Tuesday, 10 March 2015
"డాన్ ఘంటశాల" గా సంపూర్ణేష్ బాబు
హైదరాబాద్ : రీసెంట్ గా ..బందిపోటు చిత్రంలో అల్లరి నరేష్ తో సమానంగా నవ్వించిన సంపూర్ణేష్ బాబు మరోసారి తన సత్తా చూపించటానికి సిద్దమవుతున్నారు. ఈ సారి "డాన్ ఘంటశాల" గా ఆయన కనిపించనున్నారు. వేర్ ఈజ్ విద్యాబాలన్ అనే చిత్రంలో ఆయన కామెడీ విలన్ పాత్ర పోషిస్తున్నారని సమాచారం. సెకండాఫ్ లో సంపూర్ణేష్ బాబు కనిపించి, నవ్విస్తాడంటున్నారు. ఈ పాత్ర బాగా క్లిక్ అవుతుందని దర్శక,నిర్మాతలు బాగ నమ్మకం పెట్టుకున్నారు.
రామ్ చరణ్ సేవ: చిరంజీవి ట్రస్ట్, అపోలో సపోర్టుతో
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనదైన రీతిలో సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. తాజాగా చిన్న పిల్లల ఆరోగ్యంపై రామ్ చరణ్ దృష్టి సారించారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్టు, అపోలో హాస్పిటల్ సపోర్టుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పిల్లల హెల్త్ క్యాంపులు నిర్వహించాలని నిర్ణయించారు. రామ్ చరణ్ తండ్రి చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా మొదలు పెట్టిన సేవా కార్యక్రమాలను రామ్ చరణ్ కొనసాగిస్తున్నారు. రామ్ చరణ్ తో పాటు ఆయన భార్య ఉపాసన కామినేని కూడా ఇందులో పాలు పంచుకుంటున్నారు. ఈ విషయం గురించి రామ్ చరణ్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు.
చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, అపోలో హాస్పటల్ సంయుక్తంగా చిల్డ్రన్ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 12 డిపరెంట్ లోకేషన్లలో ఈ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. ఏ చిన్నారికి ఆరోగ్య సమస్య ఉన్నా మేము అక్కడ అంటెండ్ అవుతామని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బ్లడ్ బ్యాంక్ బాధ్యతలను కూడా రామ్ చరణ్ పర్యవేక్షిస్తున్నారు. ఆ మధ్య రామ్ చరణ్ మాట్లాడుతూ...2.65 లక్షల బ్లడ్ శాంపిల్స్ సేకరించాం. దాదాపు 8 లక్షల మందిని కాపాడగలిగామని తెలిపారు.
Monday, 9 March 2015
మీడియా విలేఖరిపై మోహన్ బాబు ఉగ్రరూపం(వీడియో)
హైదరాబాద్ : మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ నిశ్చితార్దంలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. పార్క్ హయిత్ లో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి సుషీల్ కుమార్ షిండే విచ్చేసారు. దాంతో జాతీయ ఛానెల్ టౌమ్స్ నౌ కి చెందిన విలేఖరి...నిర్బయ డాక్యుమెంటరీకు సంభందించిన ప్రశ్నను ఆయన్ని వేసారు. అలాంటివి వద్దని మోహన్ బాబు సూచించారు. అయినా సదరు విలేఖరి..షిండేతో మాట్లాడేందుకు ప్రయత్నించటంతో మోహన్ బాబు ఫైర్ అయ్యారు. ఓ వైపు షిండే ..ఆ ప్రశ్నకు సమాధానమిస్తూ...వారిస్తున్నా ఆయన ఉగ్రరూపం చల్లారలేదు. ఆ విలేఖరిని అక్కడనుంచి వెళ్లపొవాలని సూచించారు. దానికి సంభందించిన వీడియోని మీరు ఇక్కడ చూడండి.
మంచు మనోజ్ నిశ్చితార్థం ప్రణతితో బుధవారం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. వేదమంత్రాల సాక్షిగా, అత్యంత సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుకలో మనోజ్, ప్రణతి పెద్దల సమక్షంలో ఉంగరాలు మార్చుకొన్నారు. పట్టు షేర్వాణీతో మనోజ్, పసుపు పట్టుచీరతో ప్రణతి మెరిసిపోయారు. గౌరీ పూజ అనంతరం మోహన్‌బాబు, నిర్మల దంపతులు, వధువు తల్లిదండ్రులు సత్యనారాయణ, ప్రవీణ దంపతులు లగ్న పత్రికలు మార్చుకొన్నారు. అటు సినీ ప్రముఖులు, ఇటు రాజకీయ నాయకుల ఆగమనంతో వేడుక కళకళలాడింది. నిశ్చితార్థం పనులన్నీ తానే దగ్గరుండి చూసుకొన్న లక్ష్మీ ప్రసన్న... ఓ సందర్భంలో ఉద్వేగం ఆపుకోలేక కంటతడిపెట్టారు. ఆ సమయంలో విష్ణు ఆమెను ఓదార్చారు. మే 20న పెళ్లికి శుభ ముహూర్తం నిర్ణయించారు. అదే రోజు మనోజ్ పుట్టిన రోజు కావడం విశేషం. ఆ రోజు ఉదయం గం9.10 నిమిషాలకు హైదరాబాద్‌లో మనోజ్ - ప్రణతిల పెళ్లి జరగనుంది. నిశ్చితార్థానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జస్టిస్ జాస్తి చలమేశ్వర్, ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు, రాజకీయ ప్రముఖులు సుశీల్‌కుమార్ షిండే, వై.ఎస్.జగన్, డి.ఎస్, దానం నాగేందర్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి, తలసాని శ్రీనివాసయాదవ్, మహేందర్‌రెడ్డి, టి.సుబ్బరామిరెడ్డి, అమర్‌సింగ్ హాజరయ్యారు. సినీ ప్రముఖులు దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, చిరంజీవి, సురేఖ, కృష్ణంరాజు, రామ్‌చరణ్, ఉపాసన, అఖిల్, సునీల్, సుశాంత్, సుమంత్, శింబు, ఆది, బాలకృష్ణ సతీమణి వసుంధర, జయసుధ, జయప్రద, ప్రకాష్‌రాజ్, వినాయక్, మెహర్ రమేష్, బాబి, బి.గోపాల్, కైకాల సత్యనారాయణ, కోడి రామకృష్ణ, పరుచూరి గోపాల కృష్ణ, శ్రీకాంత్, శ్రీను వైట్ల, తాప్సి, ప్రణీత తదితరులు హాజరయ్యారు.
తాతను కాబోతున్నా: బాలకృష్ణ ప్రకటన
తుని : త్వరలో తాను తాతను కాబోతున్నానని ప్రముఖ సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో బుధవారం రాత్రి జరిగిన ఓ వివాహ వేడుకకు ఆయన హాజరై సందడి చేశారు. తన మిత్రుడైన చల్లకొండ రమేష్ కుమార్తె వివాహానికి హాజరై వధూవరులు నాగేశ్వరి, సురేష్‌లను ఆశీర్వదించారు. తాను త్వరలో తాతను కాబోతున్నానని చెప్పడంతో ఒక్కసారిగా అభిమానులు కేరింతలు కొట్టారు.కూతురుతో కలిసి మంచు లక్ష్మి ఇలా...(ఫోటో)
హైదరాబాద్: నటి మంచు లక్ష్మి మహాశివరాత్రిని పురస్కరించుకుని తన కూతురు విద్యా నిర్వాణతో కలిసి శివ పూజ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోను తన అభిమానులతో షేర్ చేసుకుంది. అటు కెరీర్, ఇటు ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్న మంచు లక్ష్మి....సాంప్రదాయలపై కూడా నమ్మకం, గౌరవం ఎక్కువే.
మంచు లక్ష్మి కూతురు పేరు 'విద్యా నిర్వాణ మంచు ఆనంద్'. సరోగసీ పద్దతి ద్వారా బిడ్డకు తల్లయింది. అంటే అద్దెగర్భం ద్వారా పిల్లలను కనడం అన్నమాట. మంచు లక్ష్మి, ఆమె భర్త ఆండీకి సహజ పద్దతిలో పిల్లలు పుట్ట లేదు. చాలా కాలం పిల్లల కోసం డాక్టర్ల చుట్టూ తిరిగారు. ఈ పరిణామ క్రమంలో చివరకు పిల్లలు వద్దనుకున్నారు. కానీ సరోగసీ ద్వారా పిల్లలు పుట్టే అవకాశం ఉండటంతో కుటుంబ సభ్యులతో చర్చించి ఆ పద్దతి ఫాలో అయ్యారు.
Subscribe to:
Posts (Atom)