Saturday, 12 October 2013

సచిన్ రిటైర్మెంట్ పై టాలీవుడ్ హీరోల స్పందన


క్రికెట్ గాడ్‌గా పేర్గాంచిన సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ వార్త క్రీడా ప్రపంచాన్ని కలవరానికి గురి చేసింది. సచిన్ వీరాభిమానులు ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. సచిన్‌ని విపరీతంగా ఆరాధించేవారిలో మన టాలీవుడ్ హీరోలు కూడా ఉన్నారు. వారు కూడా సచిన్ రిటైర్మెంట్ వార్త విని చలించిపోయారు. పలువురి హీరోల స్పందన ఇలా.


..   విభజించాల్సిందే - వెంకటేశ్

నా దృష్టిలో ఇది వెరీ శాడ్ డే. 24 ఏళ్లుగా సచిన్ ఆటను ఆస్వాదిస్తూ వచ్చాను. ఇక తను లేని క్రికెట్ అంటే నాకే బ్లాంక్‌గా ఉంది. సచిన్‌ని చూసి ఎవ్వరైనా సరే ఇన్‌స్పైర్ కావాల్సిందే. అతని డిసిప్లిన్, డెడికేషన్, ఎఛీవ్‌మెంట్, ఎనర్జీ... మామూలు వ్యక్తులకు సాధ్యం కాదు. నాకు రిలాక్సేషన్ అంటే క్రికెట్టే. సచిన్ లేని క్రికెట్‌ని ఇంకో రకంగా ఊహించాల్సిందే. ఇక నుంచి ఈ క్రికెట్ ఎలా ఉంటుందో అనిపిస్తోంది. అసలు క్రికెట్ గురించి మాట్లాడాలంటే... సచిన్‌కి ముందు, సచిన్‌కి తర్వాత అని విభజించాల్సిందే. సచిన్‌తో నాకు మంచి పరిచయమే ఉంది. దక్షిణాఫ్రికాలో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌ల సమయంలోనూ, ఐపీయల్ మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు తనను చాలాసార్లు కలిశాను. మా ఇద్దరి మధ్యనా చాలా మంచి చర్చలు జరిగేవి. ఆ సందర్భాలను ఎప్పుడు గుర్తు చేసుకున్నా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది.
నేనెక్కడ కనిపించినా గుర్తుపట్టి పలకరిస్తుంటారు - శ్రీకాంత్

 ‘‘క్రికెట్‌ని గాఢంగా ప్రేమించే వాళ్లంతా సచిన్ రిటైర్మెంట్ వార్త వినగానే ఏడ్చినంత పనిచేశారు. క్రమశిక్షణకు నిలువుటద్దంలాంటి వ్యక్తి ఆయన. సచిన్‌ని చూడ్డానికే స్టేడియమ్‌కి వెళ్లేవాళ్లు చాలామంది ఉంటారు. ఇప్పుడా సంఖ్య తగ్గుతుంది. ఇకపై నేను కూడా స్టేడియమ్‌కి వెళ్లి మ్యాచ్‌లు చూడను. సచిన్‌తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వైజాగ్‌లో ఓసారి ఛారిటీ మ్యాచ్ జరిగినప్పుడు సచిన్‌తో పాటు ఐదుగురు ఇండియన్ క్రికెటర్లు, నేను, చిరంజీవిగారు, వెంకటేశ్‌గారు, తరుణ్ క్రికెట్ ఆడాం. ఆ మ్యాచ్‌లో నా కాలికి దెబ్బ తగిలితే, సచిన్ స్వయంగా నాకు ఐస్ పెట్టి ఎలా కేర్‌గా ఉండాలో సూచనలు చేశారు. ఆ తర్వాత రోజు చిరంజీవిగారి ఇంట్లో పార్టీ జరిగినప్పుడు సచిన్, మేమంతా చాలా ఎంజాయ్ చేశాం. ఆ క్షణాల్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పటికీ నేనెక్కడ కనిపించినా గుర్తుపట్టి పలకరిస్తుంటారు
  సచిన్ అంటేనే క్రికెట్... క్రికెట్ అంటేనే సచిన్..! - అల్లరి నరేశ్

 ‘గబ్బర్ సింగ్’లో పవన్ కల్యాణ్ ‘పిల్లా... నువ్వు లేని జీవితం నల్లరంగు అంటుకున్న తెల్ల కాగితం’ అని పాట పాడినట్టుగా, సచిన్ లేని క్రికెట్‌ని ఊహించడమే ఎంతో కష్టంగా ఉంది. బ్రియాన్ లారా లాంటి హేమాహేమీల్లాంటి క్రికెటర్లే సచిన్ రిటైర్మెంట్ వార్తను జీర్ణించుకోలేకపోతుంటే, నాలాంటి సాధారణ అభిమానుల పరిస్థితి ఏంటి? నిజంగానే సచిన్ క్రికెట్ దేవుడు. ఆయనలో ఇప్పటికీ క్రికెట్ ఆడే సత్తా ఉంది. కానీ కొత్త తరానికి అవకాశం ఇవ్వాలనే ఒకే ఒక్క కారణంతో పక్కకు తప్పుకుంటున్నారు. నా మట్టుకు నేను సచిన్ లేని క్రికెట్‌ని చూడ్డానికి ఇంకో రెండేళ్లు పడుతుందేమో! అసలు ఒక మనిషి 24 ఏళ్లుగా ఎక్కడా గ్రాఫ్ పడిపోకుండా హైరేంజ్‌లోనే క్రికెట్ ఆడటమంటే మాటలు కాదు. అది సచిన్ ఒక్కడి వల్లే అవుతుంది. ఇన్నేళ్లలో తనపై ఒక్క కాంట్రవర్శి కూడా రాకపోవడం చాలా గొప్ప విషయం. అసలు సచిన్ గురించి ఇంకా చాలా చెప్పొచ్చు. ఫైనల్‌గా మాత్రం ఒక్కటే. సచిన్ అంటేనే క్రికెట్. క్రికెట్ అంటేనే సచిన్.
  సచిన్ కోసమే ‘‘ఇక సచిన్ లేని క్రికెట్‌ని నేను చూడలేను - విష్ణు.

 సచిన్ కోసమే ఇన్నేళ్లూ క్రికెట్ చూశాను. ఇక నుంచి క్రికెట్ ప్రపంచమంతా బిఫోర్ సచిన్, ఆఫ్టర్ సచిన్ అని చెప్పుకుంటారు. ఈ 40 ఏళ్లలో 30 ఏళ్లు సచిన్ క్రికెట్‌నే అంకితమైపోయాడు. నెక్ట్స్ ఆయన ఏం చేస్తాడు? ఎంత మందికి ఆదర్శవంతంగా ఉంటాడు? అనేది నాతో పాటు చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్ వచ్చినపుడు 2 సార్లు సచిన్‌ని కలిశాను. ఆ ఇన్సిడెంట్స్ ఇప్పటికే నా మదిలో లైవ్లీగా ఉన్నాయి’’.ఇన్నేళ్లూ క్రికెట్ చూశాను
  వన్ అండ్ ఓన్లీ సచిన్ - సిద్దార్థ్

 ‘‘నాకు డాన్ బ్రాడ్‌మన్ తెలీదు. గ్యారీ సోబర్స్‌ని చూడలేదు. నేను చూసింది, నాకు తెలిసింది, నేను ఆరాధించింది, నేను ఆస్వాదించింది వన్ అండ్ ఓన్లీ సచిన్‌నే. ప్రపంచంలో ఇంత గొప్ప బ్యాట్స్‌మెన్ మళ్లీ రాడు. 24 ఏళ్లుగా ఈ క్రికెట్ ప్రపంచాన్ని తేజోవంతం చేసినందుకు సచిన్‌కి కృతజ్ఞతలు.

ఆర్టీసీ కదిలింది!


రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలని డిమాండ్ తో చేపట్టిన సమ్మెను సీమాంధ్ర ఆర్టీసీ కార్మికులు విరమించుకున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించుకోవడంతో తిరిగి బస్ ల రాకపోకలు ఆరంభమయ్యాయి. ఎంప్లాయిస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ నేతలతో రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఏకే ఖాన్ ఇతర ఉన్నతాధికారులు శుక్రవారం సుదీర్ఘ చర్చలు జరిపారు. రాత్రి 10.30 గంటల సమయంలో చర్చలు ఫలించాయి. సమ్మెను విరమించుకుంటున్నామని కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. శనివారం ఉదయం ఆరు గంటల నుంచి బస్సు సర్వీసులు ప్రారంభమవుతాయని తెలిపారు. మరి వీరు సమ్మె చేసింది సమైక్య రాష్ట్రం కోరుతూనా?లేక వీరి డిమాండ్ల కోసమా?

జగన్ వచ్చి దెబ్బ తిన్నాడా


జగన్ జైలు నుంచి వచ్చి దెబ్బతిన్నాడా... ఈ ప్రశ్న ఆయన ప్రత్యర్థుల్లో కంటే ఆయన పార్టీ నేతల్లోనే ఎక్కువగా వ్యక్తమవుతోంది. ఆయన రావడం పార్టీకి కొంత నష్టమే కలిగించిందన్న అభిప్రాయాలను కూడా కొందరు వైఎస్సార్ సిపి నేతలు వ్యక్తం చేస్తున్నారట. దీనికి ప్రధాన కారణం ఆయన దీక్ష ఫెయిల్ కావడమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఆయన రాకూడాని సమయంలో బయటకు వచ్చాడా, ఉద్యమంలోకి ప్రజలు లీడర్లను రానీయని సమయంలో రావడం కూడా మైనస్ అయిందా అన్న వాదనలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఈ మాట ఎలా ఉన్నా ఆయన దీక్షకు ఆయన మీడియా ఇచ్చిన విపరీత ప్రచారం, జరిగిన తీరు, ఆయన వ్యవహార శైలి జగన్ పై నమ్మకాన్ని మాత్రం సన్నగిల్లేలా చేసాయన్న వాదనే ఎక్కువగా వ్యక్థం అవుతోంది అంటున్నారు పరిశీలకులు.

 దీనికి తోడు ఆయన కాంగ్రెస్ తో కుమ్ముక్కై వచ్చాడని ఆరోపణలు వెల్తువెత్తడం, మరోవైపు కాంగ్రెస్ రాష్ట్ర విభజనను ఆపకుండా మరింత వేగవంతం చేయడంతో ఆయన ప్రభావం ఏమాత్రం చూపడం లేదన్న భావం ఒకటయితే, జగన్ కూడా విభజనకు లోలోపల అనుకూలమేనా అన్న భావాన్ని ఆయన ప్రత్యర్థులు జనాల్లోకి తీసుకువెల్లడానికి దోహదం చేసిందంటున్నారు. ఆయన రాకపోతే షర్మిల సమైక్య శంఖారావం ప్రజల్లో ఇంకా కొనసాగేది, ఆమో శంఖారావానికి ప్రజల మద్దతు కూడా బాగానే లభిస్తోంది.

 జగనన్న పై దర్యాప్తు పూర్తయినా ఆయనకు బెయిల్ రాకుండా కాంగ్రెస్, టిడిపి అడ్డుకుంటోందన్న ప్రచారం చేసే అవకాశం కూడా ఉండేది, అది నిజమేనన్న భావాన్ని కల్పించే అవకాశం ఉండేది. అలా కాక జగన్ రావడం, ఆయన రాష్ట్ర విభజన ఆపడంలో ఫెయిల్ అవుతుండడం, మరో వైపు షర్మిల ను జనాల్లోకి వెల్లకుండా ఆపడం, జగన్ కు షరతుల కారణంగా హైదరాబాద్ వదిలి సీమాంద్రలోకి వెల్లే వీలులేక పోవడం వంటివన్ని పార్టీకి ఆయన రాక మైనస్ చేసిందంటున్నారు. అయితే సీమాంద్రుల మనసు చూరగొనే నాయకుడు ఎవరవుతారన్న పోటీ నడుస్తున్న నేపథ్యంలో జగన్ బాగా కష్టపడితే మాత్రం పలితం దక్కవచ్చన్న ఆశాభావం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

బాబు దీక్ష భగ్నం: చూస్తూ లోకేష్, ఉద్రిక్తత (పిక్చర్స్)


కేరళలో తెలుగు సినిమా షూటింగుపై దాడి


కేరళ: తెలుగు సినిమా షూటింగ్ యూనిట్ సభ్యులపై కేరళలో దాడి జరిగింది. సందీప్ కిషన్, రెజీనా హీరో హీరోయిన్లు తెరకెక్కుతున్న ‘రా రా కృష్ణయ్య' చిత్రం షూటింగ్ కేరళలోని అల్లెప్పీ సమీపంలోని తిరువల్లాలో ఓ దేవాలయంలో జరుగుతుండగా శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. దాడిచేసిన వ్యక్తులు లోకల్‌గా ఉండే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్ఎస్) మద్దతుదారులని తెలుస్తోంది. ఈ విషయాన్ని సందీప్ కిషన్ తన మైక్రో బ్లాగింగ్ సైట్ ద్వారా వెల్లడించారు. కేరళ పత్రికల్లో కూడా ఈ దాడి విషయం ప్రచురితమైంది. ‘అధికారుల నుంచి అనుమతి తీసుకుని మేము షూటింగ్ మొదలు పెట్టాం. కొందరు వ్యక్తులు అక్కడి వచ్చి గొడవ చేయడం ప్రారంభించారు. పర్మిషన్ ఉందని చెప్పినా వారు వినలేదు. మా దర్శకుడు మహేష్‌పై దాడి చేసారు.

లోకల్ మేనేజర్ 57 ఏళ్ల కబీర్‌పై దాడి చేసారు. చివరకు మా దర్శకుడి దగ్గర నుంచి కొంత డబ్బు తీసుకుని వెళ్లి పోయారు' అని సందీప్ కిషన్ తెలిపారు. దాడి చేసిన వ్యక్తులు మతపరమైన ఉద్దేశాలతోనే వచ్చినట్లు తెలుస్తోంది. హీరోయిన్ రెజీనా మాట్లాడుతూ...‘దేవాలయంలో ఎవరూ ఎలాంటి తప్పు చేయలేదు. యూనిట్ సభ్యులంతా పాదరక్షలు బయటే విడిచి వచ్చాం. కానీ వారు వచ్చిన ఉద్దేశ్యం వేరు. కావాలనే దాడి చేసారు' అని వెల్లడించారు.

మహేష్ బాబు బార్య మళ్లీ వస్తోంది


టాలీవుడ్ టాప్ హీరో మహేష్ బాబు బార్య నమ్రతా శిరోద్కర్ మళ్లీ వెండితెరపైకి వస్తోంది. ఒకప్పటి మిస్ ఇండియానే కాదు తన నటన, అందచందాలతో సినిమా రంగాన్ని ఓ ఊపు ఊపిన హీరోయినే.

 అయితే ఆమె మహేష్ బాబు ను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమయింది. కుటుంబజీవితానికే పరిమితమై పోయింది. ఏదైనా మహేష్ బాబు సినిమా ఫంక్షన్లలో కనపడడం తప్ప ఆమె అంతగా బాహ్యప్రపంచంలో కనిపించలేదు.

 కారణం మహేష్ బాబుది కూడా బిజినెస్ మైండ్ కాకపోవడం తో బార్యకు రిస్క్ ఇవ్వలేదన్న టాక్ ఉంది. అయితే శ్రీదేవి ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ తో మళ్లీ వెండితెరపైకి రావడంతో నమ్రత కూడా మళ్లీ తన టాలెంట్ చూపించుకోవాలని డిసైడ్ అయిందంటున్నారు. మహేష్ బాబు కూడా ఈ విషయం చెప్పడంతో అది నిజమేనని తేలిపోయింది.

అమ్మ కోసం ముంబైలో చివరి టెస్టు: సచిన్


న్యూఢిల్లీ: దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను ముంబైలోనే జరపాలని భారత క్రికెట్ నియంత్రణ మండలిని కోరిన విషయం తెలిసిందె. అయితే ఇందుకు ఓ ప్రత్యేకమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. క్రికెట్ జీవితానికి స్వస్తి పలుకబోయే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ తిలకించేందుకు తన తల్లి రజిని ముంబైలో మ్యాచ్ జరిగితే హాజరవుతుందనే ఆలోచనతోనే సచిన్ బిసిసిఐకి విజ్ఞప్తి చేశారు. సచిన్ టెండూల్కర్ కోరిక మేరకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో తన 200వ టెస్టును నిర్వహించేందుకు బిసిసిఐ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. చివరి మ్యాచ్‌కు తన తల్లి హాజరై వీక్షించడం తనకు గర్వంగా ఉంటుందని సచిన్ భావిస్తున్నట్లు తెలిసింది. కాగా సచిన్ టెండూల్కర్ తన 199వ టెస్ట్ మ్యాచ్‌ను కోల్‌కతా ఈడెన్ గార్డెన్ స్టేడియంలో, ఆ తర్వాత 200వ టెస్ట్ మ్యాచ్‌ను అతనికి ఇష్టమైన ముంబై వాంఖడే స్టేడియంలో నిర్వహించనున్నట్లు సమాచారం. సచిన్ టెండూల్కర్ క్రికెట్ జీవితాన్ని ప్రారంభించిన వాంఖడే స్టేడియంలోనే తన తల్లి సమక్షంలో తన క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలకనున్నారు. తనను ప్రోత్సహించిన పలువురు ప్రముఖులు, ముంబై ప్రజల మధ్య తన చివరి మ్యాచ్‌ను ఆడనుండడం తనకు సంతోషన్నిచ్చే అంశంగా సచిన్ భావిస్తున్నట్లు సమాచారం.

ముని 3 : రాఘవ్ లారెన్స్‌కు గాయాలు


హైదరాబాద్: కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ గాయ పడ్డాడు. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ముని-3 : గంగా' షూటింగు కోసం డాన్స్ ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. డాక్టర్లు అతనికి కంప్లీట్‌గా 3 నెలలు రెస్ట్ తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో షూటింగ్ కాన్సిల్ అయింది. ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. ‘కాంచన' వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని గతంలో బెల్లంకొండ సురేష్ తెలుగు అనువాద హక్కులు దక్కించుకుని భారీ లాభాలు పొందారు.

 ఈ నేపథ్యంలో దర్శకుడు రాఘవ లారెన్స్ ‘ముని-3' చిత్రానికి చేయడానికి ముందుకు వచ్చాడు బెల్లకొండ. లారెన్స్ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించే ‘ముని-3'లో తాప్సీ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా గురించి నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ...‘కాంచన లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మా బేనర్లో లారెన్స్ తో చేస్తున్న ‘ముని-3' సబ్జెక్ట్ ఎక్స్ ట్రార్డినరీగా ఉంది. హీరోగా, దర్శకుడిగా లారెన్స్ ముని-3 మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు' అన్నారు.

 రాఘవ లెరెన్స్, తాప్సీ జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రానికి ఫోటోగ్రఫీ: కిచ్చా, సంగీతం: థమన్, సమర్పణ: మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: బెల్లంకొండ సురేష్, బెల్లకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-కొరియోగ్రఫీ-దర్శకత్వం: రాఘవ లారెన్స్.