ ముందే కుట్ర జరిగిందని, పైరసీ కాపీ ముందే తమ దగ్గర పెట్టుకుని, సమయం చూసి నెట్ లో పెట్టారని పవన్ అన్నారు. కుట్రను మర్చిపోలెం, పేరు పేరునా గుర్తుపెట్టుకుటాం. దీని వెనక ఎవరు వున్నారో నాకు తెలుసు, కుట్ర దారులు ఎంతటి వాళ్ళు అయిన వదలం, అన్ని భరిస్తాం… తేడ వస్తే తాట తీస్తాం… నిగ్రహాన్ని చేతకానితనంగా చూడొద్దని అన్నారు. పైరసీ ని అభిమానులు ప్రోత్సహించలేదు, సినిమా పెద్దలే ప్రోత్సహిస్తున్నారు. చాలా మంది సిని పరిశ్రమలోని వారు పైరసీ కాపీ చూసి సినిమా బాగుందని చెప్పారు. ఒకరిద్దరు అయితే పేర్లు చెప్పేవాడిని అని ఆవేశంగా చెప్పారు.ఇదిలా వుండగా విడుదలకు ముందే పైరసీ సీడీ మార్కెట్లోకి రావడం, మరోవైపు సినిమా అడ్డుకుంటామన్న హెచ్చరికలు…. ఇలా క్లిష్ట పరిస్థితుల్లో విడుదలైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా ‘అత్తారింటికి దారేది’ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. 2 వారాల లో 59 కోట్లు పైగా షేర్ రాబట్టినట్టు సమాచారం. ఈ సక్సెస్ తో పవన్ కు ఎక్కువ పారితోషకం ఇచ్చి కాల్షీట్స్ తీసుకోటానికి నిర్మాతలు క్యూ కట్టేస్తున్నారు.




























