Saturday, 12 October 2013

మహేష్ బాబు బార్య మళ్లీ వస్తోంది


టాలీవుడ్ టాప్ హీరో మహేష్ బాబు బార్య నమ్రతా శిరోద్కర్ మళ్లీ వెండితెరపైకి వస్తోంది. ఒకప్పటి మిస్ ఇండియానే కాదు తన నటన, అందచందాలతో సినిమా రంగాన్ని ఓ ఊపు ఊపిన హీరోయినే.

 అయితే ఆమె మహేష్ బాబు ను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమయింది. కుటుంబజీవితానికే పరిమితమై పోయింది. ఏదైనా మహేష్ బాబు సినిమా ఫంక్షన్లలో కనపడడం తప్ప ఆమె అంతగా బాహ్యప్రపంచంలో కనిపించలేదు.

 కారణం మహేష్ బాబుది కూడా బిజినెస్ మైండ్ కాకపోవడం తో బార్యకు రిస్క్ ఇవ్వలేదన్న టాక్ ఉంది. అయితే శ్రీదేవి ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ తో మళ్లీ వెండితెరపైకి రావడంతో నమ్రత కూడా మళ్లీ తన టాలెంట్ చూపించుకోవాలని డిసైడ్ అయిందంటున్నారు. మహేష్ బాబు కూడా ఈ విషయం చెప్పడంతో అది నిజమేనని తేలిపోయింది.

అమ్మ కోసం ముంబైలో చివరి టెస్టు: సచిన్


న్యూఢిల్లీ: దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను ముంబైలోనే జరపాలని భారత క్రికెట్ నియంత్రణ మండలిని కోరిన విషయం తెలిసిందె. అయితే ఇందుకు ఓ ప్రత్యేకమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. క్రికెట్ జీవితానికి స్వస్తి పలుకబోయే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ తిలకించేందుకు తన తల్లి రజిని ముంబైలో మ్యాచ్ జరిగితే హాజరవుతుందనే ఆలోచనతోనే సచిన్ బిసిసిఐకి విజ్ఞప్తి చేశారు. సచిన్ టెండూల్కర్ కోరిక మేరకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో తన 200వ టెస్టును నిర్వహించేందుకు బిసిసిఐ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. చివరి మ్యాచ్‌కు తన తల్లి హాజరై వీక్షించడం తనకు గర్వంగా ఉంటుందని సచిన్ భావిస్తున్నట్లు తెలిసింది. కాగా సచిన్ టెండూల్కర్ తన 199వ టెస్ట్ మ్యాచ్‌ను కోల్‌కతా ఈడెన్ గార్డెన్ స్టేడియంలో, ఆ తర్వాత 200వ టెస్ట్ మ్యాచ్‌ను అతనికి ఇష్టమైన ముంబై వాంఖడే స్టేడియంలో నిర్వహించనున్నట్లు సమాచారం. సచిన్ టెండూల్కర్ క్రికెట్ జీవితాన్ని ప్రారంభించిన వాంఖడే స్టేడియంలోనే తన తల్లి సమక్షంలో తన క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలకనున్నారు. తనను ప్రోత్సహించిన పలువురు ప్రముఖులు, ముంబై ప్రజల మధ్య తన చివరి మ్యాచ్‌ను ఆడనుండడం తనకు సంతోషన్నిచ్చే అంశంగా సచిన్ భావిస్తున్నట్లు సమాచారం.

ముని 3 : రాఘవ్ లారెన్స్‌కు గాయాలు


హైదరాబాద్: కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ గాయ పడ్డాడు. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ముని-3 : గంగా' షూటింగు కోసం డాన్స్ ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. డాక్టర్లు అతనికి కంప్లీట్‌గా 3 నెలలు రెస్ట్ తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో షూటింగ్ కాన్సిల్ అయింది. ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. ‘కాంచన' వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని గతంలో బెల్లంకొండ సురేష్ తెలుగు అనువాద హక్కులు దక్కించుకుని భారీ లాభాలు పొందారు.

 ఈ నేపథ్యంలో దర్శకుడు రాఘవ లారెన్స్ ‘ముని-3' చిత్రానికి చేయడానికి ముందుకు వచ్చాడు బెల్లకొండ. లారెన్స్ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించే ‘ముని-3'లో తాప్సీ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా గురించి నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ...‘కాంచన లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మా బేనర్లో లారెన్స్ తో చేస్తున్న ‘ముని-3' సబ్జెక్ట్ ఎక్స్ ట్రార్డినరీగా ఉంది. హీరోగా, దర్శకుడిగా లారెన్స్ ముని-3 మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు' అన్నారు.

 రాఘవ లెరెన్స్, తాప్సీ జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రానికి ఫోటోగ్రఫీ: కిచ్చా, సంగీతం: థమన్, సమర్పణ: మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: బెల్లంకొండ సురేష్, బెల్లకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-కొరియోగ్రఫీ-దర్శకత్వం: రాఘవ లారెన్స్.

Events >> Courier Boy Kalyan First Look Launch


నేను ఎవరినీ చంపలేదు, బ్యాన్ ఎందుకు: జ్వాలా గుత్తా


హైదరాబాద్: సంక్షోభ సమయంలో తనకు మద్దతు నిలిచినవారందరికీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి ఢిల్లీ హైకోర్టు ఆమెకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆమె ఉత్సాహంగా కనిపించారు. తాను ఎవరినీ చంపలేదని, తాను మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడలేదని, ఎందుకు తనపై జీవిత కాలం నిషేధం విధించారని ఆమె అన్నారు. తన పక్షాన హైకోర్టు ఆదేశాలు వెలువడడం ఎంతో సంతోషంగా ఉందని, తనను ఆడడానికి అనుమతించినందుకు ఆనందంగా ఉందని ఆమె చెప్పారు. బ్యాడ్మింటన్ ఆడడం తప్ప తాను వేరేది ఏదీ చేయలేదని ఆమె అన్నారు. తాను బ్యాడ్మింటన్ ఆడుతానని, దేశానికి గౌరవాన్ని తెస్తానని, ప్రతి ఒక్కరినీ గర్వించేలా చేస్తానని ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తన డబుల్స్ జోడీ అశ్విని పొన్నప్పకు, తన కోచ్‌లకు జ్వాలా ధన్యవాదాలు తెలిపారు. తాను క్లీన్ స్పోర్ట్స్ ఇండియాకు, అశ్వినీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆమె అన్నారు. తనను మాత్రమే కాకుండా అశ్వినిని కూడా డెన్మార్క్ ఓపెన్ టోర్నమెంట్‌కు అనుమతించలేదని, తన వల్ల అశ్విని తీవ్రమైన ఒత్తిడికి గురైందని జ్వాలా అన్నారు. తనను అర్థం చేసుకుని అశ్విని తన పక్కన నిలిచిందని చెప్పారు. అది తనకు ఎంతో బలాన్ని ఇచ్చిందని అన్నారు. విమల్ కుమార్ సారుకు, ఆరిఫ్ సారుకు కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేనని ఆమె అన్నారు. తన మిత్రులకు, తనకు మద్దతిచ్చినవారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆమె చెప్పారు. ఆన్‌లైన్ సందేశాలు కూడా తనకు పోరాటం చేయడానికి శక్తిని ఇచ్చాయని అన్నారు

శృతిహాసన్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తిన బన్నీ


ఏదో పని మీద ముంబై వెళ్ళిన బన్నీ పనిలో పనిగా, శృతి హాసన్‌ని కూడా కలిశాడు. ఇటీవల చెన్నై నుంచి తన నివాసాన్ని ముంబైకి మార్చిన శృతిహాసన్ అకస్మాత్తుగా ఇలా ముంబైలో బన్నీని చూడగానే ఆశ్చర్యపోయిందట. అక్కడతనితో కలిసి దిగిన ఫొటోను ట్విట్టెర్‌లో పోస్ట్ చేసింది కూడా. పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ సినిమాలో నటించిన తర్వాత శృతిహాసన్‌కు తెలుగులో ఫాలోయింగ్ పెరిగింది. ఇప్పుడు ఆమెకు తెలుగులో ఆఫర్లు వచ్చి పడుతున్నాయట. రవితేజ హీరోగా నటించిన బలుపు సినిమాలో కూడా ఆమె నటించింది. ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూతురైన శృతిహాసన్ ఇటీవలి కాలంలో తెరపై అందాలను ఆరబోయడానికి కూడా వెనకాడడం లేదు.

హైదరాబాద్‌లో కుక్క కాటుపై కేసు: యజమాని అరెస్ట్


నగరంలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. మౌలాలిలోని వసంత్ విహార్ కాలనీలో గురువారం ఓ పదేళ్ల బాలికను పెంపుడు కుక్క కరవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఆ పెంపుడు కుక్క యజమానిని శుక్రవారం అరెస్ట్ చేశారు. మల్కాజిగిరి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న సాయి కిరణ్ తన ఇంట్లో ఓ పెంపుడు కుక్కను పెంచుకుటున్నారు. అతని ఇంటికి ఎదురుగా భారతి అనే మహిళ పిల్లల సంరక్షణ కేంద్రాన్ని నడుపుతోంది. కాగా గురువారం రోజు భారతి కూతురు సత్య అతిథి కేంద్రం ఎదుట రోడ్డుపై ఉండగా ఆ కుక్క ఆమెను కరిచింది. గాయాలపాలైన బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెంపుడు కుక్క యజమాని సాయి కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతనిపై ఇండియన్ పీనల్ కోడ్ 298(నిర్లక్ష్య ప్రవర్తన) సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

శ్రీహ‌రి మ‌ర‌ణంపై బాలీవుడ్ బ‌లుపు వేషాలు


త‌ను టాలీవుడ్‌లో ఓ సీనియ‌ర్ యాక్టెర్‌..స్వయంకృషితో ఎదిగిన ఫిల్మి రియ‌ల్ స్టార్, త‌నే శ్రీహ‌రి. అశేష జ‌నాభిమానం ఉన్న స్టార్ యాక్టర్ శ్రీహ‌రి మ‌ర‌ణం టాలీవుడ్ ఇండ‌స్ట్రీకు తీర‌ని లోటును మిగిల్చింది. చేసుకుంటున్న గొప్పలను ఏనాడు పైకి చెప్పుకోని వ్యక్తిత్వం శ్రీహ‌రిది. టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో చిన్న త‌ర‌హా వ‌ర్గం న‌టుల‌కు ఆధ‌ర‌ణ త‌క్కువుగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ ఇబ్బందుల్లోనూ, అవ‌కాశాల లేమితోనూ, ఆధ‌ర‌ణ క‌రువై ఉంటారు. అలాంటి వాళ్ళకు శ్రీహ‌రి ఓ దేవుడు. ఎంతో మంది న‌టుల‌కు నేన్నాను అని భ‌రోస ఇచ్చి వెన్నుద‌న్ను ఉండి, వారి బాధ‌ల్లోనూ, సంతోషంలోనూ ఒక‌డిగా క‌లిసి మెలిగేవాడు. త‌న స్వయం కృషితో అంచ‌లెంచెలుగా ఎదిగి, టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో త‌న‌దైనా మార్కుతో, ప్రేక్షకుల మ‌న‌స్సులో చిర‌స్థాయి ఆత్మీయ ప్రేమాభిమానాన్ని చూర‌గొన్న ఏకైన న‌టుడు శ్రీహ‌రి. బాలీవుడ్‌లో ప్రభుదేవా ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న రాంబో రాజ్‌కుమార్ మూవీ షూటింగ్‌లో ప్రత్యర్ధి పాత్రగా లీడ్ రోల్ చేస్తున్న శ్రీహ‌రికి, షూటింగ్ స‌మ‌యంలో అశ్వస్థత‌కు గురికావ‌డం, ఆ త‌రువాత వెంట‌వెంట‌నే ఆరోగ్యం క్షీణించ‌డం, ఆ త‌రువాత మృత్యువాత ప‌డ‌టం యావ‌త్ టాలీవుడ్ ఇండ‌స్ట్రీను క‌ల‌చివేసింది.

శ్రీహ‌రి ఇక‌లేరు అనే వార్త ఆంద్రప్రదేష్‌కు చేర‌గానే ప్రతి ఒక్కరి మ‌న‌స్సు శోక‌స‌ముద్రంలా త‌ల్లడిల్లిపోయింది. ఒక్క ఇండ‌స్ట్రీ వారు అనే బేధం లేకుండా అన్ని రంగాల నుండి అంద‌రూ శ్రీహ‌రిని చివ‌రిసారిగా చూడ‌టానికి ఎక్కడెక్కడినుండో త‌ర‌లి వ‌చ్చారు. ఇదిలా ఉంటే, ఈ విష‌యం బాలీవుడ్‌ యాక్టెర్స్‌కి చీమైనా కుట్టిన‌ట్టు లేదు. మొత్తం బాలీవుడ్ ఇండ‌స్ట్రీకు శ్రీహ‌రి గురించి తెలియ‌క‌పోవ‌చ్చు. క‌నీసం రాంబోరాజ్‌కుమార్ షూటింగ్ యూనిట్‌లోనూ తోటి యాక్టర్‌కు జ‌రిగిన విషాదంపై ఏ మాత్రం స్పందించ‌లేదు. హీరో షాహిద్‌క‌పూర్‌,హీరోయిన్ సోనాక్షి సిన్హా, డైరెక్టర్ ప్రభుదేవా ఎవ్వరూ కూడ జ‌రిగిన విషాదానికి క‌నీస స్పంద‌న లేదు. సోషియ‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్స్‌లో రాంబో రాజ్‌కుమార్ మూవీ గురించి ఊధ‌ర‌గొడుతున్న హీరో షాహిద్‌కు, శ్రీహ‌రి మేట‌ర్‌ను చాలా లైట్ తీసుకున్నాడు. పైగా ఈ విష‌యం బ‌య‌ట‌కు తెలిస్తే మూవీపై నెగిటివ్ టాక్ వ‌స్తుందేమో అని కూడ జాగ్రత్త ప‌డ్డట్టు ఓ లీడింగ్ టాబ్లాయిడ్ క‌థ‌నం వెల్లడించింది. తోటి క‌ళాకారుడిని గౌర‌వించ‌లేని బాలీవుడ్ ఇండ‌స్ట్రీపై, మ‌న సౌత్ ఇండ‌స్ట్రీ వ‌ల్లమాలిన అభిమానాన్ని ఎందుకు చూపుతుందో అర్ధం కాదు. ఇప్పటి వర‌కూ కూడ శ్రీహ‌రి విష‌యంపై రాంబోరాజ్‌కుమార్ చిత్ర యూనిట్ అఫిషియ‌ల్‌గా స్పందించ‌క‌పోవ‌డంపై బాలీవుడ్‌లోనూ నిర‌స‌న‌లు వెల్లువ‌డుతున్నాయి.