Sunday, 3 November 2013

తన ‘స్క్రిప్ట్’ కాపీ కొట్టారంటూ కోర్టుకు...


మరో కాపీ వివాదం భారీ బడ్జెట్ సినిమాకు తగులుకుంది. గతంలో తాను ఇచ్చిన స్క్రిప్ట్ ఆధారంగా ‘క్రిష్ 3' నిర్మించారని, తనకు ఎలాంటి పారితోషికం ఇవ్వలేదని, సినిమా టైటిల్స్‌లో తన పేరు కూడా వేయలేదని మధ్యప్రదేశ్‌కు చెందిన ఉదయ్‌సింగ్ రాజ్‌పుట్ అనే రచయిత ముంబై హైకోర్టును ఆశ్రయించాడు. కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు సినిమా విడుదలను నిలిపివేయాలని ఆయన పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కోర్టు అందుకు అంగీకరించలేదు. 2008లో ‘క్రిష్ 2' పేరిట తాను రాసిన స్క్రిప్ట్‌ను సినీ రచయితల సంఘంలో రిజిస్టర్ చేయించానని, దాని ప్రతిని నిర్మాత, దర్శకుడు రాకేష్ రోషన్‌కు పంపానని ఉదయ్‌సింగ్ చెబుతున్నారు. క్రిష్ 3' సినిమాకు తన స్క్రిప్ట్‌ను వాడుకోవడమే గాక, రాబిన్ భట్ అనే వ్యక్తికి పారితోషికం చెల్లించారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.

 తనకు నష్టపరిహారంగా రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలని, కేసు విచారణ ప్రారంభించగానే తాత్కాలికంగా కొంత మొత్తం చెల్లించేలా ఆదేశించాలని ఆయన కోరారు. అయితే, రాకేష్ రోషన్ తరఫున న్యాయవాదులు కూడా కోర్టుకు హాజరై సినిమా విడుదలకు ఆటంకం లేకుండా చూడాలని అభ్యర్థించారు. సినిమాను నిలిపివేసే విషయంలో కోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేనందున, నవంబర్ 1న దేశవ్యాప్తంగా ‘క్రిష్ 3'ని విడుదల చేసారు. అయితే సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కానీ పండగ ప్రబావంతో కలెక్షన్స్ బాగానే ఉన్నాయి.

విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం, ఎనిమిది మంది మృతి


విజయనగరం జిల్లాలోని గొట్లాం రైవ్వే స్టేషన్ వద్ద శనివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. బొకారో ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ కోచ్‌లో మంటలు వచ్చాయన్న వదంతి ప్రచారం కావడంతో ఆందోళన పడిన ప్రయాణికులు రైలును ఆపి కిందికి దిగి పరుగులు తీయడం మొదలు పెట్లారు. కోందరు మాత్రం పక్కనే ఉన్న ట్రాక్‌పై నిలబడ్డారు. వరిని ఆ ట్రాక్‌పై వస్తున్న విజయవాడ ప్యాసింజర్ రైలు ఢీకొట్టడంతో ఎనిమిది మంది మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది . ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిగ్బాృంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ తోనూ మాట్లాడి వెంటానే సహాయం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

దివ్వి దివ్వి దీపావళి


‘చీకటి వెలుగుల రంగేళి... జీవితమే ఒక దీపావళి’ అని ఓ సినిమా కవి అన్నారు. ఇది లక్ష ప్రమిదల వెలుతురులాంటి నిజం. దీపావళి అంటేనే సంతోషాల సంరంభం. పెద్దవాళ్లు కూడా తమ వయసు మరచిపోయి టపాసులు కాలుస్తూ ఆనంద సాగరంలో మునిగి తేలుతారు. మరి... మన అభిమాన తారల దీపావళి సంరంభం ఎలా ఉంటుందో ఓసారి తెలుసుకుందాం...

నాగార్జున:-

  నాకెందుకో చిన్నప్పట్నుంచీ టపాసులు కాల్చడం అంత ఆసక్తి అనిపించేది కాదు. కానీ, ఫ్రెండ్స్ అందరూ కాలుస్తుంటే నేనూ కొన్ని కాల్చేవాణ్ణి. ఇప్పుడైతే టపాసుల జోలికి అస్సలు వెళ్లడంలేదు. ముఖ్యంగా పర్యావరణం మీద అవగాహన పెరిగిన తర్వాత టపాసులు కాల్చకపోవడమే బెటర్ అని ఫిక్స్ అయిపోయాను. దీపావళినాడు శబ్ద కాలుష్యం ఎక్కువ. అందుకే, శబ్దం రాని టపాసులతో సరిపెట్టుకోవాలి. అయితే, దీపావళి పండగ వల్ల కూడా ప్లస్సులున్నాయి. టపాసులు కాల్చడం వల్ల దోమల బెడద తగ్గడం ఓ ప్లస్ (నవ్వుతూ). ఈ దీపావళిని అందరూ ఎంజాయ్ చేయాలని, అందరికీ శుభం చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను.అప్పట్నుంచీ టపాసులు కాల్చడం మానేశాను.

అనుష్క:-

  అసలు సిసలైన పండగ సంబరం కొత్త బట్టల ద్వారా వస్తుంది. చిన్నప్పుడైతే కంపల్సరీగా కొత్త డ్రెస్ కొనుక్కునేదాన్ని. ఉదయం తలంటు స్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకుని సందడి చేసేదాన్ని. ఫ్రెండ్స్‌తో పోటీపడి టపాసులు కాల్చేదాన్ని. ఇప్పుడు అంత ఆసక్తి లేదు. ఎవరైనా ఎంజాయ్ చేస్తుంటే చూడటమే తప్ప పెద్దగా సెలబ్రేట్ చేసుకోను. ఇప్పుడు ఒకేసారి బాహుబలి, రుద్రమదేవిలాంటి భారీ చిత్రాల్లో నటిస్తున్నాను కాబట్టి... నాకెందుకో దీపావళి ముందే వచ్చేసిందనిపిస్తోంది. ఈ పండగను అందరూ ఎంజాయ్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.ఒకప్పుడు సందడే సందడి .

 వెంకటేష్:-

  చిన్నప్పుడు నాకు దీపావళి అంటే చాలా సరదా. బీభత్సంగా టపాసులు కాల్చేవాణ్ణి. ఇదిగో ఈ చెయ్యి చూశారు కదా. ఈ మచ్చ నా ఆరేళ్ల వయసులో పడింది. దీపావళి పండగ మిగిల్చిన గుర్తు ఇది. ఆ వయసులో అంత పెద్ద దెబ్బ తగిలినా ఆ తర్వాత చాలా సంవత్సరాల వరకు నా సరదాని మానుకోలేదు. కానీ, ఇప్పుడు మాత్రం పొల్యూషన్ అంటూ... టపాసుల జోలికి దాదాపు వెళ్లడం మానేశాను. నా సంగతెలా ఉన్నా...

నాని:-


దీపావళిని చిన్నతనం నుంచి బాగా ఎంజాయ్ చేసేవాణ్ణి. దాదాపు ప్రతిసారీ ఏదో ఒక దెబ్బ తగిలేది. ఈ దీపావళి మా కుటుంబానికి చాలా స్పెషల్. అంజనాతో నా పెళ్లయిన తర్వాత వచ్చిన మొదటి దీపావళి ఇది. ఈ పండగను అమ్మా నాన్న, అంజనాతో జరుపుకుంటాను. శబ్దం వల్ల పెద్దవాళ్లకి చాలా ఇబ్బంది. అందుకని  భూచక్రాలు, మతాబులు... ఇలా సౌండ్ లేని టపాసులు కాల్చాలని మనవి చేసుకుంటున్నాను. అలాగే, మనం టపాసులు కాల్చడం మొదలుపెట్టిన తర్వాత మొదటి అరగంట జాగ్రత్తగా కాల్చాలనుకుంటాం. ఆ తర్వాత ఆ జాగ్రత్తను మర్చిపోతాం. కానీ, కాలుస్తున్నంతసేపూ జాగ్రత్తగా ఉండాలి.




Saturday, 2 November 2013

తెలుగు ఛానెల్స్ లో ఏ పోగ్రామ్ టాప్..ఏది ప్లాప్


టీవీని మనం ఒక వినోదసాధనంగానో, సమాచార సాధనంగానో అనుకుంటాం గాని దాని యజమానికి అదో వ్యాపార సాధనమనేది నిజం . ప్రకటనల కోసం ప్రేక్షకులను సమకూర్చిపెట్టటమే టీవీల పని. ఎంతమంది చూస్తున్నారో లెక్కగట్టి చెప్పే అంతర్జాతీయ సంస్థ భారతదేశ విభాగం ‘టామ్ ఇండియా'. ఆ లెక్కలే రేటింగ్స్. ఏ కార్యక్రమాన్ని ఏ వయసు వారు మహానగరాల్లో, నగరాల్లో ఎంతసేపు చూశారో తేల్చి చెబుతున్నామంటుంది టామ్ సంస్థ. ఒక వైపు రేటింగ్స్‌ను తిట్టుకుంటూనే మరోవైపు ఆ రేటింగ్స్ పెరగాలని అక్రమమార్గాలూ, అనైతిక పద్ధతులూ అనుసరించే చానల్స్ కోకొల్లలు. కానీ ఆ అక్రమమార్గాల్లో టామ్‌కూ భాగస్వామ్యముందని ఆరోపణలు రావటమే చాలా కాలంగా జరుగుతున్నదే. ఆ విషయాలు ప్రక్కన పెడితే... క్రితం వారం వివిధ టీవీ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ కు వచ్చిన రేటింగ్స్ ఏమిటి...దేనికి ఎక్కువ రేటింగ్స్ వచ్చాయనేది గమనిస్తే... అన్నిటికంటే ముందుగా జబర్దస్త్ రేటింగ్స్ ఉండగా మొదటి 20లో జీ తెలుగుకు ఒక స్థానమే దక్కింది. ( అక్టోబర్ 26 తో ముగిసిన మొదటి 10 కార్యక్రమాలు టామ్ రేటింగ్ ప్రకారం ) 1. జబర్దస్త్- ఈటీవీ - గురువారం- సమయం 21.30- రేటింగ్ 29.12 2 బోల్ బేబీ బోల్-3- జెమిని- శని- సమయం 21.00- రేటింగ్ 19.97 3 మేస్ట్రో మాజికల్ ఈవెంట్- మా టీవీ- శని-సమయం 19.30- రేటింగ్ 18.74 4 క్యాష్- ఈటీవీ- శని- సమయం 21.30- రేటింగ్ 11.31 5 ఢీ-6- ఈటీవీ- బుధ-సమయం 21.30- రేటింగ్ 10.02 6 బోల్ బేబీ బోల్-3- జెమిని- - సమయం 21.15- రేటింగ్ - రేటింగ్ 9.77 7 జబర్దస్త్- ఈటీవీ- ఆది- సమయం 10.30- రేటింగ్ - రేటింగ్ 9.18 8 గెట్ రెడీ- ఈటీవీ- శుక్ర- సమయం 21.30- రేటింగ్ 7.69 9 జబర్దస్త్- ఈటీవీ- మంగళ- సమయం 16.30- రేటింగ్ 7.06 10 అలీ 369- ఈటీవీ- మంగళ- సమయం 21.30- రేటింగ్ 6.85 గమనిక.... : ఈ రేటింగ్స్ కేవలం టామ్ సంస్ధ ఇచ్చిన సమాచారం (మీడియాలో ప్రచారంలో ఉన్న) మేరకు ... అలాగే ఈ రేటింగ్ లు వారం వారం మారిపోతూంటాయి.. వచ్చే వారానికి అంతా పూర్తిగా మారిపోవచ్చు కూడా.

అక్కినేని అఖిల్ ఎంట్రీ ఆ డైరక్టర్ తో ఫైనల్


గత కొంత కాలంగా అక్కినేని అభిమానులను మాత్రమే కాక యావత్ తెలుగు సినీ అభిమానులు సైతం ఎదురుచూస్తున్న విషయం నాగార్జున రెండవ కుమారుడు అఖిల్ ఎంట్రీ. కొంతకాలం శేఖర్ కమ్ముల డైరక్ట్ చేస్తాడని, మరికొంతకాలం రాజమౌళితో లాంచ్ చేస్తాడని ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. అయితే సరైన దర్శకుడు చేతిలో పెట్టాలని నాగార్జున తాపత్రయం. అందులో భాగంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు గా లాంచ్ చేయాలని ఒప్పించినట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ బ్యానర్ పై ఈ చిత్రం చేయనున్నారని సమాచారం. గతంలో అఖిల్ మాట్లాడుతూ... "నేను ఇప్పటిదాకా ఎటువంటి సినిమాను అంగీకరించలేదు. నా మొదటి సినిమాకు సిద్ధపడుతున్నాను" అని తెలిపాడు. ఇప్పటికే రాజమౌళి కుమారుడు కార్తీక్... అఖిల్ తో ఓ షార్ట్ ఫిల్మ్ రూపొందించారు. మాటీవీ షార్ట్ ఫిలింస్ కంటెస్ట్ లో ఆ షార్ట్ ఫిలిం ప్రదర్శిస్తారని చెప్పుకుంటున్నారు. నాగచైతన్య ఎంట్రీ విషయంలో నాగార్జున అంచనాలు తారుమారయ్యాయి. చైతన్య తొలి చిత్రం‘జోష్' అపజయాన్ని మూటగట్టుకుంది. ఈనేపథ్యంలో అఖిల్ విషయంలో అలా జరుగకూడదని నాగార్జున భావిస్తున్నారు. మరో దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా అఖిల్ తో చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఆయన ఈ విషయమై మాట్లాడుతూ... "అక్కినేని అఖిల్‌తో నా సినిమా ఉండొచ్చు. కానీ ఇప్పుడే కాదు. ఇప్పుడే అఖిల్‌తో నేను సినిమా చేయబోతున్నానన్న వార్త రూమరే. అయినా ముందు కథ దొరకాలి కదా. తనకు ఇప్పటికే ఓ స్టార్ సన్‌గా, క్రికెటర్‌గా ఓ క్రేజ్ ఉంది. చేస్తే ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే సినిమా చేయాలి. తను ఆల్రెడీ క్రికెట్‌తో స్టార్ అయ్యాడు అన్నారు శేఖర్ కమ్ముల.

అన్నం మానేసి విక్రమ్ కేవలం...


ప్రముఖ దర్శకుడు శంకర్ ప్రస్తుతం ‘ఐ' అనే చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న ఈచిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా చేస్తోంది. 'ఐ' కోసం నటుడు విక్రం సకలవిధాలా తనను తాను మలుచుకుంటున్నారు. కథకు తగ్గట్లు తన శరీరాకృతిని మార్చుకుంటున్నారట. మూడు భిన్న కోణాల్లో విక్రం కనిపించనున్నట్లు సమాచారం. ఇందులో రెండు పాత్రల్లో విక్రం చాలా సన్నగా కనిపించాలని దర్శకుడు చెప్పారట. ఇప్పటికే ఓ పాత్రకు సంబంధించిన ఫొటోలు వచ్చాయి. అందులో విక్రం నేటితర యువకుడిలా బక్కపలచగా కనిపిస్తున్నారు. మరో పాత్ర కోసం ఇంకాస్త సన్నబడినట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. సినిమా కోసం నటుడు విక్రమ్‌ వూహించని స్థాయిలో సన్నబడ్డాడు. పదహారేళ్ల యువకుడిలా.. నేటిశైలికి తగ్గట్టు శరీరాకృతిని మలచుకున్నాడు. తాజాగా విడుదలైన ఆయన ఫొటో అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రథమార్థంలో సాధారణంగా కనిపించాడట. ద్వితీయార్థంలోని పాత్ర కోసం విక్రమ్‌ ఇలా మారాడని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం విక్రమ్‌ చాలా శ్రమించాడట. '84 కిలోల బరువుండే నేను ఈ పాత్ర కోసం 14 కిలోలు తగ్గానని' విక్రమ్‌ చెప్పాడు. అందుకు విక్రం అన్నం పూర్తిగా తగ్గించేశాడని సమాచారం. ఆకుకూరలు, పళ్లరసాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

శంకర్‌ దర్శకత్వంలోని 'అన్నియన్‌'లో రెమో, అంబి, అన్నియన్‌గా మూడు పాత్రల్లో కనిపించిన విక్రం.. ఇందులోనూ అలానే కనిపిస్తాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో విక్రమ్...తమిళనాడు స్టేట్ భాక్సింగ్ ఛాంపియన్ గా కనిపించనున్నాడని సమాచారం. . ఇందులో ఒక సాధారణ యువకుడైన విక్రమ్ ఒలింపిక్‌లో బంగారు పతకం ఎలా సాధించారనేది 'ఐ' చిత్ర కథ అని వినపడుతోంది. అందుకోసం ఆయన ఎనిమిది కేజీలు పైగా బరువు తగ్గారు. ఆస్కార్ రవిచంద్రన్ అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న ఐ చిత్రం ఒలింపిక్ క్రీడల నేపథ్యంలో సాగుతుందనే సమాచారం.

ఈ నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకుని శంకర్ ఐ చిత్రాన్ని ఓ రేంజిలో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఒక సాధారణ యువకుడైన విక్రమ్ ఒలింపిక్‌లో బంగారు పతకం ఎలా సాధించారనేది ఐ చిత్ర కథ అని వినపడుతోంది. . ప్రముఖ సంగీత దర్శకడు రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసారు. పీసీ శ్రీరామ్ కెమెరామేన్. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేస్తారు. శుభతో కలిసి శంకర్ కూడా కథను రాశారు. భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రానున్న ఈ సినిమాను అంతే అపురూపంగా నెక్స్ట్ లెవల్ సినిమాగా తీర్చిదిద్దుతున్నారట శంకర్.

పవన్ తో తప్పకుండా నటిస్తా


విక్టరీ వెంకటేష్ ఒకప్పుడు వరుస విజయాలతో ‘విక్టరీ’ ని తన పేరుగా మార్చుకున్న కథానాయకుడు, ఇప్పుడు ఒక్క విజయం కోసం వేయి కన్నులతో ఎదురుచూస్తున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు విజయం కాస్త మహేష్ ఖాతాలో జమచేసారు, దాని తరవాత సోలో గా వచ్చిన ‘షాడో‘ ఎంతటి గొప్ప కళాఖండమో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆయన నటించిన మరో మల్టిస్టారర్ ‘మసాలా’ ఈ నెలలోనే విడుదల కావచ్చని సమాచారం. మసాలా ప్రమోషన్ లో భాగంగా వెంకీ చెప్పిన సంగతులు ఆయన మాటల్లో – పెద్ద స్టార్ ని అనే గర్వం నాకెప్పుడు ఉండదు. అది మా నాన్న గారి నుండి మాకు వచ్చింది. ఎప్పుడు సింపుల్ గా ఉండేదుకే ఇష్టపడతాను. స్నేహితులు కూడా అంటుంటారు అసలు ఏం మారలేదు అని. షూటింగ్ అయిపోగానే హీరో అనే మూడ్ ని స్విచ్ ఆఫ్ చేసేస్తాను, ప్రశాంతంగా ఇంటికి వెళ్లి కొడుకు అర్జున్ తో కాలక్షేపం చేస్తాను. ఈ దీపావళిన కూడా వాడికోసమే రంగు రంగుల మతాబులు కాల్చుతాను. ఆస్తులు అందరు ఇస్తారు కాని మంచి అలవాట్లు ఇవ్వలనుకుంటాను నేను. ఆధ్యాత్మిక చింతన లేకుంటే మనసుకి ప్రశాంతత ఉండదు. ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా దాన్ని కష్టపడి, సంపూర్తిగా చేయమని చెప్పారు నాన్న, ఇప్పటికి అదే పాటిస్తాను. ఇక సినిమా విషయాలకి వస్తే, మా కుటుంబం అంతా కలిసి నటించాలని నాన్న అడుగుతున్నారు. అందుకోసం కథలు వింటున్నాను. ‘మసాలా’ పేరుకు తగ్గట్టుగానే అన్నీకుదిరిన కుటుంబ కథాచిత్రం. నేను రామ్ చేసిన హంగామా అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. త్వరలోనే రామ్ చరణ్ తో కలిసి నటించబోతున్నాను. పవన్ తో ఎప్పటినుండో చేద్దాం అనుకుంటున్నాను కాని కుదరట్లేదు. తొందర్లోనే తప్పకుండా మేం ఇద్దరం కలిసి నటిస్తాం.

రికార్డుల రచ్చ చేసిన రోహిత్ శర్మ


దీపావళి రోజున మ్యాచ్, ఒకవేళ మ్యాచ్ ఓడిపోతే టపాసులు కాల్చలేం అనుకున్నారో ఏమో కానీ, బాటింగ్ చేసేప్పుడే స్టేడియం లో మోత మోగించారు మన ఆటగాళ్ళు. ముఖ్యంగా రోహిత్ శర్మ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. చివరి 20 ఓవర్లు ఆసిస్ ఆటగాళ్లకి, గేలరీ లోని వీక్షకులకి అట్టే తేడ లేకుండా పోయింది. దాదాపుగా వేసిన ప్రతీ బంతి సిక్స్ కాని, ఫోర్ కాని అవ్వకుండా ఆపటం ఎవరివల్లా కాలేదు. ఇక విషయానికి వస్తే టాస్ ఓడి, బాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 386 పరుగులు చేయగలిగింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసిస్ క్రీడాకారులు విజయాని 57 పరుగుల దూరంలో చతికిలపడ్డారు. ఇక భారత్ బాటింగ్ విషయానికి వస్తే ధావన్ 60(82), కోహ్లి 0(4), రైనా 28(40), యూవీ 12(20), ధోని 62(38) పరుగులు సాధించగా, రోహిత్ శర్మ ఒక్కడే 158 బంతుల్లో 209 పరుగులు సాధించాడు. మొదటి 50 పరుగులకు 71 బంతులు తీసుకున్న రోహిత్, తరవాత 50 పరుగులకు 43 బంతులు, ఆ తర్వాత 50 కు 26 బంతులు, మిగిలిన 50 కు కేవలం 18 బంతులు మాత్రమే తీసుకున్నాడు. రెండవ 100 పరుగులు కేవలం 44 బంతుల్లోనే పూర్తి చేసాడు. వన్డేలలొ ఒక్క ఇన్నింగ్స్ లోనే అత్యదిక సిక్స్(16) లు కొట్టిన ఆటగానిగా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ తో ఒక్క ఇన్నింగ్స్ లోనే 200 పై చిలుకు వ్యక్తిగత పరుగులు సాధించిన మూడవ ఆటగానిగా చరిత్రలో నిలిచిపోయాడు రోహిత్. అంతకుముందు సెహ్వాగ్, సచిన్ ఈ ఘనత సాధించారు. 200 పైన స్కోర్ చేసిన ముగ్గురు ఆటగాళ్ళు భారతీయులే అవ్వటం గొప్ప విషయం. ఇక బౌలింగ్ విషయానికి వస్తే షమీ, జడేజా తలో మూడు వికెట్లు, అశ్విన్ 2, వినయ్ కుమార్ 1 వికెట్ దక్కించుకున్నారు. 7 వన్డేల సిరీస్, ఈ విజయం వలన 3 -2 తో భారత్ వశం అయింది. మాన్ అఫ్ ది మ్యాచ్, ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డులు రెండూ రోహిత్ శర్మ కే దక్కాయి.