Saturday, 23 November 2013

హైటెక్ సిటీ బాబు సొత్తా, ఫోటోలకి ఫోజులిస్తున్నాడు: కెకె


రాష్ట్ర రాజధానిలోని హైటెక్ సిటీ వద్ద తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఫోటోలకు ఫోజులిస్తున్నాడని, అది ఆయన సొత్తు కాదని తెరాస జాతీయ కార్యదర్శి కె కేశవ రావు శనివారం విమర్శించారు. హైదరాబాద్ నగరంలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని తమ వారికి ధారాదత్తం చేసిన బాబు హైటెక్ సిటీ తన సొత్తు అన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. హైటెక్ సిటీ నిర్మించిన భూములేమైనా బాబు సొత్తా అని ప్రశ్నించారు. ఈ భూములన్నీ తెలంగాణ భూములేనని బాబు గ్రహించాలని అన్నారు. హైదరాబాద్‌లో దోపిడీని కొనసాగించేందుకే కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారని టిఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే నాయిని నర్సింహా రెడ్డి విమర్శించారు. టిఆర్‌ఎస్ 13ఏళ్ల ఉద్యమ ఫలితంగానే తెలంగాణ ఏర్పడుతోందని అన్నారు. సంపూర్ణ తెలంగాణాను టిఆర్‌ఎస్ కోరుకుంటోందని, ఎలాంటి పేచీలు పెట్టినా మళ్లీ ఉద్యమించడానికి టిఆర్‌ఎస్ సిద్ధంగా ఉందని నాయిని హెచ్చరించారు. అసెంబ్లీ ప్రొరోగ్ వ్యవహారం రామాయణంలో పిడకల వేట కంటే చిన్న విషయమని, దానిని తాము పట్టించుకోబోమని తెలంగాణ ఐకాస చైర్మన్ కోదండరాం వేరుగా అన్నారు.

 అసెంబ్లీ ప్రొరోగ్ అయినా కాకపోయినా అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై నిర్ణీత వ్యవధిలో చర్చ జరిగినా జరగకపోయినా ఆ బిల్లును పార్లమెంటుకు పంపించే పూర్తి అధికారాలు రాష్ట్రపతికి ఉన్నాయన్నారు. ఆర్టికల్ 371 డి, ప్రొరోగ్ ఆలోచనలన్నీ అవివేకపు, మూర్ఖత్వపు ఆలోచనలేనని, తెలంగాణ ఆగే ప్రసక్తే లేదని అన్నారు. 'భద్రాచలం తెలంగాణలో అంతర్భాగం' అనే అంశంపై హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో కోదండరాం మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు ముగింపు దశకు వచ్చిందని, సీమాంధ్ర పాలకులకు ఇంగిత జ్ఞానం ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో విడిపోయిందని తెలుసుకుని శాంతియుతంగా విభజనకు సహకరించాలని, లేకుంటే కాల గర్భంలో కలిసి పోతారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌పై ఏ ఒక్క ఆంక్షనూ సహించబోమన్నారు.

ఐశ్వర్యారాయ్ కు సైతం తప్పని అత్తపోరు...


అత్త పోరుపై ఆ మధ్య కాలం దాకా సినిమాలు వచ్చి ఆగిపోయాయి. తర్వాత కోడళ్లు సాధింపు సీరియల్స్ పాపులర్ అయ్యాయి. దానకి ఉమ్మడి కుటుంబాలు... కలిసి కాపురాలు తగ్గాయన్నారు. అయితే ఈ కాలంలో కూడా ఐశ్వర్యారాయ్ వంటి స్టార్ హీరోయిన్ కి అత్తపోరు తప్పలేదని ముంబై మీడియా సమాచారం. అందాల సుందరి ఐశ్వర్యారాయ్‌ కూడా ఇప్పుడు ఇలాంటి విషయంలో వార్తల్లోకెక్కింది. బిగ్‌బీ కుటుంబంలో ఇప్పుడు ఇలాంటి వాతావరణం ఉందా అని అందరూ ఒకింత ఆశ్చర్యపోతున్నారు. దానికి కారణం అత్తాకోడళ్లకు పడడంలేదన్న వార్తలు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు కూడా ఇది నిజమేనేమో అనేలా చేశాయి. బచ్చన్‌ కోడలు ఐశ్వర్య వేరు కాపురం పెట్టాలని యోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అత్త జయాబచ్చన్‌ వైఖరితో ఐశ్వర్య ఇమడలేకపోతోందట. ఐశ్వర్యారాయ్‌కు సంబంధించిన ప్రతి చిన్న విషయంలోనూ జయాబచ్చన్‌ జోక్యం చేసుకోవడాన్ని ఐశ్వర్య జీర్ణించుకోలేకపోతోంది. ఈ కారణంవల్లే అత్తాకోడళ్ల మధ్య మనస్ఫర్ధలు పొడచూపుతున్నట్లు తెలుస్తోంది.

 వ్యక్తిగత స్వేచ్ఛతో సంబంధం లేకుండా చేసే ప్రతిపని, తీసుకునే ప్రతి నిర్ణయం గురించి అత్త జయాబచ్చన్‌కు ఐశ్వర్య చెప్పాల్సిందేనట. అత్తతో రోజూ ఎదుర్కొంటున్న సమస్యతో విసుగెత్తిపోయి, ఓపిక నశించిపోవడంతో స్వతంత్రంగా ఉండాలని ఐశ్వర్య ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఫొటో జర్నలిస్టులు ఐశ్వర్యను ఆమె పేరుతో (అత్తింటి పేరు లేకుండా) పిలవడంతో చూసిన జయబచ్చన్‌ కోపంతో ఊగిపోయిందంటున్నారు. అంతేగాక ఆ ఫొటో జర్నలిస్టులపై తీవ్రస్థాయిలో మండిపడింది. 'ఐశ్వర్యా... ఐశ్వర్యా అంటూ పిలవడం ఏమిటి... ఆమె ఏమైనా మీ స్నేహితురాలా, క్లాస్‌మేటా?'' అని ప్రశ్నించింది. ఇదంతా మీడియా ఎదుటే చోటుచేసుకోవడంతో అత్త జయాబచ్చన్‌ వ్యవహారశైలి కోడలు ఐశ్వర్యరాయ్‌ను నొప్పించింది.

 ఈ సంఘటన తర్వాత అత్తపై అసంతృప్తి వ్యక్తంచేయకపోయినా ఇద్దరి మధ్యా దూరం పెరిగినట్లు తెలుస్తోంది. అయితే భర్త అభిషేక్‌ బచ్చన్‌, మామ అమితాబ్‌ బచ్చన్‌లపై ఐశ్వర్యకు ప్రేమాభిమానాలు ఏమీ తగ్గలేదు. అభిషేక్‌ ఆమెకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛనిస్తారట. దానికితోడు మామ అమితాబ్‌ ఆమె వ్యక్తిగత విషయాల్లో అసలు జోక్యం చేసుకోరని అంటున్నారు. ఓ బిడ్డకు తల్లి అయిన ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ త్వరలోనే బాలీవుడ్‌లోకి తిరిగి ప్రవేశించాలని భావిస్తోంది. ఈ సమయంలో ఐశ్వర్య అభీష్టానికి అత్తగా జయాబచ్చన్‌ అడ్డుచెబితే ఇరువురి మధ్యా విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో ఇదంతా జరగడానికి ముందే భర్త, కుమార్తెతో కలిసి అత్తమామలకు దూరంగా వేరు కాపురం పెట్టాలని ఐశ్వర్యారాయ్‌ భావిస్తున్నట్లు సమాచారం.

హీరోయిన్ గా శృతి హాసన్ చెల్లెలు ఖరారు...డిటేల్స్


: తెలుగు,తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న శృతి హాసన్ చెల్లి త్వరలో ప్రేక్షకులను అలరించటానికి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. కమల్‌ హాసన్‌ రెండవ కుమార్తె అయిన అక్షర హాసన్ ఆర్‌.బల్కి రూపొందించబోతున్న ఓ హిందీ సినిమాలో ఆమెను హీరోయిన్ గా తీసుకోబోతున్నారు. ఇంతకాలం డైరక్షన్ డిపార్టెమెంట్ లో అశోశియేట్ డైరక్టర్ గా పలువురు దర్శకుల దగ్గర పనిచేసిన అక్షర ఉన్నట్టుండి నటనవైపు ఆసక్తి చూపించటంతో కమల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ధనుష్ సరసన ఆమె హీరోయిన్ గా కనిపించనుంది. అలాగే ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ మరో కీలకపాత్రలో చేయనున్నారు. అమితాబ్ తో బల్కి గతంలో చీనీకామ్, పా చిత్రాలు రూపొందించారు. దాంతో ముంబయికి మకాం మార్చమని చెల్లెలికి సలహా ఇచ్చిందట శ్రుతి హాసన్‌. అక్షర కూడా ముంబయిలో ఫ్లాటు కోసం అన్వేషిస్తున్నట్లు సన్నిహితులు తెలిపారు. కమల్ కూతురు అనే ముద్రతో వెండి తెర మీదకొచ్చినా ఇప్పుడు తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సాధించింది శ్రుతి హాసన్‌. ప్రస్తుతం ఆమె తెలుగు, హిందీల్లో చేతి నిండా సినిమాలతో తీరిక లేకుండా ఉంది. ఇప్పుడు ఆమె బాటలోనే చెల్లెలు అక్షర హాసన్‌ కూడా నడవాలని భావిస్తున్నట్లు బాలీవుడ్‌ సమాచారం.
 తండ్రితో పాటు శృతిని స్ఫూర్తిగా తీసుకుని అక్షర హాసన్‌ కూడా తెరంగేట్రం చేయబోతోందని వినికిడి. ఇందుకోసం ఇప్పటికే పావులు కదుపుతోందని, అందుకు తండ్రి మద్ధతు కూడా ఆమెకు ఉందని అంటున్నారు. అక్షర హాసన్‌ మొదటిగా బాలీవుడ్‌లో పాగా వేయాలని కోరుకుంటోందని, ఓ హిందీ చిత్రంలో ఆమెను ఎంపికచేశారని చెప్పుకుంటున్నారు. అక్షర కూడా తన అక్క శృతి మాదిరిగానే సినీ పరిశ్రమలో ఏ శాఖ ఎంచుకోవాలన్న తర్జనభర్జనలో ఉందని అంటున్నారు. మొదట్లో శృతి కూడా గాయనిగా, సంగీత దర్శకురాలిగా రాణించాలని అనుకుని, ఆ తర్వాత నటనను వృత్తిగా ఎంచుకోవడం విశేషం. ఇక అక్షర కూడా హీరోయిన్‌గా, రచయిత్రిగా, దర్శకురాలిగా ఎందులో రాణిస్తే అందులో స్థిరపడాలని ఆకాంక్షిస్తోందట.

Friday, 22 November 2013

'అత్తారింటికెళ్లారు: పవర్ కల్యాణ్‌లా వద్దు'


పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు గవర్నర్ నరసింహన్ రాజకీయాలపై హెచ్చరించారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో వారం రోజుల పాటు జరిగిన 18వ అంతర్జాతీయ చిత్రోత్సవాలు బుధవారం సాయంత్రం లలిత కళా తోరణంలో ముగిశాయి. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, మంత్రి డికె అరుణలతో పాటు హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా వచ్చారు. ఈ సమయంలో నరసింహన్.. పవన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ సాగుతోంది. పవన్‌ను ఉద్దేశించి ఆరడుగుల బుల్లెట్టు.. ధైర్యం విసిరిన రాకెట్టు అని చెప్పిన గవర్నర్ ఆ తర్వాత ‘అత్తారింటికి దారేది సినిమా ద్వారా పవన్ కల్యాణ్ తన పవర్ చూపించారు.

అయితే పవన్ కల్యాణ్ ఇంట్లో పవర్ కల్యాణ్‌లా కాకుండా పవన్ కల్యాణ్‌లా ఉండాలి' అని ఛలోక్తులు విసిరారు. ఈ సమయంలో పవన్ ముసి ముసి నవ్వులు నవ్వారు. ఇటీవల పవన్ రాజకీయాల్లోకి వస్తారని, తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని, ప్రజారాజ్యం పార్టీని పునరుద్దరిస్తారనే ప్రచారం సాగింది. ఆ ప్రచారాన్ని ఖండించినప్పటికీ.. పుకార్లు వినిపించిన నేపథ్యంలో పవన్ కల్యాణ్‌ను రాజకీయాల్లోకి రావొద్దనే ఉద్దేశ్యంతోనే గవర్నర్ ఆ హెచ్చరికను చలోక్తిగా చేశారని అంటున్నారు.

సమంతపై విరుచుకు పడ్డ నాగ్!!


సామాన్యంగా ఆవేసాలకు దూరంగా ఉండే నాగార్జున ‘మనం’ సెట్లో తన విపరీతమైన కోపాన్ని ప్రదర్శించి అందర్నీ టార్గెట్ చేసాడని వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రధానకారణం ‘మనం’ సినిమాలో అఖిల్ నటిస్తున్న విషయం మీడియాకు లీక్ కావడం. మనం సినిమాలో క్లైమేక్స్ దగ్గర వచ్చే సన్నివేశాలలో సుమారు మూడు నిముషాల నిడివి ఉండేటట్లుగా అఖిల్ పాత్రను డిజైన్ చేసి ఒక ట్రైల్ షూట్ చేసారట. అందులో అఖిల్ నటించే సన్నివేశాలను షూట్ చేసారు. అయితే ‘మనం’ సినిమాలో అఖిల్ నటిస్తున్న విషయాన్ని చివరి వరకు రహస్యంగా ఉంచాలని నాగార్జన కోరికట. దీనికోసం ‘మనం’ లో అఖిల్ నటిస్తున్న వార్తలను ఎక్కడా మీడియాకు లీకులు ఇవ్వద్దని నాగార్జున స్వయంగా చెప్పినా ఈ వార్తలు ప్రముఖ ఛానల్స్ లో కూడా ప్రసారం కావడం నాగార్జునకు కోపాన్ని అసహనాన్ని తెప్పించాయట.

 ప్రముఖ ఛానల్స్ అన్నీ అఖిల్ గురించి ఈవార్తలు ప్రసారం చేసిన ఆరోజు ఉదయాన్న హీరోయిన్ సమంత పెట్టిన ట్విట్ ఇంత గందరగోళానికి దారితీసిందని నాగ్ అభిప్రాయమట. ‘మనం సినిమాలో ఒక అద్భుతం ఉంది త్వరలో మీకు చెపుతాను’ అని సమంత పెట్టిన ట్విట్ బట్టీ ఇంత హంగామా జరిగి తను ఎంతగానో ఊహించుకుని రచించిన పబ్లిసిటీ ప్లాన్ పాడైపోయిందనీ అటు ‘మనం’ యూనిట్ సభ్యుల మీద ఇటు సమంత మీద విరుచుకు పడ్డాడట వెండి తెర మన్మధుడు. సమంత తన ట్విటర్ ద్వారా చేస్తున్న ప్రచారం ‘అత్తారింటికి’ కలిసి వస్తే ‘మనం’ విషయంలో నాగ్ కు కోపాన్ని తెప్పించింది.

Tuesday, 19 November 2013

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వ ఆహ్వానం ?


ప్రస్తుతం భాగ్యనగరంలో అంతర్జాతీయ చిల్డ్రన్ ఫెస్టివల్ జరుగుతోంది. దాదాపు 48 దేశాల ప్రతినిధులు వారు నిర్మించిన సినిమాలు భాగ్యనగరంలోని చాల ధియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఎలట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వెబ్ మీడియాల దృష్టి అంతా రాష్ట్ర విభజన సమస్య పై ఉండటంతో ఈ చిల్డ్రన్ ఫెస్టివల్ కు అనుకున్నంత మీడియా కవరేజ్ రావడంలేదు. అయినా చాల మంచి, పిల్లల సినిమాలు ఈ ఫెస్టివల్ కు వచ్చినట్లుగా తెలుస్తోంది. నవంబర్ 14న ప్రారంభం అయిన ఈ ఫెస్టివల్ ఈరోజు ముగింపుకు వస్తోంది. ఈ ఫెస్టివల్ ను బాలీవుడ్ క్రేజీ హీరో రణబీర్ కపూర్ ప్రారంభించాడు.

ఈరోజు జరగబోతున్న ముగింపు ఉత్సవానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్న చిల్డ్రన్ ఫిలిం సొసైటీ ముఖ్య అతిధిగా పిలిచినట్లుగా వార్తలు వస్తున్నాయి. పవన్ అభిమానుల క్రేజ్ రీత్యా ఈ వార్తను చివరి నిముషంలో ప్రకటిస్తారు అని అంటున్నారు. గత వారంరోజులుగా ఈ ఫెస్టివల్ మన రాజధానిలో జరుగుతున్నా మన టాలీవుడ్ సెలెబ్రెటీలు ఎవ్వరూ ఈ ఉత్సవం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కానీ తెలుస్తున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం పవన్ ఈ ముగింపు ఉత్సవానికి ముఖ్య అతిధిగా హాజర అవుతాడు అని అంటున్నారు. పవన్ కు చిన్న పిల్లలంటే ఉన్న విపరీతమైన అభిమానం పవర్ స్టార్ చేత ఈ ఉత్సవాలకు వచ్చేటట్లుగా చేసింది అని టాక్. ఈ వార్తలే నిజమైతే పవన్ కళ్యాణ్ పాల్గొంటున్న మొట్టమొదటి ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా రికార్డుకేక్కుతుంది.

మ‌హేష్‌కు సిక్స్ ప్యాక్ రెడీ


టాలీవుడ్‌లో హీరో ఎవ‌రంటే ప్రిన్స్ మ‌హేష్‌బాబు పేరే చెబుతారు అమ్మాయిల గుండెల్లో ఇప్పటికీ రాకుమారుడిగానే ఉన్నాడు ఈ ప్రిన్స్‌ అయితే సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టెనర్ 1 నేనొక్కడినే అయితే మ‌హేష్ గ్లామర్ కాస్త త‌గ్గిన‌ట్టే అనిపిస్తోంది తాజాగా ఈచిత్రంలోని సీన్స్‌కు సన్నివేశాలకు సంబంధించిన కొన్ని మ‌హేష్ ఫోటోలు లీక‌యిన చూస్తుంటే. ఇదంతా సిక్స్ ప్యాక్ ఎఫెక్టే అని తెలిసింది. సిక్స్ ప్యాక్ వ‌ల్ల కండలు పెరుగుతాయి స‌రేకానీ ముఖంలో తీవ్ర మైన మార్పులొస్తాయి. ఈ చిత్రాన్ని సంక్రాంతి పండగకు జనవరి 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మహేష్ బాబు క్రితి సానన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటి మహేష్ బాబు సినిమాలకు యూఎస్‌లో బాగా డిమాండ్ ఉండటంతో అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పలు చిత్రాలకు హిట్ మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ తొలిసారిగా మహేష్ బాబు చిత్రానికి పని చేస్తున్నారు

శివశంకర్‌ మాస్టర్ కి డాక్టరేట్


: ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్‌కు బెంగళూరుకు చెందిన ఇంటర్నేషనల్‌ గ్లోబల్‌ ట్రస్ట్‌ పీస్‌ సంస్థ గౌరవ డాక్టరేట్‌ అందించింది. ఇటీవల ఆయన ఈ డాక్టరేట్‌ని స్వీకరించారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, మరాఠీ ఇలా దాదాపు పది చిత్రసీమలతో ఆయనకు అనుబంధం ఉంది. 'మగధీర' చిత్రానికి ఉత్తమ నృత్య దర్శకుడిగా జాతీయ పురస్కారం అందుకొన్నారు. శివ శంకర్ మాట్లాడుతూ... ''మీ నృత్యంలో పవిత్రత ఉంది. అందుకే ఈ పురస్కారం అందిస్తున్నాం... అని ఈ సంస్థ ప్రతినిధులు నాకు చెప్పారు. ఆ మాట వినగానే చాలా సంతోషం వేసింది. నృత్యమే నా శ్వాస. అదే నా జీవితం. ఎన్ని భాషల్లో పనిచేసినా తెలుగు సినిమాలంటేనే నాకు ప్రేమ. నటుడిగానూ రాణించాలని ఉంది'' అన్నారు. ఈ సందర్భంగా శివ శంకర్ మాస్టర్ కి ధట్స్ తెలుగు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.

ఇక శివ శంకర్ మాస్టర్ డాన్స్ మాస్టర్ గానే కాక, టీవి పోగ్రామ్స్ లోనూ పాపులర్. ఇక రీసెంట్ గా విడుదలైన మసాలా చిత్రంలో తన పాత్రకు శివ శంకర్ పాత్రే స్పూర్తి అని రామ్ అన్నారు. రామ్ మాట్లాడుతూ.. 'మసాలా' లో రెండో రకం పాత్ర కోసం ప్రత్యేకంగా ఏమైనా తర్ఫీదు పొందటంలాంటిదేమీ లేదు . అయితే ఆ పాత్ర విషయంలో శివశంకర్‌ మాస్టర్‌ నాకు బాగా సహకరించారు. సినిమాలో ఆ పాత్రపై ఓ పాట ఉంటుంది. దాంతోనే సినిమా చిత్రీకరణ ప్రారంభించాం. శివశంకర్‌ మాస్టర్‌ నృత్యరీతులు సమకూర్చడంతో నా పని సులువైంది. సినిమా మొత్తం ఆయన్ని అనుకరిస్తూ నటించా. రెండు కోణాల్లో సాగే పాత్ర అది. రెండో రకం పాత్ర కాస్త తేడాగా ఉంటుంది అన్నారు.