Wednesday, 9 October 2013

విషాదం : నటుడు శ్రీహరి కన్నుమూత



తెలుగు సిని పరిశ్రమలో మరో విషాద ఘట్టం బుధవారం చోటు చేసుకుంది. విలన్ గా హీరోగా, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకులను రంజింప చేసిన శ్రీహరి బుధవారం సాయంత్రం ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ వార్త టాలీవుడ్ ను దిగ్భ్రాంతికి గురి చేసింది. వారం రోజులుగా లివర్ వ్యాదితో తీవ్ర అస్వస్థతకు లోనై ఆసుపత్రిలో చేరిన ఆయన మృతి చెందడం ఆయన కుటుంబసభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగి పోయారు. ఇటీవలే ఆయన జన్మదిన వేడుకలను కూడా అభిమానుల మద్య హైదరాబాద్ లోని తన నివాసంలో ఘనంగా జరుపుకున్నారు.

ఆయన ఆగస్టు 15,1964 హైదరాబాద్ లోని బాల్ నగర్ లో జన్మించాడు. 1986 లో దాసరి నారాయణ సినిమాలకు పరిచయం చేసినా, 1989లో పిళ్లై తమిళ సినిమాతో నటుడిగా గుర్తింపు పొందాడు. ఆతరవాత 1993 లో తెలుగులో కుంతీ పుత్రుడు సినిమాతో తెలుగు పరిశ్రమలో విలన్ గా ప్రవేశించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతర్వాత ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి, తరవాత హీరోగా సినిమాలు తీసి మంచి గుర్తింపును పొందాడు. పోలీసు పాత్రలు ఆయనకు విశేష గుర్తింపును తెచ్చిపెట్టాయి. సినిమా రంగంలోనే క్లబ్ డాన్సర్ గా రానిస్తున్న డిస్కోశాంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. విలన్ గా ఆయన నటించిన ఆఖరు సినిమా జంజీర్, తూఫాన్, ఇందులో రాంచరణ్ హీరో. ఇక హీరోగా నటించిన ఆయన చివరి సినిమా ‘పోలీస్ గేమ్’ ఇటీవల విడుదల అయింది, టీ సమోస బిస్కట్ తో పాటు మరో రెండు మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

Tuesday, 8 October 2013

ప్రేమ‌లో ప‌డ్డ క్రిమిన‌ల్ డైరెక్టర్‌



త‌ను ఏ మూవీ తీసినా మాఫియా నేప‌థ్యం లేనిదే మూవీ పూర్తికాదు. ఆ విధంగా తీసిన మూవీలే త‌న‌ను టాప్ డైరెక్టర్‌గా మార్చాయి. త‌నే స‌న్షేన‌ల్ డైరెక్టర్ రాంగోపాల్‌వ‌ర్మ. వ‌ర్మ తీసిన ‘స‌త్య’, ‘కంపెనీ’, ‘సర్కార్’ లాంటి సినిమాలతో త‌నేంటో, త‌న మాఫియా క‌థ‌ల స‌త్తా ఏంటో ఫిల్మ్ ఇండ‌స్ట్రీకు చాటాడు. వ‌ర్మ మైండ్‌లో ఏముంటుందో మూవీలోనూ అదే ఉంటుంది. ఎప్పుడూ క్రిమిన‌ల్స్ మైండ్ సెట్‌తో ఆలోచించే వ‌ర్మ, త‌న స్టోరీల‌ను కూడ అదే విధంగా తెరెకెక్కిస్తాడు. ఇదిలా ఉంటే వ‌ర్మకు మాఫియా క‌థ‌లపైన‌ విర‌క్తి వ‌చ్చిందంట‌. వెంట‌నే త‌న మ‌న‌స్సులోంచి క్రిమిన‌ల్ స్టోరీల‌ను ప‌క్కకు తొల‌గించి, ప్రేమ క‌థ‌ల‌కు చోటు క‌ల్పించాడు.

‘నేను అండర్ వరల్డ్ కాన్సెప్ట్ తో చేస్తున్న చివరి సినిమా ఈ సత్య 2. ఇక నుంచి అండర్ వరల్డ్ కాన్సెప్ట్ తో ఎటువంటి సినిమాలు చెయ్యను. త్వర‌లో రొమాంటిక్ సినిమాలు తియ్యాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం రెండు లవ్ స్టొరీలు రెడీగా ఉన్నాయి. అందులో ఒకటి మార్షల్ ఆర్ట్స్ కి సంబందించిన మూవీ, అది ఈ డిసెంబర్లో మొదలవుతుందని’ ఓ ఆడియో ఫంక్షన్‌కు అటెండ్ అయిన సంద‌ర్భంలో వివ‌రించాడు. వ‌ర్మ ఏంటి, ప్రేమ క‌థ‌లేంటి అని ఫిల్మ్ ఇండ‌స్ట్రీతో పాటు, ప్రేక్షకులు కూడ భ‌య‌ప‌డిపోతున్నారు. వ‌ర్మ లవ్ స్టోరీను తీస్తే అది లవ్ ఫెయిల్యూర్ స్టోరీనా లేక స‌క్సెస్‌ఫుల్ ల‌వ్ స్టోరీనా అని అంద‌రూ ఆలోచిస్తున్నారు. ఏదేమైనా వ‌ర్మ ల‌వ్‌స్టోరీల‌ను తీసి, ఓ ట్రెండ్ సెట్ చేయాల‌ని వ‌ర్మ అభిమానులు కోరుకుంటున్నారు.

ఒక్క డబుల్ మీనింగ్ డైలాగ్ లేకుండా సినిమా చేస్తున్నాను - మారుతి


‘‘నంబర్‌ప్లేట్‌లు వేసుకొనే ఓ కుర్రాడు... ఆఫీస్‌బాయ్‌గా ఉద్యోగం చేసిన ఓ కుర్రాడు ఈ రోజు సినిమా డెరైక్టర్. ఇదంతా నిజంగా మాయలా ఉంది. అంత చిన్న స్థాయి నుంచి దాదాపు వంద మంది ఉద్యోగులకు జీతాలిచ్చే స్థాయికి వచ్చానంటే... నిజంగా దైవకృపే’’ అని దర్శకుడు మారుతి అన్నారు.\

 నేడు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో పత్రికల వారితో ప్రత్యేకంగా ముచ్చటించారు. ప్రస్తుతం తాను డెరైక్ట్ చేస్తున్న ‘కొత్తజంట’ సినిమా గురించి చెబుతూ -‘‘ఇద్దరు స్వార్థపరులు ప్రేమించుకుంటే పర్యవసానం ఎలా ఉంటుంది అనేదే ‘కొత్తజంట’. ఇప్పటివరకూ నేను తీసిన సినిమాలకు సంబంధంలేని టాపిక్ ఇది. శిరీష్ తను టెన్త్ చదువుతున్నప్పట్నుంచీ నాకు తెలుసు. అతని ప్లస్‌లు, మైనస్‌లు అన్నీ తెలిసినవాణ్ణి. అందుకే అతనికి తగ్గ కథను ఎన్నుకున్నాను. అలాగే... ఒక్క డబుల్‌మీనింగ్ డైలాగ్ లేకుండా, కనీసం స్మోకింగ్ మెసేజ్ కూడా కనబడనంత క్లియర్‌గా ఈ చిత్రం తీస్తున్నాను. నిర్మాతతో అనవసరపు ఖర్చు పెట్టించడం విషయంలో నేను వ్యతిరేకిని. అయితే... గీతా ఆర్ట్స్ స్థాయికి తగ్గట్టుగా గ్రాండియర్‌గా ఈ సినిమా ఉంటుంది. ప్రేమకథల్లో ఓ కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేస్తుందీ సినిమా. సగానికి పైగా చిత్రీకరణ పూర్తయింది’’ అని తెలిపారు. ఇకపై కూడా దర్శకత్వ పర్యవేక్షణ చేస్తారా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ -‘‘నిజానికి ‘ప్రేమకథాచిత్రమ్’ చిత్రానికి దర్శకుణ్ణి నేనే. ఆ సినిమాకు ‘దర్శకత్వ పర్యవేక్షణ’ అని టైటిల్ వేసుకోవడానికి బలమైన కారణం ఉంది. ‘కొత్తజంట’ సెట్‌కి వెళ్లడం ఆలస్యం అవుతుండటంతో ఈ మధ్య గ్యాప్‌లో ఓ చిన్న సినిమా చేసుకుంటానని అరవింద్‌గారిని అడిగాను. ‘ఆ సినిమా సరిగ్గా ఆడకపోతే... మళ్లీ నా సినిమాకు ఇబ్బంది కదా’ అనే అనుమానం వ్యక్తం చేశారు అరవింద్. దాంతో ‘ప్రేమకథాచిత్రమ్’ చిత్రానికి దర్శకునిగా టైటిల్ కార్డ్ వేసుకోడానికి భయపడ్డాను. కానీ ఆ సినిమా నా గత చిత్రాలన్నింటికంటే పెద్ద విజయం సాధించింది. ఇతర భాషల్లో కూడా సక్సెస్ సాధించింది. యూటీవీ, పద్మాలయా సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాయి. అక్కడ కూడా దర్శకుణ్ణి నేనే’’ అని తెలిపారు. ప్రస్తుతం తన సొంత ప్రొడక్షన్ హౌస్‌లో లవ్యూ బంగారం, గ్రీన్‌సిగ్నల్, లవర్స్ చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయని, అలాగే... డీవీవీ దానయ్య, బన్నీ వాసు, బెల్లంకొండ సురేష్, గుడ్ సినిమా గ్రూప్, ‘జులాయి’ నిర్మాత రాధాకృష్ణ, దిల్‌రాజు చిత్రాలకు దర్శకత్వం వహించనున్నాననీ మారుతి చెప్పారు.

తండ్రీ కొడుకులుగా ప్రభాస్ ద్విపాత్రాభినయం?


రాజమౌళికి ఎన్టీఆర్ ముద్దుగా పెట్టుకున్న పేరు ‘జక్కన్న’. దానికి తగ్గట్టే సినిమాని శిల్పంలా చెక్కుతారాయన. ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నారు రాజమౌళి. గ్రాండియర్‌గా... హాలీవుడ్ సినిమా ‘గ్లాడియేటర్’ రేంజ్‌లో ‘బాహుబలి’ని తెరకెక్కిస్తున్నారాయన.


 రాచఠీవీకి దర్పణంలా భారీ రాజప్రాసాదాలు, అబ్బురపరిచే పాత్రధారుల ఆహార్యం, వీరత్వానికి ప్రతీకల్లా ఆయుధాల సొగసులు... మేలుజాతి గుర్రాల డెక్కల చప్పుళ్ళు, ప్రకృతి సైతం పరవశింపజేసే ఉద్యానవనాలు... ఇవన్నీ ‘బాహుబలి’కి కళాత్మకశోభను సంతరింపజేశాయని వినికిడి. ఆర్‌ఎఫ్‌సీలో జరుగుతున్న ఈ చిత్రం షూటింగ్ పరిసరాలను చూసి ప్రముఖులు, మేధావులు సైతం ఆశ్చర్యానికి లోనవుతున్నట్లు సమాచారం. ఇందులో ప్రభాస్, రానా అన్నదమ్ములుగా నటిస్తున్న విషయం తెలిసిందే. తండ్రీ కొడుకులుగా ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే... రానా కొడుకు పాత్రలో అడవి శేష్ నటిస్తున్నారని తెలిసింది. వీరిద్దరిదీ యాంటీషేడ్స్ ఉన్న పాత్రలే కావడం విశేషం. ఇక అనుష్క కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మరో కథానాయికగా ప్రముఖ బాలీవుడ్ నాయికను ఎంపిక చేసినట్లు తెలిసింది. 80 నుంచి 100 కోట్ల రూపాయల భారీ నిర్మాణ వ్యయంతో రూపొందుతోన్న ఈ చిత్రం పూర్తవడానికి సుమారు రెండేళ్లు పడుతుందని అంచనా. ‘బాహుబలి’తో రాజమౌళి విజయపరంపర దిగ్విజయంగా కొనసాగడం ఖాయమని యూనిట్ వర్గాల అభిప్రాయం.

అసంపూర్తిగా ముగిసిన సీఎం-విద్యుత్ జేఏసీ చర్చలు


హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సీమాంధ్ర జిల్లాల విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ నేతలు చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. సమ్మె విరమించాలని జేఏసీ నేతలపై సీఎం తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అయితే సీమాంధ్ర జిల్లాల జేఏసీ నేతలు మాత్రం అందుకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. చర్చలు మూడు గంటలకుపైగా కొనసాగాయి. అయినా ఫలితంలేదు. రాష్ట్రం విభజించడంలేదని కేంద్రం నుంచి ప్రకటన వస్తేనే సమ్మె విరమిస్తామని జేఏసీ నేతలు తెగేసి చెప్పారు. మళ్లీ సాయంత్రం 7 గంటలకు ముఖ్యమంత్రి మరోసారి జేఏసీ నేతలతో చర్చలు జరుగుతాయి.

నా తమ్ముడి ప్రాణాలకు హాని జరిగితే నరికేస్తా: తారా చౌదరీ


వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తుందనే ఆరోపణలపై అరెస్టైన సినీ నటి తారా చౌదరీ మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. తన తమ్ముడిని కొందరు కిడ్నాప్ చేశారని ఆందోళన వ్యక్తం చేస్తూ గుంటూరు జిల్లా వినుకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

 తన బావతో ఓ స్కార్పియో వాహనం విషయంలో వివాదం చోటు చేసుకుంది. వాస్తవానికి స్కార్పియో వాహనం తన బావ పేరుతో ఉన్న .. తాను రుణ వాయిదాలను చెల్లించాని తారా చౌదరీ తెలిపింది. అయితే తన బావ వద్ద ఉన్న స్కార్పియో వాహనం తనదేనని వినుకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తన ఫిర్యాదును సీఐ బాలసుబ్రమణ్యం పట్టించుకోలేదని తారా ఆరోపణలు చేసింది. ఆతర్వాత తన తమ్ముడు భాస్కర్ ను తన బావకు సంబంధించిన కొందరు మనుషులు కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కిడ్నాప్ కు గురైన తన తమ్ముడి ప్రాణాలకు ముప్పు ఉంది అని తారా చౌదరీ రోదిస్తూ మీడియాకు మొరపెట్టుకుంది. తన తమ్ముడి ప్రాణాలకు ముప్పు కలిగిస్తే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించింది. తన తమ్ముడి ప్రాణాలకు హాని జరిగితే నడిరోడ్డు మీదే నరికేస్తా అని పోలీస్ స్టేషన్ వద్ద హడావిడి చేసింది. తన తమ్ముడు కిడ్నాప్ కు గురయ్యాడని తారా చౌదరీ ఇచ్చిన ఫిర్యాదును తాము తీసుకుని.. విచారణ చేపట్టామని సీఐ బాలసుబ్రమణ్యం తెలిపారు.

30 థియోట‌ర్లకే రామ‌య్యవ‌స్తావ‌య్యా ప‌రిమితం


యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన రామ‌య్యవ‌స్తావ‌య్యా మూవీ ముఫ్పై థియోట‌ర్లకే ప‌రిమితం అయింది. ఈ లెక్క మ‌న ఆంద్రప్రదేశ్‌ది కాదు. అక్టోబ‌ర్ 11న ఘ‌నంగా ప్రపంచ‌వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న రామ‌య్యవస్తావ‌య్యా మూవీకు, త‌మిళ‌నాడులో చుక్కెదుర‌య్యింది. త‌మిళ‌నాడులో మ‌న తెలుగు మూవీల‌కు బాగానే ఆధ‌ర‌ణ ఉంటుంది.

 రామ‌య్యవ‌స్తావ‌య్యా మూవీను త‌మిళ‌నాడులో అర‌వైకు పైగా థియోట‌ర్లలో రిలీజ్ చేయాల‌నుకున్నారు. కాని చివ‌ర‌కు ముఫై థియోట‌ర్లతో స‌రిపెట్టుకోవ‌ల‌సి వ‌చ్చింది. ఈ ప్రభావం బాక్సాపీస్ క‌లెక్షన్స్‌పై ప‌డే అవ‌కాశం ఉందంటున్నారు. అక్టోబ‌ర్ 11న రెండు పెద్ద మూవీలు త‌మిళనాడులో రిలీజ్‌కు సిద్దంగా ఉన్నాయి. దీంతో రామ‌య్యవ‌స్తావ‌య్యా మూవీకు థియోట‌ర్లను స‌మ‌కూర్చలేక‌పోయారు.

 కోళీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ న‌టించిన నైయాంది మూవీ, అలాగే స్టార్ క‌మెడియ‌న్ సంతానం న‌టించిన వ‌ణ‌క్కం చెన్నై మూవీలు అక్టోబ‌ర్ 11న రిలీజ్ అవుతున్నాయి. దీంతో ఎన్టీఆర్ మూవీకు థియోట‌ర్ల క‌రువ‌య్యాయి. అతి క‌ష్టం మీద దాదాపు ముఫ్పై థియోట‌ర్లను యంగ్ టైగ‌ర్ మూవీ కోసం సంపాదించ‌గ‌లిగారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అత్తారింటికి దారేది మూవీ, త‌మిళ‌నాడులో చెప్పుకోద‌గ్గ క‌లెక్షన్స్‌ను తెచ్చుకుంది. అత్తారింటికిదారేది మూవీ త‌మిళ‌నాడులో ప‌దిరోజుల క‌లెక్షన్స్ దాదాపు అయిదు కోట్ల వ‌ర‌కూ వ‌చ్చాయి. అస‌లే యంగ్‌టైగ‌ర్ మూవీ ప‌వ‌న్ మూవీ క‌లెక్షన్స్‌ను తిర‌గ‌రాయాలని విశ్వ ప్రయ‌త్నం చేస్తుంటే, త‌మిళ‌నాడులోథియోట‌ర్లు త‌క్కువ కావ‌డంతో, దీన్ని అధిగ‌మించేందుకు దిల్‌రాజు మ‌రో ర‌కంగా ప్రయ‌త్నాలు చేస్తున్నాడు.

ముఖ్యమంత్రికి ముహూర్తం నేడే


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని సాగనంపడానికి ముహూర్తం నేడు ఖరారయిందని విశ్వసనీయ సమాచారం. మంగళవారం నిర్వహించిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో కాంగ్రెస్ అధిష్టానం ఓ నిర్ణయం తీసుకుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆయనను గద్దె దించేందుకే ఆమోద ముద్ర పడిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. కారణం ఇప్పడు తెలంగాణ విషయంలో వెనకడుగు వేస్తే కాంగ్రెస్ ఏపిలో రెండుప్రాంతాల్లో పూర్తిగా దెబ్బతింటుందన్న అభిప్రాయాలే ఎక్కువగా వ్యక్తమయ్యాయని సమాచారం.

 అయితే అసెంబ్లీ ఉంటేనే తెలంగాణపై అసెంబ్లీ అభిప్రాయం సాధ్యమవుతుంది, అలా కాక రాష్ట్రపతి పాలన పెడితే అది వీలు కాక తెలంగాణపై వెనుకడుగు వేసామన్న సంకేతాలు జారీ అయి పార్టీ నిండా మునగడం ఖాయమన్న భావాన్నే హైకమాండ్ పెద్దలు వ్యక్తం చేస్తున్నారట. అందుకే సిఎం కిరణ్ ను తొలగించి తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి జైపాల్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించి తెలంగాణపై ముందుకు పోవాలన్న ఆలోచనకే ఆమోద ముద్ర పడిందని భావిస్తున్నారు.

 కేంద్ర మంత్రుల రాజీనామాలు కూడా ఈ సంకేతాలను జారీ చేసాయంటున్నారు. ఎంత ఆందోలనలు చేసినా రాజీనామాలు చేయకుండా, హఠాత్తుగా అదిష్టానం మమ్మలను మోసం చేసింది అని నలుగురు కేంద్రమంత్రులు తెల్లారితే సమావేశం ఉందనగా చేయడం ఈ వాదనలకు బలాన్నిస్తోంది అంటున్నారు. సమావేశం లో ఉండి తెలంగాణ అనుకూల నిర్ణయాన్ని ఆమోదించి మరో తప్పు చేయకుండా ఉండేందుకే రాజీనామాలు చేసారు అంటున్నారు. అయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇప్పటికే అధిష్టానం సీరియస్ వార్నింగ్ ఇచ్చిందట. రెండు రోజుల్లో విద్యుత్ ఉద్యోగుల సమ్మె, ఏపిఎన్జీఓల సమ్మె విరమింప చేసి రాష్ట్రంలో పరిస్తితులు చక్కదిద్దాలని ఆదేశించారని సమాచారం. అలా చేయకపోతే ఇక అసమర్థునికింద జమకట్టి, అదే కారణంతో ఆయనను గద్దె దించితే ప్రజల్లో కూడా పెద్ద వ్యతిరేకత ఉండదని, అప్పడు తమ పని తాము చేసుకు పోవచ్చని అధిష్టానం భావన అంటున్నారు. అదే కనుక నిజమైతే ముఖ్యమంత్రి కిరణ్ గద్దె దిగే ముహూర్తం ఎంతో దూరంలో లేనట్టే అన్నది రాజకీయ వర్గాల భావన