Sunday, 13 October 2013

విభేదాల్లేవు, అన్నయ్య ఆదేశిస్తే పోటీ చేస్తా : నాగబాబు


తాము అన్నయ్య చిరంజీవి వెంటే ఉంటామని ఆయన తమ్ముడు ప్రముఖ నిర్మాత నాగబాబు స్పష్టం చేశారు. అన్నయ్య ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేస్తామని కూడా చెప్పారు. నాగబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో విలేకరులతో మాట్లాడుతూ తను, తన సోదరుడు పవన్ కళ్యాన్ అన్నయ్య తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి వెంటే ఉన్నామన్నారు. తమ మధ్య విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఆ వార్తల్లో నిజం లేదన్నారు. ఆయన వల్లనే తాము ఈ స్థాయికి చేరుకున్నామని చెప్పారు.

 చిరంజీవిని ఎవరైనా ఏమైనా అంటే తాము సహించేది లేదన్నారు. కాగా ఇటీవల మెగా సోదరుల మధ్య విభేదాలు వచ్చాయన్న ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల పవన్ కల్యాణ్ పంజా ఆడియో విడుదలకు కుటుంబంలోని ఏ ఒక్కరూ హాజరు కాకపోవడం ప్రధానంగా చర్చానీయాంశమైంది. కాంగ్రెసులో పిఆర్పీ విలీనం ఇష్టం లేని పవన్ కల్యాణ్ చిరంజీవికి దూరంగా ఉంటున్నారనే వాదనలు వినిపించాయి

No comments:

Post a Comment