Thursday, 19 March 2015

వరుస పెట్టి సీడీలు చూస్తున్న నందమూరి మోక్షజ్ఞ!


హైదరాబాద్: నందమూరి ఫ్యామిలీ నుండి త్వరలో రాబోతున్న యంగ్ లయన్, బాలయ్య నటవారసుడు మోక్షజ్ఞ గురించి ఫ్యాన్స్ సర్కిల్ లో ఆసక్తి కరంగా చర్చ సాగుతోంది. అతని ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చాలా కాలంగా అతని గురించి ఫిల్మ్ సర్కిల్ లో చర్చ సాగుతోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం...మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించిన ఏర్పాట్లు వేగం అందుకున్నాయ. మోక్షజ్ఞ తొలి చిత్రం వివి వినాయక్ దర్శకత్వంలోనే ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం వినాయక్ అక్కినేని యంగ్ హీరో అఖిల్ సినిమా డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం మోక్షజ్ఞ తన తాతయ్య ఎన్టీఆర్ కు సంబంధించిన సినిమాలు వరుస పెట్టి చూస్తున్నాడట. తాతయ్య బాడీ లాంగ్వేజ్ అనుకరిస్తూ తనకంటూ ప్రత్యేకమైన మ్యానరిజం, స్టైల్ క్రియేట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడట. ప్రస్తుతం మోక్షు యూఎస్ఏలో తన చదువు కొనసాగిస్తూ నటనలో శిక్షణ తీసుకుంటున్నాడని సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం....మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడనేది ఫిక్సయినట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ దిన పత్రిలో వచ్చిన వార్తల ప్రకారం.... బాలయ్య 100వ సినిమా పూర్తయిన తర్వాత 2016లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. బాలయ్య కూడా పలు సందర్భాల్లో మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలోనే ఉంటుందని చెప్పుకొచ్చారు.

కల్లు తాగిన కోతి: రామ్ చరణ్ కామెంట్ ‘దాసరి’ పైనా?


హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన సోషనల్ నెట్వర్కింగ్ పేజీలో ఓ సెన్సేషన్ కామెంట్ చేసారు. ‘కోతి కల్లు తాగితే ఎలా ప్రవర్తిస్తుందో తెలుసు కదా, అదే కోతికి మైకు దొరికితే, మీరే ఊహించుకోండి' అంటూ మైకు పట్టుకున్న కోతి బొమ్మను పోస్టు చేసాడు చెర్రీ. అయితే చెర్రీ చేసిన ఈ పోస్ట్ టాలీవుడ్లో పాపులర్ అయిన ఓ సినీయర్ డైరెక్టర్‌ను ఉద్దేశించే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో రామ్ చరణ్ సదరు సీనియర్ డైరెక్టర్‌తో పరోక్షంగా మాటల యుద్ధంగానికి దిగారు.ఇటీవల మెగా ఫ్యామిలీకి చెందిన ఓ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి' ఆడియో వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దాసరి నారాయణరావు మాట్లాడుతూ ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇండస్ట్రీని ఎలారు. వారి తర్వాత ఆ రేంజిలో వెలుగొందిన హీరో పవన్ కళ్యాణ్ మాత్రమే అని వ్యాఖ్యానించారు. ఆయన ఇలా వ్యాఖ్యానించడం ద్వారా చిరంజీవి తక్కువ చేసి మాట్లాడారు. దీనికి కౌంటర్ గానే రామ్ చరణ్ ఈ పోస్టు చేసినట్లు కొందరు అభిప్రాయ పడుతున్నారు.

బంగ్లా చిత్తు, ప్రధాని ఆశలు గల్లంతు: సెమీ ఫైనల్లోకి భారత్


మెల్బోర్న్: ఐసిసి వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో భారత్ తన ముందు ఉంచిన 303 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లాదేశ్‌ విఫలమైంది. బంగ్లాదేశ్ 45 ఓవర్లలో 193 పరుగులు మాత్రమే చేసి భారత్ చేతిలో చిత్తయింది. తమ జట్టు గెలుస్తుందనే బంగ్లాదేశ్ ప్రధాని హసీనా ఆశలు గల్లంతయ్యాయి. ఉమేష్ యాదవ్ బంతితో, రోహిత్ శర్మ బ్యాట్‌తో రాణించడంతో భారత్ బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. ఉమేష్ యాదవ్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. మొహమ్మద్ షమీ, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీసుకున్నారు. మోహత్ శర్మకు ఒక్క వికెట్ లభించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ రోహిత్ శర్మ సెంచరీ, సురేష్ రైనా అర్థ సెంచరీలతో ఆరు వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ మూడు వికెట్లు తీసుకోగా, మొర్తాజా, షకీబ్ అల్ హసన్, రుబెల్ హోసేన్ తలో వికెట్ తీసుకున్నారు. విరాట్ కోహ్లీ వెంటనే పెవిలియన్ చేరుకున్నప్పటికీ రోహిత్ శర్మ, సురేష్ రైనా భారత్ ఇన్నంగ్సును పరుగులు పెట్టించారు. శిఖర్ ధావన్ పట్టిన క్యాచ్ మ్యాచులో హైలెట్‌గా నిలిచింది. ప్రపంచ కప్ పోటీల్లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. భారత్ తన ముందు ఉంచిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 43వ ఓవర్లో బంగ్లాదేశ్ ఏడో వికెట్ కోల్పోయింది. 42.6 వద్ద జడెజా బౌలింగులో నాసిర్ అవుటయ్యాడు. అశ్విన్ క్యాచ్ పట్టాడు. అతను 34 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ఆ తర్వాత కాసేపటికే మరో వికెట్ కోల్పోయింది. శర్మ బౌలింగులో మొర్తజా ఎనిమిదో వికెట్‌గా అవుటయ్యాడు. ధోని క్యాచ్ పట్టాడు. బంగ్లాదేశ్ వికెట్లు వరుసగా కూలుతున్నాయి. 139 పరుగుల స్కోరు వద్ద బంగ్లాదేశ్ ఆరో వికెట్ కోల్పోయింది. ముషీఫికర్ రహీం ఉమేష్ యాదవ్ బౌలింగులో 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ధోనీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. బంగ్లాదేశ్ నాలుగో వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగులో సర్కార్ అవుటయ్యాడు. ధోనీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అతను 43 బంతుల్లో 29 పరుగులు చేశాడు. అప్పటికి బంగ్లా స్కోర్ 90/4. 104 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఐదో వికెట్ కోల్పోయింది. షకీబ్ అలీ హసన్ రవీంద్ర జడేజా బౌలింగులో పది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. బంగ్లాదేశ్ 73 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగులో ధవన్ క్యాచ్ పట్టగా మహ్మదుల్లా అవుటయ్యాడు. అప్పటికి బంగ్లాదేశ్ 17.5 ఓవర్లలో 74 పరుగులతో ఉంది. నిలకడగా ఆడుతున్న బంగ్లాదేశ్ 33 పరుగుల వద్ద వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. తమిమ్ ఇక్బాల్, ఖయేస్‌లు జట్టు స్కోర్ 33 ఉన్నప్పుడు అవుటయ్యారు. బంగ్లాదేశ్ ఏడు ఓవర్లలో 33 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. చేజింగ్‌లో బంగ్లా తడపడుతోంది.బంగ్లాదేశ్ నిలకడగా ఆడుతోంది. ఐదు ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 23 పరుగులు చేశారు. తమిమ్ ఇక్బాల్, ఇమ్రుల్ ఖయేస్‌లు బ్యాటింగ్‌కు దిగారు. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది. జడెజా 10 బంతుల్లో 23 పరుగులు చేశాడు. అశ్విన్ 3 బంతుల్లో మూడు పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ లక్ష్యం 303 పరుగులు. భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. అహ్మద్ బౌలింగులో నాసిర్‌కు క్యాచ్ ఇచ్చి ధోనీ (11 బంతుల్లో 6 పరుగులు) అవుటయ్యాడు. భారత్ స్కోర్ 49 ఓవర్లకు 296 పరుగులు చేసింది. భారత్ 47 ఓవర్లో అయిదో వికెట్ కోల్పోయింది. అహ్మద్ బౌలింగులో రోహిత్ శర్మ (126 బంతుల్లో 137 పరుగులు) అవుటయ్యాడు. అతను 14 ఫోర్లు, మూడు సిక్స్‌లు కొట్టాడు. రైనా, రోహిత్ శర్మలు దూకుడుగా ఆడుతున్న సమయంలో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. సురేష్ రైనా (57 బంతుల్లో 65 పరుగులు) ముఫ్తజా బౌలింగులో రహీంకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. రైనా పరుగుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. 108 బంతుల్లో 101 పరుగులు చేశాడు. ఇందులో పది ఫోర్లు, 1 సిక్స్ ఉంది. సురేష్ రైనా 50 బంతుల్లో 60 పరుగులతో ఆడుతున్నాడు. భారత్ 42 ఓవర్లలో.. మూడు వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌తో గురువారం జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచులో భారత్ వరుసగా వికెట్లు కోల్పోతోంది. 119 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. అజింక్యా రహనే 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తస్కిన్ అహ్మద్ బౌలింగులో అవుటయ్యాడు. కాగా, రోహిత్ శర్మ అర్థ సెంచరీ పూర్తి చేశాడు. రోహిత్ శర్మ, సురేష్ రైనా దూకుడు పెంచారు. రైనా అర్థ సెంచరీ పూర్తి చేశాడు. 46 బంతుల్లో ఒక సిక్స్, ఐదు ఫోర్ల సాయంతో అతను అర్థ సెంచరీ పూర్తి చేశాడు. భారత్ 79 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ భారత క్రికెట్ అభిమానులను నిరాశపరిచాడు. అతను కేవలం 3 పరుగులు చేసి, రుబెల్ హొస్సేన్ బౌలింగులో అవుటయ్యాడు. అంతకు ముందు భారత్ 75 పరుగుల స్కోరు వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. శిఖర్ ధావన్ 30 పరుగుల వ్యక్తి్గత స్కోరు వద్ద షకీబ్ ఆల్ హసన్ బౌలింగులో అవుటయ్యాడు. భారత్ స్కోర్ 50 పరుగుుల దాటింది. ఐసిసి వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా జరుగుతున్న క్వార్టర్ ఫైనల్‌ మ్యాచులో భారత్ గురువారంనాడు భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటి వరకు ఏ మ్యాచులోనూ ఓడిపోకుండా భారత్ అప్రతిహతంగా ముందుకు దూసుకుని వచ్చింది.

Tuesday, 17 March 2015

‘రేయ్‌’ : ‘పవనిజం’ సాంగ్ ట్రైలర్ (వీడియో)



హైదరాబాద్ :సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా బొమ్మరిల్లు వారి పతాకంపై స్వీయ దర్శకత్వంలో వైవీఎస్‌ చౌదరి నిర్మిస్తున్న చిత్రం ‘రేయ్‌'. సయామీ ఖేర్‌, శ్రద్ధాదాస్‌ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ సినిమా ఆడియోలో పవన్‌కల్యాణ్‌పై రచించిన ‘పవనిజం' అనే ప్రత్యేక పాటను జోడిస్తున్నారు. ఈ పాటను ఈ రోజున విడుదల చేయబోతున్నట్లు వైవీఎస్‌ చౌదరి చెప్పారు. ఈ పాట ట్రైలర్ ని విడుదల చేసారు.మీరు వాట వచ్చేలోగ ఈ ట్రైలర్ ని చూడండి.

‘S/O సత్యమూర్తి’ కథ లీక్, ఇదేనా?


హైదరాబాద్: అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో రాబోతున్న ‘S/O సత్యమూర్తి' కథ అంటూ ఒక చిన్న స్టోరీ లైన్‌ ప్రస్తుతం ఫిల్మ్‌ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది...... ఆ ప్రచారం ప్రకారం ‘సత్యమూర్తికి వెన్నెల కిషోర్‌ మరియు అల్లు అర్జున్‌లు ఇద్దరు కొడుకులు. మిలియనీర్‌ అయిన సత్యమూర్తి తన వ్యాపార సామ్రాజ్యాన్ని దేశ విదేశాలకు విస్తరిస్తాడు. తండ్రి మిలియనీర్‌ అవ్వడంతో అల్లు అర్జున్‌ తన జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తూ బతుకుతూ ఉంటాడు. అయితే కొన్ని కారణాల వల్ల సత్యమూర్తి వ్యాపారంలో లాస్‌ వచ్చి, సత్యమూర్తి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని చనిపోతాడు. తండ్రి చనిపోవడంతో వెన్నెల కిషోర్‌ పిచ్చి వాడు అవుతాడు. సత్యమూర్తి చనిపోయే ముందు కొడుకులతో ఓ రహస్యం చెబుతాడు. దాంతో రాయలసీమకు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ బన్నీ అత్త ఉంటుందని అంటున్నారు. అత్త కోసం అక్కడ బన్నీ ఎదుర్కొన్న సమస్యలు ఏంటి....సినిమాలో ముగ్గురు హీరోయిన్ల కథేంటి? స్నేహ, ఉపేంద్ర పాత్ర ఏమిటి? అనేది ఆసక్తికరంగా ఉంటుందని' అంటున్నారు. ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది.

Monday, 16 March 2015

'S/O సత్యమూర్తి' ఆన్ లొకేషన్లో ఇలా... (ఫోటోస్)


హైదరాబాద్: అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘S/O సత్యమూర్తి' ఆడియో వేడుక గ్రాండ్ గా ముగిసింది. ఇక చిత్ర యూనిట్ సినిమా విడుదలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా సినిమాకు పబ్లిసిటీ పెంచే ప్రయత్నంలో పడింది. తాజాగా సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ విడుదల చేసారు.
ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 2న కానీ, అల్లు అర్జున్ పుట్టిన రోజైన 8న కానీ విడుదలయ్యే అవకాసం ఉంది. అల్లు అర్జున్ సరసన సమంతా, అదా శర్మ, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటించగా దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తోంది.

మహిళపై ట్వీట్: రామ్ గోపాల్ వర్మ మళ్లీ రెచ్చిపోయాడు!


హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన నైజం ప్రదర్శించాడు. కావాలని వివాదాలు సృష్టించడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, తద్వారా పబ్లిసిటీ పెంచుకోవడం అలవాటు చేసుకున్న వర్మ ట్విట్టర్ వేదికగా తన ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేసారు. ఈ సారి ఆయన వ్యాఖ్యలు మహిళలను ఉద్దేశించి చేయడం గమనార్హం. ‘యాపిల్ కంపెనీ ఫోన్లు, వాచీలు, కార్లు తయారుచేస్తోందని.. అంతా బాగానే ఉంది.. అదే విధంగా యాపిల్ మహిళలను కూడా తయారు చేయాలని సిన్సియర్ గా కోరుకుంటున్నాను' అంటూ వివాదాస్పద ట్వీట్ చేసారు.

Sunday, 15 March 2015

రాఘవ లారెన్స్ ‘కాంచన 2’ ఫస్ట్ లుక్ ఇదే..


హైదరాబాద్: కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ గాయ పడ్డాడు. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ముని-3 : గంగా' (కాంచన-2) ఫస్ట్ లుక్ విడుదలైంది. రాఘవ లెరెన్స్, తాప్సీ జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రానికి ఫోటోగ్రఫీ: కిచ్చా, సంగీతం: థమన్, సమర్పణ: మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: బెల్లంకొండ సురేష్, బెల్లకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-కొరియోగ్రఫీ-దర్శకత్వం: రాఘవ లారెన్స్.