Wednesday, 6 November 2013

సచిన్ కు థ్యాంక్యూ చెప్పాలనుకుంటున్నారా?


ప్రపంచ క్రికెట్ కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అందించిన సేవలకు గుర్తుగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సోషల్ మీడియా వెబ్ సైట్ లో #ThankYouSachin అనే అకౌంట్ ప్రారంభించారు. విశ్వవ్యాప్తంగా సచిన్ టెండూల్కర్ కు ఉన్న అభిమానులు కృతజ్క్షతలు తెలియ చేయడానికి ఈ అకౌంట్ ను అందుబాటులోకి తెచ్చారు.


 అభిమానులు @BCCI #ThankYouSachin అకౌంట్ ఉపయోగించి మెసేజ్ పంపితే.. ఒక్క క్షణంలోనే బీసీసీఐ ట్విటర్ అకౌంట్ నుంచి సచిన్ ఆటోగ్రాఫ్ తో ఉన్న పోస్టర్ వస్తుంది. సచిన్ ఆటోగ్రాఫ్ తో ఉన్న పోస్టర్ ను అభిమానులు తమ పేరుతో పొందాలనుకుంటే మీరు ప్రయత్నించవచ్చు. నేను ప్రయత్నించాను.. మీరు కూడా ప్రయత్నించి సచిన్ వాల్ పోస్టర్ పొందండి.. మరి ఆలస్యమెందుకు?


 బీసీసీఐ చేసిన ప్రయత్నానికి వేలాది మంది అభిమానుల నుంచి స్పందన వచ్చిందని బీసీసీఐ వెల్లడించింది.

గోపిచంద్‌ తో తమన్నా రొమాన్స్...డిటేల్స్


గోపీచంద్‌, తమన్నా కాంబినేషన్ లో చిత్రం రాబోతోందా అంటే అవుననే అంటు న్నాయి టాలీవుడ్‌ వర్గాలు. అహనా పెళ్ళంట, పూలరంగడు, భాయ్‌ సినిమాలకు దర్శకత్వం వహించిన వీరభద్రమ్‌ ఈ చిత్రానికి దర్శ కత్వం వహిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. భవ్యక్రియేషన్స్‌ పతాకంపై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పూర్తి స్ధాయి కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుందని చెప్పుకుంటున్నారు. గతంలో 'శౌర్యం", 'అమరావతి", 'వాంటెడ్‌" చిత్రాలు నిర్మించిన భవ్య క్రియేషన్స్‌ వీరభద్రమ్‌తో నిర్మించే చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఈ చిత్రంలో గోపీచంద్ హీరోగా చేయనున్నాడు. వీరభధ్రమ్ చెప్పిన కథను విన్న గోపీచంద్ స్టోరీ లైన్ ఓకే చేసి కొన్ని స్క్రిప్టు కరెక్షన్స్ చెప్పాడని తెలుస్తోంది. ఇక నాగార్జున తో చేసిన భాయ్ చిత్రం పెద్దగా వర్కవుట్ కాకపోయినా దర్శకుడుగా బాగానే హ్యాండిల్ చేసాడనే పేరు మాత్రం వచ్చింది. దాంతో గోపీచంద్ ...చేయటానికి ఆసక్తి చూపుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం గోపీచంద్‌ బి.గోపాల్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందు లో నయనతార హీరోయిన్. నిర్మాత తాండ్ర రమేష్, బి. గోపాల్-గోపీచంద్‌ల కాంబినేషన్‌తో నిర్మిస్తున్న తాజా చిత్రం గురించి చెబుతూ..బి. గోపాల్ దర్శకత్వంలో గోపీచంద్ కథానాయకుడిగా నిర్మిస్తున్న మా చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ని సెప్టెంబర్ 3 నుంచి స్విట్జర్లాండ్‌లో మొదలు పెట్టామన్నారు. అక్కడి అందమైన లొకేషన్స్‌లో రచయిత శ్రీమణి రాసిన రెండు యుగళ గీతాలను గోపీచంద్, నయనతారలపైన దినేష్ మాస్టర్ నృత్య దర్శకత్వంలో చిత్రీకరిస్తున్నామని తెలిపారు. అలాగే తమన్నా తమిళంలో వీరం చిత్రంలో నటిస్తోంది. తెలుగులో మహేష్‌తో కలిసి ఆగడు చేస్తోంది. ఈ సినిమా ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే....పలు సౌత్ ప్రాజెక్టులతో పాటు, బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్ సాజిద్-పర్హాద్ ‘ఇట్స్ ఎంటర్టెన్మెంట్స్' చిత్రంతో పాటు, సాజిద్ ఖాన్ ‘హమ్ షకల్' చిత్రంలో నటిస్తోది. సౌత్‌లో సిరుతై శివ దర్శకత్వంలో అజిత్ హీరోగా తెరకెక్కుతున్న తమిళ మూవీ ‘వీరమ్'లో నటిస్తోంది. మహేష్ బాబు తర్వాతి సినిమా ‘ఆగడు' చిత్రంలో కూడా తమన్నా హీరోయిన్‌గా ఎంపికయినట్లు తెలుస్తోంది.

సిఐ చొక్కా పట్టిన అంబటి రాంబాబు!, హెచ్చరిక, అరెస్టు


గుంటూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ముఖ్య నేత అంబటి రాంబాబు బుధవారం ఓ సిఐ చొక్కా పట్టుకున్నారట. సమైక్యాంధ్రకు మద్దతుగా జగన్ పార్టీ బుధవారం, గురువారం రహదారుల దిగ్బంధానికి పిలుపునివ్వగా, అంబటి రాంబాబు గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలో రోడ్డు పైన రాస్తా రోకో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో అంబటి రెచ్చిపోయారు. సీఐ చొక్కా పట్టుకుని, వేలెత్తి చూపుతూ హెచ్చరికలు చేశారని వార్తలు వచ్చాయి. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబటి సహా 50 మంది కార్యకర్తలు కొండమోడు సెంటర్లో రాస్తా రోకోకు దిగారు. దీంతో మూడు కిలో మీటర్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది.


 ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా రాస్తారోకోను విరమించాలని సీఐలు బిలాలుద్దీన్, వై. శ్రీధర్‌రెడ్డిలు అంబటికి సూచించారు. రాస్తారోకో విరమించేదిలేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు భీష్మించుకుకూర్చున్నారు. దీంతో సత్తెనపల్లి డిఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు వలయంగా ఏర్పడి అంబటితో పాటు కార్యకర్తలను పక్కకు లాగేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో పోలీసులు అంబటి మధ్య వాగ్వివాదం జరిగింది. పోలీసుల పైకి వేలెత్తిచూపుతూ అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోపంతో ఇద్దరు సిఐ చొక్కాలను పట్టుకొని, నా ఒంటిపై చేయి వేస్తారా? అంటూ మండిపడ్డారట. అంబటిని బలవంతంగా పోలీసులు జీపులోకి ఎక్కించి పిడుగురాళ్ల పోలీసు స్టేషన్‌కు తరలించారు. స్టేషన్ ఎదుట, కొండమోడు సెంటర్లో కార్యకర్తలు కొద్దిసేపు మళ్లీ రాస్తారోకో చేశారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేశారు.

వోల్వో ప్రమాదం: నిమిషాల్లో మృతి, అలాఐతే బతికేవారు



వారం రోజుల క్రితం మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన బస్సు ప్రమాదం పైన విచారణ జరుగుతోంది. బస్సులో సజీవదహనమైన వారు మంటలు అంటుకున్న రెండు నిమిషాల్లోనే మరణించినట్లుగా క్లూస్ టీం నిర్ధారించినట్లుగా తెలుస్తోంది. మంటలు వ్యాపించిన క్షణాల్లోనే కార్పన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్ పెద్ద ఎత్తున ఉత్పత్తయ్యాయి. దీంతో గాఢనిద్రలో ఉన్న ప్రయాణీకులు మేల్కొనేసరికి ఆ రెండు వాయువులు బస్సు అంతటా వ్యాపించాయి. దీంతో వారు ఊపిరాడక అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. బస్సులోకి ఆక్సిజన్ అందలేదు. ఆ స్థితిలో ఎవరైనా ఒకటి రెండు నిమిషాల కంటే ఎక్కువ సేపు బతకడం అసాధ్యమని, అద్దాలు పగులగొట్టి ఉంటే ఆక్సిజన్ సరఫరా జరిగి చాలామంది బతికే వారని, ఆ అవకాశం లేకపోవడంతో మంటలు తీవ్రత పెరగకముందే అంతా మృత్యువాత పడ్డారని తేల్చింది. దీంతో ప్రయాణీకులు మరణించాకే మంటల్లో కాలిపోయారని, బస్సుల్లో బాణసంచా, పేలుడు పదార్థాలు లేవని తేల్చింది.

కల్వర్టును బస్సు దూసుకు వచ్చి తాకడంతో ప్రమాదం సంభవించింది. కల్వర్టును బలంగా ఢీకొనడంతో బస్సు రేకు ఊడింది. అదే సమయంలో రెయిలింగ్ గొట్టం.. డీజిల్ ట్యాంకుకు గుచ్చుకోవడంతో లీకైంది. ఊడిన రేకు.. రహదారిపై రాసుకుంటూ వెళ్లడంతో నిప్పురవ్వలు వచ్చాయి. ఊడిన రేకుకు దగ్గర లగేజీ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాదం పైన మరిన్ని టీంలు విచారణ జరుపుతాయని, ఆ తర్వాతే తుది నివేదిక ఉంటుందని వనపర్తి డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.

పొగాకు వ్యతిరేక ప్రకటనలను వెక్కిరించిన రాంగోపాల్ వర్మ!


వివాదస్పద వ్యాఖ్యలు చేయడంలోనూ, వివాదాల్లో కూరుకుపోవడం మంటే సినీ దర్శకులు రాంగోపాల్ వర్మకు చెప్పలేనంత సరదాగా ఉంటుందేమో. తన ట్విటర్ అకౌంట్ ఆసరాగా చేసుకుని చేసే సంక్షిప్త సందేశాలు కొన్నిసార్లు ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ, మరి కొన్నిసార్లూ ఫులీష్ గా, కాంట్రవర్సీగా కనిపిస్తాయి. సినిమాల ప్రదర్శనకు ముందు దూమపానం, పోగాకు వ్యతిరేక ప్రకటనలను చూపించడంపై తాజాగా రాంగోపాల్ వర్మ ధ్వజమెత్తారు. వినోదం కోసం థియేటర్ కు వచ్చిన చికాకు కలిగించే విధంగా క్యాన్సర్ వ్యాధికి గురైన వారి ఊపిరితిత్తులు, నోటిని చూపిస్తున్నారని సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో పేర్కోన్నారు. అంతేకాకుండా తన చిన్నతనం నుంచి లక్షలాది దూమపాన వ్యతిరేకం కార్యక్రమాలు నిర్వహించినా.. ఏ ఒక్కడు కూడా సిగిరెట్ మానినట్టు కనిపించలేదని వ్యాఖ్యలు చేశారు.

Satya 2 Movie Press Meet


పెళ్ళికి రెడీ అయిన హీరోయిన్


ఈ మద్య హీరోయిన్స్ అందరు వరుసగా పెళ్ళికి రెడీ అవుతున్నట్టు ఉన్నారు. లేటెస్ట్ గా ప్రియమణి, అనుష్క, నిషా అగర్వాల్.... వంటి తారలు పెళ్లిళ్లకు రెడీ అయిపోతున్నారు. ఇదే కోవలో ఇప్పుడు మరో అందాల హీరోయన్ భావన కూడా పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. 'మహాత్మ' సినిమాలో శ్రీకాంత్ పక్కన కథానాయికగా నటించిన ఈ మలయాళ ముద్దుగుమ్మకు ప్రస్తుతం చెప్పుకోదగ్గ సినిమాలు లేవు దాంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టుంది. ఇంట్లో వాళ్ళు కూడా పెళ్ళిసంబందాలు చూస్తున్నారని, త్వరలోనే ఈమె పెళ్ళి జరిగే అవకాశం ఉన్నట్టు చెన్నైలో వినిపిస్తుంది.

డిసెంబర్ నుండి గబ్బర్ సింగ్ 2 ?


అత్తారింటి దారేది బ్లాక్ బస్టర్ తరువాత పవన్ అభిమానుల దృష్టి అంతా ‘గబ్బర్ సింగ్-2’ పై పడింది. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బేనర్ పై శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన విషయాలు వెల్లడయ్యాయి. ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో పవన్ చాలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆలస్యం జరుగుతోందని, ఈ సినిమా అఫీషియల్ లాంచ్ డిసెంబర్ 28 నుంచి ఉంటుందని, హీరోయిన్ తదితర సాంకేతిక నిపుణుల వివరాలు అతి త్వరలో తెలియచేస్తామని దర్శకుడు తెలిపాడు. ఈ సినిమా టైటిల్ కూడా గబ్బర్ సింగ్ 2 నే ఉంటుందని తెలిసింది.