Monday, 14 October 2013

'రామయ్యా వస్తావయ్యా' తొలిరోజు షేర్ రూ. 8.7 కోట్లు


జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'రామయ్యా వస్తావయ్యా' సినిమాపై భిన్నమైన టాక్ వచ్చినా ఆశించిన స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్లు రాబట్టింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా మొదటి రోజు 8.7 కోట్లు వసూలు చేసింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు 40 కోట్ల రూపాయల వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. సమంత, శృతిహాసన్ హీరోయిన్లు కాగా హరీష్ శంకర్ దర్శకుడు. 'రామయ్యా వస్తావయ్యా సినిమాపై మిశ్రమ స్పందన వచ్చినా ఆంధ్రప్రదేశ్ లో మంచి వసూళ్లు రాబట్టింది. తొలి రోజే భారీ మొత్తం వచ్చింది. అయితే తర్వాతి రోజు నుంచి వసూళ్లు తగ్గాయి. తొలి వారం కలెక్షన్లను బట్టి బాక్సాఫీసు వద్ద ఈ సినిమా సత్తా ఎంత అన్న విషయం తేలనుంది' అని సినీ విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు.

కళ్యాణ్‌కి ధన్యవాదాలు


‘‘తెలుగు పరిశ్రమలో నాకున్న బ్యాక్‌గ్రౌండ్‌కి ఇక్కడ సినిమా నిర్మిస్తే చాలా సులువుగా ఉంటుంది. అయితే పుణెతో నాకున్న అనుబంధం, మరాఠీ సినిమాల మీద ఉన్న మక్కువతో తొలి ప్రయత్నంగా ఓ మరాఠీ సినిమా నిర్మిస్తున్నా’’ అన్నారు రేణుదేశాయ్. ‘బద్రి’ ద్వారా తెలుగు తెరపై మెరిసిన ఆమె పవన్‌కళ్యాణ్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక్క ‘జానీ’లో నటించి, ఆ తర్వాత సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే.

 ఇప్పుడు నిర్మాతగా మారి, మరాఠీలో ‘మంగళాష్టక్ వన్స్ మోర్’ అనే చిత్రం తీస్తున్నారు. ఈ చిత్రవిశేషాలు తెలియజేయడానికి ఆమె ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో రేణు మాట్లాడుతూ - ‘‘గత పది, పన్నెండేళ్లల్లో సినిమాకి సంబంధించిన స్టోరీ డిస్కషన్స్, మ్యూజిక్ సిట్టింగ్స్ అన్నింట్లోనూ పాల్గొన్నాను. దాని వల్ల సినిమా మేకింగ్ మీద ఓ అవగాహన వచ్చింది. అందుకు కళ్యాణ్ (పవన్‌కళ్యాణ్)కి థ్యాంక్స్ చెప్పాలి. ఈ పన్నెండేళ్లల్లో సాధించిన అనుభవంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నా’’ అన్నారు. ఈ షూటింగ్ లొకేషన్‌లో మీరు కొంతమంది దగ్గర దురుసుగా ప్రవర్తించారనే టాక్ ఉంది? అనే ప్రశ్నకు సమాధానంగా- ‘‘ఎక్కడైనాసరే మగవాళ్లు అరిస్తే అది తప్పుగా అనిపించదు.

బాసా.. మజాకా..



నెల్లూరు(బారకాసు), న్యూస్‌లైన్: ఏతప్పు చేయకపోయినా బాస్‌కు ఇష్టం లేని పని చేస్తే మాత్రం అధికారులకు వేటు తప్పదు. ఇంతకీ ఎవరా బాస్ అనుకుంటున్నారా... ఎవరో కాదండి మన రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి... ఆయన ఆగ్రహానికి గురైతే ఏ అధికారిపైనైనా వేటు తప్పదు... శుక్రవారం స్థానిక 17వ డివిజన్‌లో రోడ్డు శంకుస్థాన కార్యక్రమంలో శిలాఫలకంలో మాజీ మేయర్ భానుశ్రీ పేరు లేదని ఎమ్మెల్యే వివేకానందరెడ్డి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 వెంటనే వీరు చేస్తున్న పనుల నుంచి తొలగించి ఇతర పనులు అప్పగించాలని కమిషనర్‌ను ఆదేశించడమే ఇందుకు నిదర్శనం. అంతే ఆయన ఆదేశాల మేరకు కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం చకచకా ఫైలు కదిలింది. సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఇతర పనులను అప్పగిస్తూ కమిషనర్ జాన్‌శ్యాంసన్ ఉత్తర్వులు జారీ చేశారు. సమ్మర్ స్టోరేజ్ పనులను చూస్తున్న డీఈఈ చంద్రయ్య, ఏఈఈ సుబ్బారెడ్డి స్థానంలో బాస్ వేటుకు గురైన డీఈఈ అనిల్‌కుమార్, ఏఈఈ ప్రసాద్‌ను నియమించారు. వీరి స్థానంలో సమ్మర్ స్టోరేజ్ పనులు చూస్తున్న ఇంజనీరింగ్ అధికారులను నియమించారు. అదేవిధంగా మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారికి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ప్రొటోకాల్ ప్రకారంగా తాము వ్యవహరించి నందుకు తాము నిర్వర్తించే విధుల నుంచి ఇతర పనులకు కేటాయించడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 ఇంజనీరింగ్ అధికారుల విషయంలో జరిగిన తీరుతో ఇతర అధికారులు బాస్ ఎప్పుడు ఎవరిపైన ఆగ్రహిస్తాడో తెలీదు.. ఒక వేళ ఏదైనా సందర్భంలో తమపై ఆగ్రహించారో తమకు వేటు తప్పదని కార్పొరేషన్ కార్యాలయ ఉద్యోగులు వాపోతున్నారు. బాస్‌కు నచ్చినట్లు ప్రభుత్వానికి విరుద్ధంగా నిర్వహించాలంటే ఎలా కుదురుతుందని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇలాగైతే ఉద్యోగాలు ఎలా చేయాలో అర్థం కావడం లేదని అధికారులు తలలు పట్టుకుంటున్నట్లు తెలిసింది.

Masala Movie Audio Launch


Sunday, 13 October 2013

శృతి ఆరోగ్యంపై త‌ల్లి సారిక అసంతృప్తి


వ‌రుస మూవీలతో బిజి అవుతున్న శృతిహాస‌న్‌కి ఆరోగ్య స‌మ‌స్యలు ఇబ్బంది పెడుతున్నాయి అని కొన్ని లీడింగ్ టాబ్లాయిడ్స్‌లో వ‌రుస క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. దీంతో శృతి హాస‌న్‌కి ఏమైంద‌ని అంద‌రూ కంగారు ప‌డుతున్నారు. అస‌లు మేట‌ర్‌ను తెలుసుకుంటే అంత కంగారు ప‌డాల్సిన విష‌యం కాద‌ని తెలిసింది. శృతిహాస‌న్ ఈ మ‌ధ్య కాలంలో త‌ను న‌టించిన ప్రతి ఫిల్మ్ స‌క్సెస్ బాట ప‌డుతుంది. దీంతో శృతికి ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో డిమాండ్ పెరుగుతుంది.

 ఆఫ‌ర్లు కూడ వ‌రుస పెట్టి వ‌స్తున్నాయి. వ‌స్తున్న ప్రతి ఆఫ‌ర్స్‌లో ఏది మంచిదో సెల‌క్ట్ చేసుకొని, త‌న షెడ్యూల్స్‌ని ఖాళీ లేకుండా చూసుకుంటుంది. దీని వ‌ల్ల శృతిహాస‌న్‌కు మినిమం రెస్ట్ కూడ క‌రువ‌య్యింది. ఈ విష‌యాన్ని త‌ల్లి సారిక గ‌మ‌నించింది. గ‌బ్బర్‌సింగ్ మూవీ నుండి శృతి హాస‌న్ క‌నీసం రెండు రోజుల విశ్రాంతి కూడ తీసుకోలేద‌ట‌. గ‌బ్బర్‌సింగ్‌,డిడే, రామ‌య్యావ‌స్తావ‌య్యా (హింది), రామ‌య్యవ‌స్తావ‌య్యా (ఎన్టీఆర్‌), ఇలా వ‌రుస మూవీ షూటింగ్‌ల‌తోనూ, వాటి ప్రమోష‌న్ ఈవెంట్స్‌తోనూ బిజిబిజిగా గ‌డుపుతుంది.

 ఏదైన షెడ్యూల్ వారం రోజుల గ్యాప్ దొరికితే, ఆ స‌మ‌యంలో ఎడ్వెర్‌టైజింగ్ బ్రాండ్స్‌కు సంబంధించిన షూటింగ్స్‌లో పార్టిసిపెట్ చేస్తుంది. గ‌త సంవ‌త్సర కాలంగా కూతురి డే షెడ్యూల్స్‌ను చూసిన సారిక ఓ స‌లహా ఇచ్చింది. 'నీ కొత్త మూవీ స్టార్ట్ అయ్యేట‌ప్పుడు క‌నీసం ప‌ది రోజుల రెస్ట్ తీసుకొని షూటింగ్స్‌తో పార్టిసిపెట్ చేయి' అని గ‌ట్టిగా చెప్పింద‌ట‌. దీంతో త‌ల్లి సారిక చెప్పిన స‌ల‌హాను విన‌టానికి శృతి హాస‌న్ రెడీ అయింద‌ని స‌మాచారం.

విభేదాల్లేవు, అన్నయ్య ఆదేశిస్తే పోటీ చేస్తా : నాగబాబు


తాము అన్నయ్య చిరంజీవి వెంటే ఉంటామని ఆయన తమ్ముడు ప్రముఖ నిర్మాత నాగబాబు స్పష్టం చేశారు. అన్నయ్య ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేస్తామని కూడా చెప్పారు. నాగబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో విలేకరులతో మాట్లాడుతూ తను, తన సోదరుడు పవన్ కళ్యాన్ అన్నయ్య తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి వెంటే ఉన్నామన్నారు. తమ మధ్య విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఆ వార్తల్లో నిజం లేదన్నారు. ఆయన వల్లనే తాము ఈ స్థాయికి చేరుకున్నామని చెప్పారు.

 చిరంజీవిని ఎవరైనా ఏమైనా అంటే తాము సహించేది లేదన్నారు. కాగా ఇటీవల మెగా సోదరుల మధ్య విభేదాలు వచ్చాయన్న ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల పవన్ కల్యాణ్ పంజా ఆడియో విడుదలకు కుటుంబంలోని ఏ ఒక్కరూ హాజరు కాకపోవడం ప్రధానంగా చర్చానీయాంశమైంది. కాంగ్రెసులో పిఆర్పీ విలీనం ఇష్టం లేని పవన్ కల్యాణ్ చిరంజీవికి దూరంగా ఉంటున్నారనే వాదనలు వినిపించాయి

'మసాల' ఆడియో విడుదల !


విక్తరి వెంకటేష్ ఎనర్జిటిక్ హీరో రామ్ కలసి నటిస్తున్న 'మసాలా' సినిమా పాటల సీడీలు ఈరోజు మార్కెట్ లోకి విడుదల చేశారు. హైదరాబాద్ లో నిరాడంబరంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఈ సీడీలను హీరో రామ్ విడుదల చేయగా వెంకటేష్ తొలిసీడీని స్వీకరించారు. ఈ సందర్బంగా రామ్ మాట్లాడుతూ " నేను చెన్నైలో ఏడో తరగతి చదువుతుండగా వెంకటేష్ గారు విజయభాస్కర్ గారు సురేష్ బాబు గారు పెద్దనాన్న (స్రవంతి రవికిషోర్) కలసి 'నువ్వు నాకు నచ్చావ్' సినిమా షూటింగ్ చేశారు. ఇప్పుడు సరిగా అదే టీమ్ తలో కలసి చేస్తున్నాని అప్పుడు అనుకోలేదు. ఈ సినిమా ఓ మధురానుభుతినిచ్చింది" అని అన్నాడు. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని హీరో వెంకటేష్ చెప్పాడు. ఇంకా దర్శకుడు విజయభాస్కర్ హీరోయిన్ అంజలి పోసాని రామజోగయ్య శాస్త్రి రవి కిషోర్ సురేష్ బాబు అలీ తదితరులు పాల్గొన్నారు . తమన్ ఈ సినిమాకి సంగీతం అందించాడు.

సోషల్ నెట్‌వర్క్‌లలో టాలీవుడ్ సందడి!