హైదరాబాద్: అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్లో రాబోతున్న ‘S/O సత్యమూర్తి' కథ అంటూ ఒక చిన్న స్టోరీ లైన్ ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది...... ఆ ప్రచారం ప్రకారం ‘సత్యమూర్తికి వెన్నెల కిషోర్ మరియు అల్లు అర్జున్‌లు ఇద్దరు కొడుకులు. మిలియనీర్ అయిన సత్యమూర్తి తన వ్యాపార సామ్రాజ్యాన్ని దేశ విదేశాలకు విస్తరిస్తాడు. తండ్రి మిలియనీర్ అవ్వడంతో అల్లు అర్జున్ తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ బతుకుతూ ఉంటాడు. అయితే కొన్ని కారణాల వల్ల సత్యమూర్తి వ్యాపారంలో లాస్ వచ్చి, సత్యమూర్తి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని చనిపోతాడు. తండ్రి చనిపోవడంతో వెన్నెల కిషోర్ పిచ్చి వాడు అవుతాడు. సత్యమూర్తి చనిపోయే ముందు కొడుకులతో ఓ రహస్యం చెబుతాడు. దాంతో రాయలసీమకు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ బన్నీ అత్త ఉంటుందని అంటున్నారు. అత్త కోసం అక్కడ బన్నీ ఎదుర్కొన్న సమస్యలు ఏంటి....సినిమాలో ముగ్గురు హీరోయిన్ల కథేంటి? స్నేహ, ఉపేంద్ర పాత్ర ఏమిటి? అనేది ఆసక్తికరంగా ఉంటుందని' అంటున్నారు. ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది.Tuesday, 17 March 2015
‘S/O సత్యమూర్తి’ కథ లీక్, ఇదేనా?
హైదరాబాద్: అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్లో రాబోతున్న ‘S/O సత్యమూర్తి' కథ అంటూ ఒక చిన్న స్టోరీ లైన్ ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది...... ఆ ప్రచారం ప్రకారం ‘సత్యమూర్తికి వెన్నెల కిషోర్ మరియు అల్లు అర్జున్‌లు ఇద్దరు కొడుకులు. మిలియనీర్ అయిన సత్యమూర్తి తన వ్యాపార సామ్రాజ్యాన్ని దేశ విదేశాలకు విస్తరిస్తాడు. తండ్రి మిలియనీర్ అవ్వడంతో అల్లు అర్జున్ తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ బతుకుతూ ఉంటాడు. అయితే కొన్ని కారణాల వల్ల సత్యమూర్తి వ్యాపారంలో లాస్ వచ్చి, సత్యమూర్తి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని చనిపోతాడు. తండ్రి చనిపోవడంతో వెన్నెల కిషోర్ పిచ్చి వాడు అవుతాడు. సత్యమూర్తి చనిపోయే ముందు కొడుకులతో ఓ రహస్యం చెబుతాడు. దాంతో రాయలసీమకు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ బన్నీ అత్త ఉంటుందని అంటున్నారు. అత్త కోసం అక్కడ బన్నీ ఎదుర్కొన్న సమస్యలు ఏంటి....సినిమాలో ముగ్గురు హీరోయిన్ల కథేంటి? స్నేహ, ఉపేంద్ర పాత్ర ఏమిటి? అనేది ఆసక్తికరంగా ఉంటుందని' అంటున్నారు. ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది.Monday, 16 March 2015
'S/O సత్యమూర్తి' ఆన్ లొకేషన్లో ఇలా... (ఫోటోస్)










హైదరాబాద్: అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘S/O సత్యమూర్తి' ఆడియో వేడుక గ్రాండ్ గా ముగిసింది. ఇక చిత్ర యూనిట్ సినిమా విడుదలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా సినిమాకు పబ్లిసిటీ పెంచే ప్రయత్నంలో పడింది. తాజాగా సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ విడుదల చేసారు.
ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 2న కానీ, అల్లు అర్జున్ పుట్టిన రోజైన 8న కానీ విడుదలయ్యే అవకాసం ఉంది. అల్లు అర్జున్ సరసన సమంతా, అదా శర్మ, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటించగా దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తోంది.
మహిళపై ట్వీట్: రామ్ గోపాల్ వర్మ మళ్లీ రెచ్చిపోయాడు!
హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన నైజం ప్రదర్శించాడు. కావాలని వివాదాలు సృష్టించడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, తద్వారా పబ్లిసిటీ పెంచుకోవడం అలవాటు చేసుకున్న వర్మ ట్విట్టర్ వేదికగా తన ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేసారు. ఈ సారి ఆయన వ్యాఖ్యలు మహిళలను ఉద్దేశించి చేయడం గమనార్హం. ‘యాపిల్ కంపెనీ ఫోన్లు, వాచీలు, కార్లు తయారుచేస్తోందని.. అంతా బాగానే ఉంది.. అదే విధంగా యాపిల్ మహిళలను కూడా తయారు చేయాలని సిన్సియర్ గా కోరుకుంటున్నాను' అంటూ వివాదాస్పద ట్వీట్ చేసారు.
Sunday, 15 March 2015
రాఘవ లారెన్స్ ‘కాంచన 2’ ఫస్ట్ లుక్ ఇదే..
హైదరాబాద్: కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ గాయ పడ్డాడు. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ముని-3 : గంగా' (కాంచన-2) ఫస్ట్ లుక్ విడుదలైంది.
రాఘవ లెరెన్స్, తాప్సీ జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రానికి ఫోటోగ్రఫీ: కిచ్చా, సంగీతం: థమన్, సమర్పణ: మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: బెల్లంకొండ సురేష్, బెల్లకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-కొరియోగ్రఫీ-దర్శకత్వం: రాఘవ లారెన్స్.ఉపాసన...స్లిమ్ అయ్యేందుకు ఇలా! (ఫోటోస్)



హైదరాబాద్: హాలీవుడ్ ఫిట్నెస్ ట్రైనర్ రమోనా బ్రగాంజా హైదరాబాద్ వాసులకు శిక్షణ ఇచ్చేందుకు సిటీలో ల్యాండ్ అయ్యారు. అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలోని అపోలో లైఫ్ ఫిట్నెస్ సెంటర్లో రమోనా నెల రోజులపాటు శిక్షణ(ఏప్రిల్ 7 వరకు) ఇస్తారు. ఈ మేరకు ఆమెను నగర వాసులకు ఇంట్రడ్యూస్ చేస్తూ ఇటీవల ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అపోలో లైఫ్ నిర్వాహకురాలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన మాట్లాడుతూ...‘జెస్సికా అల్బా, హల్లీబెర్రీ, అన్నాహాత్వే తదితర హాలీవుడ్ నటులకు శిక్షకురాలిగా రమోనా పేరొందారు. వారందరికీ విజయవంతంగా శిక్షణనిచ్చి... వారి ఫిజిక్‌లను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆమె సేవలు హైదరాబాదీలకు అందుబాటులోకి తీసుకురావడం ఆనందంగా ఉంది. నేను కూడా కొంత కాలంగా రమోనా సూచనలు తీసుకొంటున్నా. ఇకపై ఆమె శిక్షణలో నా ఫిజిక్ మరింతగా మెరుగవుతుందని ఆశిస్తున్నా. మహిళలందరూ స్వయంశక్తితో ఎదగాలని కోరుకుంటూ ఆ దిశగా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఫిట్నెస్ ట్రైనర్లుగా మరింత మంది మహిళలు రావాలనేది నా ఆకాంక్ష' అని చెప్పారు.
Saturday, 14 March 2015
పూరీజగన్నాథ్ ఇంట్లో భారీ దొంగతనం
హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ నివాసంలో భారీ దొంగతనం జరిగింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెం. 31లో నివసించే పూరి జగన్నాథ్ కుటుంబం బయటకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి బెడ్రూమ్లో ఉన్న అలమరా తాళాలు తీసి బంగారు ఆభరణాలు దొంగలించారు.
దాంతో పూరి జగన్నాథ్ శుక్రవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలమరాలోని సుమారు రూ.15 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, అరుదైన డిజైన్లు, వజ్రాలు పొదిగిన నెక్లెస్ ఉన్నట్లు పేర్కొన్నారు.
Thursday, 12 March 2015
అంకెల గారడి, అంతా దాచి పెట్టే ప్రయత్నమే: బడ్జెట్‌పై వైయస్ జగన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ నిరాశకు గురిచేసిందని ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.ఆయన సమావేశాల అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ అంతా దాచిపెట్టే ప్రయత్నమే తప్ప.. ఏమీ కనిపించే అవకాశాల్లేవని మండిపడ్డారు. బడ్జెట్ వాస్తవదూరంగా ఉందని, వీలైనంతవరకు అన్నీ దాచిపెట్టే ప్రయత్నం చేశారని జగన్ విమర్శించారు. బడ్జెట్ అంతా అంకెల గారడీయేనని, అన్నీ గొప్పలు చెప్పుకొన్నారని మండిపడ్డారు. బడ్జెట్ లో అవాస్తవాలు చెప్పారని ఆరోపించారు. డ్వాక్రా మహిళలకు ఈ ఏడాది ఏం చేస్తారో చెప్పలేదని అన్నారు.ఫలానా పథకానికి గొప్పగా కేటాయింపులు చేశామని చెప్పుకొనే పరిస్థితి లేదని అన్నారు.
బడ్జెట్ అంశాలపై పూర్తిగా లోతుల్లోకి వెళ్లలేదని, దీనిపై మార్చి 16న మరోసారి స్పందిస్తానని చెప్పారు. కొత్తగా జీరో బేస్డ్ బడ్జెట్ అన్నారు గానీ..గతంలో చంద్రబాబునాయుడు సిఎంగా ఉన్నప్పుడు కూడా చేశారన్నారు. అప్పుడు జీరో బేస్డ్ బడ్జెట్ విఫలం కావడంతో ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టారని గుర్తు చేశారు. వ్యవసాయ రుణాలకు ఎంత ఇచ్చారు? ఎంత ఇవ్వబోతారో చెప్పలేదని అన్నారు. శాఖల వారీగా రెవెన్యూ ఎంత వచ్చింది?, ఎంత ఖర్చు చేశారన్నది లోతుగా చూడాల్సి ఉందని జగన్ చెప్పారు. డ్వాక్రా రుణాలపై వడ్డీ మాఫీ ఎంతో లేదని అన్నారు. గతం గురించి చెప్పారు గానీ, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో, ఏం చేయబోతోందో చెప్పనేలేదని వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
Subscribe to:
Posts (Atom)
















