Friday, 27 September 2013
రికార్డులు బద్దలు చేస్తున్న ‘అత్తారింటికి దారేది
పరిస్తితులు బాగాలేవు, నిండా మునగక తప్పదు అని ఎంతో భయపడ్డ ‘అత్తారింటికి దారేది’ సినిమా అందరి అంచనాలను పటాపంచలు చేసే దిశగా ప్రయాణిస్తోంది. దీంతో సినమా మేకర్స్ ఆనందంలో అవధుల్లేకుండా పోయాయి. సమైక్య, విభజన వాదుల బారిన పడి ఎక్కడ గోల్ అవుతామో అని ముందు భయపడ్డారు.
తీరా విడుదల తేది ప్రకటించాక పైరసీ బయట పడడంతో ఇక ఈ సినిమా సంగతి అంతే సంగతులు అనుకున్నాడు. అందుకే సినిమాను ముందుగానే విడుదల చేసారు. అందరు అనుకున్న ఆ భయాలన్నింటి నుంచి బయటపడింది అత్తారింటికి దారేది. తెలంగాణ లో ఒకటి రెండు చోట్ల స్వల్ప అడ్డంకులు ఎదురయ్యాయి అంతే.
అయితే అసలైన రికార్డును ఈ సినిమా యూఎస్ లో సొంతం చేసుకుంటోంది. కేవలం ప్రీమియర్ షోలోనే ‘అత్తారింటికి దారేది’ ఏకంగా 2.3 కోట్ల డాలర్ల కలెక్షన్లు సంపాదించింది. ఇది ఎన్టీఆర్ ‘బాద్ షా’ రికార్డును బద్దలు చేసింది అంటున్నారు. ఇది ఇంకా ఎన్నో రికార్డులను బద్దలు చేస్తుంది అన్న ఆశాభావాన్ని సినిమా యూనిట్ వ్యక్తం చేస్తోంది.
లోకేశ్ వి పచ్చకామెర్ల వ్యాఖ్యలేమో...!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి కుమారుడు లోకేశ్ బాబు జగన్ బెయిల్ గురించి స్పందించాడు. ఆయన తన ట్విటర్ అకౌంట్ ద్వారానే ఈ విషయం గురించి కూడా విలువైన స్పందన వ్యక్తం చేశాడు. జగన్ అందరినీ భయపెట్టి బెయిలు తెచ్చుకున్నట్టుగా లోకేశ్‌బాబు చెప్పుకొచ్చాడు. కింది కోర్టులో అందరినీ భయపెట్టి జగన్ బెయిల్ తెచ్చుకొన్నాడని, ఈ బెయిల్ ను రద్దు చేయాలని ఒకవేళ సీబీఐ సుప్రీం కోర్టు ను కూడా భయపెట్టి జగన్ బయటకు వస్తాడేమో అని లోకేశ్ అభిప్రాయపడ్డాడు.
అయితే కోర్టులను భయపెట్టడం అనే వ్యాఖ్యానంలో అంత బలం లేదు. ఇది కేవలం జనాలను మభ్యపెట్టేందుకు వాడే పదంలాగా ఉంది. జగన్ అక్రమపద్ధతుల్లో బెయిల్ తెచ్చుకున్నాడు..అనేది చెప్పబోతున్న లోకేశ్ బాబు ఇలాంటి పదాలు ఉపయోగిస్తే వాటికి అంత బలం ఉండదు. కోర్టులను భయపెట్టడం ఏమిటీ.. మరీ విచిత్రం కాకపోతే.. అనే అనుమానం వస్తుంది వినే వాళ్లకు ఎవరికైనా..
అయితే లోకేశ్ వి కేవలం పచ్చకామెర్ల మాటలని. పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనపడినట్టుగా లోకేశ్ బాబుకు ఇప్పుడు అన్ని వ్యవస్థలూ తప్పుదోవలో ఉన్నట్టుగానే కనబడతాయని జగన్ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. జగన్ కు బెయిల్ రావడంతో లోకేశ్ భయకంపితుడవుతున్నాడని.. అందుకే అలా మాట్లాడుతున్నాడని వీరు లోకేశ్ పై విరుచుకుపడుతున్నారు.
రజనీ-అమితాబ్ ఆలింగనం
రజినీకాంత్ సిగరెట్ స్టైల్ కు – ప్రేరణ ఇచ్చిన తొలి తెలుగు హీరో
వందేళ్ళ సినిమా పండుగ జరుపుకుంటున్న నేటి నేపధ్యంలో 1940 ప్రాంతంలోనే హీరోయిజాన్ని అపాధించుకొని స్వతంత్రం రాకముందే తెలుగు ప్రేక్షకులకు గ్లామర్ హీరోగా ఒక వెలుగు వెలిగిన సి.హెచ్.నారాయణరావు గురించి చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఆరోజులలో హీరో అంటే ఎర్రగా, పొడుగుగా, నాజుకుగా, మ్యాన్లీగా నారాయణరావు లా ఉండాలి అని అనుకొనే వారట. 1940 ప్రాంతంలో తెలుగు సినిమా రంగంలో టాప్ హీరోగా వెలుగొందుతున్న చిత్తూరు వి నాగయ్య ను నారాయణరావు తన గ్లామర్ తో నాగయ్య ఇమేజ్ ను ధాటిపోయి ఆరోజుల్లోనే గ్లామర్ హీరోగా ముద్ర వేయి౦చుకున్నాడు. నారాయణరావులా డ్రెస్ లు వేసుకోవాలి, ఆయనలా క్రాప్ చేయి౦చుకోవాలి అని ఫాలో అయ్యే యువతరం ఆయనకు ఆరోజుల్లోనే వీరాభిమానులు అంటే ఎవరు నమ్మరు.
అంతేకాదు ఆరోజుల్లో ఆయన నటించిన ‘మొదటి రాత్రి’ అనే సినిమాలో ఆయన లారీ క్లీనర్ గా వేషం వేసి, అడ్డగళ్ళ చారల బనియన్ వేసుకుంటే ఆరోజుల్లోనే ఆ బనియన్ లకు ఇప్పటి క్రేజీ స్టార్స్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ల టీ-షర్ట్స్ కు వచ్చినంత క్రేజ్ వచ్చిందట. ‘భక్త పోతన’ సినిమాలో ఆయన శ్రీరాముడిగా నటిస్తే ఆయన పోస్టర్లకు ఆరోజుల్లోనే ప్రేక్షకులు దండం పెట్టేవారట. ఆయన స్టైల్స్ ఇప్పటి టాప్ హీరోలు కూడా ఫాలో అవుతున్నారు అంటే ఎవరూ నమ్మరు. కాని ఇది నిజం. ‘జీవితం’ అనే సినిమాలో నారాయణరావు అగ్గిపుల్లతో సిగరెట్ వెలిగించే మ్యానరిజం అప్పట్లో యూత్ ను విపరీతంగా ఆకర్షించింది. ఆ మ్యానరిజమే సూపర్ స్టార్ రజినీకాంత్ అనుసరించాడు అంటే ఎవరూ నమ్మరు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు నటించిన తొలి సినిమా మన దేశంలో నారాయణరావు యే హీరో. మొట్టమొదటి సారి నటిస్తున్న మన తారక రాముడికి ఎన్నో విషయాలను నారాయణరావు ఎన్టీఆర్ కు చెప్పారు అని అంటారు. నిన్ననే 90 వ పుట్టినరోజు జరుపుకున్న అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘శ్రీ లక్ష్మమ్మ కధ’ అలాగే నారాయణరావు హీరోగా నటించిన ‘లక్షమ్మ’ సినిమాలు ఒకే రోజు విడుదల అయితే ఆ రోజులలో సూపర్ హిట్ కొట్టిన ఘనత నారాయణరావు కి దక్కింది. స్వాతంత్రోద్యమం లో పాల్గొని జైలు కు కూడా వెళ్ళివచ్చిన నారాయణరావు 1940 ప్రాంతం నుండి మన దేశానికి స్వతంత్రం వచ్చిన 1947 ప్రాంతం వరకూ తెలుగు సినిమాను ఏలిన సూపర్ హీరో నారాయణరావు. ఆ రోజుల్లోనే ‘దేవత’, ‘చెంచులక్ష్మి’, ‘జీవితం’, ‘మొదటిరాత్రి’, ‘ఆడజన్మ’ లాంటి 30 సూపర్ హిట్ సినిమాలలో నటించాడు నారాయణరావు.
1951 లో ఆంద్ర యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ పొందిన నారాయరావు మన తెలుగు సినిమా రంగంలో కళాప్రపూర్ణ బిరుదు పొందిన మొదటి తెలుగు సినిమా నటుడు. గ్లామర్ స్టార్ గా ఒక వెలుగు వెలిగిన నారాయణరావు చివరకు చిన్న చిన్న పాత్రలు వేస్తూ కాలం వెల్లబుత్సాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తొలి తెలుగు గ్లామర్ హీరో ను తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఏనాడో మర్చిపొయింది. చివరకు ఆయన శతజయంతి ని కూడా మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ నిర్వహించకపోవడం దురదృష్టకరం. వందేళ్ళ సినిమా పండుగ జరుగుతున్న నేటి నేపధ్యంలో రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ కు సిగరెట్ వెలిగించడం లో ప్రేరణ ఇచ్చిన నారాయణరావు ను గుర్చుకు చేసుకోవడం తెలుగు సినిమా గౌరవాన్ని మరింత పెంచుతుంది.
అల్లు వారి అబ్బాయి ఓవర్ యాక్షన్....!
ప్రస్తుతం టాలీవుడ్ సినిమా రంగంలో దర్శకుడి పని దర్శకుడు, హీరో పని హీరో చెయ్యకుండా ఒకరిపనిలో ఒకరు వేలు పెడుతూ తమ ఇగో లను ప్రధర్శించుకుంటూ తద్వారా వారి సినిమాలకే ముప్పు తెచ్చుకుంటున్నారు. ఈ విషయంలో ప్రత్యేక్ష ఉదాహరణ గా హీరో అల్లు అర్జున్, సిద్ధార్ద్, నరేష్ లను పేర్కొనాలి. ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా విషయంలో బన్నీ విపరీతంగా అన్ని విషయాలలోనూ తల దూర్చడం వల్లే ఆ సినిమా పరాజయం పాలు అయింది అని అంటారు.
అదేవిధంగా ఈమధ్యనే విడుదల అయి అల్లరి నరేష్ కెరియర్ లోనే అత్యంత భయంకరమైన ఫ్లాప్ గా మిగిలిపోయిన ‘యాక్షన్-3డి’ సినిమా ఫ్లాప్ వెనుకాల అల్లరి నరేష్ మితిమీరిన ఓవర్ యాక్షన్ ఉంది అని అంటారు. ఇప్పుడు అదే కోవలోకి అల్లు వారి అబ్బాయి అల్లు శిరీష్ చేరిపోతున్నాడు అంటూ ఫిల్మ్ నగర్ లో వార్తలు వస్తున్నాయి. అల్లు శిరీష్ మొట్టమొదటి సినిమా ‘గౌరవం’ ఫ్లాప్ అవడంతో ఇక లాబం లేదు అనుకోని అల్లు అరవింద్ రంగంలోకి దిగి తన సొంత బ్యానర్ పై శిరీష్ ను హీరోగా పెట్టి మారుతి దర్శకత్వంలో ‘కొత్త జంట’ సినిమా తీస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో కొద్దిగా బూతుల శాతం ఎక్కువ అయిపోవడంతో అరవింద్ దర్శకుడు మారుతీ కి వార్నింగ్ ఇవ్వడంతో ఈ సినిమా కు సంబంధించిన ప్రతి విషయంలోనూ అల్లు శిరీష్ ఓవర్ యాక్షన్ ఎక్కువ అయిపోతోందని ఈ సినిమా ప్రోగ్రెస్ ను చూసినవారు అంటున్నారు.
స్వతహాగానే అల్లు శిరీష్ కు తెలివితేటలు చాలా ఎక్కువ. ఆ తెలివితేటలతో తనకు తాను చాలా ఎక్కువగా ఉహించుకొని ఈ కొత్త జంట సినిమాకు హీరో, దర్శకుడు అన్నీ తానే అన్నట్లు శిరీష్ ప్రవర్తిస్తూ ఉండడంతో ఏమి చెయ్యాలో అర్ధం కాక ఇప్పుడిప్పుడే మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టిన బూతు సినిమా దర్శకుడు మారుతి తల పట్టుకుంటున్నాడట. అంతేకాదు అటు అరవింద్ ఇటు శిరీష్ ల మధ్య నలిగిపోతున్నాడట మారుతి. బన్నీ తో సినిమా చెయ్యాలి అని కలలు కంటున్న మారుతి కి ఈ కొత్త జంట ఎటువంటి షాక్ ఇస్తుందో చూడాలి.
తండ్రి బాటలో మహేష్...!
బాలనటుడిగా తన చిన్నతనం నుండి సినిమాలలో నటించడం మొదలు పెట్టిన నాటినుండి ప్రిన్స్ మహేష్ బాబు కు స్టార్ స్టేటస్ వచ్చేసింది. సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా కాకుండా తనకంటూ తనకొక బ్రాండ్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న వ్యక్తి టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు. సామాన్యంగా బాలనటుడిగా రాణించిన వారు టాలీవుడ్ లో హీరోలుగా రాణించిన సందర్భాలు చాలా తక్కువ. అయితే ఆ సాంప్రదాయానికి విరుద్ధంగా బాలనటుడిగానే కాదు హీరోగా కూడా స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న అదృష్టం ఒక్క మహేష్ బాబు కే దక్కింది.
సూపర్ స్టార్ కృష్ణ నటన విషయంలో ఎలా ఉన్నా వ్యక్తిత్వం విషయంలో మటుకూ ఆయనను మెచ్చుకొని వారు ఉండరు. మంచి తనానికి మారుపేరుగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో పేరుగాంచిన కృష్ణ, ఆయన సూపర్ స్టార్ గా వెలిగే రోజులలో తన నిర్మాత గురించే ఎక్కువ ఆలోచించేవాడు అని అంటారు. ఆయనను హీరోగా పెట్టుకొని ఏ నిర్మాత అయినా నష్టపోతే అదే నిర్మాత మరో సినిమా తీస్తున్నప్పుడు ఎటువంటి పారితోషికం తీసుకోకుండా ఫ్రీ గా నటించేవాడు అని అంటారు. అంతేకాకుండా కృష్ణ నటించిన ఎన్నో సినిమాల నిర్మాతలు తమ సినిమాలకు లాభాలు వచ్చినా కృష్ణ కు పారితోషికం ఎగ్గొట్టిన సందర్భాలు ఉన్నాయట. ఇది గతం.
ఇక లేటెస్ట్ గా ప్రిన్స్ మహేష్ బాబు 14 రీల్స్ ఎంటర్ టైనమెంట్ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ‘వన్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. సుకుమార్ తీసుకుంటున్న విపరీతమైన జాగ్రత్త వల్ల ఈ సినిమా నిర్మాణం ఆలస్యం కావడమే కాకుండా ఈ సినిమా బడ్జెట్ కూడా విపరీతంగా పెరిగిపోవడంతో నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు అనే వార్తలు ఇప్పటికే వచ్చాయి. దాదాపు 60 కోట్ల భారీ బడ్జెట్ కు ఈ సినిమా చేరిపోవడంతో ఈ సినిమా భవితవ్యం పై రకరకాల వార్తలు కూడా ఇప్పటికే టాలీవుడ్ లో హడావుడి చేస్తున్నాయి.
ఈ వార్తల నేపధ్యంలో టాలీవుడ్ మిల్కీ బాయ్ మహేష్ బాబు వన్ సినిమా నిర్మాతలను పిలిపించి ఈ సినిమా బడ్జెట్ గురించి వాకబు చేయడమే కాకుండా అనుకోని కారణాలతో బడ్జెట్ పెరిగిపోయిన ఈ సినిమా నిర్మాతలను ఆదుకొనే ఉద్దేశంతో తన పారితోషికాన్ని సగానికి పైగా తగ్గించుకున్నాడు అనే వార్తలు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తూ, ఒక సంచలన వార్తగా మారింది. ప్రస్తుతం యంగ్ హీరోలు అంతా నిర్మాతల దగ్గర ఎంత వరకూ పిండ గలుగుతాము అని ఆలోచిస్తూ ఉంటే మహేష్ మాత్రం దీనికి భిన్నంగా ప్రవర్తించి టాలీవుడ్ నెంబర్.1 హీరో అనిపించుకోవడమే కాకుండా సూపర్ స్టార్ కృష్ణ కు వ్యక్తిత్వం లో కూడా నిజమైన వారసుడు అనిపించుకుంటున్నాడని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.
విభనపై ఎంత ముందుకెళితే..సోనియాకు అంత ప్రమాదం!
తెలుగు వాళ్లను విడదీస్తున్న ఉసురు ఊరికే పోదు. ఇది శాపంగా మారి సోనియా గాంధీని సర్వనాశనంచేస్తుంది. ఆమెను అనారోగ్యం పాలు చే స్తుంది. కాంగ్రెస్ పార్టీని అల్లకల్లోలం చేస్తుంది.. అంటున్నారు సమైక్యవాదులు. తాజాగా చికిత్స కోసం సోనియా గాంధీ మళ్లీ అమెరికాకు వెళ్లనుంది అనే వార్తలు చూసి సమైక్యవాదులు ఇదంతా సోనియా స్వయంకృతం అని అంటున్నారు.
ఆమె ఎంతో చరిత్ర ఉన్న తెలుగువారిని విడదీయాలని చూస్తోందని, తన రాజకీయ ప్రయోజనాల లెక్కలో ఆంధ్రప్రదేశ్ ను విడదీయాలని భావిస్తోందని.. ఈ ప్రయత్నంలో వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కొంటోందని. ఇప్పటికైనా ఆమె ఈ విషయాన్ని గ్రహించాలని సమైక్యవాదులు అంటున్నారు. తెలుగు వాళ్ల ఉసురు ప్రభావం ఈ విధంగా ఉండటం పెద్ద ఆశ్చర్యకరమేమీ కాదని వీరు అభిప్రాయపడుతున్నారు.
మరి ఇది నిజమేనా? సీమాంధ్రశాపానికి గురై సోనియా గాంధీ ఇలా ఇబ్బందులు పడుతోందా? అంటే అంత సులభంగా సమాధానం చెప్పలేం.. అయితే విభజనపై ఇంకెంత ముందుకు వెళితే సోనియాకు అంత ప్రమాదం ఉంటుందని కూడా అంటున్నారు సమైక్యవాదులు. మరి దీనిపై కాంగ్రెస్ వాళ్లు ఏమనుకుంటున్నారో!
Subscribe to:
Posts (Atom)
