జగన్ బండారాన్ని బహుచక్కగా బయటపెట్టిన అనకాపల్లి ఎంపీ సబ్బం హరి చాలా కూల్ గా జగన్ కు మరోసారి షాకిచ్చాడు. నన్ను పార్టీలోంచి తీసేస్తున్నారనో, లేక తనది జగన్ పార్టీ కాదనో వాళ్లు చెప్పారు అందులో ఏమాత్రం తప్పులేదు, ఎందుకంటే తాను వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీ తరఫున పోటీ చేస్తాను అని చెప్పుకుంటున్నాను కాబట్టి వారు అలా అనడంలో తప్పేంటి అన్నారు. ఇక తను జగన్ విషయంలో అన్న మాటలు తప్పు అని, అవి నావ్యక్తిగతమని అన్నారు చూడండి... అవి మాత్రం శుద్ద అబద్దం అని చెప్పి మరోసారి జగన్ కు షాకిచ్చారు సబ్బం.
అవును నేను జగన్ పార్టీలోకి ఇంకా చేరలేదు, అంతెందుకు నేనింకా ఆ పార్టీలో చేరుతున్నానని దరఖాస్తు కూడా చేసుకోలేదన్నారు. కాని నాకు జగన్ పార్టీలో చేరాలని ఉన్న కోరిక మాత్రం వాస్తవం, వారు టికెటిస్తే రాబోయే ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేస్తాను, లేదంటే ఇంకా సంతోషం అన్నారు సబ్బం హరి. అయితే ఆయన ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యూపిఏకు మద్దతిస్తానని నేను చెప్పడంలో వందశాతం నిజముందని అన్నారు.
కారణం నేను ఈ మాట నిన్న చెప్పాను, కాని విజయమ్మ, జగన్ లు ఈ మాటను ఇప్పటికి 15 సార్లు చెప్పారని అన్నారు. మతతత్వ పార్టీ బిజేపికి మదతిచ్చే ప్రసక్తి లేదని, కాబట్టి యూపిఏకే తమ మద్దతుంటుందని ఎన్నో సార్లు విజయమ్మ, జగన్ లు అన్నారని వారు ఈ మాటలు రహస్యంగా లోలోపల అనలేదని, ఎన్నో సార్లు మీడియా ముందే అన్నారని జగన్ గుట్టును మరింత రట్టు చేసాడు సబ్బం హరి. అయినా తొందరెందుకు ఎన్నికలు కావడానికి ఎన్నో రోజులు సమయం లేదు కదా, అవి అవడం, జగన్ మద్దతివ్వడం మనం చూస్తాం కదా... అప్పుడు అందరికి నిజం ఏంటో తెలుస్థుంది కదా అంటూ జగన్ కు జబర్దస్థ్ షాకిచ్చాడు అని రాజకీయ పరిశీలకులు కూడా అభిప్రాయ పడుతున్నారు.
Monday, 30 September 2013
జగన్ కు మళ్లీ షాకిచ్చిన సబ్బం
జగన్ బండారాన్ని బహుచక్కగా బయటపెట్టిన అనకాపల్లి ఎంపీ సబ్బం హరి చాలా కూల్ గా జగన్ కు మరోసారి షాకిచ్చాడు. నన్ను పార్టీలోంచి తీసేస్తున్నారనో, లేక తనది జగన్ పార్టీ కాదనో వాళ్లు చెప్పారు అందులో ఏమాత్రం తప్పులేదు, ఎందుకంటే తాను వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీ తరఫున పోటీ చేస్తాను అని చెప్పుకుంటున్నాను కాబట్టి వారు అలా అనడంలో తప్పేంటి అన్నారు. ఇక తను జగన్ విషయంలో అన్న మాటలు తప్పు అని, అవి నావ్యక్తిగతమని అన్నారు చూడండి... అవి మాత్రం శుద్ద అబద్దం అని చెప్పి మరోసారి జగన్ కు షాకిచ్చారు సబ్బం.
అవును నేను జగన్ పార్టీలోకి ఇంకా చేరలేదు, అంతెందుకు నేనింకా ఆ పార్టీలో చేరుతున్నానని దరఖాస్తు కూడా చేసుకోలేదన్నారు. కాని నాకు జగన్ పార్టీలో చేరాలని ఉన్న కోరిక మాత్రం వాస్తవం, వారు టికెటిస్తే రాబోయే ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేస్తాను, లేదంటే ఇంకా సంతోషం అన్నారు సబ్బం హరి. అయితే ఆయన ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యూపిఏకు మద్దతిస్తానని నేను చెప్పడంలో వందశాతం నిజముందని అన్నారు.
కారణం నేను ఈ మాట నిన్న చెప్పాను, కాని విజయమ్మ, జగన్ లు ఈ మాటను ఇప్పటికి 15 సార్లు చెప్పారని అన్నారు. మతతత్వ పార్టీ బిజేపికి మదతిచ్చే ప్రసక్తి లేదని, కాబట్టి యూపిఏకే తమ మద్దతుంటుందని ఎన్నో సార్లు విజయమ్మ, జగన్ లు అన్నారని వారు ఈ మాటలు రహస్యంగా లోలోపల అనలేదని, ఎన్నో సార్లు మీడియా ముందే అన్నారని జగన్ గుట్టును మరింత రట్టు చేసాడు సబ్బం హరి. అయినా తొందరెందుకు ఎన్నికలు కావడానికి ఎన్నో రోజులు సమయం లేదు కదా, అవి అవడం, జగన్ మద్దతివ్వడం మనం చూస్తాం కదా... అప్పుడు అందరికి నిజం ఏంటో తెలుస్థుంది కదా అంటూ జగన్ కు జబర్దస్థ్ షాకిచ్చాడు అని రాజకీయ పరిశీలకులు కూడా అభిప్రాయ పడుతున్నారు.
నోట్, డ్రాఫ్ట్ అయ్యాకా నెత్తినోరు బాదుకుంటారా : జగన్
తెలంగాణపై నోట్, డ్రాఫ్ట్ అయ్యాక నెత్తినోరు బాదుకుంటే ఏం లాభమని జగన్ ప్రశ్నించారు. ఇప్పటికే సిడబ్ల్యూసి తీర్మాణం అయ్యేంత వరకు చూస్తే సమస్య ఎంత జఠిలం అయ్యిందో చూసారుగా అన్నారు. అందుకే ఆ ప్రమాదం మళ్లీ రావద్దంటే నోట్ తయారు కాకముందే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ అసెంబ్లీ తీర్మాణం చేసి కేంద్రానికి పంపించాలన్నారు. అందుకే ఆ పనికోసం అసెంబ్లీని సమావేశ పరిచేందుకు చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరానని చెప్పారు.
అసెంబ్లీ సమైక్య తీర్మాణం చేసాకా కేంద్రం ముందుకు పోయే సాహసం చేయదన్న ఆశాభావం నాకుందన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయమన్న వాళ్లు రాష్ట్ర ప్రయోజనాలను కాస్తా ఆలోచిస్తే బాగుండేదన్నారు. కాంగ్రెస్ వారు ఇప్పుడు ఇక్కడ సమైక్యం అంటున్నారు, వారికి తెలియదా, వారి అధిష్టానం ఏం చేయబోతోందో, అప్పడే ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు.
ఇక చంద్రబాబు తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇచ్చారు. సరే తరవాత నిజం తెలుసుకున్నాడు అనుకుందాం, అలాంటప్పుడు ఆయన ఇచ్చిన లేఖను వాపసు తీసుకోవచ్చు కదా.. అలా కాకున్నా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ మరో లేఖనైనా రాయొచ్చు కదా అన్నారు. కాని చంద్రబాబు ఆ పని చేయడం లేదంటే దానర్థం ఏంటి అన్నారు. రాష్ట్రంలో సమైక్యం కోరుకుంటున్న పార్టీలు కేవలం ఎంఐఎం, సిపిఎం, వైఎస్సార్ సిపి లేనని ఆయన స్పష్టం చేసారు.
ఇక సమరమే... హోల్ ఆంద్రా నాదే : జగన్
నాకు తెలంగాణ, రాయలసీమ, ఆంద్రా, కోస్తాంధ్ర అంతా ఒక్కటేనని, నా తండ్రి వైఎస్సార్ అందరి వాడని నేను కూడా అంతేనని అందుకే త్వరలోనే రాష్ట్రం సమైక్యంగా ఉంచడం కోసం హైదరాబాద్ లో పెద్ద ఎత్తున సమైక్య శంఖారావం నిర్వహించబోతున్నాని చెప్పారు. ఇది అక్టోబరు 13నుంచి 20 తేదీలోపు ఉండవచ్చని చెప్పారు. దీనికోసం రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలనుంచి సమైక్యవాదులు పెద్దఎత్తున తరలిరావాలని ఆయన విజ్ఞప్తి చేసారు.
పోలవరానికి జాతీయ హోదా అంటున్నారు, రాష్ట్రం విడిపోతే పోలవరానికి నీళ్లెక్కడి నుంచి ఇస్తారు. తెలంగాణలో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును మంజూరు చేసి పనులు ప్రారంభించింది తన తండ్రి వైఎస్సార్ అని ఆయన మరణం తర్వాత అది ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదన్నారు. ఇలా విడిపోతే నెలకొనె సమస్యలను అన్నింటిని వివరించారు. నేను కుమ్ముక్కయ్యాను అంటున్నారు, అలాగయితే 16 నెలలు జైల్లో ఎందుకు ఉంటాను అని ఆయన చెప్పారు.
కాంగ్రెస్ కు చెందిన మాజి మంత్రి శంకర్రావు, తెలుగుదేశం నేత అశోక్ గజపతి లు వేసిన పిటిషన్ మేరకే కదా తనపై సిబిఐ విచారణకు కోర్టు ఆదేశించిందని జగన్ గర్తు చేసారు. వైఎస్సార్ చనిపోతే ఆ బాదలో ఉన్నాడు ఆయన కొడుకు జగన్ అని కూడా చూడకుండా వారు కోర్టుకు వెల్లడం ఎంత దారుణమో అర్థం చేసుకోండి అన్నారు. అయినా కోర్టు తనను నిందితుల జాబితాలో 52వ నెంబరుగా చేర్చి మొదటి 12 పేర్లను ప్రభుత్వ శాఖలనే పేర్కొంటే కావాలని నివేదికలు సమర్పించకుండా నన్ను ఇరికించే ప్రయత్నం చేసారు కదా అన్నారు. ఇలా తనపై జరిగిన కుట్రలను రట్టు చేయడమే కాకుండా రాష్ట్రం విడిపోవడానికి కారకులెవరు, దానికోసం తానేమి చేయబోతున్నాడో కూడా చెప్పి జగన్ ఇక సమరానికి సిద్దమవుతున్నానన్న సంకేతాలు జారీ చేసాడు.
ఆంధ్రలో నీలాంటి మేధవి ఉంటే..నువ్వే ఉండేవాడివి కాదు కేసీఆర్!
అసలు ఆంధ్రలో ఎవడన్న మేధావి, ఉన్నడో లేడో అర్థం కావడం లేదనీ.. అని అన్నాడు కేసీఆర్. సకలజనుల భేరీ లో కేసీఆర్ కు ఈ సందేహం వచ్చింది.అయితే సూటిగా చెప్పాలంటే ఆంధ్రలో కేసీఆర్ అంతటి మేధావి లేడు. జనాలను రెచ్చగొట్టే తెలవితేటలు ఎవరికీ లేవు. అవే ఉండి ఉంటే.. కేసీఆర్ అంతటి మేధావే ఉండి ఉంటే..హైదరాబాద్ ఈ పాటికి అల్లకల్లోలం అయ్యేది. రెండు నెలలుగా సాగుతున్న సమైక్యవాద ఉద్యమం ఎప్పుడో హింసాత్మకం అయ్యేది!
సకలజనుల భేరీలో చూశాం.. కేసీఆర్ జనాలను ఎలా రెచ్చగొడతాడో.. ఎలా విధ్వేషాలను రగల్చగలడో.. మరి ఆంధ్రలో ఇలాంటి మేధావి లేకపోవడమే మంచిదైంది. ఒకవేళ ఉండి ఉంటే.. అతడూ ఇలాగే జనాలను రెచ్చగొట్టి ఉంటే.. జనాలు కత్తులు తీసుకునిపొడుచుకు చ్చేవారు. పనిలో పనిగా కేసీఆర్్ ను కూడా ఒక పోటు పొడిచేవారు. పీడ విరగడైందనే వారు.. అని అంటున్నారు సమైక్యవాదులు.
వెంట్రుకలు పీకలేరు.. జుట్టు పీకలేరు.. అంటూ అత్యంత నీఛంగా మాట్లాడుతూ.. సమస్యను తెలంగాణ నుంచి దారి మళ్లీస్తూ.. రెండు ప్రాంతాల మధ్య విధ్వేషాలను పెంచుతున్నాడు కేసీఆర్. ఇది నిస్సందేహమైన విషయం. ఇన్ని రోజులూ.. సమైక్య కాంక్ష లేని ప్రజల్లో కూడా కేసీఆర్ మాటలను విన్నాకా.. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యమించాలన్న కోరిక పుట్టి ఉంటుందనడంలో సందేహం లేదు.
మంచు మనోజ్ కు లక్ష్మి డార్లింగ్ అట...!
మొన్న సాయంత్రం భాగ్యనగరంలో జరిగిన ‘దూసుకేళ్తా’ ఆడియో వేడుకలో హీరో మంచు మనోజ్ చేసిన ఓవర్ యాక్షన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. తెలుగు సాంప్రదాయ సినిమాలకు చిరునామాగా పిలవబడే రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు ల సమక్షంలో హీరో మంచు మనోజ్ తన సోదరి మంచు లక్ష్మి ప్రసన్నను డార్లింగ్ అంటూ సంబోధించడం ఆవేడుకకు విచ్చేసిన అతిధులకు, అలాగే ఆ ఆడియో వేడుకను లైవ్ టెలికాస్ట్ లో చూస్తున్న వీక్షకులకు అతిగా అనిపించింది.
ఈమధ్య ఈ ఆడియో వేడుకలలో సినిమా హీరోలు చేస్తున్న ఓవర్ యాక్షన్ మరీ ఎక్కువగా ఉంటూ ఆ ఫంక్షన్ కు వచ్చిన అతిధులకు కూడా సమస్యగా మారుతోంది. మరొక ముఖ్య విషయం ఏమిటంటే, చిన్న సినిమాల ఆడియో వేడుకలు జరుగుతున్నప్పుడు ఆ ఆడియో వేడుకలో హీరోను పోగిడినప్పుడల్లా చప్పట్లు కొట్టి అల్లరి చేసే ఒక ప్రత్యేకమైన గ్రూప్ ప్రస్తుతం టాలీవుడ్ పరిశ్రమకు అందుబాటు లో ఉందట. అందువల్ల ఏ ఆడియో వేడుక జరిగినా ఆ గ్రూప్ ను పిలిస్తే చాలు, ఇక సందడే సందడి. ఆ విదానంగానే మంచు వారి కుటుంబం ‘దూసుకేళ్తా’ ఆడియో వేడుక కూడా జరిగింది అని అంటున్నారు. ఇక ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో మనోజ్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.
ప్రతీ విషయంలోనూ క్రమశిక్షణ గురించి, డిసిప్లెన్ గురించి ఉపన్యాసాలు ఇచ్చే మోహన్ బాబు సమక్షంలోనే ఒకసారి కాదు అనేక సార్లు మనోజ్ తన సోదరి లక్ష్మి ని డార్లింగ్ డార్లింగ్ అంటూ సంబోధించడం చూసినవారు అంతా మనం తెలుగు సినిమా ఆడియో ఫంక్షన్ లో ఉన్నామా..? లేక అమెరికాలో జరుగుతున్న కార్యక్రమంలో ఉన్నామా..? అంటూ చెవులు కొరుక్కోవడం స్పష్టంగా కనిపించింది. అయినా సోదరిని డార్లింగ్ అంటూ కొత్త సంబోధనతో పలరిస్తున్న మంచు మనోజ్ నిఘంటువు లోని ఈ డార్లింగ్ పధం అర్ధానికి అర్ధం వెతకాలి అంటే మంచు మనోజ్ నే అడగాలి.
ఇడుపులపాయ వెళ్లేందుకు జగన్కు అనుమతి
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ వెళ్లేందుకు నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు ఇచ్చింది. తన బెయిల్ షరతులను సడలించాలని, వచ్చే నెల 1, 2 తేదీలలో ఇడుపులపాయ, 4న గుంటూరు వెళ్లేందుకు అనుమతించాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు ఈరోజు విచారించింది.
జగన్ పిటిషన్ పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీబీఐ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. జగన్ బెయిల్ పై ఆంక్షలు సడలించవద్దని కోరారు. సాక్షులంతా హైదరాబాద్ వెలుపలే ఉన్నారని, జగన్ పలుకుబడి ఉన్న వ్యక్తి అయినందున వారిని ప్రభావితం చేయవచ్చనని సిబిఐ న్యాయస్థానానికి తెలిపింది. ఈ కేసులో నిందితులు ఇంకా జైల్లోనే ఉన్నారని, వారి బెయిల్ పిటిషన్లు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని తెలిపింది. బెయిల్ షరతులు సడలిస్తే తమ ప్రక్రియకు విఘాతం కలుగుతుందని కౌంటర్ పిటిషన్ లో వెల్లడించింది.
సీబీఐ కౌంటర్ పిటిషన్ పై జగన్ తరపు న్యాయవాది సుశీల్ కుమార్ కోర్టులో వాదనలు వినిపించారు. జగన్ పై ఉన్నది హైలీ టెక్నికల్ కేసు అని, సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం లేదని, ప్రతి సాక్ష్యం డాక్యుమెంట్ గా రికార్డు అయిందన్నారు. 70 మంది నిందితుల్లో 2౦ మందిని నిర్దోషులని సీబీఐ పేర్కొన్నట్లు వివరించారు. 9 కంపెనీల్లో క్విడ్ ప్రో కోనే లేదని సీబీఐ చెప్పిందన్నారు. కోర్టు కల్పించిన స్వేచ్చను తాము కోల్పోమని, ఎట్టి పరిస్థితుల్లోనూ షరతులు ఉల్లంఘించమని సుశీల్ కుమార్ న్యాయస్థానానికి విన్నవించారు. తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించడానికే జగన్ ఇడుపులపాయకు వెళ్లనున్నారని తెలిపారు. ఇడుపులపాయ నుంచి తిరిగి హైదరాబాద్ వస్తారని ఆ తర్వాత 4వ తేదీన గుంటూరు వెళ్తారని చెప్పారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఇడుపులపాయకు వెళ్లేందుకు జగన్ కు అనుమతి ఇచ్చింది.
కోర్టు అనుమతితో సుదీర్ఘ కాలం తరువాత జగన్ ఇడుపులపాయ వెళ్లనున్నారు. తన తండ్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధివద్ద జగన్ నివాళులర్పించనున్నారు.
మీడియాను దిక్కరించిన రణబీర్ కపూర్ ...!

Subscribe to:
Posts (Atom)

















