Wednesday, 11 March 2015

రామ్ గోపాల్ వర్మ చిన్నతనంలో ఇలా....(ఫోటో)


హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో ఎప్పుడూ ఏదో ఒక వివాదం రేపుతూ ట్వీట్లు చేస్తుంటారు. కానీ ఈ సారి మాత్రం తన చిన్ననాటి ఫోటో పోస్టు చేసాడు. తనకు ఊహ తెలియని వయసులో తన తాతయ్యతో కలిసి దిగిన ఫోటో ఇది.

నేను పవన్ కళ్యాణ్ ని ఏ కామెంటూ చేయలేదు


హైదరాబాద్ : నేను పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేయటమేంటి...ఆయనంటే నాకు గౌరవం... అసలు ఆయన ప్రసక్తే ఎక్కడా తేలేదు అంటూ మొత్తుకుంటోంది హన్సిక. ఆమె పవన్ కళ్యాణ్ ని కామెంట్ చేస్తూ ఇంటర్వూ ఇచ్చిందని తమిళ పత్రికల్లో వచ్చింది. దాంతో అది తెలుగు మీడియాలోనూ క్యారీ ఫార్వర్డ్ అయ్యింది. ఈ నేపధ్యంలో వాటిని ఖండించింది. ఇంతకీ ఆమె తమిళ పత్రికల్లో ఇంటర్వూ ఇచ్చిందని చెప్పబడుతున్న దాంట్లో ఏముందంటే... "సోషల్ సర్వీస్ చెయ్యాలంటే పవన్ కళ్యాణ్ లాగో మరొకరిలాగో రాజకీయాల్లోకి లోకి రావాల్సిన పనిలేదు " అందంటూ అక్కడ మీడియా రాసుకొచ్చింది. ఈ నేపధ్యంలో పవన్ అభిమానులు ఆమెపై మండిపడుతున్నారు. తెలుగు మీడియా సైతం అత్యుత్సాహంగా ఈ విషయమై వార్తలు రాసేసింది. ఈ నేపధ్యంలో ఆమె వివరణ ఇచ్చింది. "ఓ మైగాడ్.. కొంతమంది నేను పవన్ కళ్యాణ్ ని కామెంట్ చేసానని అంటున్నారు. ఈ విషయమై వివరణ ఇస్తున్నాను..నేను ఆయన్ని మెన్షన్ చేస్తూ ఎక్కడా ఇంటర్వూ ఇవ్వలేదు. అదంతా రూమర్స్..ఆ పత్రికల వాళ్లు వండి వార్చిన వార్తే. ఆయనంటే నాకు చాలా గౌరవం...ఆయన చేసే పనులకు నేను అభిమానిని. నేను మిగతా వాళ్లను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ రూమర్ ని ఇక్కడితే ఆపేయండి.. ", అంది హన్సిక.

హిందీ చిత్రంలో అల్లు అర్జున్...డిటేల్స్


హైదరాబాద్ : హీరోయిన్స్ ఇక్కడో అడుగు..అక్కడో అడుగు అన్నట్లుగా ఎప్పుడూ బాలీవుడ్ వైపు ఓ లుక్కేస్తున్న విషయం తెలిసిందే. అదే రూటులో ఇటీవల మన యువ హీరోలు హిందీ సినిమాలపై మక్కువ చూపుతున్నారు. రానా ఇప్పటికే అక్కడ ఓ స్థానాన్ని ఏర్పాటు చేసుకొన్నారు.'జంజీర్‌'తో రామ్‌చరణ్‌ హిందీలోకి అడుగుపెట్టారు. ప్రభాస్‌ ఆమధ్య 'యాక్షన్‌ జాక్సన్‌'లో తళుక్కున మెరిశారు. ఇప్పుడు అల్లు అర్జున్‌ వంతొచ్చింది. ఆయన ఇటీవల ఓ హిందీ చిత్రంలో నటించారని సమాచారం. వరుణ్‌ధావన్‌, శ్రద్ధాకపూర్‌ జంటగా 'ఏబీసీడీ2' చిత్రం తెరకెక్కుతోంది. రెమో డిసౌజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఓ కీలక పాత్రలో బన్నీ నటించినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్‌కు డ్యాన్స్‌ అంటే అభిమానం. అందుకే ఆయనకు 'ఏబీసీడీ2'లో నటించే అవకాశం లభించినట్టు సమాచారం. మరి బన్నీ పాత్ర తెరపై ఎంతసేపు కనిపిస్తుందన్నది తెలియాల్సి ఉంది. ఇందులో ప్రభుదేవా కూడా ఓ కీలక పాత్రను పోషించారు.


అల్లు అర్జున్ తాజా చిత్రం విషయానికి వస్తే... అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న చిత్రం ‘S/O సత్యమూర్తి' . ఈ చిత్రం అఫీషియల్ టైటిల్ లోగో ని ఇప్పటికే విడుదల చేసారు. ‘విలేవలే ఆస్తి' అనేది సబ్ టైటిల్. ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తోందీ ఈ చిత్రం . ఈ చిత్రంలో అల్లు అర్జున్ ..వెడ్డింగ్ ప్లానర్ గా కనిపిస్తారు. నిర్మాత ఎస్.రాధాకృష్ణ మాట్లాడుతూ... అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన జులాయి ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఇదే కాంబినేషన్లో సినిమా రూపొందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. తివిక్ర‌మ్ అత్తారింటికి దారేది చిత్రం త‌రువాత అల్లు అర్జున్ రేసుగుర్రం చిత్రం త‌రువాత చేస్తున్నందున‌ ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పెర్ ఫార్మెన్స్ ఈ సినిమాకు హైలైట్ కానుంది. ఫుల్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా నిర్మిస్తున్నాం. ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ పాత్రలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. అందాల భామలు సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్ర‌స్తుతం స్పెయిన్ లో పాట‌ల చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. ఈ షెడ్యూల్ తో ఒక్క పాట షూటింగ్ మిన‌హ షూటింగ్ మెత్తం పూర్త‌వుతుంది. మరి కొద్దిరోజుల్లో ఆడియో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం. అని కార్యక్రమాలు పూర్తి చేసి స‌మ్మ‌ర్ కానుక‌గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాము.. అని అన్నారు.

200 కోట్లు టార్గెట్: మహేష్ బాబు భారీ మల్టీ స్టారర్


హైదరాబాద్: ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘శ్రీమంతుడు'(వర్కింగ్ టైటిల్) చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఆయన ఓ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది మల్టీ లాంగ్వేజ్ మల్టీస్టారర్ మూవీ అని అంటున్నారు. మహేష్ బాబుతో పాటు కోలీవుడ్ స్టార్ ఆర్య, మాళయాల నటుడు మోహన్ లాల్ కాబినేషన్లో ఈ చిత్రం తెరకెక్కనుందని అంటున్నారు. టోటల్ సౌతిండియా ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ...ఈ చిత్రం ప్లాన్ చేస్తున్నారు. మగ్గురు మూడు సౌతిండియాన్ స్టేట్లలో పెద్ద స్టార్లు కావడంతో మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు చర్చల దశలోనే ఉంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ చిత్రం వసూళ్లు ర. 200 కోట్లు వసూలు చేస్తుందనే అంచనాలతో ప్రాజెక్టును రూపకల్పన చేస్తున్నారు. తమిళంలో మహష్ బాబు మార్కెట్ రూ. 50 కోట్ల పైనే, ఆర్య, మహేష్ బాబు, మోహన్ లాల్ లాంటి స్టార్స్ ఉండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్నాటక, తమిళ నాడు రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రం వసూళ్లు రూ. 200 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని అంటున్నారు.

రవితేజ తన కొడుకుతో కలిసి సెల్ఫీ(ఫొటో)


హైదరాబాద్ :హీరో రవితేజ తన కుటుంబానికి తగిన సమయం కేటాయించి చాలా హ్యాపీగా గడుపుతూంటారు. ఆయన తన కొడుకు మాధవన్ తో కలిసి సర్ఫైజింగ్ గా ఈ ఫొటోని అఫీషియల్ గా తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో షేర్ చేసారు. రవితేజ..చాలా కాలం క్రితం కళ్యాణి ని వివాహం చేసుకున్నారు. ఆయనకు కుమార్తె మోక్షద, కుమారుడు మాధవన్ భూపతి రాజు ఉన్నారు. పాప..తొమ్మిదవ తరగతి చదువుతోంది. కుమారుడు ఐదవ తరగతి చదువుకుంటున్నారు. వీళ్లిద్దరూ రవితేజకు చాలా క్లోజ్ గా ఉంటారు. ఇక్కడ రవితేజ తన కొడుకుతో దిగిన ఫొటో చూడవచ్చు.

ఎన్నారైతో జగపతి బాబు కుమార్తె వివాహం (ఫోటోస్)


హైదరాబాద్: ప్రముఖ తెలుగు నటుడు జగపతి బాబు పెద్ద కుమార్తె మేఘన అమెరికాకు చెందిన ఎన్నారైని ఆదివారం పెళ్లాడుతోంది. హైదరాబాద్ లోని వెస్టిన్ హోటల్ ఇందుకు వేదిక అయింది. అమెరికాలో ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు చేసిన మేఘన అక్కడే ఓ ఎన్నారైతో ప్రేమలో పడింది. తండ్రి జగపతి బాబుతో పాటు ఇతర కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అంగరంగ వైభవంగా ఈ రోజు వివాహం జరుగుతోంది. ఆదివారం రాత్రి జరిగే ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాల నుండి ప్రముఖులు హాజరుకానున్నారు. పూర్తి ప్రైవేట్ కార్యక్రమంగా ఈ వేడుక ప్లాన్ చేసారు. వివాహం అయిన తర్వాత మీడియాకు ఫోటోలు విడదల చేయనున్నారు.