Saturday, 12 October 2013
నేను ఎవరినీ చంపలేదు, బ్యాన్ ఎందుకు: జ్వాలా గుత్తా
హైదరాబాద్: సంక్షోభ సమయంలో తనకు మద్దతు నిలిచినవారందరికీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి ఢిల్లీ హైకోర్టు ఆమెకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆమె ఉత్సాహంగా కనిపించారు. తాను ఎవరినీ చంపలేదని, తాను మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడలేదని, ఎందుకు తనపై జీవిత కాలం నిషేధం విధించారని ఆమె అన్నారు. తన పక్షాన హైకోర్టు ఆదేశాలు వెలువడడం ఎంతో సంతోషంగా ఉందని, తనను ఆడడానికి అనుమతించినందుకు ఆనందంగా ఉందని ఆమె చెప్పారు. బ్యాడ్మింటన్ ఆడడం తప్ప తాను వేరేది ఏదీ చేయలేదని ఆమె అన్నారు. తాను బ్యాడ్మింటన్ ఆడుతానని, దేశానికి గౌరవాన్ని తెస్తానని, ప్రతి ఒక్కరినీ గర్వించేలా చేస్తానని ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
తన డబుల్స్ జోడీ అశ్విని పొన్నప్పకు, తన కోచ్‌లకు జ్వాలా ధన్యవాదాలు తెలిపారు. తాను క్లీన్ స్పోర్ట్స్ ఇండియాకు, అశ్వినీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆమె అన్నారు. తనను మాత్రమే కాకుండా అశ్వినిని కూడా డెన్మార్క్ ఓపెన్ టోర్నమెంట్‌కు అనుమతించలేదని, తన వల్ల అశ్విని తీవ్రమైన ఒత్తిడికి గురైందని జ్వాలా అన్నారు. తనను అర్థం చేసుకుని అశ్విని తన పక్కన నిలిచిందని చెప్పారు. అది తనకు ఎంతో బలాన్ని ఇచ్చిందని అన్నారు. విమల్ కుమార్ సారుకు, ఆరిఫ్ సారుకు కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేనని ఆమె అన్నారు. తన మిత్రులకు, తనకు మద్దతిచ్చినవారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆమె చెప్పారు. ఆన్‌లైన్ సందేశాలు కూడా తనకు పోరాటం చేయడానికి శక్తిని ఇచ్చాయని అన్నారు
శృతిహాసన్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తిన బన్నీ
ఏదో పని మీద ముంబై వెళ్ళిన బన్నీ పనిలో పనిగా, శృతి హాసన్‌ని కూడా కలిశాడు. ఇటీవల చెన్నై నుంచి తన నివాసాన్ని ముంబైకి మార్చిన శృతిహాసన్ అకస్మాత్తుగా ఇలా ముంబైలో బన్నీని చూడగానే ఆశ్చర్యపోయిందట. అక్కడతనితో కలిసి దిగిన ఫొటోను ట్విట్టెర్‌లో పోస్ట్ చేసింది కూడా. పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ సినిమాలో నటించిన తర్వాత శృతిహాసన్‌కు తెలుగులో ఫాలోయింగ్ పెరిగింది. ఇప్పుడు ఆమెకు తెలుగులో ఆఫర్లు వచ్చి పడుతున్నాయట. రవితేజ హీరోగా నటించిన బలుపు సినిమాలో కూడా ఆమె నటించింది. ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూతురైన శృతిహాసన్ ఇటీవలి కాలంలో తెరపై అందాలను ఆరబోయడానికి కూడా వెనకాడడం లేదు.
హైదరాబాద్‌లో కుక్క కాటుపై కేసు: యజమాని అరెస్ట్
నగరంలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. మౌలాలిలోని వసంత్ విహార్ కాలనీలో గురువారం ఓ పదేళ్ల బాలికను పెంపుడు కుక్క కరవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఆ పెంపుడు కుక్క యజమానిని శుక్రవారం అరెస్ట్ చేశారు. మల్కాజిగిరి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న సాయి కిరణ్ తన ఇంట్లో ఓ పెంపుడు కుక్కను పెంచుకుటున్నారు. అతని ఇంటికి ఎదురుగా భారతి అనే మహిళ పిల్లల సంరక్షణ కేంద్రాన్ని నడుపుతోంది. కాగా గురువారం రోజు భారతి కూతురు సత్య అతిథి కేంద్రం ఎదుట రోడ్డుపై ఉండగా ఆ కుక్క ఆమెను కరిచింది. గాయాలపాలైన బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెంపుడు కుక్క యజమాని సాయి కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతనిపై ఇండియన్ పీనల్ కోడ్ 298(నిర్లక్ష్య ప్రవర్తన) సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
శ్రీహరి మరణంపై బాలీవుడ్ బలుపు వేషాలు
తను టాలీవుడ్‌లో ఓ సీనియర్ యాక్టెర్..స్వయంకృషితో ఎదిగిన ఫిల్మి రియల్ స్టార్, తనే శ్రీహరి. అశేష జనాభిమానం ఉన్న స్టార్ యాక్టర్ శ్రీహరి మరణం టాలీవుడ్ ఇండస్ట్రీకు తీరని లోటును మిగిల్చింది. చేసుకుంటున్న గొప్పలను ఏనాడు పైకి చెప్పుకోని వ్యక్తిత్వం శ్రీహరిది. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చిన్న తరహా వర్గం నటులకు ఆధరణ తక్కువుగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ ఇబ్బందుల్లోనూ, అవకాశాల లేమితోనూ, ఆధరణ కరువై ఉంటారు. అలాంటి వాళ్ళకు శ్రీహరి ఓ దేవుడు. ఎంతో మంది నటులకు నేన్నాను అని భరోస ఇచ్చి వెన్నుదన్ను ఉండి, వారి బాధల్లోనూ, సంతోషంలోనూ ఒకడిగా కలిసి మెలిగేవాడు.
తన స్వయం కృషితో అంచలెంచెలుగా ఎదిగి, టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైనా మార్కుతో, ప్రేక్షకుల మనస్సులో చిరస్థాయి ఆత్మీయ ప్రేమాభిమానాన్ని చూరగొన్న ఏకైన నటుడు శ్రీహరి. బాలీవుడ్‌లో ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న రాంబో రాజ్‌కుమార్ మూవీ షూటింగ్‌లో ప్రత్యర్ధి పాత్రగా లీడ్ రోల్ చేస్తున్న శ్రీహరికి, షూటింగ్ సమయంలో అశ్వస్థతకు గురికావడం, ఆ తరువాత వెంటవెంటనే ఆరోగ్యం క్షీణించడం, ఆ తరువాత మృత్యువాత పడటం యావత్ టాలీవుడ్ ఇండస్ట్రీను కలచివేసింది.శ్రీహరి ఇకలేరు అనే వార్త ఆంద్రప్రదేష్‌కు చేరగానే ప్రతి ఒక్కరి మనస్సు శోకసముద్రంలా తల్లడిల్లిపోయింది. ఒక్క ఇండస్ట్రీ వారు అనే బేధం లేకుండా అన్ని రంగాల నుండి అందరూ శ్రీహరిని చివరిసారిగా చూడటానికి ఎక్కడెక్కడినుండో తరలి వచ్చారు. ఇదిలా ఉంటే, ఈ విషయం బాలీవుడ్ యాక్టెర్స్‌కి చీమైనా కుట్టినట్టు లేదు. మొత్తం బాలీవుడ్ ఇండస్ట్రీకు శ్రీహరి గురించి తెలియకపోవచ్చు. కనీసం రాంబోరాజ్‌కుమార్ షూటింగ్ యూనిట్‌లోనూ తోటి యాక్టర్‌కు జరిగిన విషాదంపై ఏ మాత్రం స్పందించలేదు. హీరో షాహిద్‌కపూర్,హీరోయిన్ సోనాక్షి సిన్హా, డైరెక్టర్ ప్రభుదేవా ఎవ్వరూ కూడ జరిగిన విషాదానికి కనీస స్పందన లేదు. సోషియల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌లో రాంబో రాజ్‌కుమార్ మూవీ గురించి ఊధరగొడుతున్న హీరో షాహిద్‌కు, శ్రీహరి మేటర్‌ను చాలా లైట్ తీసుకున్నాడు. పైగా ఈ విషయం బయటకు తెలిస్తే మూవీపై నెగిటివ్ టాక్ వస్తుందేమో అని కూడ జాగ్రత్త పడ్డట్టు ఓ లీడింగ్ టాబ్లాయిడ్ కథనం వెల్లడించింది. తోటి కళాకారుడిని గౌరవించలేని బాలీవుడ్ ఇండస్ట్రీపై, మన సౌత్ ఇండస్ట్రీ వల్లమాలిన అభిమానాన్ని ఎందుకు చూపుతుందో అర్ధం కాదు. ఇప్పటి వరకూ కూడ శ్రీహరి విషయంపై రాంబోరాజ్‌కుమార్ చిత్ర యూనిట్ అఫిషియల్‌గా స్పందించకపోవడంపై బాలీవుడ్‌లోనూ నిరసనలు వెల్లువడుతున్నాయి.
Friday, 11 October 2013
త్వరలో అనుష్కకు పెళ్లట...!?
అనుకున్న ది తడవుగా ప్రేమ కలగ దు.. కోరుకున్న వెంటనే పెళ్లి జరగదు. దేనికైనా సమయం రావాలి. ఆ శుభ ఘడియలు నటి అనుష్కకు వచ్చినట్టు తెలుస్తోం ది. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ పెళ్లి పీటలెక్కడానికి సిద్ధం అవుతున్నట్లు పరిశ్రమ వర్గాల టాక్. తొలుత టాలీవుడ్, ఆ తర్వాత కోలీవుడ్‌కు పరిచయమైన నటి అనుష్క తొలి రోజుల్లో స్కిన్ షోకు ప్రాధాన్యం ఇచ్చింది. ఆ తర్వాత అరుంధతి లాంటి చిత్రాల్లో అద్భుతమైన అభినయం చాటి నటిగా తానేమిటో నిరూపించుకుంది. ఆపై అభినయం, గ్లామర్ ఈ రెండు అంశాలను బ్యాలెన్స్ చేసుకుంటూ నటిగా ఎదిగింది. ప్రముఖ హీరోయిన్లలో తన స్థానం పదిలపరుచుకుంటోంది.తమిళంలో ఇరండామ్ ఉలగం, తెలుగులో రుద్రమదేవి, బాహుబలి వంటి చారి త్రక కథా చిత్రాల్లో నటిస్తోంది. ఈ బ్యూటీ నూతన చిత్రాలు అంగీకరించడం లేదట. కారణం కల్యాణ ఘడియలు దగ్గర పడడమేనట. అనుష్కకు 31 ఏళ్లు. దీంతో ఆమెకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే ఈ బ్యూటీ పై పలు వదంతులు ప్రచారంలో ఉన్నాయి. టాలీవుడ్ నటుడు నాగార్జునతో సన్నిహితంగా ఉంటోందని, ఆర్యతో చెట్టాపట్టాలంటూ ప్రచారం అవుతున్నాయి. వీటికి పుల్‌స్టాప్ పెట్టేలా కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారట. ఈ కారణంగానే అనుష్క కమల్ సరసన ఉత్తమ విలన్ చిత్రంలో నటించే అవకాశాన్ని అంగీకరించలేదని సమాచారం.
సీమాంధ్రకు భారీగా ప్యాకేజ్ దిశగా కేంద్రం!!
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో ఉద్యమాలతో రగిలిపోతుంది. అయినా నిన్నటి వరకు పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు సీమాంధ్రను బుజ్జగించేపనిలో పడిందని చెబుతున్నారు. ఈ మేరకు జాతీయా మీడియాకు చెందిన వెబ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే యోచనలో కేంద్రం ఉన్నట్లు పీటీఐ ఓ వార్తా కథనాన్ని విడుదల చేసింది.ఆత్య అధునాతన సదుపాయాలతో సీమాంధ్రలో కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్రం ఆర్థికసాయం చేయనుంది. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఎక్కువ మొత్తంలో ఆర్థిక సాయం చేయాలనే తలంపుతో మంత్రి వర్గ బృందం ఉందని చెబుతున్నారు. ఇక మరోపక్క తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను త్వరగా పూర్తి చేసే పనిలో కేంద్రం ఉందట. అంతేకాదు హైదరాబాద్ విషయంలో కేబినెట్ నోట్‌లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే యోచన కేంద్రం మదిలో లేదని, ఒక వేళ హైదరాబాద్‌ను యూటీ చేస్తే తెలంగాణలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కేంద్రం భావిస్తుందని చెప్పారు. ఇక కేంద్ర మంత్రి వర్గ బృందం రాష్ట్రంలో పర్యటించనుందని చెబుతున్న వార్తలను కొట్టిపారేస్తూ ఆ అవకాశం లేదని తేల్చిచెప్పింది.
Subscribe to:
Posts (Atom)











