సంచలన విజయంతోపాటు రికార్డుల కలెక్షన్లతో దూసుకుపోతున్న అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓ విభిన్న పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్నసంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పోషించిన పాత్రను ఆయన సోదరుడు నాగబాబు అనుకరించనున్నాడు. త్వరలో విడుదల కానున్న 'చూసినోడికి చూసినంత' అనే చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్రను పోలివుండే కారెక్టర్ ను నాగబాబు పోషిస్తున్నారని చిత్ర దర్శకుడు అనిల్ వాటుపాలి తెలిపారు.
ఈ చిత్రంలో పవన్ పేరుతో ఉండే పాత్రను ఈ చిత్రంలో నాగబాబు చేస్తున్నారని.. ఆ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పవన్ పాత్రతో పోలివుండే లుక్ ను షూట్ చేశామన్నారు. కేవలం వినోదం కోసమే నాగబాబుతో ఈ పాత్రను చేయిస్తున్నామని.. అభిమానులు మరోలా భావించకూడదు అని అనిల్ అన్నారు. ఈ పాత్రలో నటించేటప్పుడు నాగబాబు ఎంజాయ్ చేశారు అని తెలిపారు. ఈ చిత్రంలో శివాజీ, కృష్ణుడు, నిత్యాలు ప్రధాన పాత్రలో నటించారు.Tuesday, 26 November 2013
పవన్ కళ్యాణ్ ను అనుకరించిన అన్నయ్య!
సంచలన విజయంతోపాటు రికార్డుల కలెక్షన్లతో దూసుకుపోతున్న అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓ విభిన్న పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్నసంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పోషించిన పాత్రను ఆయన సోదరుడు నాగబాబు అనుకరించనున్నాడు. త్వరలో విడుదల కానున్న 'చూసినోడికి చూసినంత' అనే చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్రను పోలివుండే కారెక్టర్ ను నాగబాబు పోషిస్తున్నారని చిత్ర దర్శకుడు అనిల్ వాటుపాలి తెలిపారు.
ఈ చిత్రంలో పవన్ పేరుతో ఉండే పాత్రను ఈ చిత్రంలో నాగబాబు చేస్తున్నారని.. ఆ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పవన్ పాత్రతో పోలివుండే లుక్ ను షూట్ చేశామన్నారు. కేవలం వినోదం కోసమే నాగబాబుతో ఈ పాత్రను చేయిస్తున్నామని.. అభిమానులు మరోలా భావించకూడదు అని అనిల్ అన్నారు. ఈ పాత్రలో నటించేటప్పుడు నాగబాబు ఎంజాయ్ చేశారు అని తెలిపారు. ఈ చిత్రంలో శివాజీ, కృష్ణుడు, నిత్యాలు ప్రధాన పాత్రలో నటించారు.Monday, 25 November 2013
రామ్ గోపాల్ వర్మ పిటీషన్ తిరస్కరణ
సత్య 2 సినిమాను నిర్మించిన ప్రముఖ డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ కు నాంపల్లి కోర్టులో రెండోసారీ చుక్కెదురు అయ్యింది. సెన్సార్ బోర్డ్ ప్రాంతీయ అథికారిణి ధనలక్ష్మి తన సినిమాకు ఉద్దేశపూర్వకంగా ఆటంకాలు కల్పిస్తున్నారని, ఆమెపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన రెండోసారి ధాఖలు చేసిన పిటీషన్ ను కూడాకోర్టు తిరస్కరించిందని సమాచారం. కొద్దిరోజులు క్రితం నాంపల్లి కోర్టులో వర్మ తరుపు న్యాయవాది పిటీషన్ వేయగా అది తమ పరిధిలోకి రాదంటూ ఈ నెల 20న తిరస్కరించింది.
ఈ విషయమై తాము పలువురు న్యాయవాదులను సంప్రదించామని,సెన్సార్ బోర్డ్ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం మసాబ్ ట్యాంక్ కు ప్రాంతంలో ఉండటంతో నాంపల్లి కోర్టులో పిటీషన్ దాఖలు చేయాలని వారు సూచించడంతో 12వ సీఎంఎంకోర్టులో పిటీషన్ పేర్కొంటూ వర్మ తరుపు న్యాయవాది రెండోసారి పిటీషన్ దాఖలు చేసారు. కోర్టు వర్గాల సమాచారం మేరకు...రెండో పిటీషన్ పైనా పరిథి తమది కాదు అని కోర్టు రాసిందని తెలుస్తోంది. దీనిపై వర్మ న్యాయవాదిని సంప్రదించగా...తమ పిటీషన్ ని కోర్టు రెండోసారి తిరస్కరించిన విషయం తమనకు తెలియదని చెప్పారు.రామ్ గోపాల్ వర్మ వేసిన పిటీషన్‌పై సెన్సార్ ఆఫీసర్ ధనలక్ష్మి స్సందించినట్లు తెలుస్తోంది. సినిమాల సెన్సార్ విషయంలో తాను ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం లేదని, రివ్యూ కమిటీ సభ్యులంతా కలిసే సెన్సార్ చేస్తామని, వర్మ పిటీషన్ దాఖలు చేసే ముందు రివ్యూ కమిటీని సంప్రదించి ఉండాల్సిందని వ్యాఖ్యానించినట్లు సమాచారం. సత్య 2 సినిమాలో ముగ్గురు ప్రముఖ వ్యక్తులను ఉద్దేశించేలా సన్నివేశాలు ఉన్నాయని, ఓ టీవీ ఛానల్ నుండి సెన్సార్ బోర్డుకు మెమోరండం అందిందని, సినిమాలో నుండి తమ సీఈవో పేరు తొలగించాలని వారు కోరినట్లు సమాచారం. వర్మ సినిమాలో ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీవీ9 సీఈఓ రవిప్రకాష్, మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ లను ఉద్దేశించిన సన్నివేశాలు ఉన్నట్లు ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు. కాగా...పిటీషన్ దాఖలు చేయడానికి ముందు ఆయన పలు టీవీ ఛానళ్లలో ఈ విషయమై లైవ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ఇండస్ట్రీ పెద్దలు మద్దతు ప్రకటించారు. వర్మకు మద్దతుగా నిలిచిన వారిలో ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు, మోహన్ బాబు కాడా ఉన్నారు. ఇప్పటి వరకు సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ ధనలక్ష్మి గురించి ఎవరికీ ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలువురు నిర్మాతలు వాపోయారు.
అమ్మ అంత అందంగా...
‘ఆ భగవంతుడు మాకిచ్చిన వరం మా కూతురు ఆరాధ్య’ అని ఓ సందర్భంలో ఐశ్వర్యరాయ్ ఎంతో మురిపెంగా చెప్పారు. ఈ నెల 16న ఆరాధ్య పుట్టినరోజు వేడుకను సన్నిహితుల మధ్య ఘనంగా జరిపారు అభిషేక్, ఐశ్వర్య. పాపకు రెండేళ్లు పూర్తయ్యాయి కాబట్టి.. ఇక నటిగా ఐష్ రీ-ఎంట్రీకి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఐష్ కూడా ఆ సన్నాహాల్లోనే ఉన్నారట. మరోవైపు ఇటీవల తన తల్లిదండ్రులు వృందారాయ్, కృష్ణరాజ్, సోదరుడు ఆదిత్య, అతని భార్యతో కలిసి కూతుర్ని తీసుకుని ఐష్ దుబాయ్ వెళ్లారట.
‘హ్యాపీ న్యూ ఇయర్’ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్న అభిషేక్‌బచ్చన్ మాత్రం ఈ ట్రిప్‌ని మిస్ అయ్యారు.పుట్టింటివాళ్లతో హాయిగా గడిపి ఐష్ ముంబయ్ వచ్చారు. మామూలుగా ఈ అందాల సుందరి పబ్లిక్‌లోకి వస్తే.. కొన్ని కెమెరాలు ఆమెను వెంటాడతాయి. పైగా, కూతుర్ని తీసుకొని బయటకు వచ్చారంటే, ఈ తల్లీకూతుళ్లను కెమెరాలో బంధించడానికి ఫొటోగ్రాఫర్లు తాపత్రయపడతారు. ఈ క్రమంలో ఇటీవల దుబాయ్ ట్రిప్ ముగించుకుని ఐష్ ముంబయ్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో కొంతమంది ఫొటోలు తీశారు. ఆ ఫొటోల్లో క్యూట్‌గా ఉన్న రెండేళ్ల ఆరాధ్యని చూస్తే.. అచ్చం అమ్మలా మంచి అందగత్తె అవుతుందని అందరూ అనుకున్నారు.
Saturday, 23 November 2013
హైటెక్ సిటీ బాబు సొత్తా, ఫోటోలకి ఫోజులిస్తున్నాడు: కెకె
రాష్ట్ర రాజధానిలోని హైటెక్ సిటీ వద్ద తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఫోటోలకు ఫోజులిస్తున్నాడని, అది ఆయన సొత్తు కాదని తెరాస జాతీయ కార్యదర్శి కె కేశవ రావు శనివారం విమర్శించారు. హైదరాబాద్ నగరంలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని తమ వారికి ధారాదత్తం చేసిన బాబు హైటెక్ సిటీ తన సొత్తు అన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు.
హైటెక్ సిటీ నిర్మించిన భూములేమైనా బాబు సొత్తా అని ప్రశ్నించారు. ఈ భూములన్నీ తెలంగాణ భూములేనని బాబు గ్రహించాలని అన్నారు. హైదరాబాద్‌లో దోపిడీని కొనసాగించేందుకే కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారని టిఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే నాయిని నర్సింహా రెడ్డి విమర్శించారు. టిఆర్‌ఎస్ 13ఏళ్ల ఉద్యమ ఫలితంగానే తెలంగాణ ఏర్పడుతోందని అన్నారు. సంపూర్ణ తెలంగాణాను టిఆర్‌ఎస్ కోరుకుంటోందని, ఎలాంటి పేచీలు పెట్టినా మళ్లీ ఉద్యమించడానికి టిఆర్‌ఎస్ సిద్ధంగా ఉందని నాయిని హెచ్చరించారు.
అసెంబ్లీ ప్రొరోగ్ వ్యవహారం రామాయణంలో పిడకల వేట కంటే చిన్న విషయమని, దానిని తాము పట్టించుకోబోమని తెలంగాణ ఐకాస చైర్మన్ కోదండరాం వేరుగా అన్నారు.అసెంబ్లీ ప్రొరోగ్ అయినా కాకపోయినా అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై నిర్ణీత వ్యవధిలో చర్చ జరిగినా జరగకపోయినా ఆ బిల్లును పార్లమెంటుకు పంపించే పూర్తి అధికారాలు రాష్ట్రపతికి ఉన్నాయన్నారు. ఆర్టికల్ 371 డి, ప్రొరోగ్ ఆలోచనలన్నీ అవివేకపు, మూర్ఖత్వపు ఆలోచనలేనని, తెలంగాణ ఆగే ప్రసక్తే లేదని అన్నారు. 'భద్రాచలం తెలంగాణలో అంతర్భాగం' అనే అంశంపై హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో కోదండరాం మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు ముగింపు దశకు వచ్చిందని, సీమాంధ్ర పాలకులకు ఇంగిత జ్ఞానం ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో విడిపోయిందని తెలుసుకుని శాంతియుతంగా విభజనకు సహకరించాలని, లేకుంటే కాల గర్భంలో కలిసి పోతారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌పై ఏ ఒక్క ఆంక్షనూ సహించబోమన్నారు.
ఐశ్వర్యారాయ్ కు సైతం తప్పని అత్తపోరు...
అత్త పోరుపై ఆ మధ్య కాలం దాకా సినిమాలు వచ్చి ఆగిపోయాయి. తర్వాత కోడళ్లు సాధింపు సీరియల్స్ పాపులర్ అయ్యాయి. దానకి ఉమ్మడి కుటుంబాలు... కలిసి కాపురాలు తగ్గాయన్నారు. అయితే ఈ కాలంలో కూడా ఐశ్వర్యారాయ్ వంటి స్టార్ హీరోయిన్ కి అత్తపోరు తప్పలేదని ముంబై మీడియా సమాచారం. అందాల సుందరి ఐశ్వర్యారాయ్ కూడా ఇప్పుడు ఇలాంటి విషయంలో వార్తల్లోకెక్కింది. బిగ్‌బీ కుటుంబంలో ఇప్పుడు ఇలాంటి వాతావరణం ఉందా అని అందరూ ఒకింత ఆశ్చర్యపోతున్నారు. దానికి కారణం అత్తాకోడళ్లకు పడడంలేదన్న వార్తలు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు కూడా ఇది నిజమేనేమో అనేలా చేశాయి.
బచ్చన్ కోడలు ఐశ్వర్య వేరు కాపురం పెట్టాలని యోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అత్త జయాబచ్చన్ వైఖరితో ఐశ్వర్య ఇమడలేకపోతోందట. ఐశ్వర్యారాయ్‌కు సంబంధించిన ప్రతి చిన్న విషయంలోనూ జయాబచ్చన్ జోక్యం చేసుకోవడాన్ని ఐశ్వర్య జీర్ణించుకోలేకపోతోంది. ఈ కారణంవల్లే అత్తాకోడళ్ల మధ్య మనస్ఫర్ధలు పొడచూపుతున్నట్లు తెలుస్తోంది.వ్యక్తిగత స్వేచ్ఛతో సంబంధం లేకుండా చేసే ప్రతిపని, తీసుకునే ప్రతి నిర్ణయం గురించి అత్త జయాబచ్చన్‌కు ఐశ్వర్య చెప్పాల్సిందేనట. అత్తతో రోజూ ఎదుర్కొంటున్న సమస్యతో విసుగెత్తిపోయి, ఓపిక నశించిపోవడంతో స్వతంత్రంగా ఉండాలని ఐశ్వర్య ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఫొటో జర్నలిస్టులు ఐశ్వర్యను ఆమె పేరుతో (అత్తింటి పేరు లేకుండా) పిలవడంతో చూసిన జయబచ్చన్ కోపంతో ఊగిపోయిందంటున్నారు. అంతేగాక ఆ ఫొటో జర్నలిస్టులపై తీవ్రస్థాయిలో మండిపడింది. 'ఐశ్వర్యా... ఐశ్వర్యా అంటూ పిలవడం ఏమిటి... ఆమె ఏమైనా మీ స్నేహితురాలా, క్లాస్‌మేటా?'' అని ప్రశ్నించింది. ఇదంతా మీడియా ఎదుటే చోటుచేసుకోవడంతో అత్త జయాబచ్చన్ వ్యవహారశైలి కోడలు ఐశ్వర్యరాయ్‌ను నొప్పించింది.
ఈ సంఘటన తర్వాత అత్తపై అసంతృప్తి వ్యక్తంచేయకపోయినా ఇద్దరి మధ్యా దూరం పెరిగినట్లు తెలుస్తోంది. అయితే భర్త అభిషేక్ బచ్చన్, మామ అమితాబ్ బచ్చన్‌లపై ఐశ్వర్యకు ప్రేమాభిమానాలు ఏమీ తగ్గలేదు. అభిషేక్ ఆమెకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛనిస్తారట. దానికితోడు మామ అమితాబ్ ఆమె వ్యక్తిగత విషయాల్లో అసలు జోక్యం చేసుకోరని అంటున్నారు. ఓ బిడ్డకు తల్లి అయిన ఐశ్వర్యరాయ్ బచ్చన్ త్వరలోనే బాలీవుడ్‌లోకి తిరిగి ప్రవేశించాలని భావిస్తోంది. ఈ సమయంలో ఐశ్వర్య అభీష్టానికి అత్తగా జయాబచ్చన్ అడ్డుచెబితే ఇరువురి మధ్యా విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో ఇదంతా జరగడానికి ముందే భర్త, కుమార్తెతో కలిసి అత్తమామలకు దూరంగా వేరు కాపురం పెట్టాలని ఐశ్వర్యారాయ్ భావిస్తున్నట్లు సమాచారం.
హీరోయిన్ గా శృతి హాసన్ చెల్లెలు ఖరారు...డిటేల్స్
: తెలుగు,తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న శృతి హాసన్ చెల్లి త్వరలో ప్రేక్షకులను అలరించటానికి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. కమల్ హాసన్ రెండవ కుమార్తె అయిన అక్షర హాసన్ ఆర్.బల్కి రూపొందించబోతున్న ఓ హిందీ సినిమాలో ఆమెను హీరోయిన్ గా తీసుకోబోతున్నారు. ఇంతకాలం డైరక్షన్ డిపార్టెమెంట్ లో అశోశియేట్ డైరక్టర్ గా పలువురు దర్శకుల దగ్గర పనిచేసిన అక్షర ఉన్నట్టుండి నటనవైపు ఆసక్తి చూపించటంతో కమల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ధనుష్ సరసన ఆమె హీరోయిన్ గా కనిపించనుంది.
అలాగే ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ మరో కీలకపాత్రలో చేయనున్నారు. అమితాబ్ తో బల్కి గతంలో చీనీకామ్, పా చిత్రాలు రూపొందించారు. దాంతో ముంబయికి మకాం మార్చమని చెల్లెలికి సలహా ఇచ్చిందట శ్రుతి హాసన్. అక్షర కూడా ముంబయిలో ఫ్లాటు కోసం అన్వేషిస్తున్నట్లు సన్నిహితులు తెలిపారు. కమల్ కూతురు అనే ముద్రతో వెండి తెర మీదకొచ్చినా ఇప్పుడు తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సాధించింది శ్రుతి హాసన్. ప్రస్తుతం ఆమె తెలుగు, హిందీల్లో చేతి నిండా సినిమాలతో తీరిక లేకుండా ఉంది. ఇప్పుడు ఆమె బాటలోనే చెల్లెలు అక్షర హాసన్ కూడా నడవాలని భావిస్తున్నట్లు బాలీవుడ్ సమాచారం.తండ్రితో పాటు శృతిని స్ఫూర్తిగా తీసుకుని అక్షర హాసన్ కూడా తెరంగేట్రం చేయబోతోందని వినికిడి. ఇందుకోసం ఇప్పటికే పావులు కదుపుతోందని, అందుకు తండ్రి మద్ధతు కూడా ఆమెకు ఉందని అంటున్నారు. అక్షర హాసన్ మొదటిగా బాలీవుడ్‌లో పాగా వేయాలని కోరుకుంటోందని, ఓ హిందీ చిత్రంలో ఆమెను ఎంపికచేశారని చెప్పుకుంటున్నారు. అక్షర కూడా తన అక్క శృతి మాదిరిగానే సినీ పరిశ్రమలో ఏ శాఖ ఎంచుకోవాలన్న తర్జనభర్జనలో ఉందని అంటున్నారు. మొదట్లో శృతి కూడా గాయనిగా, సంగీత దర్శకురాలిగా రాణించాలని అనుకుని, ఆ తర్వాత నటనను వృత్తిగా ఎంచుకోవడం విశేషం. ఇక అక్షర కూడా హీరోయిన్‌గా, రచయిత్రిగా, దర్శకురాలిగా ఎందులో రాణిస్తే అందులో స్థిరపడాలని ఆకాంక్షిస్తోందట.
Friday, 22 November 2013
'అత్తారింటికెళ్లారు: పవర్ కల్యాణ్‌లా వద్దు'
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు గవర్నర్ నరసింహన్ రాజకీయాలపై హెచ్చరించారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో వారం రోజుల పాటు జరిగిన 18వ అంతర్జాతీయ చిత్రోత్సవాలు బుధవారం సాయంత్రం లలిత కళా తోరణంలో ముగిశాయి.
ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, మంత్రి డికె అరుణలతో పాటు హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా వచ్చారు. ఈ సమయంలో నరసింహన్.. పవన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ సాగుతోంది.
పవన్‌ను ఉద్దేశించి ఆరడుగుల బుల్లెట్టు.. ధైర్యం విసిరిన రాకెట్టు అని చెప్పిన గవర్నర్ ఆ తర్వాత ‘అత్తారింటికి దారేది సినిమా ద్వారా పవన్ కల్యాణ్ తన పవర్ చూపించారు.అయితే పవన్ కల్యాణ్ ఇంట్లో పవర్ కల్యాణ్‌లా కాకుండా పవన్ కల్యాణ్‌లా ఉండాలి' అని ఛలోక్తులు విసిరారు. ఈ సమయంలో పవన్ ముసి ముసి నవ్వులు నవ్వారు. ఇటీవల పవన్ రాజకీయాల్లోకి వస్తారని, తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని, ప్రజారాజ్యం పార్టీని పునరుద్దరిస్తారనే ప్రచారం సాగింది. ఆ ప్రచారాన్ని ఖండించినప్పటికీ.. పుకార్లు వినిపించిన నేపథ్యంలో పవన్ కల్యాణ్‌ను రాజకీయాల్లోకి రావొద్దనే ఉద్దేశ్యంతోనే గవర్నర్ ఆ హెచ్చరికను చలోక్తిగా చేశారని అంటున్నారు.
సమంతపై విరుచుకు పడ్డ నాగ్!!
సామాన్యంగా ఆవేసాలకు దూరంగా ఉండే నాగార్జున ‘మనం’ సెట్లో తన విపరీతమైన కోపాన్ని ప్రదర్శించి అందర్నీ టార్గెట్ చేసాడని వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రధానకారణం ‘మనం’ సినిమాలో అఖిల్ నటిస్తున్న విషయం మీడియాకు లీక్ కావడం. మనం సినిమాలో క్లైమేక్స్ దగ్గర వచ్చే సన్నివేశాలలో సుమారు మూడు నిముషాల నిడివి ఉండేటట్లుగా అఖిల్ పాత్రను డిజైన్ చేసి ఒక ట్రైల్ షూట్ చేసారట. అందులో అఖిల్ నటించే సన్నివేశాలను షూట్ చేసారు. అయితే ‘మనం’ సినిమాలో అఖిల్ నటిస్తున్న విషయాన్ని చివరి వరకు రహస్యంగా ఉంచాలని నాగార్జన కోరికట. దీనికోసం ‘మనం’ లో అఖిల్ నటిస్తున్న వార్తలను ఎక్కడా మీడియాకు లీకులు ఇవ్వద్దని నాగార్జున స్వయంగా చెప్పినా ఈ వార్తలు ప్రముఖ ఛానల్స్ లో కూడా ప్రసారం కావడం నాగార్జునకు కోపాన్ని అసహనాన్ని తెప్పించాయట.ప్రముఖ ఛానల్స్ అన్నీ అఖిల్ గురించి ఈవార్తలు ప్రసారం చేసిన ఆరోజు ఉదయాన్న హీరోయిన్ సమంత పెట్టిన ట్విట్ ఇంత గందరగోళానికి దారితీసిందని నాగ్ అభిప్రాయమట. ‘మనం సినిమాలో ఒక అద్భుతం ఉంది త్వరలో మీకు చెపుతాను’ అని సమంత పెట్టిన ట్విట్ బట్టీ ఇంత హంగామా జరిగి తను ఎంతగానో ఊహించుకుని రచించిన పబ్లిసిటీ ప్లాన్ పాడైపోయిందనీ అటు ‘మనం’ యూనిట్ సభ్యుల మీద ఇటు సమంత మీద విరుచుకు పడ్డాడట వెండి తెర మన్మధుడు. సమంత తన ట్విటర్ ద్వారా చేస్తున్న ప్రచారం ‘అత్తారింటికి’ కలిసి వస్తే ‘మనం’ విషయంలో నాగ్ కు కోపాన్ని తెప్పించింది.
Subscribe to:
Posts (Atom)