Sunday, 13 October 2013

శృతి ఆరోగ్యంపై త‌ల్లి సారిక అసంతృప్తి


వ‌రుస మూవీలతో బిజి అవుతున్న శృతిహాస‌న్‌కి ఆరోగ్య స‌మ‌స్యలు ఇబ్బంది పెడుతున్నాయి అని కొన్ని లీడింగ్ టాబ్లాయిడ్స్‌లో వ‌రుస క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. దీంతో శృతి హాస‌న్‌కి ఏమైంద‌ని అంద‌రూ కంగారు ప‌డుతున్నారు. అస‌లు మేట‌ర్‌ను తెలుసుకుంటే అంత కంగారు ప‌డాల్సిన విష‌యం కాద‌ని తెలిసింది. శృతిహాస‌న్ ఈ మ‌ధ్య కాలంలో త‌ను న‌టించిన ప్రతి ఫిల్మ్ స‌క్సెస్ బాట ప‌డుతుంది. దీంతో శృతికి ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో డిమాండ్ పెరుగుతుంది.

 ఆఫ‌ర్లు కూడ వ‌రుస పెట్టి వ‌స్తున్నాయి. వ‌స్తున్న ప్రతి ఆఫ‌ర్స్‌లో ఏది మంచిదో సెల‌క్ట్ చేసుకొని, త‌న షెడ్యూల్స్‌ని ఖాళీ లేకుండా చూసుకుంటుంది. దీని వ‌ల్ల శృతిహాస‌న్‌కు మినిమం రెస్ట్ కూడ క‌రువ‌య్యింది. ఈ విష‌యాన్ని త‌ల్లి సారిక గ‌మ‌నించింది. గ‌బ్బర్‌సింగ్ మూవీ నుండి శృతి హాస‌న్ క‌నీసం రెండు రోజుల విశ్రాంతి కూడ తీసుకోలేద‌ట‌. గ‌బ్బర్‌సింగ్‌,డిడే, రామ‌య్యావ‌స్తావ‌య్యా (హింది), రామ‌య్యవ‌స్తావ‌య్యా (ఎన్టీఆర్‌), ఇలా వ‌రుస మూవీ షూటింగ్‌ల‌తోనూ, వాటి ప్రమోష‌న్ ఈవెంట్స్‌తోనూ బిజిబిజిగా గ‌డుపుతుంది.

 ఏదైన షెడ్యూల్ వారం రోజుల గ్యాప్ దొరికితే, ఆ స‌మ‌యంలో ఎడ్వెర్‌టైజింగ్ బ్రాండ్స్‌కు సంబంధించిన షూటింగ్స్‌లో పార్టిసిపెట్ చేస్తుంది. గ‌త సంవ‌త్సర కాలంగా కూతురి డే షెడ్యూల్స్‌ను చూసిన సారిక ఓ స‌లహా ఇచ్చింది. 'నీ కొత్త మూవీ స్టార్ట్ అయ్యేట‌ప్పుడు క‌నీసం ప‌ది రోజుల రెస్ట్ తీసుకొని షూటింగ్స్‌తో పార్టిసిపెట్ చేయి' అని గ‌ట్టిగా చెప్పింద‌ట‌. దీంతో త‌ల్లి సారిక చెప్పిన స‌ల‌హాను విన‌టానికి శృతి హాస‌న్ రెడీ అయింద‌ని స‌మాచారం.

విభేదాల్లేవు, అన్నయ్య ఆదేశిస్తే పోటీ చేస్తా : నాగబాబు


తాము అన్నయ్య చిరంజీవి వెంటే ఉంటామని ఆయన తమ్ముడు ప్రముఖ నిర్మాత నాగబాబు స్పష్టం చేశారు. అన్నయ్య ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేస్తామని కూడా చెప్పారు. నాగబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో విలేకరులతో మాట్లాడుతూ తను, తన సోదరుడు పవన్ కళ్యాన్ అన్నయ్య తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి వెంటే ఉన్నామన్నారు. తమ మధ్య విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఆ వార్తల్లో నిజం లేదన్నారు. ఆయన వల్లనే తాము ఈ స్థాయికి చేరుకున్నామని చెప్పారు.

 చిరంజీవిని ఎవరైనా ఏమైనా అంటే తాము సహించేది లేదన్నారు. కాగా ఇటీవల మెగా సోదరుల మధ్య విభేదాలు వచ్చాయన్న ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల పవన్ కల్యాణ్ పంజా ఆడియో విడుదలకు కుటుంబంలోని ఏ ఒక్కరూ హాజరు కాకపోవడం ప్రధానంగా చర్చానీయాంశమైంది. కాంగ్రెసులో పిఆర్పీ విలీనం ఇష్టం లేని పవన్ కల్యాణ్ చిరంజీవికి దూరంగా ఉంటున్నారనే వాదనలు వినిపించాయి

'మసాల' ఆడియో విడుదల !


విక్తరి వెంకటేష్ ఎనర్జిటిక్ హీరో రామ్ కలసి నటిస్తున్న 'మసాలా' సినిమా పాటల సీడీలు ఈరోజు మార్కెట్ లోకి విడుదల చేశారు. హైదరాబాద్ లో నిరాడంబరంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఈ సీడీలను హీరో రామ్ విడుదల చేయగా వెంకటేష్ తొలిసీడీని స్వీకరించారు. ఈ సందర్బంగా రామ్ మాట్లాడుతూ " నేను చెన్నైలో ఏడో తరగతి చదువుతుండగా వెంకటేష్ గారు విజయభాస్కర్ గారు సురేష్ బాబు గారు పెద్దనాన్న (స్రవంతి రవికిషోర్) కలసి 'నువ్వు నాకు నచ్చావ్' సినిమా షూటింగ్ చేశారు. ఇప్పుడు సరిగా అదే టీమ్ తలో కలసి చేస్తున్నాని అప్పుడు అనుకోలేదు. ఈ సినిమా ఓ మధురానుభుతినిచ్చింది" అని అన్నాడు. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని హీరో వెంకటేష్ చెప్పాడు. ఇంకా దర్శకుడు విజయభాస్కర్ హీరోయిన్ అంజలి పోసాని రామజోగయ్య శాస్త్రి రవి కిషోర్ సురేష్ బాబు అలీ తదితరులు పాల్గొన్నారు . తమన్ ఈ సినిమాకి సంగీతం అందించాడు.

సోషల్ నెట్‌వర్క్‌లలో టాలీవుడ్ సందడి!


మంచువారి సినిమాని మనం పొగడక్కర్లా!


ఎవరైనా సినిమా చేస్తే, ప్రేక్షకులు దాన్ని చూసి ఏమంటారా అని చాలా ఉత్సుకతతో ఎదురు చూస్తుంటారు. సినిమా విడుదలై, జనం రెస్పాన్స్ తెలిసేవరకూ టెన్షన్ పడుతుంటారు. కానీ మంచు ఫ్యామిలీ ఆ టైపు కాదు. తమ సినిమాకి వాళ్లకి వేరేవాళ్ల స్పందన అక్కర్లేదు. వాళ్లకి వాళ్లే డిసైడ్ చేసేస్తారు సినిమా ఎలా ఉంటుందో.

 తాజాగా విష్ణు నటించిన దూసుకెళ్తా సినిమా గురించి, ఆ చిత్ర నిర్మాత విష్ణు తండ్రి అయిన మోహన్ బాబు మాట్లాడారు. ఆ సినిమా గురించి ఆయన చెప్పే మాటలు వింటే కచ్చితంగా పిచ్చెక్కుతుంది. మోహన్ బాబు తన కొడుకుని, ప్రత్యేక పాత్రలో చేసిన కూతురిని ఆకాశానికి ఎత్తేశారు. వీరు పోట్ల టేకింగ్, రవితేజ వాయిస్ ఓవర్ ఆ సినిమాకి ఎంత ప్లస్సో... విష్ణు పర్ ఫార్మెన్స్, మంచు లక్ష్మి పాత్ర ఆ సినిమాకి మరీ ప్లస్ అట. ముఖ్యంగా లక్ష్మి రోల్ చాలా ఆసక్తికరంగా ఉంటుందట. అందరికీ తెగ నచ్చేస్తుందట. సినిమా ఎలా ఉంటుందన్నది అందరూ చెబుతారు. అది మామూలే.

ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే జయాపజయాలను తట్టుకోవడం కష్టం. కానీ ఇంట్లోవాళ్లు ఇంట్లోవాళ్లను పొగిడేసుకోవడం చూస్తే కాస్త వెరైటీగానే అనిపిస్తుంది. జనాలు అలానే ఫీలయ్యారు. వాళ్ల డబ్బాలు వాళ్లే కొట్టేసుకోవడం ఏంటి, మనం కదా ఇవన్నీ చెప్పాల్సింది అంటూ సెటైర్లు వేస్తున్నారు. అయినా వాళ్లు పెద్ద పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరో మంచు వారి సినిమాలకు సంబంధించిన ఏ ఫంక్షన్, ఏ ప్రెస్ మీట్ చూసినా అర్థమైపోతుంది!

జగన్.. మీడియాను కొనేస్తున్నాడు...!



తెలుగుదేశం పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై మరోసారి విరుచుకుపడింది. జగన్ మీడియాను కొనేస్తున్నాడని ఆ పార్టీ నాయకుడు వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్ అన్నాడు. ఒకవైపు సొంత మీడియాను దుర్వినియోగం చేస్తున్న జగన ఇప్పుడు నేషనల్ మీడియాను కూడా తన అవసరాలకు తగ్గట్టుగా ఉపయోగించుకొంటున్నాడని ఆయన వ్యాఖ్యానించాడు.

 బహుశా.. నేషనల్ మీడియాలో బాబు దీక్షపై అంత కవరేజీ రాకపోవడ గురించి స్పందిస్తూ తెలుగుదేశం నేతలు ఈ ఆరోపనలు చేసి ఉండవచ్చు... అయితే.. జగన్ మొత్తం మీడియాను కొనేస్తున్నాడని టీడీపీ వాళ్లు ఆరోపిస్తే అంత సమంజసంగా ఉండదు. ఏదోఒక మీడియా వర్గం గురించి ఆరోపిస్తే ఆ మాటలకు విలువ ఉంటుంది. కానీ. ఇలా అందరూ అమ్ముడు బోయారు అంటే అది టీడీపీ వాళ్ల బేలతనమే అవుతుంది.

 మరి తెలుగుదేశం వాళ్ల దగ్గర డబ్బులేదా? అమ్ముడుపోవడానికి మీడియా లేదా.. ? వారిని మ్యానేజ్ చేసే సత్తా లేదా? మ్యానేజ్ చేసిన చరిత్ర లేదా? అనే సందేహాలు వస్తున్నాయిప్పుడు.

వేధింపులతో టివి నటుడి భార్య ఆత్మహత్య, భర్త అరెస్టు


హైదరాబాద్: అదనపు కట్నం తేవాలంటూ ఓ టివి నటుడు తన భార్యను వేధించగా, వాటిని భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. భార్య మృతికి సంబంధించిన కేసులో పోలీసులు ఆర్టిస్టు అయిన భర్తను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన హైదరాబాదులో జరిగింది. పలు సీరియళ్లలో నటిస్తున్న టివి నటుడికి జీవిత అనే ఇరవై నాలుగేళ్ల యువతితో 2011 అక్టోబర్ 9న పెళ్లైంది. పెళ్లి సమయంలో జీవిత తల్లిదండ్రులు పెద్ద మొత్తంలో ముట్టజెప్పారు.

 పెళ్లయ్యాక దంపతులు వెంకటగిరిలో నివాసముంటున్నారు. పెళ్లైన మూడు నెలల నుండే భర్త అదనపు కట్నం కోసం భార్యను వేధించసాగాడు. మద్యం తాగి వచ్చి భార్యను కొట్టేవాడు. రెండు నెలలుగా ఆ వేధింపులు ఎక్కువయ్యాయి. భర్త వేధింపులు తట్టుకోలేక జీవిత శుక్రవారం అర్ధరాత్రి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త ఆమెను వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించాడు. అక్కడి నుండి భార్య తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. భార్యాభర్తలు ఇటీవలె తమ వివాహ దినోత్సవాన్ని జరుపుకునేందుకు యాదగిరి గుట్టకు వెళ్లారు. తిరిగి వచ్చాక ఈ ఘటన జరిగింది. మరోవైపు తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, అల్లుడే హత్య చేశాడని బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు శనివారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దంపతులకు ఏడాదిన్నర వయసుగల కూతురు ఉంది.

వెంటనే పవన్‌, మహేష్‌ స్పందించారు: సమంత


పవన్ తో,మహేష్ తో సినిమాలు చేసిన సమంతకు వారిద్దరితో మంచి రిలేషన్ ఉంది. దాంతో ఆమె తన ప్రత్యూష ఫౌండేషన్ కు వారి నుంచి హెల్ప్ తీసుకుంది. ప్రత్యూష ఫౌండేషన్‌ గురించి తెలుసుకొని మహేష్‌బాబు, పవన్‌ కల్యాణ్‌ చాలా సంతోషించారు. కథానాయకుల దుస్తుల్ని వేలం వేసి, ఆ డబ్బుతో ఫౌండేషన్‌కి ధన సహాయం చేయాలనేది నా ఆలోచన. వెంటనే పవన్‌, మహేష్‌ స్పందించారు. పవన్‌ తన 'గబ్బర్‌ సింగ్‌' దుస్తుల్ని ఇచ్చారు. మహేష్‌ అప్పటికి లండన్‌లో ఉన్నారు. అక్కడి నుంచి 'దూకుడు' దుస్తులు నాకు అందేలా చూశారు. నిజం చెప్పాలంటే నా తోటి హీరోయిన్స్ కూడా ఇంతలా స్పందించలేదు అంటూ చెప్పుకొచ్చింది సమంత. ఇప్పుడు నేను సెలబ్రెటీని. ఏం మాట్లాడినా విలువ ఉంటుంది. అందుకే మంచి మాటలు మాట్లాడాలి. మంచి పనులు చేయాలి. ట్విట్టర్‌లో మూడు లక్షల మంది నన్ను అనుసరిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది సమంత. మధ్యతరగతి జీవితం నుంచి వచ్చింది కదా... ఒదిగి ఉండడం ఎలాగో కూడా నేర్చుకొంది. ఇంతిచ్చిన సమాజానికి ఎంతోకొంత తిరిగి ఇవ్వడం అలవాటు చేసుకొంది. అందుకే సినిమాలతో పాటు సామాజిక సేవకూ సమయం కేటాయిస్తోంది. ఈ ఏడాది సమంతకు బాగానే కలిసొచ్చింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'అత్తారింటికి దారేది' సినిమాలతో విజయాలు దక్కించుకొంది. 'రామయ్యా వస్తావయ్యా'లో ఆకర్ష పాత్రతో ఆకర్షిస్తోంది. ఈ సందర్భంగా మీడియా తో సమంత ప్రత్యేకంగా మాట్లాడింది.