Monday, 30 March 2015

నిల్ ( గోపిచంద్ 'జిల్‌' రివ్యూ)


క్రైమ్, సస్పెన్స్ ఎలిమెంట్ కథలు ఎప్పుడూ బాగానే ఉంటాయి. అయితే మారుతున్న కాలంతో పాటు మారిన ప్రేక్షకుడుకి ఆ కథ,కథనం చాలా చాలా కొత్తగా అనిపించేలా డిజైన్ చేయగలగాలి. ముఖ్యంగా మాస్ హీరో తో ముందుకు వెళ్తున్నప్పుడు ఆ క్రైమ్ తను ఎత్తుకున్న కథలో కరెక్టు గా కలవకపోతే రెండు వేరు వేరు ట్రాక్ లుగా ఉన్నట్లు అనిపిస్తాయి. ఈ చిత్రానికి అలాంటిదే జరిగిందనిపిస్తుంది. లవ్ ట్రాక్ ఓ ప్రక్క, విలన్ ట్రాక్ ఓ ప్రక్క విడివిడిగా నడుస్తూ ఉంటాయి. హీరో తనకు గానీ తన కుటుంబానికి గానీ సంభంధం లేని సమస్యలో ఇరుక్కుంటాడు.

 ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు ఆ సమస్య కూడా అతన్ని దూరం నుంచే పలకరిస్తుంది. పలకరించినా వెంటనే దగ్గరకు రాదు...విలన్ కరెక్టు డెషిషన్ తీసుకుని హీరోకు సమస్య పూర్తిగ నెట్టే సరికే పుణ్యంకాలం గడిచే సరికి క్లైమాక్స్ వచ్చేస్తుంది. దాంతో హీరో పాత్ర పూర్తి ప్యాసివ్ గా మారి చూసే వారికి నీరసం వస్తుంది....మనలో జిల్ చచ్చిపోతుంది. అయితే ఈ సినిమా చూసిన వారికి ఒకటి మాత్రం అనిపిస్తుంది. దర్శకుడు సరైన స్క్రిప్టు లేక ఇబ్బంది పడ్డాడు కానీ లేకుంటే పెద్ద హిట్ కొట్టేవాడిని అర్దమవుతుంది. షాట్ మేకింగ్, డైలాగులు, ఆర్టిస్టుల ఫెరఫార్మెన్స్ విషయంలో కొత్త దర్శకుడు ఎక్కడా తడబడకుండా చాలా బాగా డీల్ చేసాడు. కాబట్టి నెక్ట్స్ టైమ్ బెటర్ లక్. సినిమాలో ఏకైక ప్లస్ పాయింట్ రాసిఖన్నా. ఆమెను గ్లామర్ గా చూపించిన విధానం. జై(గోపీచంద్) ఓ సిన్సియర్..ఫైర్ ఆఫీసర్. కుటుంబంతో హ్యాపీగా జీవిస్తున్న అతని జీవితంలోకి సావిత్రి(రాసిఖన్నా) వస్తుంది. ఆమెతో సరదా,సరదాగా గడుస్తున్న సమయంలో కథలో ట్విస్ట్ వస్తుంది. ఊహించని విధంగా అండర్ వరల్డ్ డాన్ ఛోటా నాయక్ (కబీర్) ...జై కోసం వెతకటం మొదలెడతాడు. ఎందుకంటే...ఉద్యోగ భాధ్యతల్లో భాగంగా ఆ డాన్ దగ్గర నుంచి డబ్బు కొట్టేసిన రంగనాధ్ (బ్రహ్మాజి) ని ఓ సారి ఫైర్ యాక్సిడెంట్ లో కాపాడే ప్రయత్నం చేస్తాడు. అయితే ఆ చివరి క్షణాల్లో రంగనాథ్ .. జై కు ఆ డబ్బు వివరాలు చెప్పాడని సందేహంతో. అయితే జై కి ఆ వివరాలు ఏమీ తెలియదు. దాన్ని డాన్ ఎంత చెప్పినా నమ్మడు. అప్పుడేం జరిగింది. డాన్ నుంచి జై ఎలా తప్పించుకున్నాడు. ఆ డబ్బు ఏమైంది వంటి వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మిగతా ఎలిమెంట్స్ అన్నీ వదిలేసి మాస్ యాక్షన్ హీరోతో కేవలం స్టైల్ ని నమ్ముకుని సినిమాలు తీస్తే ఎలా ఉంటుంది. దానికి తోడు గతంలో ఎప్పుడో అరవై,డబ్బై సంవత్సరాల క్రితం హిచ్ కాక్ చేసిన The Man Who Knew Too Much వంటి కథనం ఎత్తుకుంటే ఎలా..అప్పటికీ ఇప్పటికీ సినిమా ప్రేక్షకులు బాగా మారారు. అలాగే...మనకు హీరో,హీరోయిన్, పాటలు, విలన్,కామెడీ వంటి అనేక అంశాలు కలిపి వండాలి అనుకున్నప్పుడు స్క్రీన్ ప్లే పై మరింత కసరత్తు చేయాల్సింది. ఇక ఈ సినిమాలో విలన్ ... ఎక్కడా తప్పు చేస్తున్నట్లు కనిపించదు...తన పోగొట్టుకున్న డబ్బు కోసం తను హీరో వెనక తిరుగతూంటాడు. అయినా వెయ్యికోట్లు బ్యాంక్ లో ఉందంటే అది వైట్ మనీనే. అలాంటప్పుడు దాన్ని పోగొట్టుకున్నవాడు...దాన్ని రాబట్టుకోవాలనుకోవటంలో తప్పేముంది అనిపిస్తుంది. అలాగే హీరోకు...క్లైమాక్స్ ముందు దాకా...తన దగ్గర ఉన్న క్లూ సంగతి గుర్తుకు రాదు. అలా ఎక్కడిక్కడ ... కథను కన్వీనెంట్ గా చేసుకుంటూ వెళ్లటంతో చాలా ప్రెడిక్టుబుల్ గా మారిపోయింది.

దాసరికి కోల్ షాక్: రూ.2.25 కోట్ల ఆస్తుల జఫ్తు, అప్పుడేమన్నారు?


న్యూఢిల్లీ/హైదరాబాద్: మాజీ కేంద్రమంత్రి, దర్శకరత్న దాసరి నారాయణ రావుకు పెద్ద షాక్. బొగ్గు కుంభకోణం కేసులో దాసరికి చెందిన రూ.2.25 కోట్ల ఆస్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం నాడు అటాచ్ చేసింది. బ్యాంకులోని ఫిక్స్డ్ డిపాజిట్లు, రెండు వాహనాలు, ఓ ఫ్లాట్, ఇతర ఆస్తులను తాత్కాలికంగా జఫ్తు చేసింది. దాసరి కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు జిందాల్ కంపెనీ పట్ల పక్షపాతం చూపించారని దాసరి పైన ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతని ఆస్తులను తాత్కాలికంగా జఫ్తు చేసింది. బొగ్గు కుంభకోణం సమయంలో దాసరి సహాయమంత్రిగా ఉన్నారు. కాగా, దాసరి నారాయణ రావు ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఈడీ రంగం సిద్ధం చేసినట్లుగా వారం రోజుల క్రితం వార్తలు వచ్చాయి. బొగ్గు కుంభకోణంలో దాసరి పాత్ర ఉందని సీబీఐ నిర్ధారించింది. దాసరి బొగ్గుగునుల శాఖ సహాయమంత్రిగా ఉన్నప్పుడు జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌ కంపెనీకి ఆయాచిత లబ్ది చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకున్నారని, జిందాల్‌ కంపెనీ నుంచి దాసరికి చెందిన సౌభాగ్య మీడియా కంపెనీకి రూ.2.25 కోట్లు క్విడ్‌ ప్రోకో రూపంలో అందాయని సీబీఐ నిర్ధారించింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు దాసరిని ఈడీ, సీబీఐ విచారించింది. సౌభాగ్య మీడియా కంపెనీ ఆస్తులను ఈడీ జప్తు చేయనున్నట్లుగా వార్తలు వచ్చాయి. సోమవారం సాయంత్రానికి ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సంబంధించిన ప్రకటనను ఈడీ వెలువరించే అవకాశం ఉన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. 2006-2009 మధ్యకాలంలో బొగ్గు శాఖలో భారీ కుంభకోణం జరిగిందని కాగ్ నివేదిక ద్వారా వెలుగు చూసిన విషయం తెలిసిందే. అప్పుడు దాసరి బొగ్గు శాఖ సహాయమంత్రిగా ఉన్నారు. గతంలో దాసరిని సీబీఐ హైదరాబాదులో ప్రశ్నించింది. అదే సమయంలో మరో మాజీ మంత్రి సంతోష్ బగ్రోడియాను కూడా ప్రశ్నించింది. హిండాల్కోకు బొగ్గు కేటాయింపుల విషయంలో తన ప్రమేయం లేదని దాసరి నారాయణ రావు సీబీఐకి గతంలో వెల్లడించినట్లుగా వార్తలు వచ్చాయి. బొగ్గు కుంభకోణంలో విచారణ జరుపుతున్న సిబిఐ ముందుకు దాసరి తనకు సహాయంగా గతంలో పిఎస్‌గా పని చేసిన అధికారిని కూడా తీసుకువెళ్లారు.

Sunday, 22 March 2015

సమంత,ఎమీ జాక్సన్ హీరోయిన్స్ గా...


చెన్నై : సమంత,ఎమి జాక్సన్ ఇద్దరూ టాప్ హీరోయిన్స్. వీరిద్దరూ ఒకే సినిమాల్లో ఉంటే ఇంక చెప్పేదేముంది..ప్రేక్షకులకు పండుగే. అలాంటిదే ఇప్పుడు జరగబోతోంది. అదీ ఆశామాషీ కాంబినేషన్ లో కాదు. పూర్తి వివరాల్లోకి వెళితే... 'షమితాబ్‌', 'అనేగన్‌' (అనేకుడు)చిత్రాలతో భారత సినీ జనాలను ఆకట్టుకుంటున్న నటుడు ధనుష్‌. అంతకుముందు వేల్‌రాజ్‌ దర్శకత్వంలో విడుదలైన 'వేలై ఇల్లా పట్టదారి' (తెలుగులో రఘువరన్ ఎంటెక్) వసూళ్ల వర్షం కురిపించింది. ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందించారు. ఇప్పుడు మళ్లీ ఇదే జట్టు మరో చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. ఇందులో ఎమీజాక్సన్‌, సమంత హీరోయిన్లుగా నటిస్తున్నారు.

సునంద మృతి కేసు: పాక్ జర్నలిస్ట్ తరర్‌ను ఎలా ప్రశ్నిస్తారు?


న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ మృతి కేసులో ఢిల్లీ పోలీసులు పాకిస్తాన్ జర్నలిస్ట్ మెహర్ తరర్‌ను ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. ఆమెను ఎలా ప్రశ్నించాలనే విషయమై ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆమె పాకిస్తాన్‌కు చెందిన జర్నలిస్టు కావడంతో ఆమెకు సమన్లు ఇవ్వడం కొంచెం ఇబ్బందితో కూడుకున్న పని. మెహర్ తరర్ విచారణ కోసం ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధమైతే పెద్ద సమస్య పోతుంది. కానీ ఆమె అందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెను విచారించేందుకు పోలీసులు తర్జన భర్జన పడుతున్నారు. అయితే, సునంద పుష్కర్ మృతి కేసులో దర్యాఫ్తు బృందానికి తాను సహకరిస్తానని ఆమె చెప్పారు. వారు పాక్‌కు వస్తే విచారించుకోవచ్చునని గతంలో చెప్పారు. ఈ కేసులో ఆమె కీలకమైన సాక్షి. అయినప్పటికీ ఆమె విచారణ కోసం భారత్ వస్తారా లేదా అనేది ఇంకా అనుమానమే.

Thursday, 19 March 2015

వరుస పెట్టి సీడీలు చూస్తున్న నందమూరి మోక్షజ్ఞ!


హైదరాబాద్: నందమూరి ఫ్యామిలీ నుండి త్వరలో రాబోతున్న యంగ్ లయన్, బాలయ్య నటవారసుడు మోక్షజ్ఞ గురించి ఫ్యాన్స్ సర్కిల్ లో ఆసక్తి కరంగా చర్చ సాగుతోంది. అతని ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చాలా కాలంగా అతని గురించి ఫిల్మ్ సర్కిల్ లో చర్చ సాగుతోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం...మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించిన ఏర్పాట్లు వేగం అందుకున్నాయ. మోక్షజ్ఞ తొలి చిత్రం వివి వినాయక్ దర్శకత్వంలోనే ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం వినాయక్ అక్కినేని యంగ్ హీరో అఖిల్ సినిమా డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం మోక్షజ్ఞ తన తాతయ్య ఎన్టీఆర్ కు సంబంధించిన సినిమాలు వరుస పెట్టి చూస్తున్నాడట. తాతయ్య బాడీ లాంగ్వేజ్ అనుకరిస్తూ తనకంటూ ప్రత్యేకమైన మ్యానరిజం, స్టైల్ క్రియేట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడట. ప్రస్తుతం మోక్షు యూఎస్ఏలో తన చదువు కొనసాగిస్తూ నటనలో శిక్షణ తీసుకుంటున్నాడని సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం....మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడనేది ఫిక్సయినట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ దిన పత్రిలో వచ్చిన వార్తల ప్రకారం.... బాలయ్య 100వ సినిమా పూర్తయిన తర్వాత 2016లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. బాలయ్య కూడా పలు సందర్భాల్లో మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలోనే ఉంటుందని చెప్పుకొచ్చారు.

కల్లు తాగిన కోతి: రామ్ చరణ్ కామెంట్ ‘దాసరి’ పైనా?


హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన సోషనల్ నెట్వర్కింగ్ పేజీలో ఓ సెన్సేషన్ కామెంట్ చేసారు. ‘కోతి కల్లు తాగితే ఎలా ప్రవర్తిస్తుందో తెలుసు కదా, అదే కోతికి మైకు దొరికితే, మీరే ఊహించుకోండి' అంటూ మైకు పట్టుకున్న కోతి బొమ్మను పోస్టు చేసాడు చెర్రీ. అయితే చెర్రీ చేసిన ఈ పోస్ట్ టాలీవుడ్లో పాపులర్ అయిన ఓ సినీయర్ డైరెక్టర్‌ను ఉద్దేశించే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో రామ్ చరణ్ సదరు సీనియర్ డైరెక్టర్‌తో పరోక్షంగా మాటల యుద్ధంగానికి దిగారు.ఇటీవల మెగా ఫ్యామిలీకి చెందిన ఓ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి' ఆడియో వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దాసరి నారాయణరావు మాట్లాడుతూ ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇండస్ట్రీని ఎలారు. వారి తర్వాత ఆ రేంజిలో వెలుగొందిన హీరో పవన్ కళ్యాణ్ మాత్రమే అని వ్యాఖ్యానించారు. ఆయన ఇలా వ్యాఖ్యానించడం ద్వారా చిరంజీవి తక్కువ చేసి మాట్లాడారు. దీనికి కౌంటర్ గానే రామ్ చరణ్ ఈ పోస్టు చేసినట్లు కొందరు అభిప్రాయ పడుతున్నారు.