సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అత్తారింటికి దారేది సూపర్ హిట్ టాక్ తరువాత మళ్ళీ వార్తలలోకి వచ్చాడు. అంతేకాదు మళ్ళీ పవన్ పై సంచనల వ్యాఖ్యలు చేశాడు మన సెన్సేషనల్ డైరెక్టర్. తన దృష్టిలో పవన్ ఒక ఇడియట్ గా మారిపోతున్నాడు అని అంటూ ఈ మాటలను తాను పవన్ పై ఉన్న వెర్రి అభిమానంతో అంటున్నాను అంటూ కామెంట్ చేస్తున్నాడు. ఆయన మాటలలో ఈ పరిస్థితులలో కూడా పవన్ రాజకీయ పార్టీ పెట్టకపోతే భవిష్యత్ లో ఆయన ఒక ఇడియట్ గా మిగిలిపోతాడు అని అంటూ అత్తారింటికి దారేది కి వచ్చిన మెగా సక్సెస్ ఆ సినిమా గొప్పదనం వల్ల కాదని, పవన్ కళ్యాణ్ పట్ల తెలుగు ప్రజలకు ఉన్న వెర్రి అభిమానం ఆ సినిమాను అంత బ్లాక్ బస్టర్ హిట్ గా మార్చిందని అంటున్నాడు వర్మ.
వర్మ అభిప్రాయంలో పవన్ అత్తారింటికి దారేది బాలీవుడ్ సినిమాలలో కాకుండా హాలీవుడ్ సినిమాలతో పోటీ పడుతొందట. హాలీవుడ్ లోని ప్రముఖ సినిమా కంపెనీలు ఈ సినిమా అమెరికాలో సృష్టిస్తున్న సునామి ని చూసి ఆశ్చర్యపోతున్నాయి అట. అంతేకాదు రేషియో ప్రాతిపదికన తీసుకుంటే పవన్ అత్తారిల్లు షారుఖ్ ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ ను ధాటిపోయి౦దని అంటున్నాడు ఈ విలక్షణ దర్శకుడు. అమెరికాలో ఈ సినిమా క్రేజ్ ను చూసిన చాలామంది తెలుగు అర్ధంకాని వాళ్ళు అత్తారింటికి దారేది అంటే అర్ధం ఏమిటి అని వర్మ ను అడుగుతున్నారట.
ఈ సినిమా గురించి ఇన్ని గొప్పతనాలు ఏకరువు పెట్టిన వర్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను సునామి స్టార్ గా పిలవమంటూ పవన్ అభిమానులకు సలహా ఇస్తున్నాడు వర్మ. వర్మ పొగడ్తల దండకంతో సునామి స్టార్ గా పేరు మారబోతున్న పవర్ స్టార్ రాజకీయాల లోకి వస్తాడా..? రాడా..? అన్నది సమాధానం లేని ప్రశ్న అయితే, గబ్బర్ సింగ్-2 గా వస్తాడు అన్నది మాత్రం ఖచ్చితమైన సమాధానం.
Tuesday, 1 October 2013
పవన్ ను ఇడియట్ అని సంబోధిస్తున్న సెన్సేషనల్ డైరెక్టర్...!
సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అత్తారింటికి దారేది సూపర్ హిట్ టాక్ తరువాత మళ్ళీ వార్తలలోకి వచ్చాడు. అంతేకాదు మళ్ళీ పవన్ పై సంచనల వ్యాఖ్యలు చేశాడు మన సెన్సేషనల్ డైరెక్టర్. తన దృష్టిలో పవన్ ఒక ఇడియట్ గా మారిపోతున్నాడు అని అంటూ ఈ మాటలను తాను పవన్ పై ఉన్న వెర్రి అభిమానంతో అంటున్నాను అంటూ కామెంట్ చేస్తున్నాడు. ఆయన మాటలలో ఈ పరిస్థితులలో కూడా పవన్ రాజకీయ పార్టీ పెట్టకపోతే భవిష్యత్ లో ఆయన ఒక ఇడియట్ గా మిగిలిపోతాడు అని అంటూ అత్తారింటికి దారేది కి వచ్చిన మెగా సక్సెస్ ఆ సినిమా గొప్పదనం వల్ల కాదని, పవన్ కళ్యాణ్ పట్ల తెలుగు ప్రజలకు ఉన్న వెర్రి అభిమానం ఆ సినిమాను అంత బ్లాక్ బస్టర్ హిట్ గా మార్చిందని అంటున్నాడు వర్మ.
వర్మ అభిప్రాయంలో పవన్ అత్తారింటికి దారేది బాలీవుడ్ సినిమాలలో కాకుండా హాలీవుడ్ సినిమాలతో పోటీ పడుతొందట. హాలీవుడ్ లోని ప్రముఖ సినిమా కంపెనీలు ఈ సినిమా అమెరికాలో సృష్టిస్తున్న సునామి ని చూసి ఆశ్చర్యపోతున్నాయి అట. అంతేకాదు రేషియో ప్రాతిపదికన తీసుకుంటే పవన్ అత్తారిల్లు షారుఖ్ ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ ను ధాటిపోయి౦దని అంటున్నాడు ఈ విలక్షణ దర్శకుడు. అమెరికాలో ఈ సినిమా క్రేజ్ ను చూసిన చాలామంది తెలుగు అర్ధంకాని వాళ్ళు అత్తారింటికి దారేది అంటే అర్ధం ఏమిటి అని వర్మ ను అడుగుతున్నారట.
ఈ సినిమా గురించి ఇన్ని గొప్పతనాలు ఏకరువు పెట్టిన వర్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను సునామి స్టార్ గా పిలవమంటూ పవన్ అభిమానులకు సలహా ఇస్తున్నాడు వర్మ. వర్మ పొగడ్తల దండకంతో సునామి స్టార్ గా పేరు మారబోతున్న పవర్ స్టార్ రాజకీయాల లోకి వస్తాడా..? రాడా..? అన్నది సమాధానం లేని ప్రశ్న అయితే, గబ్బర్ సింగ్-2 గా వస్తాడు అన్నది మాత్రం ఖచ్చితమైన సమాధానం.
పెట్రోల్ ధర తగ్గింది
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: పెట్రోల్ ధర దిగొచ్చింది. లీటరుకు రూ.3.05 పైసల వంతున తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రకటించాయి. సోమవారం అర్ధరాత్రి నుంచే ఇది అమలులోకి వస్తుందని పేర్కొన్నాయి. దీనిపై పన్నులు కూడా కలిపితే తగ్గింపు సుమారు రూ.3.66గా ఉండొచ్చు. గడచిన ఐదు నెలల కాలంలో తొలిసారిగా ధర తగ్గగా, ఐదేళ్ల వ్యవధిలో ఈ తగ్గింపు అత్యధికం కావడం విశేషం. అయితే, డీజిల్‌పై మాత్రం నెలవారీ విధానం మేరకు 50 పైసలు పెంచుతున్నట్లు ప్రకటన వెలువడింది. అమెరికా డాలరులో రూపాయి మారకం విలువ పెరిగినందువల్లే పెట్రోల్ ధరను తగ్గించినట్లు సమాచారం. కాగా, రూపాయి విలువ తగ్గిందంటూ ఈ ఏడాది జూన్ నుంచి ఏడుసార్లు మొత్తం రూ.10.80 మేర పెంచగా, పన్నులు కలిపిన తర్వాత ప్రజలపై భారం రూ.13.06కు చేరింది.
ఇక డీజిల్‌పై జనవరి 17 నుంచి ఇప్పటిదాకా తొమ్మిదిసార్లు పెంచగా, మొత్తం పెంపు లీటరుకు రూ.5.39గా నమోదైంది. మరోవైపు 14.2 కిలోల సబ్సిడీయేతర వంటగ్యాస్ సిలిండర్‌పై గరిష్ఠంగా రూ.71.50 మేర చమురు కంపెనీలు బాదేశాయి. దీనివల్ల వినియోగదారులు 9 సిలిండర్ల పరిమితికి మించి తీసుకునే ప్రతి సిలిండర్‌కు ఇకపై భారీగా చెల్లించుకోవాల్సిందే. అయినప్పటికీ డీజిల్, కిరోసిన్‌లపై లీటరుకు రూ.10.52, రూ.38.32 వంతున, వంటగ్యాస్‌పై రూ.532.50 మేర నష్టపోతున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) పేర్కొంది. ఈ మూడు ఉత్పత్తుల మీద ఈ ఆర్థిక సంవత్సరంలో తమకు రూ.73,500 కోట్ల లోటు ఉంటుందని, అన్ని కంపెనీలకు కలిపి ఇది రూ.1,39,600 కోట్లని ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, గ్యాస్ సిలండర్ ధరలు కూడా మరోసారి పెరిగాయి. దీంతో సిలిండ్ ధర 1024.50 నుంచి రూ. 1,111 లకు చెరుకుంది.
- See more at: http://www.andhrajyothy.com/node/5830#sthash.re5xtN1Y.dpuf
సైబర్ స్పేస్‌లో అత్యంత ప్రమాదకర తెలుగు తారలు
ఒక అధ్యయనం ప్రకారం భారతదేశంలో అత్యంత ఆకర్షణీయమైన తారగా రెండో స్థానంలో నిలిచిన అగ్ర కథానాయకుడు మహేశ్‌ను, మరో అధ్యయనం ప్రకారం ఇండియన్ సైబర్‌స్పేస్‌లో అత్యంత ప్రమాదకరమైన తెలుగు సెలబ్రిటీగా 'మెక్ అఫీ' ప్రకటించింది. మెక్ అఫీ అనేది ప్రపంచపు అతి పెద్ద భద్రతా సాంకేతికతా సంస్థ. ఇండియన్ సైబర్ స్పేస్‌లో తెలుగు సెలబ్రిటీల ప్రమాదపు సూచీల ఆధారంగా ప్రసిద్ధ వ్యక్తులపై మెక్ అఫీ పరిశోధన చేసింది. అంతర్జాలం ద్వారా వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని అపహరించేందుకు సైబర్ నేరస్తులు సెలబ్రిటీల పట్ల అభిమానులకు ఉండే అభిమానాన్ని ఎరగా చేసుకుని వారిని మాల్వేర్తో కూడిన వెబ్సైట్లను వెళ్లేలా చేస్తారనీ, ఆ సైట్ల నుంచి వారి పరికరాల్లోకి మాల్వేర్ చేరేలా చేస్తారనీ మెక్ అఫీ అధికార ప్రతినిథి వెంకట సుబ్రహ్మణ్యం అయ్యర్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఆ సంస్థ అధ్యయనం ప్రకారం ఈ ఏడాది ఇండియన్ సైబర్‌స్పేస్‌లో అత్యధిక ప్రమాద శాతాన్ని కలిగిన మొదటి పది తెలుగు సెలబ్రిటీలు ఎవరంటే... 1. మహేశ్, 2. రామ్‌చరణ్, 3. పవన్ కల్యాణ్, 4. అంజలి, 5. ఇలియానా, 6. ఎన్టీఆర్, 7. అల్లు అర్జున్, 8. అమలా పాల్, 9. కృతి సనన్, 10. కాజల్ అగర్వాల్. - See more at: http://www.andhrajyothy.com/node/1865#sthash.uEvDdRWA.dpuf
రౌడీలనే ఇష్టపడేవాడ్ని: రామ్‌గోపాల్‌వర్మ
చిన్నతనంలో గాంధీజీ కంటే రౌడీలనే ఇష్టపడేవాడినని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ పేర్కొన్నారు. తన మనసులోని మాటను ధైర్యంగా చెప్పే దర్శకుడు వర్మ. తొలి చిత్రం శివతోనే సంచలనం సృష్టించారు. తెలుగు సినిమా పయనాన్ని మార్చారు. హిట్, ప్లాప్‌లతో సంబంధం లేకుండా సినిమాలను చేసుకుంటూ పోవడం ఆయన నైజం. ఆయన సినిమా అంటే ప్రేక్షకులకు ఎనలేని ఆసక్తి.
వర్మ దర్శకత్వం వహిస్తున్న తొలి తమిళ చిత్రం నాందాండా. శర్వానంద్, అనైక, అంజలి గుప్తా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఇటీవల విడుదలైంది. చెన్నైలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో వర్మ మాట్లాడారు. ఈ సమావేశంలో చిత్ర హీరో హీరోయిన్లు శర్వానంద్, అనైక, నృత్య దర్శకురాలు రాధిక, నిర్మాత దేవిశ్రీదేవి సతీష్ తదితరులు పాల్గొన్నారు.ప్రశ్న : నాందాండా చిత్ర కథేంటి? వర్మ: క్రిమినల్ బలం, బలహీనతలను అంచనా వేసి వాడిని మట్టి కరిపించే ఒక యువకుడి కథ నాందాండా. ఈ పాత్రలో నటుడు శర్వానంద్ ఒదిగిపోయారు.
ప్రశ్న : మీ చిత్రాలలో హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి కదా? వర్మ: హింసకు పాల్పడే ప్రతి వ్యక్తి వెనుక అందుకు బలమైన కారణాలుంటాయి. అవి ఏమిటని చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ప్రశ్న : మీకు రౌడీలంటే ఇష్టమా?
వర్మ: చిన్నతనంలో గాంధీజీకంటే రౌడీలంటేనే ఇష్టపడేవాడిని.
ప్రశ్న : బాలీవుడ్లో బిజీగా ఉన్న మీరు కోలీవుడ్ చిత్రం తీయడానికి కారణమేమిటి?
వర్మ: తమిళ చిత్రం తెరకెక్కించాలన్న కోరిక చాలా కాలంగా ఉంది. అది ఈ నాందాండా చిత్రంతో తీరనుంది.
ప్రశ్న : ఈ చిత్రంతో దర్శకుడంటే (నాందాండా) నేనేరా అని నిరూపించుకుంటారా?
వర్మ: కచ్చితంగా ఇది నా స్టైల్ చిత్రం.
ప్రశ్న : హీరోయిన్ అనైక గురించి చెప్పండి?
వర్మ: అనైక తన పాత్రను సమర్థవంతంగా పోషించింది. ఆమెకిది తొలి చిత్రమే అయినా చాలా బాగా నటించింది.
ప్రశ్న : చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేయనున్నారు?
వర్మ: అక్టోబర్ తొలివారంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం.
సుధీర్‌బాబు రిస్కీ ఫైట్స్!

ఆత్మహత్య చేసుకోవాలనున్నా: త్రివిక్రమ్ శ్రీనివాస్
'అత్తారింటికి దారేది' సినిమా పైరసీ సీడీలు బయటకు రావడంతో ఆత్మహత్యే శరణ్యమనుకున్నామని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పారు. తానెంతో కష్టపడి తెరకెక్కించిన సినిమా దొంగదారిలో బయటకు రావడంతో ఆత్మహత్య ఒకటే మార్గమనుకున్నానని వెల్లడించాడు. తన స్థానంలో ఎవరున్నా ఇలాగే ఆలోచించేవారని పేర్కొన్నారు. కొన్ని కోట్ల రూపాయలు పెట్టి తీసిన సినిమా విడుదలకు ముందే అక్రమ మార్గంలో బయటకు వస్తే చావు తప్ప మరో మార్గం ఉండదన్నారు. ఇప్పటికే సినిమా బయర్లకు అమ్మేసినప్పటికీ డబ్బులు ఇంకా చేతికి రాలేదని చెప్పారు.
'పైరసీ సీడీలు బయటకు వచ్చాయని తెలిసిన వెంటనే స్పందించి నష్ట నివారణ చర్యలు చేపట్టాం. సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశాం. వారు గొప్పగా స్పందించారు. 36 గంటల్లోనే కేసును ఛేదించారు. ఈ సమస్యను దశలవారిగా అధిగమించుకుంటూ వచ్చాం. క్షణక్షణం ఉత్కంఠకు గురయ్యాం. తర్వాత ఏం జరుగుతుందోనన్న భయం వెంటాడింది. పవన్ కళ్యాణ్ అభిమానులు సీడీల పంపిణీని సమర్థవంతంగా అడ్డుకున్నారు. అలాగే ఇంటర్నెట్ డౌన్ లోడ్ లింకులను ఆపేశారు. ఆ మూడు రోజులు నరకం అనుభవించాను. అయితే సినిమా విడుదలయిన తర్వాత ప్రేక్షకుల స్పందన చూసి కష్టాలన్నీ మర్చిపోయాను' అని త్రివిక్రమ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. పైరసీ వ్యవహారంతో నిర్మాతకు తాను, పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ తిరిగిచ్చేశారని వచ్చిన ఊహాగానాలపై త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పందించలేదు.
కుప్పకూలిన అమెరికా ఆర్థిక వ్యవస్థ.. ప్రభుత్వం మూత!
వాషింగ్టన్ : అమెరికాలో అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభం తలెత్తింది. ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ మూసేయాలని వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్ మెంట్ అండ్ బడ్జెట్ సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆదేశించింది. బడ్జెట్ బిల్లు సెనేట్ లో ఆమోదం పొందకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. కాంగ్రెస్ సమయానికి స్పందించి, అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా రేపటికి సంతకం చేస్తారో లేదో ఇంకా తెలియదని, అందువల్ల ప్రస్తుతానికి ప్రభుత్వ కార్యాయాలయన్నింటినీ మూత పెట్టాలని వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్ మెంట్ అండ్ బడ్జెట్ డైరెక్టర్ సిల్వియా బర్వెల్ ఓ ప్రకటనలో తెలిపారు.
కాంగ్రెస్ వీలైనంత త్వరగా స్పందించి, తాత్కాలికంగానైనా ఓ బడ్జెట్ ను ఆమోదించాలని, అప్పుడు మిగిలిన ఆర్థిక సంవత్సరానికి కావల్సిన బడ్జెట్ ను కొంత సమయం తీసుకున్న తర్వాత ఆమోదించుకోవచ్చని, దానివల్ల ప్రభుత్వ సేవలన్నింటినీ త్వరగా పునరుద్ధరించే అవకాశం ఉంటుందని లేనిపక్షంలో తీవ్ర ప్రభావం కలిగే ప్రమాదముందని బర్వెల్ అన్నారు. గడిచిన 17 సంవత్సరాల్లో అమెరికా ప్రభుత్వం మూతపడటం ఇదే మొట్టమొదటిసారి. చిట్టచివరిసారిగా 1996లో క్లింటన్ ప్రభుత్వానికి, రిపబ్లికన్ల ఆధిపత్యం ఉన్న కాంగ్రెస్ కు మధ్య విభేదాలు తలెత్తినప్పుడు కూడా బడ్జెట్ ఆమోదం పొందలేదు.
ఇడుపులపాయకు పోటెత్తిన అభిమాన సంద్రం
ఇడుపులపాయ : ఇడుపులపాయకు అభిమాన సంద్రం పోటెత్తింది. మహానేత తనయుడు, జగనేత జగన్ మోహన్ రెడ్డిని చూసేందుకు అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కోర్టు అనుమతితో తండ్రి సమాధిని సందర్శించేందుకు వచ్చిన జగన్ ను కలిసేందుకు వచ్చిన అభిమానుల తాకిడి జన సునామీని తలపించింది. తండ్రికి నివాళులు అర్పించిన అనంతరం జగన్ .... ప్రతి ఒక్కరికి అభివాదం చూస్తూ పలకించారు.
చాలాకాలం తర్వాత తమ అభిమాన నేతను ప్రత్యక్షంగా కలుసుకునేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. దాంతో ఇడుపులపాయ కిటకిటలాడుతోంది. ఇక కుటుంబ సభ్యులు వైఎస్ వివేకానంద రెడ్డి, అవినాష్ రెడ్డితో పాటు పార్టీ నేతలు అమర్ నాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు...ఇతర ముఖ్యనేతలు వైఎస్ఆర్ కు నివాళులు అర్పించారు.
Subscribe to:
Posts (Atom)