పవన్ కళ్యాణ్ భార్య రేణు దేశాయ్ లేటెస్ట్ గా ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆశక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె మరాఠీ భాషలో ‘మగలాష్ తక్ వన్స్ మోర్’ అనే సినిమాను తానే నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రేణు తను స్క్రిప్ట్ రైటింగ్, స్టోరీ సెలక్షన్, మ్యూజిక్ సెటింగ్స్ ఈ విషయాలన్నీ తాను పవన్ నుంచి నేర్చుకున్నానని అంటు, పవన్ చాలా పెద్ద వ్యక్తి అనీ తను దారి తప్పితే సెట్ చేసే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ మాత్రమే అని అనడం పవన్ రేణుదేశాయ్ ల మధ్య ఆ మధ్య వచ్చిన రూమర్లకు తెరదించడమే అని అనుకోవాలి.అంతేకాదు ఇదే ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ ఈ సినిమాను తాను వ్యక్తిగతంగా పవన్ సహాయం లేకుండా నిర్మిస్తున్నానని పవన్ భార్య అయినంత మాత్రాన విజయం రాదనీ అంటు, తల్లిగా తన బాధ్యతలు నిర్వర్తించడం లో రాజీపడననీ అని అంటున్న రేణుదేశాయ్ మాటలను పరిశీలిస్తే ఆమె పవన్ విషయంలో యూటర్న్ తీసుకుంటుందా అని ఎవరికైనా అనిపిస్తుంది...
No comments:
Post a Comment