Monday, 9 March 2015

కూతురుతో కలిసి మంచు లక్ష్మి ఇలా...(ఫోటో)


హైదరాబాద్: నటి మంచు లక్ష్మి మహాశివరాత్రిని పురస్కరించుకుని తన కూతురు విద్యా నిర్వాణతో కలిసి శివ పూజ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోను తన అభిమానులతో షేర్ చేసుకుంది. అటు కెరీర్, ఇటు ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్న మంచు లక్ష్మి....సాంప్రదాయలపై కూడా నమ్మకం, గౌరవం ఎక్కువే. మంచు లక్ష్మి కూతురు పేరు 'విద్యా నిర్వాణ మంచు ఆనంద్'. సరోగసీ పద్దతి ద్వారా బిడ్డకు తల్లయింది. అంటే అద్దెగర్భం ద్వారా పిల్లలను కనడం అన్నమాట. మంచు లక్ష్మి, ఆమె భర్త ఆండీకి సహజ పద్దతిలో పిల్లలు పుట్ట లేదు. చాలా కాలం పిల్లల కోసం డాక్టర్ల చుట్టూ తిరిగారు. ఈ పరిణామ క్రమంలో చివరకు పిల్లలు వద్దనుకున్నారు. కానీ సరోగసీ ద్వారా పిల్లలు పుట్టే అవకాశం ఉండటంతో కుటుంబ సభ్యులతో చర్చించి ఆ పద్దతి ఫాలో అయ్యారు.

No comments:

Post a Comment