అక్కినేని కుటుంబ అభిమానులకు శుభవార్త నాగ్ తనయుడు అఖిల్ టాలీవుడ్ ఎంట్రీ గురించి ఒక లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు ఫిలిం నగర్ లో హడావిడి చేస్తోంది. మంచి కథ దొరికితే అఖిల్ ఎంట్రీ ఖాయమని నాగార్జున ఇప్పటికే చెప్పాడు, అయితే ఇప్పటివరకూ అఖిల్కోసం నాగార్జున విన్న కథలు ఏవీ ఆయనకు నచ్చలేదని ఫిల్మ్ నగర్ టాక్. ఈ నేపధ్యంలో పూణె ఫిలిమ్ ఇనిస్టిట్యూట్ నుండి వచ్చిన ఒక నూతన దర్శకుడు అఖిల్ కు చెప్పిన కథ నచ్చిందని వార్త ప్రచారంలోకి వస్తోంది. ఈ నూతన దర్శకుడు ఈ కధను ఇంతకుముందు బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్‌కు కథను వినిపిస్తే ఆ కధ బాగా నచ్చడంతో ఈ కధ గురించి హీరో అమీర్ ఖాన్ నాగార్జునకు చెప్పాడని ఆ రీత్యా ఆ నూతన దర్శకుడి ఎంట్రీ అక్కినేని కుటుంబంలో జరిగిందని అని అంటున్నారు.
ఈ సినిమాలో ఈ నూతన దర్శకుడు అఖిల్ ను వారియర్‌గా చూపే ప్రయత్నం చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది.అందుకోసం 7 విభిన్నమైన గెటప్స్‌లో అఖిల్ చేత ట్రయిల్షూట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇటువంటి కధలకు భారీ వ్యయం తప్పదు కనుక నాగార్జున తన సొంత బేనర్ పైనే తీద్దామనే ఉద్దేశ్యంలో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ ట్రయిల్ షూట్ సక్సెస్ అయితే అఖిల్ ఎంట్రీ త్వరలోనే జరగడం ఖాయం అని అంటున్నారు. ఇప్పటికే అఖిల్ తో రాజమౌళి కుమారుడు కార్తీక్ ఓ షార్ట్ ఫిల్మ్ రూపొందించాడు. ఈ సినిమాను మాటీవీ షార్ట్ ఫిలింస్ కంటెస్ట్ లో ప్రదర్శిస్తారని అంటున్నారు. ఇప్పటికే నాగచైతన్య కెరియర్ విషయంలో సరిగ్గా ప్లాన్ చేయలేక పోయాను అని బాధపడుతున్న నాగ్ అఖిల్ మొట్టమొదటి సినిమా విషయంపై చాల జాగర్తలు తీసుకుంటున్నాడనే వార్తలు వస్తున్నాయి....






