హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో ఉద్యమాలతో రగిలిపోతుంది. అయినా నిన్నటి వరకు పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు సీమాంధ్రను బుజ్జగించేపనిలో పడిందని చెబుతున్నారు. ఈ మేరకు జాతీయా మీడియాకు చెందిన వెబ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే యోచనలో కేంద్రం ఉన్నట్లు పీటీఐ ఓ వార్తా కథనాన్ని విడుదల చేసింది.ఆత్య అధునాతన సదుపాయాలతో సీమాంధ్రలో కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్రం ఆర్థికసాయం చేయనుంది. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఎక్కువ మొత్తంలో ఆర్థిక సాయం చేయాలనే తలంపుతో మంత్రి వర్గ బృందం ఉందని చెబుతున్నారు. ఇక మరోపక్క తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను త్వరగా పూర్తి చేసే పనిలో కేంద్రం ఉందట. అంతేకాదు హైదరాబాద్ విషయంలో కేబినెట్ నోట్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే యోచన కేంద్రం మదిలో లేదని, ఒక వేళ హైదరాబాద్‌ను యూటీ చేస్తే తెలంగాణలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కేంద్రం భావిస్తుందని చెప్పారు. ఇక కేంద్ర మంత్రి వర్గ బృందం రాష్ట్రంలో పర్యటించనుందని చెబుతున్న వార్తలను కొట్టిపారేస్తూ ఆ అవకాశం లేదని తేల్చిచెప్పింది.
No comments:
Post a Comment