Monday, 7 October 2013

కరెంట్ షాక్ తో కళ్లు తేలేసిన కాంగ్రెస్



ఆందోళనలు సహజం, అవి ముందుగా ఊహించినవే, పట్టించుకోవాల్సిన పనిలేదు, విభజన విషయంలో ముందుకే పోతాం అని కుండబద్దలు కొట్టిన కాంగ్రెస్ హైకమాండ్ కు కరెంట్ షాక్ కాస్తా గట్టిగానే తాకిందంటున్నారు. ఏపిఎన్జీఓలు 60 రోజులుగా సమ్మెలో ఉండి సమైక్య ఉద్యమాన్ని ఉవ్వెత్తున చేపడితే కూడా చీమకుట్టినట్టు కూడా లేకుండా ఉన్న కాంగ్రెస్ హైకమాండ్ ఒక్క రోజు విద్యుత్ ప్లాంట్ ల ఉద్యోగుల సమ్మెతో కళ్లుతేలేసింది.

 పరిస్థితులను అర్థం చేసుకోండి సమ్మె విరమించండి అని ఏకంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ కోరారంటే కరెంట్ షాక్ గట్టిగా తాకినట్టే అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కారణం విజయవాడ విటిపిఎస్ తో పాటు రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యోగులతో పాటు సీమాంద్రలోని విద్యుత్ ఉత్పత్తి స్టేషన్లన్ని ఉత్పత్తిని నిలిపివేసాయి. ఇది ఒక ఏపి పైనే కాకుండా ఏకంగా నాలుగు రాష్ట్రాలపై పడింది. ఇది మరో 24 గంటలు ఇదే పరిస్థితి ఉంటే దక్షిణాది గ్రిడ్ పడిపోయే అవకాశం ఉంది.

అదే జరిగితే విద్యుత్ పునరుద్దరణ నాలుగు రాష్ట్రాల్లో జరగడం అసాధ్యం. మామూలు సమ్మెతో కాకుండా రైళ్లకు, ఆసుపత్రులకు, అత్యవసర సేవలకు కూడా విద్యుత్ సరఫరాను నిలిపి వేస్తుండడంతో చాలా పెద్ద ఝలక్ తగిలింది. అసలే దసరా పండగవేళ రైళ్లు నిలిచిపోవడంతో భారీ ఆదాయానికి కూడా గండి పడింది. ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్సలు, ఆపరేషన్లకు కరెంట్ కోతతో నిలిచిపోయి ఎందరో అభాగ్యుల ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం కూడా ఏర్పడింది. అందుకే కాంగ్రెస్ హైకమాండ్ ఏదో ఒకటి చేస్తుందన్న వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి.

Saturday, 5 October 2013

సంచలనం : ప్రధాని రేసులో వైఎస్ జగన్


సంచలనం, రాష్ట్రరాజకీయాల్లో ఓ సీనియర్ నేత లేఖ బాంబులాంటి వార్తను వినిపించింది, ఇది తెలిసిన వారంతా అవాక్కవడం కాదు హతాషులయ్యారు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అదేంటంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పోస్టుపై కన్నేయలేదట, ఏకంగా ప్రధాని పోస్టుకే పోటీలో ఉన్నాడు, అవుతాడు కూడా అన్నది ఆ లేఖ సారాంశం. అది ఉత్తుత్తి మాట కాదు, అదెలాగో కూడా ఆలేఖలో వివరించడంతో ఆ అవకాశం కూడా జగన్ కు ఉంది అన్న టాక్ కూడా మొదలయింది.

ఎందుకంటే కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే కీలకం అన్న విషయాన్ని లేటేస్టుగా సర్వేలు, రాజకీయ విశ్లేషకులు అంటున్న మాటే కదా.. నిజానికి ఈ టాక్ లేనప్పుడు దేవగౌడ ప్రధాని పీఠం అదిరోహించి నిరూపించాడు. ఇప్పుడు అదే పరిస్థితి వస్తుందన్నది ఆ సీనియర్ కాంగ్రెస్ ఎంపీ విశ్లేషణ. ఈ మాటను చెప్పడం కాదు ఏకంగా సోనియాకు లేఖ ద్వారా తెలియచేసాడు ఆ ఎంపీ రాయపాటి సాంబశివరావు. ఇప్పుడు సీమాంద్రలో కాంగ్రెస్ ను పూర్తిగా చంపేసి జగన్ పాట పాడుతున్నారు. బాగానే ఉంది, కాని ఆయన 20 ఎంపి సీట్లు గెలుచుకోవడం ఖాయం, అప్పుడు మీరే ఆయనకు మద్దతుగా నిలచి ప్రధానిని చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, అప్పట్లో దేవగౌడ కూడా 20 మంది ఎంపీలతోనే ప్రధాని అయ్యాడు, గుర్తుంచుకోండి అంటూ రాయపాటి చక్కటి రాయితో సోనియాను కొట్టినంత పనిచేసాడు. అంతే కాదు, బిజేపి సీమాంద్రలో పుంజుకుంటుంది, మీరు కాదన్నా ఆ అవకాశం బిజేపి జగన్ కు ఇచ్చినా ఇస్తుంది జాగ్రత్త అన్నాడు. అందుకే ఈ విషయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది.

ఇక విద్యుత్ సమ్మె, పొరుగు రాష్ట్రాలలో సైతం ఇక అంధకారమే


విజయవాడ, అక్టోబర్ 5: రాష్ట్ర విభ జనకు కేంద్రం నిర్ణయించడంతో విద్యుత్ ఉద్యోగులు ఆదివారం ఉదయం ఆరు గంటలనుంచే నిరవధిక సమ్మెకు దిగనున్నారు. దీని ఫలితంగా రాష్ట్రంలోనే కాక, పొరుగు రాష్ట్రాలలో కూడా చిమ్మచీకట్లు అలుముకోనున్నాయి.

ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కమ్ ఉద్యోగులు సమ్మెను నిరవధికంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తున్నది. ఫీడర్లు ట్రిప్ చేయాలని కూడా విద్యుత్ ఉద్యోగులు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే విద్యుత్ సమ్మె ప్రభావం తీవ్రంగా ఉంది. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలో దీని ప్రభావం కనిపించడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లకోసం ఆ రాష్ట్రాలనుంచి యత్నాలు ప్రారంభమయ్యాయి. 

Will Akkineni family repeat Ghattamaneni family history?


Tollywood is filled with a good number of film families and two among them are the Ghattamaneni family and the Akkineni family. In a way, the Akkineni family is more famous due to its vast presence. But now some are wondering if this family will repeat the history of Ghattamaneni family regarding their family heroes. Many years ago, superstar Krishna introduced his son Ramesh Babu as the hero but despite his best efforts, Ramesh Babu could not shine as a hero. But within no time, Mahesh Babu emerged and he overtook Ramesh. Today, he is a superstar. Now, a similar situation is being anticipated in the Akkineni family.

 The time is fast approaching for Akkineni Akhil to make his debut and many in the filmnagar circles are stating that once he makes his debut, he has full potential to overtake step brother Naga Chaitanya and reach stardom. If that happens then history will have repeated or we have to see if Naga Chaitanya can keep ahead of Akhil.

లుక్కు మారిస్తే లక్కు వస్తుందా?


తుఫాన్ సినిమా కొట్టిన బీభత్సమైన దెబ్బకి అల్లకల్లోలం అయిపోయింది రామ్ చరణ్ కెరీర్. ఎందుకిలా జరిగిందా అంటూ కుమిలిపోతోన్న కుర్రాడు ఇప్పటికి కాస్త తేరుకున్నాడు. మిగతా సినిమాల మీద కాన్సన్ ట్రేట్ చేస్తున్నాడు. తుఫాన్ మిగిల్చిన చేదు అనుభవాన్ని తుడిచేయాలని తపిస్తున్నాడు. తుఫాన్ పోతే పోయింది, ఎవడు అయినా తన తలరాతను మారుస్తుందేమో అని ఆశపడిన రామ్ చరణ్ కి నిరాశే మిగిలింది. సమైక్యాంధ్ర ఉద్యమం పుణ్యమా అని ఆ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో కూడా తెలీని పరిస్థితి ఏర్పడింది. అందుకే దాన్న సంగతి పక్కన పెట్టి, వెంకటేష్ తో కలిసి కృష్ణవంశీ డైరెక్షన్లో మల్టీస్టారర్ చేయడానికి ప్రిపేరవుతున్నాడు చెర్రీ. దానికోసం తెగ కసరత్తులు చేస్తున్నాడు. ముఖ్యంతా తన లుక్స్ విషయంలో బాగా కేర్ తీసుకుంటున్నాడు. కొద్దిగా గడ్డం, కొంచెం పొడవైన జుత్తుతో కనిపించేవాడు చెర్రీ మొన్నటివరకూ. కానీ ఇప్పుడు హెయిర్ స్టయిల్ మారింది. ఫేస్ లో లుక్ కూడా మారింది. ఇంతకు ముందులా కాకుండా కాస్త డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. ఏంటా అని ఆరా తీస్తే, అదంతా కృష్ణవంశీ సినిమా కోసం అని తెలిసింది. ఇందులో వెంకటేష్ అన్న కొడుకుగా కనిపించనున్నాడు చెర్రీ. చూద్దాం... లుక్కు మార్చాక అతడి లక్కు ఏమైనా మారుతుందేమో!

బక్కన్న కేసిఆర్ బహుత్ పరేషాన్



బక్కన్న కేసిఆర్ బహుత్ పరేషాన్ లో పడ్డాడట, దేవుడా ఇప్పుడేం చేయాలి అంటూ తెగ టెన్షన్ పడుతున్నాడట, ఈవిషయం టిఆర్ఎస్ నేతలే చెపుతున్నారు, అదేంటి తెలంణాణ నోట్ క్యాబినెట్ ఆమోదం పొందడంతో మీడియా ముందుకు వచ్చి ఎగిరి గంతులేసినంత పని చేసిన కేసిఆర్, గిప్పుడు పరేషాన్ అవుడేంది అనుకోవడం సహజం. రాజకీయ నాయకులకు బయటకో రూపం, లోపలో రూపం ఉంటుంది కదా... అలాంటిదేదో అయ్యుంటుందిలే అనుకునే వారు కూడా ఉంటారనుకోండి.

 కేసిఆర్ పరేషాన్ కు అసలు కారణమేంటంటే తెలంగాణ నోట్ ఆమోదం పొందడమేనట. గదేంది మళ్లీ బాంబులాంటి వార్త పేలుస్తున్నారు అనుకోవద్దు, ఇందులో కేసిఆర్ చిత్తశుద్దిని శంకించాల్సిన అవసరం లేదు, కాని ఇదే ఆయన టెన్షన్ కు కారణం అన్నది మాత్రం నిజం. అదేంటంటే తెలంగాణ ఇస్తే టిఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తా అని కేసిఆర్ ఎప్పుడో చెప్పాడు కదా... ఇప్పుడెట్టా, ఎలాచేయాలి అంటూ తెగ మదనపడుతున్నాడు కేసిఆర్ అంటున్నారు. మొదట తెలంగాణ ఇస్తున్నట్టు ప్రకటిస్తే చాలు పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానన్నాడు కేసిఆర్. ఆ పనిచేసాకా ఏంసంగతి ఎప్పుడు కలుస్తావ్ అంటే గట్లెట్ల కుదరుతుది, పుసుక్కున నిర్ణయం వెనక్కు తీసుకుంటే నా బతుకు చిరంజీవి లెక్క గాదా.. అందుకే నోట్ పెట్టండి, క్యాబినెట్ ఆమోదం పొందనీయండి, గప్పుడు నమ్ముతా అన్నాడు. ఇప్పుడు అది కూడా పూర్తయింది, ఇప్పుడు సోనియమ్మ ఎప్పుడు పిలుస్తుంది, ఎప్పుడు పార్టీని ఎత్తేయమంటది అన్న బెంగ కేసిఆర్ లో మొదలయింది అంటున్నారు టిఆర్ఎస్ వర్గాలు.

మహేష్ బాబు తో రాంచరణ్ కుస్తీ



ఇద్దరు టాప్ హీరోలు కుస్తీ పడితే ఎలా, అందరిలో ఒకటే టెన్షన్ ఎవరు గెలుస్తారని, ఇదే సీన్ టాలీవుడ్ లో త్వరలోనే చూడబోతున్నాం అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఏకంగా ప్రిన్స్ మహేష్ బాబుతో తూఫాన్ ప్లాఫ్ తో కసి మీదున్న రాంచరణ్ కుస్తీ పడబోతున్నాడట.

తెలంగాణ కోట్ క్యాబినెట్ ఆమోదంతో చిరంజీవి పరిస్తితి రాష్ట్ర రాజకీయాల్లో మరింత విపత్కర పరిస్థితుల్లో పడిందని రాంచరణ్ తో పాటు ‘ఎవడు’ నిర్మాత దిల్ రాజు కూడా బావిస్తున్నారట. అందుకే దసరా సెలవుల్లో విడుదల చేయాలను కున్న ఈ సినిమాను ఇంకా వాయిదా వేసి సంక్రాంతికి విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు అంటున్నారు. అదే సమయానికి మహేష్ బాబు తెరమీదకు వస్తున్నాడు. తను ప్రాణం పెట్టి తీస్తున్న ‘వన్ – నేనొక్కడినే’ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని ముందుగానే ప్రకటించారు. అందుకే రాంచరణ్ తన ‘ఎవడు’ తో మహేష్ ‘వన్’ సినిమాతో హిట్టు విషయంలో కుస్తీ పడబోతున్నాడన్న మాట. సరే ఎవరు గెలుస్తారు, ఇది నిజమవుతుందా.. అంటే సంక్రాంతి దాకా ఆగాల్సిందే.

పవన్ కు నో చెప్పిన టాప్ హీరో ..!



రాజకీయ ఉద్యమాలను సహితం ఎదిరించి ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా సత్తాను చాటుతూ 2013 బ్లాక్ బస్టర్ గా రికార్డుకేక్కిన పవన్ ‘అత్తారింటికి దారేది’ సినిమానుకోలీవుడ్ లో రీమేక్ చేయడానికి ఒక ప్రముఖ తమిళ నిర్మాత హీరో విజయ్ ను ఈ సినిమాను చూడమనికోరాడట. స్వతహాగా పవన్ అభిమాని అయిన హీరో విజయ్ ఈ సినిమాను చూసి పవన్ అద్భుత నటనకు ఫిదా అయిపోయాడట. ఈ సినిమాను చూసిన వెంటనే విజయ్ పవన్ కు ఫోన్ చేసి అభినందించడంమే కాకుండా ఆ ప్రముఖ నిర్మాతను పిలిపించి పవన్ అత్తారిల్లు సినిమా కోలీవుడ్ లో రీమేక్ చేయాలనే ఆలోచన పూర్తిగా మరిచిపోమనీ చెప్పాడట.

దానికి షాక్ అయిన ఆ కోలీవుడ్ నిర్మాత ‘అత్తారిల్లు’ నచ్చలేదా అని అడిగితే నచ్చకపోవడం కాదు ఆ సినిమాలోని పవన్ చేసిన పాత్రను మరెవ్వరూ ఆ విధంగా చేయలేరని ఆ స్థాయి ఉన్న హీరోలు దక్షణాది సినిమా రంగంలో ప్రస్తుతం ఎవ్వరూ లేరనీ అంటూ తాను కూడా ఆ పాత్రకు సరిపోననీ తమిళ ప్రజల చేత ఇళయ దళపతి గా పిలిపించుకునే హీరో విజయ్ అన్నాడట. గతంలో అనేక సూపర్ హిట్ తెలుగు సినిమాలు ‘ఒక్కడు’, ‘పోకిరి’, ‘తమ్ముడు’, ‘నువ్వు నాకు నచ్చావు’ లాంటి సినిమాలను కోలీవుడ్ లో రీమేక్ చేయించి సూపర్ హిట్లు అందుకున్న విజయ్ లాంటి కోలీవుడ్ సూపర్ స్టార్ కూడా ‘అత్తారింటి’ రీమేక్ కు నో చెప్పాడు అంటే పవన్ కళ్యాణ్ ‘ఆతరిల్లు’లో నటించిన నటన పవన్ అభిమానులకే కాదు టాప్ హీరోలకు కూడా ఎంతబాగా నచ్చిందో అర్ధం అవుతుంది..