హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కేంద్ర ప్రభుత్వం పైన వివిధ రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. ప్రత్యేక ప్యాకేజీ కోసం అవసరమైతే రోడ్డెక్కుతానని జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలె ప్రకటించారు. తాజాగా లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ కూడా ప్రధాని మోడీ ప్రభుత్వం పైన ప్రత్యక్ష పోరుకు సిద్ధమని ప్రకటించారు. ఆసక్తికర విషయమేమంటే.. ఇరువురు నేతలు కూడా సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాని మోడీకి అనుకూలంగా మాట్లాడటం, మద్దతివ్వడం చేసినవారే. సార్వత్రిక ఎన్నికల సమయంలో జేపీ నాడు మోడిని కలిశారు. ఆ సమయంలో మోడీ.. జేపీకి కితాబిచ్చారు. మీలాంటి నేతలు పార్లమెంటులో ఉండాలన్నారు. మల్కాజిగిరి నుండి పోటీ చేసిన జేపీకి మద్దతివ్వలేకపోయినందుకు పవన్ కళ్యాణ్ కూడా ఒకింత అసంతృప్తి చెందారనే చెప్పవచ్చు. నాడు ప్రధాని మోడీకి అనుకూలంగా ఉన్న జేపీ, పవన్ కళ్యాణ్ వంటి నేతలు ఇప్పుడు అదే బీజేపీ పైన ప్రత్యక్ష పోరుకు సన్నద్ధమని చెబుతున్నారు. విభజన నేపథ్యంలో ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చడం లేదని ఆరోపిస్తున్నారు.
Monday, 9 March 2015
మోడీపై బాబు గుర్రు: రోడ్డెక్కుతానని పవన్, జేపీ జత

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment