ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని నమ్ముకుంటే ముండమోసుడే అని క్లియర్ అయ్యింది. ఇప్పటికి ఆయన సమైక్యాంద్రకోసం కట్టుబడి ఉన్నాడు, ఆయన తెలంగాణను అడ్డుకుంటాడు అని నమ్మితే దానంత మూర్ఖత్వం మరోటి ఉండదని తనకు తానే తేల్చిచెప్పాడు అంటున్నారు. సీమాంద్రుని ముసుగులో నిజమైన తెలంగాణ ఏర్పాటు వాదిగా పని చేస్తున్నది నేనే అంటూ కుండబద్దలు కొట్టి మరీ నిరూపించుకున్నాడు అన్న భావం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇలా తన అసలు రూపం బయటపెట్టుకోవడం ఇదేమి మొదటిసారి కాదు, ఇప్పటికే ఎన్నో సార్లు బయటపెట్టుకున్నాడు, ఇప్పుడు మరోసారి చూపించాడు అంటున్నారు.శుక్రవారం ఆయనను వైఎస్సార్ సిపి ఎమ్మెల్యేలు సచివాలయంలో ఆయనను కలిసారు, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అసెంబ్లీలో తీర్మానించాలి, దీని కోసం అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయండి అన్నారు. నిజంగా ఆయన సమైక్యమే కోరుకుంటే ఇలా చేయడానికి ఆయనకు అభ్యంతరం ఉండదు. పైగా ప్రతిపక్షమే కలిసి వస్తున్నందున తన కాంక్ష నెరవేర్చుకోవడం కోసం బంగారం లాంటి అవకాశం వచ్చింది అంటూ ఎగిరి గంతేయాలి. కాని ఆయనేం చేసాడు, అది కుదరదు అంటూ చెప్పేసి అసలు బాగోతాన్ని బయటపెట్టుకున్నాడు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎందుకంటే రాష్ట్రం విడిపోకుండా ఎంతకైనా తెగిస్తాను, అంటూ ఏకంగా తనకు ముఖ్యమంత్రి పదవినిచ్చిన సోనియా గాందీనే ధిక్కరిస్తే వారెవ్వా... శభాష్ అనుకున్నారు. ముఖ్యమంత్రి ఎదురుతిరిగాక ఇక సోనియా ఏం సాహసం చేస్తుంది అంటూ ఆయనను ఏకంగా సమైక్యాంద్ర స్టార్ బ్యాట్స్ మెన్ తో పోల్చారు.
కాని ఏమయింది, తెలంగాణ ప్రక్రియ ఆగలేదు కదా... వేగంగా ముందుకు కదిలి చివరకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం కూడా పొందింది. ఆయన నడిపిస్తున్నాడు అన్న ఏపిఎన్జీఓలు కూడా రాజీనామాలు చేసి రాజకీయ సంక్షోభం సృష్టిస్తేనే రాష్ట్రం విభజన ఆగుతుంది అంటే వద్దు, అలా చేస్తే పార్లమెంటులో, అసెంబ్లీలో బిల్లును అడ్డుకోలేం అంటూ బయటక నమ్మ బలికి రాజీనామాలకు సిద్దమైన ఎంపీలను కూడా ఢిల్లీ వెల్లి నివారించాడు ముఖ్యమంత్రి. అంతెందుకు సమైక్యం తప్ప మరో డిమాండ్ లేదు, ఎంత వరకైనా సమ్మె చేస్తాం అని భీష్మించుకు కూర్చున్న ఉద్యోగులకు ఎలాంటి హామి ఇవ్వకుండానే సమ్మెనుంచి తప్పించేసాడు. పైగా వారితో చర్చల సంధర్బంగా తెలంగాణ ఏర్పాటు ఆపడం, ఆపకపోవడం కేంద్రానిది, అందుకే ఆ హామి ఇవ్వలేను, కాని ఎన్నికల దాకా తెలంగాణ ఏర్పాటు కాదని హామి ఇస్తున్నాను అన్నాడు,
అంటే దానర్థం ఏంటి తెలంగాణ ఏర్పాటు ఖాయమే అన్నట్టు కదా. అంతెందుకు నిన్న కాక మొన్న దిగ్విజయ్ సింగ్ కూడా మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ తెలంగాణ ఏర్పాటుకు సహకరించడానికే ఉన్నాడని చెప్పాడు ఇవన్నీ చాలు సమైక్య ముసుగులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోనియా ఆదేశాల ప్రకారం తెలంగాణ ఏర్పాటుకు ఎలా ముందుకు కదులుతున్నాడో చెప్పాడానికి. ఇవన్నీ పక్కనే బెడితే వైఎస్సార్ సిపి అడిగిందేమిటి, అసెంబ్లీ సమావేశం పెట్టి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని తీర్మాణం చేసి కేంద్రానికి పంపించమన్నారు, సమైక్యాన్ని కోరుకుంటున్న ఆయన దీనికి ఎందుకు అభ్యంతరం చెప్పాడు, తీర్మాణం ప్రవేశపెడితే ఆయన కూడా మద్దతివ్వాల్సి వచ్చి సోనియా ఆదేశాలను బేఖాతరు చేసిన వాడవుతాడన్నది ఓ భయమైతే, ఇది తెలంగాణ ఏర్పాటుకు ఎక్కడ బ్రేకులు వేస్తుందోనన్న భయం కూడా ఆయనలో ఉన్నదన్నది స్పష్టమవుతోంది కదా అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అందుకే ఇన్నాళ్లకు ముఖ్యమంత్రి తన అసలు స్వరూపాన్ని బయట పెట్టుకున్నాడు అన్న వాదనలకు బలం చేకూరుతోంది.




.jpg)

