
తెలుగు సినీ పరిశ్రమ లో నే ” అత్యంత పేరు గల నటుడు … ఒక విలన్ గా , హీరో గా, ఎన్నో సినిమాల్లో అతి ముఖ్యమైన పాత్రలు పోషించి , ఆ సినిమాల విజయానికి ప్రాణం పోసిన విలక్షణ నటుడు , శ్రీ హరి మరణానికి “అదే” కారణం అని తేల్చి చెప్పారు, ఆయనని పరీక్షించి , వైద్యం చేసి , ఆయన తుది శ్వాస విడిచే వరకు ఆయన తో ఉన్న వైద్యులు …
అవును , “అది” అంటే , “నిర్లక్ష్యం”… తన ఆరోగ్యం బాగోలేకపోయినా , “ఒప్పుకున్న షూటింగ్ తన వల్ల ఆగకూడదని శ్రీ హరి ,
బలవంతంగా షూటింగ్ చెయ్యడం , తన ఆరోగ్యం నిర్లక్ష్యం చెయ్యడం వల్లనే , ఆయన ఈ రోజు మన మధ్య లేడని “వైద్యులు స్పష్టం చేసారు “…
“శ్రీ హరి , కాలేయ సంభందీత వ్యాధి తో మృతి చెందారని , ముందు చెప్పిన వైద్యులు , తరువాత , అది కాలేయం వరకు చేరిన “పచ్చకామేర్లని ” … ముందుగానే , శ్రీ హరి గారికి తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరించినా , వారించి , తాను చేస్తున్న హిందీ చిత్రం , ప్రభు దేవా దర్శకత్వం లో వస్తోన్న “ర్యాంబో రాజకుమార్” షూటింగ్ లో పాల్గొన్నారని , షూటింగ్ స్పాట్ లో నలతగా ఉంది అని చాలా సార్లు కంప్లెయింట్ చేసారని , చాతీ నొప్పిగా ఉందని కూడా అన్నారని , తన ఆరోగ్య పరిస్థితి క్షీణించిన సమయాన , ముంబై లోని పేరున్న లీలావతి హాస్పిటల్ లో జాయిన్ చేసారు … కాని అప్పటికే , ఆయన ఆరోగ్య పరిస్థితి చేదాటి పోయింది … ఇక , తిరిగిరాని లోకాలకు ఆయన చేరుకున్నారు “…
తన వ్రుత్తి పట్ల శ్రీ హరి కి ఉన్న డెడికేషన్ , నటన లో భాగం గా , ఎన్నో క్లిష్టమైన సన్నివేశాలలో డూప్ లేకుండా శ్రీ హరి నటించడం ,
ఆరోగ్యం బాగోలేకపోయినా ఎన్నో సార్లు తన ఆరోగ్యాన్ని లెక్క చెయ్యకుండా , కమిట్మెంట్ ఇచ్చిన సమయానికి షూటింగ్ పూర్తీ చెయ్యాలన్న సంకల్పం తో శ్రీ హరి షూటింగ్ లలో పాల్గొనడం అందరికీ తెలిసిందే … ఇది ఎందరో నటీనటులకు ఆదర్శం … అయితే , ఈ క్రమం లో తన ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం, “నిర్లక్ష్యం” చెయ్యడం, శ్రీ హరి ప్రానాలని హరించిందని చెప్పారు …
ఈ సంఘటన , “ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత ” అందరికీ వివరించడం తో పాటు , ఆర్టిస్టు గా శ్రీ హరి డెడికేషన్ కు మరోసారి సలాం చేసేలా చేస్తుంది …