Sunday, 15 March 2015

ఉపాసన...స్లిమ్ అయ్యేందుకు ఇలా! (ఫోటోస్)


హైదరాబాద్: హాలీవుడ్ ఫిట్‌నెస్ ట్రైనర్ రమోనా బ్రగాంజా హైదరాబాద్ వాసులకు శిక్షణ ఇచ్చేందుకు సిటీలో ల్యాండ్ అయ్యారు. అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలోని అపోలో లైఫ్ ఫిట్‌నెస్ సెంటర్‌లో రమోనా నెల రోజులపాటు శిక్షణ(ఏప్రిల్ 7 వరకు) ఇస్తారు. ఈ మేరకు ఆమెను నగర వాసులకు ఇంట్రడ్యూస్ చేస్తూ ఇటీవల ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అపోలో లైఫ్ నిర్వాహకురాలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన మాట్లాడుతూ...‘జెస్సికా అల్బా, హల్లీబెర్రీ, అన్నాహాత్‌వే తదితర హాలీవుడ్ నటులకు శిక్షకురాలిగా రమోనా పేరొందారు. వారందరికీ విజయవంతంగా శిక్షణనిచ్చి... వారి ఫిజిక్‌లను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆమె సేవలు హైదరాబాదీలకు అందుబాటులోకి తీసుకురావడం ఆనందంగా ఉంది. నేను కూడా కొంత కాలంగా రమోనా సూచనలు తీసుకొంటున్నా. ఇకపై ఆమె శిక్షణలో నా ఫిజిక్ మరింతగా మెరుగవుతుందని ఆశిస్తున్నా. మహిళలందరూ స్వయంశక్తితో ఎదగాలని కోరుకుంటూ ఆ దిశగా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఫిట్‌నెస్ ట్రైనర్లుగా మరింత మంది మహిళలు రావాలనేది నా ఆకాంక్ష' అని చెప్పారు.

No comments:

Post a Comment