ప్రపంచ క్రికెట్ కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అందించిన సేవలకు గుర్తుగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సోషల్ మీడియా వెబ్ సైట్ లో #ThankYouSachin అనే అకౌంట్ ప్రారంభించారు. విశ్వవ్యాప్తంగా సచిన్ టెండూల్కర్ కు ఉన్న అభిమానులు కృతజ్క్షతలు తెలియ చేయడానికి ఈ అకౌంట్ ను అందుబాటులోకి తెచ్చారు.అభిమానులు @BCCI #ThankYouSachin అకౌంట్ ఉపయోగించి మెసేజ్ పంపితే.. ఒక్క క్షణంలోనే బీసీసీఐ ట్విటర్ అకౌంట్ నుంచి సచిన్ ఆటోగ్రాఫ్ తో ఉన్న పోస్టర్ వస్తుంది. సచిన్ ఆటోగ్రాఫ్ తో ఉన్న పోస్టర్ ను అభిమానులు తమ పేరుతో పొందాలనుకుంటే మీరు ప్రయత్నించవచ్చు. నేను ప్రయత్నించాను.. మీరు కూడా ప్రయత్నించి సచిన్ వాల్ పోస్టర్ పొందండి.. మరి ఆలస్యమెందుకు?
బీసీసీఐ చేసిన ప్రయత్నానికి వేలాది మంది అభిమానుల నుంచి స్పందన వచ్చిందని బీసీసీఐ వెల్లడించింది.
No comments:
Post a Comment