Monday, 9 March 2015

మంచు లక్ష్మి ‘దొంగాట’ ఫస్ట్ లుక్ ఇదే..


హైదరాబాద్: మంచు లక్ష్మి-అడవి శేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘దొంగాట' సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతున్నాయి. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మంచు లక్ష్మి నిర్మిస్తున్న ఈ సినిమాకు గౌతమ్ మీనన్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఉమెన్స్ డే సందర్బంగా ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఈ చిత్రం మంచు లక్ష్మి చిట్టి కూతురు విద్యా నిర్వాణ సమర్ఫణలో విడుదలవుతోంది. దొంగాట సినిమా టీజర్‌ను ఉగాదికి, సినిమాను ఏప్రిల్ 16న రిలీజ్ చేసేందుకు నిర్మాత మంచు లక్ష్మి సన్నాహాలు చేస్తున్నారు. కింగ్ నాగార్జున, మాస్ మహారాజ్ రవితేజ, రానా దగ్గుబాటి, నాని, తమిళ హీరో శింబు, తాప్సీ తదితరులు ఓ పాటలో సందడి చేయనున్నారు. ‘దొంగాట' సినిమాకు ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం చెప్తుంది. సాధారణంగా హిందీలో ఎక్కువ ఈ తరహ ట్రెండ్ కనిపిస్తుంది. మన తెలుగులో మొదలవడం సంతోషించదగ్గ అంశం. ఇటీవలే ఈ పాటను హైదరాబాద్‌లో చిత్రీకరించారు.

మోడీపై బాబు గుర్రు: రోడ్డెక్కుతానని పవన్, జేపీ జత


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కేంద్ర ప్రభుత్వం పైన వివిధ రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. ప్రత్యేక ప్యాకేజీ కోసం అవసరమైతే రోడ్డెక్కుతానని జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలె ప్రకటించారు. తాజాగా లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ కూడా ప్రధాని మోడీ ప్రభుత్వం పైన ప్రత్యక్ష పోరుకు సిద్ధమని ప్రకటించారు. ఆసక్తికర విషయమేమంటే.. ఇరువురు నేతలు కూడా సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాని మోడీకి అనుకూలంగా మాట్లాడటం, మద్దతివ్వడం చేసినవారే. సార్వత్రిక ఎన్నికల సమయంలో జేపీ నాడు మోడిని కలిశారు. ఆ సమయంలో మోడీ.. జేపీకి కితాబిచ్చారు. మీలాంటి నేతలు పార్లమెంటులో ఉండాలన్నారు. మల్కాజిగిరి నుండి పోటీ చేసిన జేపీకి మద్దతివ్వలేకపోయినందుకు పవన్ కళ్యాణ్ కూడా ఒకింత అసంతృప్తి చెందారనే చెప్పవచ్చు. నాడు ప్రధాని మోడీకి అనుకూలంగా ఉన్న జేపీ, పవన్ కళ్యాణ్ వంటి నేతలు ఇప్పుడు అదే బీజేపీ పైన ప్రత్యక్ష పోరుకు సన్నద్ధమని చెబుతున్నారు. విభజన నేపథ్యంలో ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చడం లేదని ఆరోపిస్తున్నారు.

Bank of Baroda Recruitment 2015 – Apply Online for 1200 Probationary Officer Read more: Bank of Baroda Recruitment 2015


Bank of Baroda Recruitment 2015 – Apply Online for 1200 Probationary Officer Posts: Bank of Baroda has delivered notification for the recruitment of 1200 Probationary Officer Vacancies in Junior Management Grade/ Scale-I. Eligible candidates can apply online from 03-03-2015 to 17-03-2015. For more details regarding age limit, educational qualification, how to apply and other information is mentioned below… Bank of Baroda Vacancy Details: Total No of Posts: 1200 Name of the Post: Probationary Officer in Junior Management Grade/ Scale-I Name of the Category: 1. Unreserved: 606 Posts 2. OBC: 324 Posts 3. SC: 180 Posts 4. ST: 90 Posts Age Limit: Candidates age should be minimum 20 years and maximum 28 years as on 17-03-2015 i.e candidate must have been born not earlier than 18-03-1987 and not later than 17-03-1995 (both dates inclusive). Age relaxation is applicable as per rules. Educational Qualification: Candidates should possess Degree (Graduation) with minimum 60% (55% for SC/ ST/ PWD) marks in any discipline from a recognized University OR any equivalent qualification as such recognized by Central Government. Application Fee: Candidates have to pay Rs.100/- for SC/ ST/ PWD candidates and Rs.600/- for General & OBC candidates from 03-03-2015 to 17-03-2015. Candidates can pay the fee by using Debit Cards (RuPay/ Visa/ Master Card/ Maestro), Credit Cards, Internet Banking, IMPS, Cash Cards/ Mobile Wallets. On successful completion of the transaction an e-receipt, Registration Number & Password will be generated. Selection Process: Candidates are selected based on Online Exam followed by Group Discussion & Interview. How to Apply: Candidates can apply online through the website www.bankofbaroda.com website from 03-03-2015 to 17-03-2015. Instructions for Online Application: 1. Candidates should have a valid personal email ID, contact No. 2. Before applying candidates have to scan photo (200 x 230 pixels between 20kb to 50 kb) and signature (140 x 60 pixels between 10kb to 20kb). 3. Log on to the website www.bankofbaroda.com 4. Click on “ADMISSION IN BARODA MANIPAL SCHOOL OF BANKING FOR THE YEAR 2015-16″. 5. Click here to Apply Online —> APPLY ONLINE. 6. Enter their basic details, Personal Details, contact details, Qualification and upload photo and signature. 7. After filling all the details click on Submit button. 8. Make payment as through credit/ debit card and click on Submit button. 9. After successfully completion a Registration Number and Password will be generated, retain for future reference. 10. An E-Mail & SMS indicating the Provisional Registration number and Password will be sent. 11. If the online transaction has not been successfully completed then “Your online transaction was unsuccessful’. Please register again” message will be displayed. 12. Revisit the ‘Apply Online’ link and fill in their application details again. 13. On successful completion of the transaction, an e-receipt will be generated, take a print of the e-receipt and retain it for future use. 14. Finally take print out of the filled application and retain it for future use. Important Dates: Start Date of Online Application & Payment of Fee: 03-03-2015. Last Date for Submission of Online Application & Payment of Fee: 17-03-2015. Download of Call letter for Examination: From 07-04-2015. Date of Examination (Tentative): 18-04-2015. For more information regarding age limit, educational qualification, pay scale, application fee, how to apply, selection procedure and other information are available at below given link…http://www.bankofbaroda.com/Careers/Admission_28_2_2015.asp

Sunday, 8 March 2015

Dochey Movie Latest Photos


5గురు గర్ల్స్ ఒడిలో పడుకొని విద్యార్థి ఫోటో: వివాదం


బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో ఓ విద్యార్థి క్లాసులోని అమ్మాయిల ఒడిలో పడుకొని ఓ పొటో తీయించుకున్నాడు. అది ఇప్పుడు విమర్శలకు దారి తీస్తోంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వేగంగా పాకిపోవడంతో.. పలువురు దీని పైన మండిపడుతున్నారు. హిందూ సంస్థలు కొన్ని కళాశాల ఎదుట ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో అమ్మాయిల ఒడిలో పడుకున్న వ్యక్తిని కిడ్నాప్ చేశారు. అతనిని చితకబాది వదిలేశారు. ఆ ఫోటోను తన మిత్రులు సరదాగా తీశారని అతను చెబుతున్నాడు. కాగా, విద్యార్థితో పాటు అతను ఎవరి ఒడిలో పడుకున్నాడో.. ఆ విద్యార్థినీలను కళాశాల సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ ఫోటో ఓ అమ్మాయి ఫేస్‌బుక్ అకౌంట్ నుండి బయటకు వచ్చింది. దీని పైన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాదాస్పదమైన ఆ ఫోటోను తన ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ చేసి అప్ లోడ్ చేశారని ఆరోపించారు. ఈ ఫోటోను తన క్లాస్‌మేట్ ఒకరు ఫిబ్రవరి 18వ తేదీన తీశారని, అనంతరం ఫేస్‌బుక్‌లో అప్ లోడ్ చేశారని చెప్పారు. తన ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ చేసి దానిని అప్ లోడ్ చేశారని ఫిర్యాదు చేశారు. సురత్కాల్ పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకొని, కేసును దర్యాఫ్తు చేస్తున్నారు.

పన్ను కట్టని హీరోయిన్


సినిమా చేయడానికి కోట్లకు కోట్లు రెమ్యున్ రేషన్ అడగటంలో వెనుకాడని హీరోయిన్ నయనతారకు పాపం ఇంటి పన్ను కట్టడానికి డబ్పులు లేవేమో. ఇంటి పన్ను కట్టనందుకు నయనతారకు ఊటీ కార్పోరేషన్ అధికారులు ఇంటివాటర్, డ్రైనేజ్ కనెక్షన్లు కట్ చేస్తున్నట్లు నోటీసులు జారీ చేశారు. నీలగిరి జిల్లా ఊటీ సమీపంలో లవ్ టెల్ రోడ్డు రాయల్ కాస్టిల్ ప్రాంతంలో నయనతారకు ఇల్లు ఉంది. కాని ఈ అమ్మడు చాలా కాలం నుండి ఇంటి పన్నునే కట్టడం లేదట. దీంతో ఊటీ కార్పోరేషన్ అధికారులు నయనతార ఇంటికి తాళం వేసి జప్తు నోటీసులు అతికించారు.

సోనమ్ కపూర్ కి స్వైన్ ఫ్లూ తగ్గింది


అందాలతార బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ కు స్వైన్ ఫ్లూ వచ్చిందన్న విషయం అందరికీ తెలిసిందే. ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సోనమ్ కపూర్ కి స్వైన్ ఫ్లూ తగ్గి ఆరోగ్యం మెరుగుపడటంతో ఈ రోజు ఆమెను డిస్చార్జ్ చేశారు. ఆసుపత్రి నుండి ఇంటికి చేరుకున్నాను. హోం స్వీట్ హోం అని తానే స్వయంగా ట్విట్టర్ లో తెలిపింది. రాజ్‌కోట్ సమీపంలో సోనమ్ సల్మాన్ ఖాన్ సరసన నటిస్తున్న ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ సినిమా షూటింగ్ జరుగుతున్న సందర్భంగా గత శుక్రవారం నాడు ఆమె అస్వస్థతకు గురైంది. దాంతో ఆమెను స్థానికంగా వున్న ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తరువాత ముంబై ఆస్పత్రికి తరలించారు. ఆమెకు ఫ్లూ జ్వరం వచ్చిందని మొదట భావించారు. అయితే వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెకు స్వైన్ ఫ్లూ వచ్చినట్టు డాక్టర్లు నిర్ధారించారు.

పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏమి మాట్లాడుతాడోఆయనకే తెలియదు: జగన్


పవన్ కళ్యాణ్ రాజధాని గ్రామాలలో తనకంటే ఒకరోజు ముందే పర్యటించబోతున్నారనే సంగతి తెలిసి కంగారుపడిన వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయనపై తన మీడియా ద్వారా విమర్శలు గుప్పించారు. కానీ తన పర్యటన తరువాతే పవన్ కళ్యాణ్ తుళ్ళూరుకి బయలుదేరుతారని తెలిసి ఆయన చల్లబడ్డారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ తుళ్ళూరులో ఒకలాగ, హైదరాబాద్ చేరుకోగానే మరొకలాగా మాట్లాడి అభాసుపాలవడంతో అందరి కంటే ఎక్కువగా వైకాపాయే చాలా సంతోషించి ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. అదే అభిప్రాయం జగన్ మాటలలో ప్రతిఫలించింది. నిన్న శాసనసభ సమావేశం ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడిన జగన్, ఒక ప్రశ్నకు బదులిస్తూ, “ఆయన (పవన్ కళ్యాణ్) ఎప్పుడు ఏమి మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. ఆయన తుళ్ళూరులో ఏమి మాట్లాడారో, హైదరాబాద్ కి తిరిగి వచ్చి ఏమి మాట్లాడారో అందరూ విన్నారు. మరి రేపు ఏమి మాట్లాడబోతాడో ప్రజలే ఆయనని అడగాలి,” అని సమాధానం ఇచ్చేరు. కానీ తన తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన భూ కుంభకోణాల గురించి పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలకు మాత్రం నేరుగా సమాధానం చెప్పకుండా, “ఆయన చనిపోయి ఏడేళ్లయింది. చనిపోయిన వ్యక్తి గురించి ఇపుడు కొందరు మాట్లాడుతున్నారు. కానీ ఇపుడు జరుగుతున్న అక్రమాలను మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు’’ అని నేర్పుగా సమాధానం దాటవేసారు. ఏడేళ్ళ క్రితం చనిపోయిన తన తండ్రి పేరు చెప్పుకొని ఇప్పటికీ ఓదార్పు యాత్రలు చేస్తూ, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాల గురించి చెప్పుకొంటూ రాజకీయ లబ్ది పొందాలని ఆశిస్తున్న జగన్మోహన్ రెడ్డి, ఆయన హయాంలో జరిగిన అవినీతి గురించి మాత్రం ఎవరూ మాట్లాడకూడదని అంటున్నారు. పైగా తనకు ప్రజలు అవకాశమిస్తే మళ్ళీ రాజన్న రాజ్యం స్థాపిస్తానని గొప్పగా చెప్పుకొంటున్నారు కూడా! నేటికీ జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? డిల్లీలో ఉండే ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సంస్థ జగన్ కి చెందిన వందల కోట్లు ఆస్తులను ఎందుకు జప్తు చేసుకొంటోంది? అయినా దానిపై జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన మీడియా గానీ ఎప్పుడు ఎందుకు స్పందించవు? అని ప్రశ్నించుకొంటే వచ్చే సమాధానం ఆయన నీతి నిజాయితీల గురించి తెలియజేస్తుంది. నిజమే! పవన్ కళ్యాణ్ బొత్తిగా రాజకీయ అనుభవం లేక తప్పటడుగులు వేస్తూ అభాసుపాలవుతున్నారు. అందుకు ఆయనే నష్టపోతారు. కానీ బొత్తిగా రాజకీయ అనుభవం లేని ఆయన తుళ్ళూరు పర్యటిస్తారనగానే వైకాపా ఎందుకు ఉలికిపడింది? ఎందుకు అంత తీవ్రంగా స్పందించింది? అని ప్రశ్నించుకొంటే ఎవరు ఎంత నీతిమంతులో, ఎవరి పోరాటంలో ఎంత నిజాయితీ ఉందో అందరికీ అర్ధమవుతుంది. ఒకవేళ ఇప్పుడు అక్రమాలు జరుగుతున్నాయని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లయితే, ఆయన ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీయవచ్చును. ఇంకా అవసరమనుకొంటే కోర్టుకు కూడా వెళ్లి ఆ అక్రమాలను అడ్డుకోవచ్చును. ఆయనను ఎవరూ అడ్డుకోవడం లేదు. కానీ, ఆయన ఈ అంశాలను కూడా తన రాజకీయ లబ్ది కోసమే ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నారు తప్ప ప్రజలకు, రాష్ట్రానికి ఏదో నష్టం జరిగిపోతోందని ఆవేదనతో మాట్లాడుతున్న మాటలు కావవి. ఇక కేంద్రం నుండి నిధులు రాబట్టడంలో విఫలమయినప్పటికీ ఇంకా తెదేపా, బీజేపీతో ఎన్డీయేతో అంటకాగుతూ డ్రామాలు ఆడుతోందని ఆక్షేపించారు. అంటే కేంద్రం నిధులు ఇవ్వకపోతే తక్షణమే తెదేపా బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారన్న మాట. అయితే అలా చేస్తే కేంద్రం నుండి భారీగా నిధులు వచ్చిపడిపోతాయా? లేక రాష్ట్రం ఇంకా నష్టపోతుందా? అని ఆలోచిస్తే నష్టపోయే అవకాశాలే ఎక్కువని ఎటువంటి రాజకీయ జ్ఞానం లేని వారు కూడా చెప్పగలరు. కానీ తనను తాను గొప్ప రాజకీయ మేధావిగా, రాష్ట్రం కోసం, ప్రజల కోసం పరితపించిపోయే గొప్ప వ్యక్తిగా భావించుకొంటున్న జగన్మోహన్ రెడ్డి, కేంద్రంతో తెగతెంపులు చేసుకోమని సలహా ఇస్తున్నారు! దేనికి? అనే ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి లేదా వైకాపా నేతలెవరూ సమాధానం చెప్పకపోవచ్చును. కానీ కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “మా ఎన్డీయే కూటమిలో చేరాలని కొందరు ఆరాటపడుతున్నట్లు కనబడుతోంది. ఒకవేళ తెదేపా మా కూటమి నుండి బయటకు వచ్చేస్తే వాళ్ళు లోపలకి ప్రవేశించాలని చూస్తున్నట్లుంది. కానీ అది అసంభవం. తెదేపా, బీజేపీల మధ్య మంచి బలమయిన స్నేహ సంబంధాలున్నాయి. రెండూ కలిసి రాష్ట్రాభివృద్ధికి తద్వారా దేశాభివృద్ధికి కలిసి పనిచేస్తాయి,” అని చెప్పారు. కేంద్రం నిధులు ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి నేరుగా కేంద్రాన్ని ప్రశ్నించాలి. కానీ ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నారు, విమర్శిస్తున్నారు. ఎందుకు? అంటే దానికీ వెంకయ్య నాయుడు సమాధానమే వర్తిస్తుంది. తను బీజేపీతో, కేంద్రంతో చాలా జాగ్రత్తగా, లౌక్యంగా కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లు వ్యవహరిస్తూనే బీజేపీతో ఎన్డీయే ప్రభుత్వంతో తెదేపా కలిసిపనిచేయడాన్ని ఏదో పెద్ద నేరం అన్నట్లుగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మాటలు వింటుంటే తను చేస్తున్న ఈ రాజకీయాలను ప్రజలు గమనించడం లేదని, గమనించినా వారికి అర్ధం చేసుకొనే శక్తి లేదని భావిస్తున్నట్లుంది. వారికి ఆ శక్తి ఉందో లేదో ఎన్నికలలో చూపారు. ఇంకా గ్రహించలేకపోతే ఎవరు మాత్రం వైకాపాను ఆయన భారి నుండి కాపాడగలరు?