Friday, 11 October 2013

త్వరలో అనుష్కకు పెళ్లట...!?


అనుకున్న ది తడవుగా ప్రేమ కలగ దు.. కోరుకున్న వెంటనే పెళ్లి జరగదు. దేనికైనా సమయం రావాలి. ఆ శుభ ఘడియలు నటి అనుష్కకు వచ్చినట్టు తెలుస్తోం ది. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ పెళ్లి పీటలెక్కడానికి సిద్ధం అవుతున్నట్లు పరిశ్రమ వర్గాల టాక్. తొలుత టాలీవుడ్, ఆ తర్వాత కోలీవుడ్‌కు పరిచయమైన నటి అనుష్క తొలి రోజుల్లో స్కిన్ షోకు ప్రాధాన్యం ఇచ్చింది. ఆ తర్వాత అరుంధతి లాంటి చిత్రాల్లో అద్భుతమైన అభినయం చాటి నటిగా తానేమిటో నిరూపించుకుంది. ఆపై అభినయం, గ్లామర్ ఈ రెండు అంశాలను బ్యాలెన్స్ చేసుకుంటూ నటిగా ఎదిగింది. ప్రముఖ హీరోయిన్లలో తన స్థానం పదిలపరుచుకుంటోంది.

తమిళంలో ఇరండామ్ ఉలగం, తెలుగులో రుద్రమదేవి, బాహుబలి వంటి చారి త్రక కథా చిత్రాల్లో నటిస్తోంది. ఈ బ్యూటీ నూతన చిత్రాలు అంగీకరించడం లేదట. కారణం కల్యాణ ఘడియలు దగ్గర పడడమేనట. అనుష్కకు 31 ఏళ్లు. దీంతో ఆమెకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే ఈ బ్యూటీ పై పలు వదంతులు ప్రచారంలో ఉన్నాయి. టాలీవుడ్ నటుడు నాగార్జునతో సన్నిహితంగా ఉంటోందని, ఆర్యతో చెట్టాపట్టాలంటూ ప్రచారం అవుతున్నాయి. వీటికి పుల్‌స్టాప్ పెట్టేలా కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారట. ఈ కారణంగానే అనుష్క కమల్ సరసన ఉత్తమ విలన్ చిత్రంలో నటించే అవకాశాన్ని అంగీకరించలేదని సమాచారం.

బాహుబలుడి కొత్త ఫోటో లీక్!


సీమాంధ్రకు భారీగా ప్యాకేజ్ దిశగా కేంద్రం!!


హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో ఉద్యమాలతో రగిలిపోతుంది. అయినా నిన్నటి వరకు పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు సీమాంధ్రను బుజ్జగించేపనిలో పడిందని చెబుతున్నారు. ఈ మేరకు జాతీయా మీడియాకు చెందిన వెబ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే యోచనలో కేంద్రం ఉన్నట్లు పీటీఐ ఓ వార్తా కథనాన్ని విడుదల చేసింది.

 ఆత్య అధునాతన సదుపాయాలతో సీమాంధ్రలో కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్రం ఆర్థికసాయం చేయనుంది. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఎక్కువ మొత్తంలో ఆర్థిక సాయం చేయాలనే తలంపుతో మంత్రి వర్గ బృందం ఉందని చెబుతున్నారు. ఇక మరోపక్క తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను త్వరగా పూర్తి చేసే పనిలో కేంద్రం ఉందట. అంతేకాదు హైదరాబాద్ విషయంలో కేబినెట్ నోట్‌లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే యోచన కేంద్రం మదిలో లేదని, ఒక వేళ హైదరాబాద్‌ను యూటీ చేస్తే తెలంగాణలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కేంద్రం భావిస్తుందని చెప్పారు. ఇక కేంద్ర మంత్రి వర్గ బృందం రాష్ట్రంలో పర్యటించనుందని చెబుతున్న వార్తలను కొట్టిపారేస్తూ ఆ అవకాశం లేదని తేల్చిచెప్పింది.

అశృనయనాల మధ్య శ్రీహరి అంత్యక్రియలు(ఫోటోలు)



శ్రీహరి మరణంతో ఆగిపోయిన....మహేష్ బాబు ‘ఆగడు’


మహేష్‌బాబు, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మించనున్న చిత్రం ‘ఆగడు'. ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్ 11న ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే శ్రీహరి మరణంతో ఇండస్ట్రీ విషాదంలో ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని దర్శకుడు శ్రీను వైట్ల వాయిదా వేసారు. మళ్లీ సినిమా ప్రారంభోత్సవం ఎప్పుడు అనేది త్వరలో ప్రకటించనున్నారు. శ్రీను వైట్ల ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పూర్తి చేసారు. ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి.

‘ఆగడు' సినిమాను రూ. 40 కోట్ల బడ్జెట్ మించకుండా పూర్తి చేయాలని, అప్పుడే నిర్మాతలకు, బయ్యర్లకు మంచి జరుగుతుందని మహేష్ బాబు శ్రీను వైట్లు సూచించినట్లు తెలుస్తోంది. తన సినిమా నష్టాల పాలైతే తనకే చెడ్డపేరు కాబట్టి మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మహేష్ బాబు ఆలోచన పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ప్రారంభం రోజే ఈ సినిమాకు సంబంధించిన కథనాయికలు, మిగిలిన సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలుస్తాయి. ఇప్పటికే సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో రెండు పాటలు ఓకే అయ్యాయి. సంగీత దర్శకునిగా తమన్‌కిది 50వ సినిమా. ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న 1(నేనొక్కడినే) సినిమాతో పాటు ‘ఆగడు' సినిమా కూడా 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ యే నిర్మిస్తుంది. ఈ సినిమాల నిర్మాతలైన రామ్ ఆచంట, గోపి ఆచంటమరియు అనీల్ సుంకర మహేష్ కు సన్నిహితులు. 1(నేనొక్కడినే) సినిమా 2014 సంక్రాంతికి విడుదలకానుంది

డిసెంబర్‌లో కిరణ్ పార్టీ: వెంట ఎవరెవరు?


రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డి డిసెంబర్ నెలలో పార్టీ పెట్టే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం, కాంగ్రెసు అధిష్టానం ముందుకు పోతే కొత్త పార్టీ పెట్టాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకు ఆయన డిసెంబర్ వరకు వేచి చూడాలని అనుకుంటున్నారు. పార్లమెంటు శీతాకాలం సమావేశాల్లో తెలంగాణ బిల్లును కేంద్రం ప్రతిపాదించే అవకాశం ఉంది. ఆ బిల్లు ఆమోదం పొంది, రెండు రాష్ట్రాలు ఏర్పడితే కచ్చితంగా పార్టీ పెట్టాలనే యోచనలో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర విభజన ఈ ఎన్నికల్లోగా జరదని ఆయన గట్టిగా నమ్ముతున్నట్లు కనిపిస్తున్నారు. ఇంత త్వరగా ప్రక్రియ పూర్తి కాదని, వీలైతే అడ్డంకులు కల్పించాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ తీర్మానాన్ని శానససభలో ఓడించి, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రతిస్పందనను చూసిన తర్వాత పార్టీ పెట్టే విషయంపై ఆలోచన చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.


 రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర కాంగ్రెసు శాసనసభ్యులు, మంత్రులు తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల్లోకి వలసలు వెళ్లకుండా కిరణ్ కుమార్ రెడ్డి వర్గీయులు ఆపుతున్నట్లు చెబుతున్నారు. పార్టీ పెట్టే ఆలోచనతోనే వారు ఈ పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. తాను కొత్త పార్టీ పెడితే ఎపిఎన్జీవోల మద్దతు తమకు సంపూర్ణంగా లభిస్తుందని కిరణ్ కుమార్ రెడ్డి అనుకుంటున్నారు. ఎపిఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబుతో కిరణ్ కుమార్ రెడ్డికి ఈ మేరకు అవగాహన ఉన్నట్లు కూడా ప్రచారం సాగుతోంది. ఎపిఎన్జీవోలు సమ్మెను విరమించినా సమైక్యాంధ్ర ఉద్యమ సెగ చల్లారకుండా చూడాలనే వ్యూహంతో కిరణ్ రెడ్డి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడిస్తే కచ్చితంగా విభజన ప్రక్రియ ఆగిపోతుందని, తీర్మానాన్ని ఓడించి రాష్ట్రపతిని కలిసి విభజనను అడ్డుకోవాలని కిరణ్ కుమార్ రెడ్డి అనుకుంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి సీమాంధ్రకు చెందిన మంత్రులు శైలజానాథ్ (అనంతపురం), ఏరాసు ప్రతాప రెడ్డి, టిజి వెంకటేష్ (కర్నూలు), కె. పార్థసారథి (కృష్ణా), పితాని సత్యనారాయణ (పశ్చిమ గోదావరి), గంటా శ్రీనివాసరావు (విశాఖ), కాసు వెంకట కృష్ణా రెడ్డి (గుంటూరు), తోట నర్సింహం (తూర్పు గోదావరి) కిరణ్ కుమార్ రెడ్డి వెంట ఉంటారని వార్తలు వచ్చాయి. సీనియర్ శాసనసభ్యుల్లో జెసి దివాకర్ రెడ్డి (అనంతపురం), గాదె వెంకటరెడ్డి (గుంటూరు), రాయపాటి సాంబశివ రావు (గుంటూరు), ధర్మాన ప్రసాదరావు (శ్రీకాకుళం) కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతు ఇస్తారని చెబుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉండడం వల్లనే కొంత మంది వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి వెళ్లే విషయంలో జాప్యం చేస్తున్నట్లు చెబుతున్నారు. దాదాపు 40 మంది శాసనసభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి వెంట ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కాంగ్రెసుకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఎన్నికల తర్వాత విభజనకు కారణమైన కాంగ్రెసు వెంట వెళ్తారని ప్రచారం చేయడం ద్వారా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లేఖ ఇవ్వడం వల్లనే రాష్ట్ర విభజన జరిగిందని చెప్పడం ద్వారా సమైక్యాంధ్ర కోసం నిలబడిన నేతగా కొత్త పార్టీతో ముందుకు వస్తే తనను సీమాంధ్ర ప్రజలు ఆదరిస్తారని కిరణ్ కుమార్ రెడ్డి నమ్మకంతో ఉన్నట్లు చెబుతున్నారు.

Akshay Kumar at Charminar


ఎన్టీఆర్ ను ఏడిపించిన ‘రామయ్యా వస్తావయ్యా’



యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను శుక్రవారం తెరపైకి వచ్చిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా ఏడిపించిందంటున్నారు ఆయన సన్నిహితులు. ఈ సినిమాపై అభిమానులే కాదు ఎన్టీఆర్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. తీరా దాని పలితం అలా రాకపోయే సరికి ఎన్టీఆర్ పని ఏడ్చినంతపనయింది అంటున్నారు సినీ విశ్లేషకులు కూడా.

 దీనికి కారణాలు అనేకం ఉన్నాయి, ఎన్టీఆర్ పవర్ ను వరుసగా అభాసుపాలు చేస్తున్నాయి ఆయన సినిమాలు. రాంచరన్ మగధీరను బీట్ చేద్దామని శక్తి తో తెరపైకి వస్తే మెహర్ రమేష్ దానిని తుస్సు మనిపించాడు. ఆ తరవాత దమ్ము సినిమాను కూడా బోయపాటి బోర్ కొట్టించాడు. మహేష్ బాబు సినిమా దూకుడు కు కళ్లెం వేయాలని శ్రీనువైట్లతో బాద్ షా తీస్తే అది దాని దరిదాపులను కూడా చేరుకోలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ రికార్డును ఆపేద్దామని వస్తే అది కూడా బోల్తాపడింది. గబ్బర్ సింగ్ ను అందించిన హరీష్ శంకర్ తో సినిమా కాబట్టి ఎన్టీఆర్ కూడా ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. పైగా దీని విడుదలపై జరిగిన రాద్దాంతంతో అభిమానులు కూడా ఎంతో ఆతృత కనపరచారు. కాని అదంతా కల్లలయ్యేసరికి పాపం ఎన్టీఆర్ కంట కన్నీరు ఆగలేదంటున్నారు.