Sunday, 13 October 2013

వెంటనే పవన్‌, మహేష్‌ స్పందించారు: సమంత


పవన్ తో,మహేష్ తో సినిమాలు చేసిన సమంతకు వారిద్దరితో మంచి రిలేషన్ ఉంది. దాంతో ఆమె తన ప్రత్యూష ఫౌండేషన్ కు వారి నుంచి హెల్ప్ తీసుకుంది. ప్రత్యూష ఫౌండేషన్‌ గురించి తెలుసుకొని మహేష్‌బాబు, పవన్‌ కల్యాణ్‌ చాలా సంతోషించారు. కథానాయకుల దుస్తుల్ని వేలం వేసి, ఆ డబ్బుతో ఫౌండేషన్‌కి ధన సహాయం చేయాలనేది నా ఆలోచన. వెంటనే పవన్‌, మహేష్‌ స్పందించారు. పవన్‌ తన 'గబ్బర్‌ సింగ్‌' దుస్తుల్ని ఇచ్చారు. మహేష్‌ అప్పటికి లండన్‌లో ఉన్నారు. అక్కడి నుంచి 'దూకుడు' దుస్తులు నాకు అందేలా చూశారు. నిజం చెప్పాలంటే నా తోటి హీరోయిన్స్ కూడా ఇంతలా స్పందించలేదు అంటూ చెప్పుకొచ్చింది సమంత. ఇప్పుడు నేను సెలబ్రెటీని. ఏం మాట్లాడినా విలువ ఉంటుంది. అందుకే మంచి మాటలు మాట్లాడాలి. మంచి పనులు చేయాలి. ట్విట్టర్‌లో మూడు లక్షల మంది నన్ను అనుసరిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది సమంత. మధ్యతరగతి జీవితం నుంచి వచ్చింది కదా... ఒదిగి ఉండడం ఎలాగో కూడా నేర్చుకొంది. ఇంతిచ్చిన సమాజానికి ఎంతోకొంత తిరిగి ఇవ్వడం అలవాటు చేసుకొంది. అందుకే సినిమాలతో పాటు సామాజిక సేవకూ సమయం కేటాయిస్తోంది. ఈ ఏడాది సమంతకు బాగానే కలిసొచ్చింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'అత్తారింటికి దారేది' సినిమాలతో విజయాలు దక్కించుకొంది. 'రామయ్యా వస్తావయ్యా'లో ఆకర్ష పాత్రతో ఆకర్షిస్తోంది. ఈ సందర్భంగా మీడియా తో సమంత ప్రత్యేకంగా మాట్లాడింది.

No comments:

Post a Comment