Friday, 4 October 2013

నితిన్ ఏం చేస్తున్నాడంటే ?



నితిన్ ప‌ట్టరాని ఆనందంలో ఉన్నాడు. అత్తారింటికిదారేది మూవీ క‌లెక్షన్స్ నైజాంలో విజృంభిస్తుంటే, త‌ను పెట్టిన మ‌నీ కంటే కంటే లాభాల్లో మూవీ ప‌రుగులు పెడుతుంది. దీని కార‌ణంగా నితిన్‌కు పెద్ద టెన్షన్ త‌ప్పింద‌ని టాలీవుడ్ చెబుతుంది. ఎట్‌ప్రెజెండ్ నితిన్ స్పెయిన్ షెడ్యూల్‌లో ఉన్నాడు. మొత్తం 55 రోజుల లాంగ్ షెడ్యూల్ ఇక్కడ జ‌రుగుతుంది. హార్ట్ ఎటాక్ మూవీను పూరీజ‌గ‌న్నాధ్ ప్రత్యేక శ్రధ్ధతో తెర‌కెక్కిస్తున్నాడు. పెద్ద హీరోల‌తో స‌క్సెస్ కొడితే ఆ క్రెడిట్ హీరోకు ద‌క్కుతుందో, ద‌ర్శకుడికి ద‌క్కుతుందో అర్ధంకాదు. ఈ మ‌ధ్య కాలంలో పూరీ జ‌గ‌న్నాధ్ మూవీలు అన్ని యావ‌రేజ్‌గా బాక్సాపీస్ వ‌ద్ద బండి లాగేస్తున్నాయి.

 అందుకే నితిన్‌తో బ్లాక్ బ‌స్టర్ కొట్టి ఆ స‌క్సెస్‌ను త‌న ఖాతాలో వేసుకోవాల‌ని రెడీ అవుతున్నాడు. ఈ సినిమా ద్వారా ఆద శర్మ హీరోయిన్ గా టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకు పరిచయం కానుంది. నితిన్ గ‌త చిత్రాల కంటే ఈ మూవీలో మ‌రింత స్టైలిష్‌గా క‌నిపించ‌నున్నాడు. అందుకోసం డిజైన‌ర్ నీర‌జ కోన ప్రత్యేక శ్రధ్ధ తీసుకుంటుంది. మొత్తానికి నితిన్, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌పై పెట్టిన పెట్టుబ‌డి లాభాల‌ను తెచ్చిపెడుతుంటే నితిన్ ఏ టెన్షన్ లేకుండా హార్ట్ఎటాక్ మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.

ఇంకా.. ఆడ్డుకొంటామంటున్న వాళ్లు జోకర్లే..!


" 2014 వరకు తెలంగాణ రాష్ట్రం రాదన్న వ్యాఖ్యలకు నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. విభజన నిర్ణయం అమలు కాకుండా ఉండేందుకు ఏం చేయాలి ? ఎలా ముందుకు వెళ్లాలి ? అన్న విషయంలో నా వద్ద చాలా ప్రణాళికలు ఉన్నాయి. ఇక ఇప్పుడు వీటిని అమలు చేస్తా. పార్టీలో ఉంటే వీటిని అమలు చేయడానికి ఇబ్బందులు ఎదురవుతాయన్న ఆలోచనతోనే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశాను...'' అని అన్నాడు రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.

కేవలం అరుణ్ కుమార్ మాత్రమే కాదు.. చాలా మంది కాంగ్రెస్ నేతలు ఇదే మాట మాట్లాడుతున్నారు. వీళ్లు రాష్ట్ర విభజన జరుగుతుందని ఇప్పటికీ ఒప్పుకోవడం లేదు. తెలంగాణ నోట్ ను క్యాబినెట్ ఆమోదించినంత మాత్రాన తెలంగాణ రాష్ట్ర ఏర్పడదు.. రాష్ట్రం విడిపోదు. దానికి ముందు ముందు చాలా జరగాల్సి ఉంది... అంటున్నారు వీళ్లు. అయితే వీళ్లను జోకర్లుగా అభివర్ణిస్తున్నారు సీమాంధ్ర ప్రజలు. విభజన విషయంలో వీరు సీమాంధ్ర ద్రోహులుగా నిలిచిన వీళ్లు ఇప్పుడు కూడా ప్రజలను మోసం చేస్తున్నారు అని సమైక్యవాదులు మండిపడుతున్నారు. ఓవరాల్ గా సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహజ్వాలలు ఎగసిపడుతున్నాయి.

సమైఖ్య ఉద్యమం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యంగ్ హీరో ..!!


సామాన్యంగా మన యంగ్ హీరోలు ఆడియో వేడుకల స్టేజీల పైనా టివి షోలలోను హడావిడి చేస్తూ కనిపిస్తూ ఉంటారు. రాజకీయాల పై, రాజకీయ ఉద్యమాల పై సామాన్యంగా ఆమడ దూరంలో ఉంటారు. దీనికి విరుద్ధంగా నిన్నటి కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్ తరువాత ప్రస్తుతం మండిపోతున్న సమైఖ్యాంధ్ర ఉద్యమం పై హీరో నవదీప్ విచిత్రంగా స్పందించాడు.

అతని ట్విటర్ లో పెట్టిన అతడి మాటలు చూద్దాం ‘నేడే చూడండి మీ అభిమాన టివీ ఛానల్లో ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ హైడ్రామా మీరెప్పుడు గతంలో చూడనిది విననిది ఆలసించిన ఆశాభంగం’ అంటూ ఒక టివి ఎడ్వటైజ్ మెంట్ లా హీరో నవదీప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఈనాటి రాజకీయ ఉద్యమ నేపధ్యంలో అందర్నీ ఆకర్షించింది. పెద్దపెద్ద రాజకీయ నేపధ్యంగల కుటుంబాలనుంచి వచ్చిన యంగ్ హీరోలు నోరు మెదపకుండా రోజులు గడిపేస్తూ ఉంటే ఒక చిన్న హీరో ధైర్యంగా ఈనాటి రాజకీయనాయకులు ఆడుతన్న హైడ్రామాను విమర్శిస్తూ తన అభిప్రాయాన్ని తన ట్విటర్ లో పెట్టడం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది....

రూటు మార్చిన స‌ల్మాన్‌


స‌ల్మాన్‌ఖాన్ అంటేనే మాస్ హీరో. ఎట్‌ప్రెజెంట్ స‌ల్మాన్‌ బాలీవుడ్ మాస్ మూవీల‌కు లీడ‌ర్‌గా మారాడు. స‌ల్మాన్ ష‌ర్ట్ మ‌డ‌త‌పెట్టినా, వంద మంది విల‌న్లను చొక్కా కాల‌ర్‌తో దుమ్ముదులిపినా బాలీవుడ్ జ‌నాలు క్లాప్స్ కొట్టేస్తారు. బాలీవుడ్‌లో స‌ల్మాన్‌కు అంత‌టి మాస్ స్టార్‌డం క్రియోట్ అయింది. ఒక‌ప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఎక్కువ‌గా క‌నిపించే ఈ మాస్ ఫార్ములా, ఇప్పుడు బాలీవుడ్‌లో ఓ ట్రెండ్ అయింది. దీన్ని బాలీవుడ్‌కి ప‌రిచయం చేసిన హీరో స‌ల్మాన్‌ఖానే. ‘వాంటెడ్’, ‘రెడీ’, ‘దబాంగ్’, ‘బాడీగార్డ్’, ‘దబాంగ్ 2′, ‘ఏక్ థా టైగర్’ లాంటి మాస్ ఫిల్మ్స్‌తో మిగ‌తా హీరోల‌కు రోల్‌మోడ‌ల్ అయ్యాడు.

 ప్రస్తుతం స‌ల్మాన్‌కి ఆ మాస్ మూవీలంటే బోర్ కొడుతుంద‌ట‌. ‘ ఇప్పుడు మాస్ మసాలా సినిమాలు ఎడాపెడా వచ్చేస్తున్నాయి. ఒకే రకమైన విషయాలతో పదే పదే సినిమాలు తీసేస్తున్నారు. దీనివల్ల సృజనాత్మకత తగ్గిపోతుంది అలాగే జనాలకు విసుగొస్తుంది. ఇలాంటి మాస్ మసాల సినిమాకు త్వరలోనే కాలం చెల్లిపోతుందని’ స‌ల్లూభాయ్ ఓ ప్రెస్‌మీట్‌లో చెప్పాడు. స‌ల్మాన్ చెప్పిన స్టేట్‌మెంట్ కార‌ణంగా త‌రువాత రాబోతున్న మాస్ మూవీల క‌లెక్షన్స్‌పై, ఈ ఎఫెక్ట్ ఉంటుంద‌ని బిటౌన్ బాక్సాపీస్ అంటుంది. దీంతో స‌ల్మాన్ త్వర‌లోనే మాస్ చిత్రాల‌కు గుడ్ చెప్సేస్తున్నాడ‌ని అంద‌రూ అంటున్నారు.

చిరంజీవికి ప్రధాని ఫోన్


న్యూఢిల్లీ: కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవికి ప్రధాని మన్మోహన్ సింగ్ ఫోన్ చేశారు. మంత్రి పదవికి చేసిన రాజీనామా ఉపసంహరించుకోవాలని చిరంజీవిని ప్రధాని కోరారు. రాజీనామాపై పునరాలోచన చేయాలని కోరారు. అయితే ప్రధాని విజ్ఞప్తిని చిరంజీవి సున్నితంతా తిరస్కరించినట్టు సమాచారం.

రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం బాధించిందని చిరంజీవి అన్నట్టు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో కేంద్ర మానవరుల శాఖ మంత్రి పళ్లంరాజు సమావేశమయ్యారు. సీమాంధ్రలో పరిస్థితులను సోనియాకు ఆయన వివరించారు. ఈ ఉదయం ప్రధాని మన్మోహన్ సింగ్ తో పళ్లంరాజు భేటీ అయ్యారు.

'సీఎం పదవిపై మంత్రి ఆనం కన్ను'


నెల్లూరు: ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ ఏకపక్షంగా, నియంతలా వ్యవహరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ నోట్ ను కేంద్ర కేబినెట్ హడావుడిగా ఆమోదించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్ర ఎంపీలు రాజీనామాలు చేసుంటే రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో వెనక్కి తగ్గేదని ఆయన అన్నారు.

 సీఎం పదవిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కన్నేశారని ఆనం జయకుమార్‌రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవి కోసం గడ్డి తింటున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీని, ఆనం సోదరులను ప్రజలు క్షమించరని అన్నారు.

విభజనకు నిరసనగా రేపటి నుంచి జగన్ ఆమరణ దీక్ష


హైదరాబాద్ : కనివినీ ఎరగని రీతిలో రాష్ట్ర విభజన జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం లోటస్ పాండ్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మీ చావు మీరు చావండి అన్న రీతిలో కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరించిందన్నారు. కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట శనివారం నుంచి ఆమరణ దీక్షకు దిగనున్నట్లు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.

Nellore Boy Sucide Post In Facebook..