Sunday, 13 October 2013

మంచువారి సినిమాని మనం పొగడక్కర్లా!


ఎవరైనా సినిమా చేస్తే, ప్రేక్షకులు దాన్ని చూసి ఏమంటారా అని చాలా ఉత్సుకతతో ఎదురు చూస్తుంటారు. సినిమా విడుదలై, జనం రెస్పాన్స్ తెలిసేవరకూ టెన్షన్ పడుతుంటారు. కానీ మంచు ఫ్యామిలీ ఆ టైపు కాదు. తమ సినిమాకి వాళ్లకి వేరేవాళ్ల స్పందన అక్కర్లేదు. వాళ్లకి వాళ్లే డిసైడ్ చేసేస్తారు సినిమా ఎలా ఉంటుందో.

 తాజాగా విష్ణు నటించిన దూసుకెళ్తా సినిమా గురించి, ఆ చిత్ర నిర్మాత విష్ణు తండ్రి అయిన మోహన్ బాబు మాట్లాడారు. ఆ సినిమా గురించి ఆయన చెప్పే మాటలు వింటే కచ్చితంగా పిచ్చెక్కుతుంది. మోహన్ బాబు తన కొడుకుని, ప్రత్యేక పాత్రలో చేసిన కూతురిని ఆకాశానికి ఎత్తేశారు. వీరు పోట్ల టేకింగ్, రవితేజ వాయిస్ ఓవర్ ఆ సినిమాకి ఎంత ప్లస్సో... విష్ణు పర్ ఫార్మెన్స్, మంచు లక్ష్మి పాత్ర ఆ సినిమాకి మరీ ప్లస్ అట. ముఖ్యంగా లక్ష్మి రోల్ చాలా ఆసక్తికరంగా ఉంటుందట. అందరికీ తెగ నచ్చేస్తుందట. సినిమా ఎలా ఉంటుందన్నది అందరూ చెబుతారు. అది మామూలే.

ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే జయాపజయాలను తట్టుకోవడం కష్టం. కానీ ఇంట్లోవాళ్లు ఇంట్లోవాళ్లను పొగిడేసుకోవడం చూస్తే కాస్త వెరైటీగానే అనిపిస్తుంది. జనాలు అలానే ఫీలయ్యారు. వాళ్ల డబ్బాలు వాళ్లే కొట్టేసుకోవడం ఏంటి, మనం కదా ఇవన్నీ చెప్పాల్సింది అంటూ సెటైర్లు వేస్తున్నారు. అయినా వాళ్లు పెద్ద పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరో మంచు వారి సినిమాలకు సంబంధించిన ఏ ఫంక్షన్, ఏ ప్రెస్ మీట్ చూసినా అర్థమైపోతుంది!

జగన్.. మీడియాను కొనేస్తున్నాడు...!



తెలుగుదేశం పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై మరోసారి విరుచుకుపడింది. జగన్ మీడియాను కొనేస్తున్నాడని ఆ పార్టీ నాయకుడు వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్ అన్నాడు. ఒకవైపు సొంత మీడియాను దుర్వినియోగం చేస్తున్న జగన ఇప్పుడు నేషనల్ మీడియాను కూడా తన అవసరాలకు తగ్గట్టుగా ఉపయోగించుకొంటున్నాడని ఆయన వ్యాఖ్యానించాడు.

 బహుశా.. నేషనల్ మీడియాలో బాబు దీక్షపై అంత కవరేజీ రాకపోవడ గురించి స్పందిస్తూ తెలుగుదేశం నేతలు ఈ ఆరోపనలు చేసి ఉండవచ్చు... అయితే.. జగన్ మొత్తం మీడియాను కొనేస్తున్నాడని టీడీపీ వాళ్లు ఆరోపిస్తే అంత సమంజసంగా ఉండదు. ఏదోఒక మీడియా వర్గం గురించి ఆరోపిస్తే ఆ మాటలకు విలువ ఉంటుంది. కానీ. ఇలా అందరూ అమ్ముడు బోయారు అంటే అది టీడీపీ వాళ్ల బేలతనమే అవుతుంది.

 మరి తెలుగుదేశం వాళ్ల దగ్గర డబ్బులేదా? అమ్ముడుపోవడానికి మీడియా లేదా.. ? వారిని మ్యానేజ్ చేసే సత్తా లేదా? మ్యానేజ్ చేసిన చరిత్ర లేదా? అనే సందేహాలు వస్తున్నాయిప్పుడు.

వేధింపులతో టివి నటుడి భార్య ఆత్మహత్య, భర్త అరెస్టు


హైదరాబాద్: అదనపు కట్నం తేవాలంటూ ఓ టివి నటుడు తన భార్యను వేధించగా, వాటిని భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. భార్య మృతికి సంబంధించిన కేసులో పోలీసులు ఆర్టిస్టు అయిన భర్తను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన హైదరాబాదులో జరిగింది. పలు సీరియళ్లలో నటిస్తున్న టివి నటుడికి జీవిత అనే ఇరవై నాలుగేళ్ల యువతితో 2011 అక్టోబర్ 9న పెళ్లైంది. పెళ్లి సమయంలో జీవిత తల్లిదండ్రులు పెద్ద మొత్తంలో ముట్టజెప్పారు.

 పెళ్లయ్యాక దంపతులు వెంకటగిరిలో నివాసముంటున్నారు. పెళ్లైన మూడు నెలల నుండే భర్త అదనపు కట్నం కోసం భార్యను వేధించసాగాడు. మద్యం తాగి వచ్చి భార్యను కొట్టేవాడు. రెండు నెలలుగా ఆ వేధింపులు ఎక్కువయ్యాయి. భర్త వేధింపులు తట్టుకోలేక జీవిత శుక్రవారం అర్ధరాత్రి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త ఆమెను వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించాడు. అక్కడి నుండి భార్య తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. భార్యాభర్తలు ఇటీవలె తమ వివాహ దినోత్సవాన్ని జరుపుకునేందుకు యాదగిరి గుట్టకు వెళ్లారు. తిరిగి వచ్చాక ఈ ఘటన జరిగింది. మరోవైపు తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, అల్లుడే హత్య చేశాడని బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు శనివారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దంపతులకు ఏడాదిన్నర వయసుగల కూతురు ఉంది.

వెంటనే పవన్‌, మహేష్‌ స్పందించారు: సమంత


పవన్ తో,మహేష్ తో సినిమాలు చేసిన సమంతకు వారిద్దరితో మంచి రిలేషన్ ఉంది. దాంతో ఆమె తన ప్రత్యూష ఫౌండేషన్ కు వారి నుంచి హెల్ప్ తీసుకుంది. ప్రత్యూష ఫౌండేషన్‌ గురించి తెలుసుకొని మహేష్‌బాబు, పవన్‌ కల్యాణ్‌ చాలా సంతోషించారు. కథానాయకుల దుస్తుల్ని వేలం వేసి, ఆ డబ్బుతో ఫౌండేషన్‌కి ధన సహాయం చేయాలనేది నా ఆలోచన. వెంటనే పవన్‌, మహేష్‌ స్పందించారు. పవన్‌ తన 'గబ్బర్‌ సింగ్‌' దుస్తుల్ని ఇచ్చారు. మహేష్‌ అప్పటికి లండన్‌లో ఉన్నారు. అక్కడి నుంచి 'దూకుడు' దుస్తులు నాకు అందేలా చూశారు. నిజం చెప్పాలంటే నా తోటి హీరోయిన్స్ కూడా ఇంతలా స్పందించలేదు అంటూ చెప్పుకొచ్చింది సమంత. ఇప్పుడు నేను సెలబ్రెటీని. ఏం మాట్లాడినా విలువ ఉంటుంది. అందుకే మంచి మాటలు మాట్లాడాలి. మంచి పనులు చేయాలి. ట్విట్టర్‌లో మూడు లక్షల మంది నన్ను అనుసరిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది సమంత. మధ్యతరగతి జీవితం నుంచి వచ్చింది కదా... ఒదిగి ఉండడం ఎలాగో కూడా నేర్చుకొంది. ఇంతిచ్చిన సమాజానికి ఎంతోకొంత తిరిగి ఇవ్వడం అలవాటు చేసుకొంది. అందుకే సినిమాలతో పాటు సామాజిక సేవకూ సమయం కేటాయిస్తోంది. ఈ ఏడాది సమంతకు బాగానే కలిసొచ్చింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'అత్తారింటికి దారేది' సినిమాలతో విజయాలు దక్కించుకొంది. 'రామయ్యా వస్తావయ్యా'లో ఆకర్ష పాత్రతో ఆకర్షిస్తోంది. ఈ సందర్భంగా మీడియా తో సమంత ప్రత్యేకంగా మాట్లాడింది.

కాస్త కంట్రోల్ చేసుకో నితిన్!


ఫెయిల్యూర్స్ అంటే ఎలా ఉంటాయో బాగా తెలిసినవాడు నితిన్. అందుకే సక్సెస్ వచ్చేసరికి ఆనందంతో పొంగిపోతున్నాడు. పెద్ద పెద్ద దర్శకులంతా తనతో సినిమాలు చేయడానికి ముందుకొస్తుంటే, ఉత్సాహంతో ఊగిపోతున్నాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తో హార్ట్ అటాక్ లో చేస్తున్న సంగతి తెలిసిందే కదా! ఈ సినిమా విషయంలో చాలా ఎగ్జయిటైపోతున్నాడు నితిన్.

 హార్ట్ అటాక్ చిత్రం శరవేగంగా షూటింగ్ చేసుకుంటోంది. ప్రస్తుతం స్పెయిన్లో సందడి చేస్తోంది. దీని హడావుడి ఎంతగా ఉందంటే... అక్కడి పత్రికలో ఈ సినిమా షూటింగ్ గురించి ప్రచురించారు. దాంతో తెగ మురిసిపోయాడు నితిన్. అతడు అంతకంటే ఎక్కువ ఆనందపడిపోతోన్న విషయం ఇంకోటుంది. అదేంటంటే... ఈ చిత్రానికి పూరి దర్శకత్వం వహించడం. అతడి వర్కింగ్ స్టయిల్ అద్భుతంగా ఉందట. ఆయన టేకింగ్ సూపర్బ్ గా ఉంటుందని తెలుసుగానీ, పని చేసే విధానం ఇంత ఫెంటాస్టిక్ గా ఉంటుందని ఇప్పుడే తెలిసిందంటూ గంతులు వేస్తున్నాడు.

 నితిన్ ఇంత హడావుడి ఎందుకు చేస్తున్నాడో అర్థం కావడం లేదు. అతడికి పెద్ద డైరెక్టర్లతో పని చేయడం కొత్తేమీ కాదు. గతంలో వీవీ వినాయక్ అతడితో సూపర్ హిట్ ఇచ్చాడు. రాఘవేంద్రరావు, తేజ లాంటి డైరెక్టర్లతో కూడా పని చేశాడు. మరి ఎప్పుడూ గొప్ప డైరెక్టర్ ముఖమే చూడనట్టు, పెద్ద దర్శకుడితో పనిచేసే చాన్సే రాలేదన్నట్టు మురిసిపోవడమేంటో కామెడీ కాకపోతే. కానీ నితిన్ కి ఓ విషయం అర్థం కావడం లేదు. సినిమాని స్పీడుగా తీయడం, వైవిధ్యంగా పని చేయడమే కాదు, ఫ్లాపులను ఇవ్వడంలో కూడా పూరి స్పెషలే. ఆ విషయం మనసులో పెట్టుకుని, సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూసేవరకూ కాస్త కంట్రోల్ చేసుకో నితిన్ బాబూ!

హీరో ల పై వేణుమాధవ్ వివాదాస్పద వ్యాఖ్యలు


కమేడియన్ వేణుమాధవ్ ఈ రోజు ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. తను డైటింగ్ చేయడం వల్ల బరువు తగ్గానని చెపుతూ అయితే తనకు ఎదో భయం కరమైన జబ్బు వచ్చింది అంటూ కొందరు కావాలని ప్రచారం చేసారని, హీరో లు బరువు తగ్గితే అందంగా కనిపించ డానికిఒళ్ళు తగ్గారని అంటారని, కానీ అదే ఒక కమెడియన్ లేదంటే మరో క్యారెక్టర్ నటుడు ఒళ్ళు తగ్గితే అతడికి ఎదో జబ్బు వచ్చింది అంటూ టాలీవుడ్ లో ప్రచారాలు జరుగు తాయని అంటూ హీరో లేకాకుండా మాములు నటులు కూడా మనుషులే కదా అంటూ సంచలనాత్మక వ్యాఖ్యానాలు చేసారు వేణుమాధవ్

 హైట్ తక్కువగా ఉన్నాను కాబట్టే ఇంత డబ్బు సంపాదించ గలిగానని చెపుతూ, హై ట్ ఉన్న హీరోలు అందరూ సంపాదిం చేస్తున్నారా అంటూ మరో సారి హీరో లను టార్గెట్ చేసాడు వేణుమాధవ్..అంతే కాదు తన కెరియర్ లో సంవత్సరానికి 40 సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి అంటూ వేణుమాధవ్ తను ఇంకా టాప్ కమెడియన్ గానే ఉన్నాను అన్న సంకేతాలు ఇచ్చాడు. సినిమాల పరంగా తనకు ఏ ఆశయం లేదంటూ తాను దేముడిని లక్ష రూపాయలు అడిగేతే తనకు లెక్కలేనన్ని లక్షలు ఇచ్చాడు అంటూ, తనకు ప్రస్తుతం సినిమాలలో అవకాశాలు తగ్గడానికి కారణం ప్తస్తుతం రాష్ట్రం జరుతున్న రాజకీయ ఉద్యమాలు అంటున్నాడు. తనలో మంచి రచయిత కూడా ఉన్నాడు అంటున్న వేణుమాధవ్ లోని రచయితను తెలుగు సినిమా ప్రేక్షకులు చూసే రోజు త్వరలో నే వస్తుంది అనుకోవాలి. .

నాగచైతన్య ప్లేస్ లోకి దగ్గుపాటి రానా ఖరారు


దగ్గుపాటి రానా మరో సినిమా కమిటయ్యినట్లు సమాచారం. నాగచైతన్య తో అనుకున్న ఛార్మినార్ చిత్రం రీమేక్ లోకి రానా వచ్చినట్లు సమాచారం. రీసెంట్ గా పోటుగాడు తో హిట్ కొట్టిన లగడపాటి శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మొదట నాగచైతన్య తో మొదట ఈ ప్రొడక్షన్ అనుకున్నారు...ప్రీ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసారు. అయితే అనుకోని విధంగా డేట్స్ సర్దుబాటు కావటంతో రానా సీన్ లోకి ఎంటరయ్యాడు. కన్నడంలో డైరక్ట్ చేసిన దర్శకుడే తెలుగులోనూ డైరక్ట్ చేయనున్నారు. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని సమాచారం.

ప్రభాస్‌ హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి'. ఈ చిత్రం కోసం భారీగా సెట్స్ వేస్తున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ‘గ్లాడియేటర్' తరహాలో ఓ భారీ సెట్‌ను కూడా రాజవౌళి ఈ చిత్రం కోసం రూపొందించనున్నారని చెప్తున్నారు. దీంతోపాటు విలన్ గా చేస్తున్న రానా డెన్, ఉద్యానవనాలు వంటివి కూడా సెట్టింగ్స్ వేస్తున్నారట. మొత్తంమీద చాలా ఖర్చవుతుందని అంచనా. ఈ సెట్స్ లో తీసే సీన్స్ లో సినిమాలో కీలకమై నిలుస్తాయని చెప్తున్నారు. ఇక దర్శకుడు ఎస్.ఎస్.రాజవౌళి ఏది చేసినా అది సెన్సేషన్‌గా మారుతుంది. తాజాగా ఆయన రూపొందిస్తున్న ‘బాహుబలి' చిత్రంపై ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు అంచనాలు పెంచడంలో ఆయనది అందెవేసిన చేయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఆర్‌ఎఫ్‌సిలో ఇటీవలే సాబు శిరిల్ రూపొందించిన ఎరీనా సెట్‌లో రాజవౌళి రెండున్నర కోట్ల భారీ వ్యయంతో ప్రభాస్‌కు అనుష్కకు నిశ్చితార్థం దృశ్యాలను చిత్రీకరించారు. ఈ సన్నివేశంలో రానా, రమ్యకృష్ణలతోపాటుగా ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్నారు. ఈ ఒక్క సెట్‌కే రెండున్నర కోట్ల రూపాయలు ఖర్చయితే ఇక మిగతా వాటి గురించి ఏ తరహాలో ఖర్చు చేస్తారో అన్న ఆలోచన టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది.

తప్పుడు ప్రచారమే, శ్రీహరికి ఆ వ్యాధి లేదు: ప్రభుదేవా



రెండు రోజుల క్రితం హఠాన్మరణం చెందిన శ్రీహరిపై రకరకాలుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆయనకు కాలేయ సంబంధ వ్యాధి ఉందని, లివర్ క్యాన్సర్ వల్లనే ఆయన మరణించారని పుకార్లు షికార్లు చేసాయి. బలమైన ఫిజిక్‌తో ఉండే శ్రీహరి కొన్ని రోజులుగా చిక్కిపోయి కన్పించడం కూడా ఈ ప్రచారానికి మరింత బలం చేకూరినట్లయింది. అయితే ఇదంతా తప్పుడు ప్రచారమే అంటున్నారు దర్శకుడు ప్రభుదేవా. తాను దర్శకత్వం వహిస్తున్న ‘రాంబో రాజ్ కుమార్' సినిమా షూటింగులో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారని, శ్రీహరి చనిపోయారంటే ఇప్పటికీ నమ్మలేక పోతున్నానని తెలిపారు.

 శ్రీహరికి కేన్సర్ వచ్చినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని, ముంబైలో షూటింగ్ పూర్తయ్యాక ఆయన అస్వస్థతకు గురయ్యారు. గుండె పోటు రావడం వల్లనే ఆయన చనిపోయారు అని ప్రభుదేవా వెల్లడించారు. ఆయన ఎప్పుడూ ఎంతో ఆరోగ్యం, ఫిట్‌నెస్‌గా ఉంటారు అని ప్రభుదేవా వెల్లడించారు. శ్రీహరి భార్య కూడా ఇదే విషయం వెల్లడించారు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ...ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాంబో రాజ్ కుమార్ అనే హిందీ సినిమా షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లినట్లు తెలిపారు. సినిమా షూటింగులో ఉత్సాహంగా పాల్గొన్నారని ఆమె తెలిపారు. హోటల్ రూమ్‌లో పాలు తాగి పడుకున్నారని. కొంత సమయంత తర్వాత చాతి నొప్పిఉందని చెప్పి కుప్ప కూలిపోయారని, ఆయన్ను వెంటనే లీలావతి ఆసుపత్రికి తరలించినట్లు శాంతి తెలిపారు. వైద్యులు బృందం ఆయన్ను పరీక్షించి బీపీ డౌన్ అయిందని తెలిపారని, 4 గంటలకు మరణించినట్లు ధృవీకరించారని తెలిపారు