Friday, 11 October 2013

అశృనయనాల మధ్య శ్రీహరి అంత్యక్రియలు(ఫోటోలు)



శ్రీహరి మరణంతో ఆగిపోయిన....మహేష్ బాబు ‘ఆగడు’


మహేష్‌బాబు, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మించనున్న చిత్రం ‘ఆగడు'. ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్ 11న ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే శ్రీహరి మరణంతో ఇండస్ట్రీ విషాదంలో ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని దర్శకుడు శ్రీను వైట్ల వాయిదా వేసారు. మళ్లీ సినిమా ప్రారంభోత్సవం ఎప్పుడు అనేది త్వరలో ప్రకటించనున్నారు. శ్రీను వైట్ల ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పూర్తి చేసారు. ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి.

‘ఆగడు' సినిమాను రూ. 40 కోట్ల బడ్జెట్ మించకుండా పూర్తి చేయాలని, అప్పుడే నిర్మాతలకు, బయ్యర్లకు మంచి జరుగుతుందని మహేష్ బాబు శ్రీను వైట్లు సూచించినట్లు తెలుస్తోంది. తన సినిమా నష్టాల పాలైతే తనకే చెడ్డపేరు కాబట్టి మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మహేష్ బాబు ఆలోచన పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ప్రారంభం రోజే ఈ సినిమాకు సంబంధించిన కథనాయికలు, మిగిలిన సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలుస్తాయి. ఇప్పటికే సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో రెండు పాటలు ఓకే అయ్యాయి. సంగీత దర్శకునిగా తమన్‌కిది 50వ సినిమా. ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న 1(నేనొక్కడినే) సినిమాతో పాటు ‘ఆగడు' సినిమా కూడా 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ యే నిర్మిస్తుంది. ఈ సినిమాల నిర్మాతలైన రామ్ ఆచంట, గోపి ఆచంటమరియు అనీల్ సుంకర మహేష్ కు సన్నిహితులు. 1(నేనొక్కడినే) సినిమా 2014 సంక్రాంతికి విడుదలకానుంది

డిసెంబర్‌లో కిరణ్ పార్టీ: వెంట ఎవరెవరు?


రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డి డిసెంబర్ నెలలో పార్టీ పెట్టే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం, కాంగ్రెసు అధిష్టానం ముందుకు పోతే కొత్త పార్టీ పెట్టాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకు ఆయన డిసెంబర్ వరకు వేచి చూడాలని అనుకుంటున్నారు. పార్లమెంటు శీతాకాలం సమావేశాల్లో తెలంగాణ బిల్లును కేంద్రం ప్రతిపాదించే అవకాశం ఉంది. ఆ బిల్లు ఆమోదం పొంది, రెండు రాష్ట్రాలు ఏర్పడితే కచ్చితంగా పార్టీ పెట్టాలనే యోచనలో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర విభజన ఈ ఎన్నికల్లోగా జరదని ఆయన గట్టిగా నమ్ముతున్నట్లు కనిపిస్తున్నారు. ఇంత త్వరగా ప్రక్రియ పూర్తి కాదని, వీలైతే అడ్డంకులు కల్పించాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ తీర్మానాన్ని శానససభలో ఓడించి, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రతిస్పందనను చూసిన తర్వాత పార్టీ పెట్టే విషయంపై ఆలోచన చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.


 రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర కాంగ్రెసు శాసనసభ్యులు, మంత్రులు తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల్లోకి వలసలు వెళ్లకుండా కిరణ్ కుమార్ రెడ్డి వర్గీయులు ఆపుతున్నట్లు చెబుతున్నారు. పార్టీ పెట్టే ఆలోచనతోనే వారు ఈ పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. తాను కొత్త పార్టీ పెడితే ఎపిఎన్జీవోల మద్దతు తమకు సంపూర్ణంగా లభిస్తుందని కిరణ్ కుమార్ రెడ్డి అనుకుంటున్నారు. ఎపిఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబుతో కిరణ్ కుమార్ రెడ్డికి ఈ మేరకు అవగాహన ఉన్నట్లు కూడా ప్రచారం సాగుతోంది. ఎపిఎన్జీవోలు సమ్మెను విరమించినా సమైక్యాంధ్ర ఉద్యమ సెగ చల్లారకుండా చూడాలనే వ్యూహంతో కిరణ్ రెడ్డి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడిస్తే కచ్చితంగా విభజన ప్రక్రియ ఆగిపోతుందని, తీర్మానాన్ని ఓడించి రాష్ట్రపతిని కలిసి విభజనను అడ్డుకోవాలని కిరణ్ కుమార్ రెడ్డి అనుకుంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి సీమాంధ్రకు చెందిన మంత్రులు శైలజానాథ్ (అనంతపురం), ఏరాసు ప్రతాప రెడ్డి, టిజి వెంకటేష్ (కర్నూలు), కె. పార్థసారథి (కృష్ణా), పితాని సత్యనారాయణ (పశ్చిమ గోదావరి), గంటా శ్రీనివాసరావు (విశాఖ), కాసు వెంకట కృష్ణా రెడ్డి (గుంటూరు), తోట నర్సింహం (తూర్పు గోదావరి) కిరణ్ కుమార్ రెడ్డి వెంట ఉంటారని వార్తలు వచ్చాయి. సీనియర్ శాసనసభ్యుల్లో జెసి దివాకర్ రెడ్డి (అనంతపురం), గాదె వెంకటరెడ్డి (గుంటూరు), రాయపాటి సాంబశివ రావు (గుంటూరు), ధర్మాన ప్రసాదరావు (శ్రీకాకుళం) కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతు ఇస్తారని చెబుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉండడం వల్లనే కొంత మంది వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి వెళ్లే విషయంలో జాప్యం చేస్తున్నట్లు చెబుతున్నారు. దాదాపు 40 మంది శాసనసభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి వెంట ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కాంగ్రెసుకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఎన్నికల తర్వాత విభజనకు కారణమైన కాంగ్రెసు వెంట వెళ్తారని ప్రచారం చేయడం ద్వారా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లేఖ ఇవ్వడం వల్లనే రాష్ట్ర విభజన జరిగిందని చెప్పడం ద్వారా సమైక్యాంధ్ర కోసం నిలబడిన నేతగా కొత్త పార్టీతో ముందుకు వస్తే తనను సీమాంధ్ర ప్రజలు ఆదరిస్తారని కిరణ్ కుమార్ రెడ్డి నమ్మకంతో ఉన్నట్లు చెబుతున్నారు.

Akshay Kumar at Charminar


ఎన్టీఆర్ ను ఏడిపించిన ‘రామయ్యా వస్తావయ్యా’



యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను శుక్రవారం తెరపైకి వచ్చిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా ఏడిపించిందంటున్నారు ఆయన సన్నిహితులు. ఈ సినిమాపై అభిమానులే కాదు ఎన్టీఆర్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. తీరా దాని పలితం అలా రాకపోయే సరికి ఎన్టీఆర్ పని ఏడ్చినంతపనయింది అంటున్నారు సినీ విశ్లేషకులు కూడా.

 దీనికి కారణాలు అనేకం ఉన్నాయి, ఎన్టీఆర్ పవర్ ను వరుసగా అభాసుపాలు చేస్తున్నాయి ఆయన సినిమాలు. రాంచరన్ మగధీరను బీట్ చేద్దామని శక్తి తో తెరపైకి వస్తే మెహర్ రమేష్ దానిని తుస్సు మనిపించాడు. ఆ తరవాత దమ్ము సినిమాను కూడా బోయపాటి బోర్ కొట్టించాడు. మహేష్ బాబు సినిమా దూకుడు కు కళ్లెం వేయాలని శ్రీనువైట్లతో బాద్ షా తీస్తే అది దాని దరిదాపులను కూడా చేరుకోలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ రికార్డును ఆపేద్దామని వస్తే అది కూడా బోల్తాపడింది. గబ్బర్ సింగ్ ను అందించిన హరీష్ శంకర్ తో సినిమా కాబట్టి ఎన్టీఆర్ కూడా ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. పైగా దీని విడుదలపై జరిగిన రాద్దాంతంతో అభిమానులు కూడా ఎంతో ఆతృత కనపరచారు. కాని అదంతా కల్లలయ్యేసరికి పాపం ఎన్టీఆర్ కంట కన్నీరు ఆగలేదంటున్నారు.

పవన్ విషయంలో యూటర్న్ తీసుకుంటున్న రేణుదేశాయ్ !!


పవన్ కళ్యాణ్ భార్య రేణు దేశాయ్ లేటెస్ట్ గా ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆశక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె మరాఠీ భాషలో ‘మగలాష్ తక్ వన్స్ మోర్’ అనే సినిమాను తానే నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రేణు తను స్క్రిప్ట్ రైటింగ్, స్టోరీ సెలక్షన్, మ్యూజిక్ సెటింగ్స్ ఈ విషయాలన్నీ తాను పవన్ నుంచి నేర్చుకున్నానని అంటు, పవన్ చాలా పెద్ద వ్యక్తి అనీ తను దారి తప్పితే సెట్ చేసే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ మాత్రమే అని అనడం పవన్ రేణుదేశాయ్ ల మధ్య ఆ మధ్య వచ్చిన రూమర్లకు తెరదించడమే అని అనుకోవాలి.

 అంతేకాదు ఇదే ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ ఈ సినిమాను తాను వ్యక్తిగతంగా పవన్ సహాయం లేకుండా నిర్మిస్తున్నానని పవన్ భార్య అయినంత మాత్రాన విజయం రాదనీ అంటు, తల్లిగా తన బాధ్యతలు నిర్వర్తించడం లో రాజీపడననీ అని అంటున్న రేణుదేశాయ్ మాటలను పరిశీలిస్తే ఆమె పవన్ విషయంలో యూటర్న్ తీసుకుంటుందా అని ఎవరికైనా అనిపిస్తుంది...

రజనీకాంత్‌కు మళ్లీ అనారోగ్యం, ఆందోళనలో ఫ్యాన్స్!



సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ మళ్లీ అనారోగ్యానకి గురయ్యారా? ప్రస్తుతం ఆయన మెడికల్ ట్రీట్మెంటులో ఉన్నారా? అంటే అవుననే అంటున్నారు ఆయన సన్నిహిత వర్గాలు. వచ్చే నెలలో జరిగే ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI)2013' కార్యక్రమం ఆయన చేతులమీదుగా ప్రారంభం కావాల్సి ఉండగా, అనారోగ్య కారణాలతో ఆయన దీనికి దూరంగా ఉండటున్నట్లు సమాచారం. గోవాలోని పనాజీలో నవంబర్ 20న జరిగే IFFI-2013 ప్రారంభోత్సవ కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా ఆహ్వానించేందుకు నిర్వాహకులు రజనీకాంత్‌ వద్దకు వెళ్లారు. అప్పుడే వారికి రజనీకాంత్ అనారోగ్యం విషయం తెలిసినట్లు తెలుస్తోంది. రజనీకాంత్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు. గతంలోనూ రజనీకాంత్ తీవ్రమైన అనారోగ్యానికి గురవడంతో పాటు విదేశాల్లో చికిత్స తీసుకున్నారు. అనారోగ్యం కారణంగా ఆయన చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. తాజాగా రజనీకాంత్ అనరోగ్యం బారిన పడ్డారనే విషయం తెలియగానే అభిమానుల్లో ఆందోళన మొదలైంది. కాగా...రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘కొచ్చాడయాన్' చిత్రం డిసెంబర్ 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈచిత్రానికి రజనీకాంత్ కూతురు సౌందర్య దర్శకత్వం వహించారు. అత్యాధునిక టెక్నాలజీతో హాలీవుడ్ ప్రమాణాలతో ఈచిత్రాన్ని తెరకెక్కించారు.

వచ్చాడు కానీ... ( 'రామయ్యా వస్తావయ్యా ' రివ్యూ)


"ఏంటిరా రికార్డులు రికార్డులు అని ఎగురుతున్నావు... నిక్కర్లు వేసుకున్న వయస్సులోనే రికార్డులు మడిచి జేబులో పెట్టుకున్న వాడిని " అంటూ 'రామయ్యా వస్తావయ్యా ' కౌంటర్స్ ఇస్తూ వచ్చేసాడు. ‘గబ్బర్ సింగ్ ' వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు తదుపరి చిత్రం అంటే మంచి అంచనాలే ఉన్నాయి.... అందులోనూ ఎన్టీఆర్ హీరో అంటే మరీనూ.... దాంతో ఈ చిత్రం ఆకాశాన్ని అంటిన ఆ అంచనాలు ను అందుకుందాలేదా అనేది అందరికీ ఆసక్తికరమే. అయితే హరీష్ శంకర్ తన మ్యాజిక్ ఈ చిత్రంలో చూపించలేకపోయారనిపిస్తుంది. ఫస్టాఫ్ ఫన్ తో,ఇంటర్వెల్ ట్విస్ట్ తో సేఫ్ గా నడిచిపోయనా సినిమాకు కీలకమైన సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్ సోసోగా ఉండి నిరాశకలిగించింది. ముఖ్యంగా హరీష్ శంకర్ ..పూర్తిగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అలరించటానికి ఎంచుకునే ఎలిమెంట్స్ మీదే దృష్టి పెట్టారు. ఎన్టీఆర్ గత చిత్రాల కన్నా గ్లామర్ గా కనిపించారు... డైలాగ్ డెలవరీలోనూ ఒక రకమైన ఈజ్ చూపిస్తూ వేరియేషన్ చూపించారు. అలాగే సినిమా మొత్తం ఎన్టీఆర్ భుజాలపైనే నడిచింది. ముఖేష్ రుషి తన పెద్ద కూతురు పెళ్లి చేయటానికి సన్నాహాలు చేస్తూంటే అతనిపై రైవల్ బ్యాచ్ అజయ్ గ్రూఫ్ ఎటాక్ చేస్తుంది. దాన్ని నుంచి తప్పించుకున్న ముఖేష్ రుషి పెళ్లి కి టైట్ సెక్యూరిటీ పెడతాడు. ఇదిలా ఉంటే మరో ప్రక్క కాలేజీలో చదువుకుంటున్న నందు(ఎన్టీఆర్) మరో కాలేజీలో చదువుతున్న అమ్మాయి అక్షర (సమంత)ని చూసి ప్రేమలో పడిపోతాడు. ఆమెను కూడా ప్రేమలో పడేయటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూంటాడు. ఆమె మొదట కాదన్నా...తర్వాత ఓకే అంటుంది. అంతేకాకుండా తన అక్క పెళ్లికి రమ్మంటుంది. ఇంతకీ సమంత ఎవరో కాదు ముఖేష్ రుషి రెండో కూతురు. ఆ పెళ్లికి వెళ్లిన ఎన్టీఆర్ ఏం చేసాడు. ముఖేష్ రుషి కి ... ఎన్టీఆర్ కి ఏంటి సంభంధం...శృతి హాసన్ పాత్ర ఏమిటి... అనేది మిగతా కథ. కేవలం ఇంటర్వెల్ ట్విస్ట్ ని నమ్ముకుని చేసిన ఈ చిత్రం కథ కి సెకండాఫ్ ప్లాష్ బ్యాక్ దెబ్బ కొట్టింది. ముఖ్యంగా దాదాపు ప్రీ క్లైమాక్స్ దాకా ప్లాష్ బ్యాక్ ఉండటంతో అది సాగిన ఫీలింగ్ వచ్చింది. దానికి తోడు తర్వాత ఏం జరుగుతుందనే ప్రెడిక్టుబులిటీ సెకండాఫ్ లో బాగా ఎక్కువైంది. తర్వాత ఏం జరిగిందేనేది చాలా ఈజీగా ఊహించేలా తయారుచేసారు. ముఖ్యంగా సెకండాఫ్ లో ఎంటర్టైన్మెంట్ పూర్తిగా లేకుండా పోయింది. ఉన్న కొద్ది జోకులూ పేలలేదు. ఆ మాత్రమైనా చూడగలిగామంటే అది ఎన్టీఆర్ నటనా గొప్పతనమని నిశ్శందేహంగా చెప్పవచ్చు. ఇక హరీష్ శంకర్ నుంచి ఆశించే పంచ్ లు సైతం ఫస్టాఫ్ లో బాగా పేలాయి కానీ...సెకండాఫ్ లో అవీ లేవు. అంతేకాక ఈ రోజుల్లో ఇంకా జమీలు లేని ఈ రోజుల్లో జమీందారు వారసుడు అని ఎన్టీఆర్ ని చెప్పడం కూడా విచిత్రంగా అనిపిస్తుంది. అలాగే సినిమాకు హైలెట్ అవుతుందనుకున్న శృతి హాసన్ పాత్ర కూడా తేలిపోయింది.

 ఆ డైలాగ్ సూపర్............

 దుర్యోధనుడు గెటప్ లో కనిపించి..దానవీర శూర కర్ణలో చెప్పే పెద్ద డైలాగుని హీరో ఇంట్రడక్షన్ సీన్ లో చెప్పి అదరకొట్టారు. తన తాతగారి లాగే పౌరాణానిక పాత్రల్లోనూ రాణిస్తాడని చెప్పినట్లైంది. ఈ సీన్ లో ఎన్టీఆర్ ఆహార్యం...డైలాగు చెప్పే తీరు చాలా బాగుంటుంది.

"తను 100 కి ప్రిపేర్ అయ్యి...99 తెచ్చుకుంది ...నేను పాస్ మార్క్ 36 కి ప్రిపేర్ అయ్యి...37 తెచ్చుకున్నాను...కనుక నేనే గొప్ప " వంటి చిత్రమైన లాజిక్ తో కూడిన ఫన్ డైలాగ్స్ తో వచ్చిన ఈ చిత్రం డైలాగ్స్,పాటలు పరంగా ఓకే అనిపిస్తుంది. కానీ ఎన్టీఆర్, హరీష్ శంకర్ కాంబినేషన్ నుంచి ఆశించే రేంజిలో ఈ చిత్రం లేదనే చెప్పాలి. కథ,కథనం ఇవ్వన్నీ ప్రక్కన పెడితే పాటలు బాగున్నాయి..ఎంజాయ్ చెయ్యచ్చు....ఫస్టాఫ్ లో కామెడీ బాగుంది కాస్సేపు నవ్వుకోవచ్చు అనుకుంటే ఈ చిత్రం ఓ ఛాయిస్.