Saturday, 31 May 2014

ఏపి కొత్త రాజధాని విజయవాడ-గుంటూరు మధ్యే?


ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయవాడ-గుంటూరుకు సమీపంలోని నాగార్జున యూనివర్సిటీ నుంచే తన అధికారిక కార్యకలాపాలను కొనసాగించే అవకాశం ఉంది. రాజధాని ఏర్పాటు పనులను ఇక్కడ్నుంచే పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలుగా విజయవాడ-గుంటూరులను అభివృద్ధి చేస్తామని ఇటీవల కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా చెప్పడం గమనార్హం. అయితే ఒంగోలు-ఏలూరు మధ్యలో కూడా కొత్త రాజధాని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే ఈ ప్రాంతాన్నే రాజధానిగా ఏర్పాటు చేసే అవకాశం ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినందున తమ పార్టీ నేతల కోరిక మేరకు విజయవాడ-గుంటూరు జిల్లాల మధ్యనే కొత్త రాజధానిని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. ఈ ప్రాంతంలో అన్ని రకాలుగా అనువుగా ఉండటంతో రాజధానిని ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నట్లు సమాచారం.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధానిపై కసరత్తులు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధానిని విజయవాడ-గుంటూరు నగరాల మధ్య ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సంకేతాలిచ్చినట్లు ప్రచారం సాగుతోంది. రెండు రోజుల క్రితం కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో గుంటూరు-విజయవాడల మధ్యనే కొత్త రాజధానిని నిర్మించాలని వారు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది. చంద్రబాబు నాయుడుకు కూడా ఇక్కడే రాజధానిని ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనే చంద్రబాబు నాయుడు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజధానిని ముందే ప్రకటిస్తే పలువురు వ్యాపారవేత్తలు, సంపన్నులు ఆ ప్రదేశంలోని భూములను భారీగా కొనుగోలు చేస్తారని, అది ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

NEWS UPDATES: దర్శకుడు రాజమౌళి తండ్రి అరెస్టుకు రంగం సిద్దం!

NEWS UPDATES: దర్శకుడు రాజమౌళి తండ్రి అరెస్టుకు రంగం సిద్దం!: హైదరాబాద్: టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌‌కు కోర్టు తిప్పలు తప్పడం లేదు. తాజాగా ఆయనకు యలమంచిలి కోర్టు నాన్ బెయ...

దర్శకుడు రాజమౌళి తండ్రి అరెస్టుకు రంగం సిద్దం!


హైదరాబాద్: టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌‌కు కోర్టు తిప్పలు తప్పడం లేదు. తాజాగా ఆయనకు యలమంచిలి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తునప్నాయి. ‘నరసింహుడు' కథ ఇస్తానని చెప్పి నిర్మాత చెంగల వెంకట్రావ్‌ వద్ద భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నారు. సమయానికి కథ అందించక పోవడంతో పారితోషికాన్ని తిరిగి ఇవ్వాలని కోరారు. అయితే బకాయి పడ్డ డబ్బు చెల్లింపు కోసం ఇచ్చిన చెక్‌ బౌన్స్ కావడంతో యలమంచిలి కోర్టులో నిర్మాత వెంకట్రావ్‌ కేసు దాఖలు చేశారు. దీంతో విజయేంద్ర ప్రసాద్‌కు యలమంచిలి కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.

Saturday, 24 May 2014

online jobs (6912 )


Data entry jobs in world is one of the reliable online data entry jobs providing company. Get guaranteed work and income on each assignment you complete. For more detail visit: http://www.eaworker.com Referral ID (6912)

Friday, 14 March 2014

పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం ఆనందాన్ని ఇచ్చింది ..అభిమానులు


హైదరాబాద్, మార్చి 14: పవన్ కళ్యాణ్ పార్టీ కాసేపట్లో ప్రకటిస్తున్న సందర్భంగా ఆయన అభిమానుల మనోగతాన్ని తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ అభిమానులు రాష్టవ్యాప్తంగా ఈ విధంగా స్పందించారు. వారి స్పందన ఇలా ఉంది క్లుప్తంగా ...పవన్ కళ్యాణ్ అంటే మాకు అభిమానమే కాదు ఆయనంటే నమ్మకం కూడా ఆయన సినిమాల్లో ఎలా విజయం సాధించాడో రాజకీయాల్లో కూడా రానిస్తాడు. పవన్ కళ్యాణ్ గారికి అన్నయ్య అంటే ఎంతో అభిమానం. అయితే ఎవరి ఆలోచన వారిది. పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తిత్వం ఉన్నా వ్యక్తే కాదు కార్యదీక్షా పరుడు. ఆయన తాను ఏదైతే నమ్ముతాడో దాన్నే ఆచరిస్తారు కూడా పవన్ కళ్యాణ్ పార్టీ ని మేము ముందుకు నడిపిస్తాము. ఆయన తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తను ఒక్కడే ఒన్ మ్యాన్ ఆర్మీ లాగా ముందుకు తీసుకు వెళతాడు. పవన్ కళ్యాణ్ లాంటివాడు మన దేశంలో ఎవరూ లేరు.అంటూ తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.

నా పార్టీ పేరు జనసేన: పవన్ కళ్యాణ్


హైదరాబాద్: గొప్పగా బతకాలని తానెన్నడూ ప్రయత్నం చేయలేదని, సామాన్యుడిలా బతకాలనుకున్నానని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. తాను రాజకీయాల నుంచి మాట్లాడతానగానే తనను ఇష్టం వచ్చినట్టు తిట్టారని అందుకే పార్టీ పెట్టానని వెల్లడించారు. తన పార్టీ పేరు 'జనసేన' అని ప్రకటించారు. తన పార్టీ విధివిధానాలు తర్వాత వెల్లడిస్తానని చెప్పారు. తాను పార్టీ పెడుతున్నట్టు తన కుటుంబ సభ్యుల్లో ఎవరికీ తెలియదన్నారు. పదవుల పట్ల తనకు వ్యామోహం లేదన్నారు. అన్నయ్య చిరంజీవిపై కోపం ఉండదన్నారు. తండ్రి తర్వాత తండ్రి లాంటి అన్నయ్యకు ఎదురెళ్లను అన్నారు. ఢిల్లీ వాళ్ల కాళ్లు పట్టుకునే బానిసను కాదన్నారు. పదవులపై తనకు మోజు లేదన్నారు. పదవులు నాకు చాలా తుచ్ఛమైనవి అన్నారు.

Wednesday, 19 February 2014

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన?


హైదరాబాద్ : రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనివార్యంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో రాష్ట్రపతి పాలనపై కేంద్రం గుంభనంగా వ్యవహరిస్తోంది. మరో రెండు నెలల్లో ఎన్నికలు రానున్న రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రిగా నియమించే సాహసం కాంగ్రెస్‌ చేస్తుందనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం రాష్ట్రపతి పాలనే. మరీ గవర్నర్‌ ఎలాంటి సిఫార్సు చేస్తారో చూడాలి. రాజకీయంగా ఎన్నో ఒడిదొడుకుల్ని చూసిన ఆంధ్రప్రదేశ్‌లో చివరిసారి 1973 జనవరి 11న రాష్ట్రపతి పాలన విధించారు. నాడు విధించిన పాలన డిసెంబర్‌ 10, 1973 వరకు కొనసాగింది. ఆ తర్వాత బహుశా మళ్లీ ఇప్పుడు ఆ పరిస్థితి తలెత్తింది. నాడు పీపీ నరసింహరావు ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించారు. మరో వైపు రాష్ట్రపతి పాలన అనివార్యమైతే రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ను మార్చే అవకాశం ఉంది. అదే జరిగితే రాష్ట్ర గవర్నర్‌గా హన్స్‌రాజ్‌ భరద్వాజ్‌ లేదా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను నియమించే అవకాశం ఉంది.

Tuesday, 18 February 2014

అందుకే పవన్‌కల్యాణ్, నేను మంచి ఫ్రెండ్స్ అయ్యాం!


ఇందపరంద ఇంద చాట... కాట్రవల్లీ... లచ్చిమీ లచ్చిమీ... బాగున్నారా బాగున్నారా... అంటూ తెరపై అలీ చేసే చిన్నెలు ఒకటా రెండా! నవ్వించడం కోసమే దేవుడు పుట్టించాడా? అన్నట్టుగా ఉంటుంది అలీ ఫేస్‌కట్. ఊహ తెలిసినప్పట్నుంచీ ఆయన నవ్విస్తూనే ఉన్నారు. సంతోషానికి సూచిక నవ్వు. చిన్నప్పట్నుంచీ ఆ నవ్వుతోనే తన సావాసం. ఇంతకంటే అదృష్టం ఏం కావాలి. 34 ఏళ్ల సుదీర్ఘ నట ప్రస్థానం.. వెయ్యికి పైగా సినిమాలు.. అందులో యాభై హీరోగా. బహుశా ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న కమెడియన్ ఎవరూ లేరేమో! నటన అలీలోని ఓ కోణం. తండ్రి పేరు మీద స్వచ్చందంగా సేవాకార్యక్రమాలు నిర్వహించడం అలీలోని రెండో కోణం. ఈ నెల 21న ఆయన కథానాయకునిగా నటించిన ‘అలీబాబా ఒక్కడే దొంగ’ సినిమా విడుదల కానుంది. ఈ సందర్బంగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో విలేకరులతో ముచ్చటించారు అలీ.

ఇదే ప్రదేశంలో...

1994లో ఇప్పుడు మనం కూర్చున్న ప్రదేశంలోనే (అన్నపూర్ణ స్టూడియో) ‘యమలీల’ ఓపెనింగ్ జరిగింది. ఆ ముహూర్తం వేళా విశేషమో ఏమో... యాభై సినిమాల్లో హీరోగా చేశాను. మళ్లీ అదే ప్రదేశంలో నా 50వ సినిమా ‘అలీబాబా ఒక్కడే దొంగ’ చిత్రీకరణ పూర్తయింది. సెంటిమెంట్ ప్రకారం తప్పకుండా ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని నా నమ్మకం.



ఆ క్వాలిటీనే పవన్‌కి నచ్చి ఉంటుంది...

 చిరంజీవిగారి ‘ముగ్గురుమొనగాళ్లు సినిమా సమయంలో నాకు పవన్‌కల్యాణ్ పరిచయమయ్యారు. అప్పుడు నేను మద్రాస్‌లో ఉండేవాణ్ణి. ఆయన తొలి, మలి సినిమాలు ‘అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి’, ‘గోకులంలో సీత’ల్లో నేను లేను. ‘సుస్వాగతం’ మేం కలిసి నటించిన తొలి సినిమా. ‘తొలిప్రేమ’లో మా ఇద్దరిపై సన్నివేశాలెక్కువ. అలా మా స్నేహం బలపడింది. ఇక అప్పట్నుంచి పవన్ చేసిన ప్రతి సినిమాలో నేనున్నా. మా ఇద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుందని చాలామంది అంటుంటారు. బంధాలకు, అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే మనిషి పవన్‌కల్యాణ్. అమ్మ, నాన్న. అన్న... ఇలా ప్రతి బంధాన్నీ ప్రేమిస్తాడు. దాదాపు నేనూ అంతే. నా కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తా. నాలోని ఆ క్వాలిటీనే పవన్‌కి నచ్చి ఉంటుంది. అందుకే మేమిద్దరం మిత్రులమయ్యాం.