Thursday, 10 October 2013

మొగుడు ఓపెన్‌గా ఉండాలి


ప్రపంచంలో ఏ అమ్మాయికైన ఎప్పుడు పెళ్ళి జ‌రుగుతుందో చెప్పేయోచ్చు కాని, ఫిల్మ్ సెల‌బ్రిటీల‌కు ఎప్పుడు పెళ్లి జ‌రుగుతుందో చెప్పాలంటే కొద్దిగా క‌ష్టమే. ఒక్కోసారి అక‌స్మార్తుగా పెళ్లి జ‌రుగుతుంది, మ‌రోసారి జీవితాన్ని ఒంట‌రిగానే గ‌డపాల్సి ఉంటుంది. ఇర‌వై ఆరు సంవ‌త్సరాల బాలీవుడ్ బ్యూటి కంగ‌నా ర‌నౌట్‌ను మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అడిగితే ఈ విధంగా స‌మాధానం చెప్పింది.

 'ప్రస్తుతానికి నేను సింగిల్‌గానే ఉన్నాను. కాని ఇలాగే ఉంటాను అని అనుకోవ‌డం లేదు. నాకు కాబోయో భ‌ర్తకు ఇటువంటి క్యాలిటీసే ఉండాల‌ని కోరుకోవ‌డం లేదు. త‌నకు ఎటువంటి క్వాలిటీస్ ఉన్నా, నిజాయితి గ‌ల వాడై ఉండాలి. ముఖ్యంగా ఓపెన్ మైండ్ అయి ఉండాలి' అంటూ ఎన్నో విష‌యాలను చెప్పింది. ఓ ప్రవేట్ ఈవెంట్‌కు అటెండ్ అయిన కంగానాను, పెళ్ళి గురించి మీడియా గుచ్చి గుచ్చి అడిగితే ఇక త‌ప్పదు అన్నట్టు త‌నదైన శైలిలో స‌మాధానం చెప్పి అక్కడ నుండి త‌ప్పించుకుంది.

 కంగ‌నర‌నౌట్ మొట్టమొద‌టి సారిగా 2006లో వ‌చ్చిన గ్యాంగ్‌స్టర్ మూవీతో బాలీవుడ్‌కి ఎంట్రి ఇచ్చింది. ఇదే మూవీలో త‌ను బెస్ట్ యాక్టెర్‌గా నేష‌న‌ల్ అవార్డును కూడ కైవ‌సం చేసుంది. త‌రువాత ఫ్యాష‌న్ మూవీలో స్ట్రగుల్ మోడ‌ల్‌గా న‌టించి మ‌రోసారి బెస్ట్ యాక్టెర్‌గా అవార్డును తీసుకుంది. ప్రస్తుతానికి త‌న అప్ క‌మింగ్ ఫిల్మ్ క్రిష్‌3కు ప్రమోష‌న్ కార్యక్రమాల‌ను చేసుకుంటుంది. అలాగే మ‌రో నాలుగు మూవీల‌లో కంగ‌నా హీరోయిన్‌గా న‌టిస్తుంది.

అక్కినేనికి విలన్ గా మంచు హీరో...?


అక్కినేని త్రయం కలిసి నటిస్తున్న చిత్రం "మనం". విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఇటీవలే విడుదల చేసారు.ఈ చిత్రంలో నాగార్జున సరసన శ్రియ, చైతన్య సరసన సమంత హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో మంచు విష్ణు విలన్ పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి అనూప్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

రిటైర్‌మెంట్ ప్రకటన చేసిన సచిన్ టెండూల్కర్


ముంబాయి, అక్టోబర్ 10 : క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన రిటైర్‌మెంట్‌ను ప్రకటించారు. 200వ టెస్ట్ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు గురువారం సచిన్ బీసీసీఐకు తన నిర్ణయాన్ని లేఖ ద్వారా తెలియజేశారు.

 ఇప్పటికే టెండుల్కర్ అంతర్జాతీయ వన్డే, ట్వంటీ20లకు గుడ్ బై చెప్పారు. తాజాగా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. వెస్టిండిస్‌తో భారత్ రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ముంబై, కోల్‌కతలలో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ టెస్టుల అనంతరం సచిన్ తప్పుకోనున్నారు. సచిన్ రిటైర్మెంట్ ప్రకటనను భారత్ క్రికెట్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బిసిసిఐ) గురువారం మధ్యాహ్నం ప్రకటించింది. సచిన్ టెండుల్కర్ 200వ టెస్టు అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని బిసిసిఐ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, సచిన్ టెండుల్కర్ 22 ఏళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడారు. వన్డేలు, టెస్టులు, ట్వంటీ20లో ఎన్నో రికార్డులు సృష్టించారు. టెస్టులు, వన్డేల్లో అత్యధిక పరుగులు, సెంచరీలను తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఎన్నో రికార్డులు తిరగరాశాడు.

గతంలో వన్డేలు, ట్వంటి20ల నుండి సచిన్ తప్పుకున్నాడు. సచిన్ 198 టెస్టులు ఆడి 15837 పరుగులు చేశాడు. 463 వన్డేలు ఆడి 18,426 పరుగులు చేశాడు. టెస్టుల్లో 51 సెంచరీలు, వన్డేల్లో 49 సెంచరీలు చేశాడు. రెండు ఫార్మాట్లలో కలిపి వంద సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్ సచిన్. వన్డేల్లో మొట్టమొదటి డబుల్ సెంచరీ సచిన్‌దే. క్రికెట్ లేని జీవితాన్ని తాను ఊహించుకోలేనని సచిన్ టెండుల్కర్ బిసిసిఐకి రాసిన లేఖలో పేర్కొన్నాడు. క్రికెట్ లేకుండా జీవించడం దుర్భరమే అన్నాడు. తాను 11వ ఏట నుండి క్రికెట్ ఆడుతున్నానని, దేశం తరఫున ఆడటం తన కల అని అది నెరవేరిందన్నాడు. దేశానికి ప్రాతినిథ్యం వహించడం గొప్పగా భావిస్తున్నట్లు చెప్పాడు. రిటైర్ అవ్వాల్సిన సమయం వచ్చిందని తన హృదయం చెబుతోందని, అభిమానుల మద్దతు వల్లే ఇన్నేళ్లు ఆడగలిగానని చెప్పాడు. తాను సొంత గడ్డ పైన ఆడనున్న రెండువందలవ మ్యాచ్ పైన దృష్టి పెట్టానని చెప్పాడు. తనకు ఇన్నాళ్లు సహకరించిన బిసిసిఐ, కుటుంబ సభ్యులు, అభిమానులకు కృతజ్ఞతలు అన్నారు.

ఏడ్చేసిన ఎన్టీఆర్ – విషాదంలో రాంచరణ్


ఎన్టీఆర్ ఏడ్చేసాడు, రాంచరణ్ విషాదంలో మునిగిపోయాడు... తెల్లవారితే తను ప్రతిష్టాత్మకంగా తీసిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా విడుతలవుతుంది అన్న సంబరంలో మునిగితేలాల్సిన ఎన్టీఆర్ ఒక్క సారిగా విషాదంలో మునిగిపోయాడు, ఉబికి వచ్చే కన్నీరును ఆపుకోలేక ఏడ్చేసాడు, ఆత్మీయుడు ఇక లేడు అన్నది చూసి దు:ఖాన్ని ఆపుకోలేకపోయాడు.

 రియల్ స్టార్ శ్రీహరి భౌతిక కాయాన్ని దర్శించి నివాళులు అర్పించేందుకు వెల్లిన ఎన్టీఆర్ పరిస్తితి ఇది. డైరెక్టర్ వంశీపైడిపెల్లితో కలిసి వెల్లిన ఎన్టీఆర్ శ్రీహరి పార్దీవ కాయానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అక్కడే ఉన్న శ్రీహరి సతీమణి శాంతిని పట్టుకుని రోదించాడు.

 రాంచరణ్ ది అదే పరిస్థితి, తండ్రి చిరంజీవితో కలిసివచ్చిన ఆయన నోరు బాదతో పెగలలేదు, నిన్న మొన్నటి వరకు జంజీర్, తూఫాన్ సినిమాల కోసం కలిసి నటించిన జ్ఞాపకాలు కళ్లముందు మెదిలాయో ఏమో పూర్తిగా అప్ సెట్ అయి విషాద వదనంతో కనిపించాడు. ఈ పరిస్తితి అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిలోను కనిపించింది.

జగన్ వ్యాన్ లో ఏం చేస్తాడు..?


ఐదు రోజులు దీక్ష చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి..తన చిత్రమైన మేనరిజమ్స్ ను ప్రదర్శించారు. దీక్ష చివరి రెండు రోజులైతేమరీనూ. కాసేపటికి ఓసారి దీక్షా స్థలికి దగ్గర్లో ఉన్న వ్యాన్ లోకివెళ్లటం అరగంట నుంచి గంట సేపు అందులో గడపటం తర్వాత బయటకు రావటం చేశారు.

 ఎందుకిలా అన్నది పార్టీ నేతల నుంచి.. మీడియా వర్గాలకు పాలుపోలేదు. ఏమైనాఆరోగ్యసమస్యలా అంటే.. అదీ లేదు. ఆహారం లేకపోవటం వల్ల కాస్తంత నీరసంతప్పించి మరెటువంటి ఇబ్బంది లేదు. జగన్నుచూసేందుకజనసమూహం వస్తుంటే.. ఆయన గారు మాత్రం బస్సులో ఉండటం అభిమానులకు.. నాయకులకు అసంతృప్తినికలిగించింది.

 దీక్ష ద్వారా వీలైనంత పొలిటికల్ మైలేజీ కోసం తపించాల్సిన అధినేత.. అలా షూటింగ్లో హీరోలు.. హీరోయిన్లు షాట్ కి..షాట్ కి వచ్చే కొద్దిపాటి గ్యాప్ లోనూ బస్సులోకి వెళ్లి రెస్ట్ తీసుకుంటారు. మరి.. జగన్ కు ఏ అవసరం వచ్చి అలా వెళ్లారా అన్న దానిపై కొంతమంది పార్టీ నేతలు ఉత్సాహం తట్టుకోలేక.. ఆ దిశగా దృష్టి సారించారు. విషయం అర్థమయ్యాక ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ.. ఏం ఫర్లేదు.. మరో వారం రోజులు దీక్ష గ్యారెంటీ అంటూ గుసగుసలాడుకోవటం కనిపించింది. బస్సులో ఏమైనా శక్తినిచ్చే రహస్యం ఉందా అంటూ పార్టీ నేతలతో కాస్త క్లోజ్ గా ఉండే రిపోర్టర్లు ప్రశ్నిస్తే.. ప్రతి విషయంలోనూ రంధ్రాన్వేషణ తప్పించి మరేం ఉందా? అంటూ అసహనం ప్రదర్శించారు. అప్పటికీ వదలకుండా.. అడగ్గా.. అడగ్గా.. ‘‘సార్ ఆసనాలు వేస్తున్నారు’’ అంటూ చెప్పారు.

 ఎందుకలా అంటే.. రోజుల తరబడి ఏమీ తీసుకోకుండా ఉంటే నీరసించిపోతారు కదా. అలా కాకుండా.. వీలైనంతగా హుషారు ఉండే ప్రయత్నం కోసమే ఈ తాపత్రయం అని చెబుతూ.. నా నోటి నుంచి ఇంకే చెప్పించొద్దు మహాప్రభూ అంటూ అక్కడి నుంచి మాయమయ్యారు. సరే.. ఆ అసనాలు ఏంటో తెలుసుకుందామని ఓ ఔత్సాహిక జర్నలిస్టు ఓ కన్ను వేస్తే.. రహస్యం అర్థమైంది. శక్తినిచ్చి.. మరింతకాలం దీక్ష చేసే సామర్థ్యానిచ్చే ప్లూయిడ్స్ ఇస్తున్నట్లు అర్థమై వాక్కయ్యాడు. అంటే.. జగనన్న చేసేది ఆమరణ నిరాహారదీక్ష కాదు.. రిలే నిరాహార దీక్షలన్న మాట అంటూ మరో రిపోర్టర్ కామెంట్ చేయబోతే.. ఇక్కడికి వచ్చింది వార్త కవర్ చేయటానికే అంటూ లాక్కెళ్లిపోవటం కనిపించింది.

సంచలనం : ప్రభుత్వంలో ఆర్టీసి విలీనం


లక్షకు పైగా ఆర్టీసి ఉద్యోగులు, కార్మికులు కంటున్న కల నెరవేరింది, ఎట్టకేలకు ఆర్టీసిని ప్రభుత్వం లో విలీనం చేసారు. రవాణా శాఖా మంత్రితో ఆర్టీసి సంఘాలు జరుపుతున్న చర్చలు పలించాయి. ఈమేరకు ఆర్టీసిని విలీనం చేస్తూ ప్రభుత్వం జిఓ 954 ను విడుదల చేసింది. ఇప్పటికే ఆర్టీసి వందల కోట్ల నష్టం లో ఉంది. ఇది భరించలేక ఆర్టీసి కార్మికులకు, ఉద్యోగులకు సరైన ప్రయోజనాలు దొరకడం లేదు. పైగా వేతనాలు కూడా తక్కువే.

 ఆర్టీసి ని ఎలా కలపాలి, ఏంచేయాలి అన్నదానిపై అధికారులు, ఆర్టీసి కార్మికులతో ఒక హైపవర్ కమిటీ ఏర్పాటు చేసారు. ఇది రెండు రోజుల్లో విలీనం జరిగితే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలాంటి ప్రయోజనాలు కల్పించాలి అన్న దానిపై నివేదిక ఇస్తొంది. ఈ నివేదిక ప్రకారం అంతా జరుగుతుందన్న మాట. ఇంకా కొన్ని డిమాండ్స్, సమ్మె విరమణపై శుక్రవారం సాయంత్రం మరోసారి బొత్సతో ఆర్టీసి సంఘాలు సమావేశం అయి చర్చించనున్నాయి. ఇవి కూడా సఫలం అవుతాయనే సంకేతాలు ఆర్టీసి యూనియన్ల నేతల నుంచి వెలుబడ్డాయి. అంటే ఆర్టీసి సమ్మె కూడా విరమణ కానున్నదన్న మాట. ఇక ఆర్టీసి విలీనంతో ఇప్పడు అందులో పనిచేస్తున్న లక్షా 17 వేల మంది కార్మికులు, ఉద్యోగులు ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ఇక లాభం, నష్టం గూర్చి బెంగ కూడా అంతగా అవసరం లేదన్నమాట, ఎందుకంటే ఇక ప్రభుత్వమే అన్ని చూసుకుంటుంది కాబట్టి.

శ్రీహ‌రి విషాదంపై ప్రముఖ‌ల స్పంద‌న‌లు


టాలీవుడ్ నటుడు శ్రీహరి బుధవారం హఠాన్మరణం చెందారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీహరి ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో మరణించారు. ప్రముఖ సినీ డ్యాన్సర్ డిస్కో శాంతి భర్త. ఇటీవల మగధీర, తుఫాన్ చిత్రాల్లో నటన ఆయనకు మంచి పేరు తెచ్చాయి. ఆయన వయస్సు 49. శ్రీహరి మరణవార్తతో సినీ పరిశ్రమ దిగ్బ్రాంతికి లోనైంది. గత కొద్దికాలంగా ఆయన కాలేయానికి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. సుమారు 97 సినిమాల్లో నటించారు.

 సినీ నటుడు శ్రీహరి మృతికి టాలీవుడ్ సినీ పరిశ్రమతో పాటు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమ గొప్పనటుడిని కోల్పోయిందని పేర్కొన్నారు. ఆయన గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారని, మానవతా వాది అని కొనియాడారు. 

కేంద్ర మంత్రి చిరంజీవి: నటుడు శ్రీహరి మరణ వార్త టాలీవుడ్ లో విషాదఛాయలను నింపింది. -అంతేకాకుండా మా కుటుంబానికి శ్రీహరి చాలా ఆప్తుడు. శ్రీహరి మరణించారనే వార్తను నమ్మలేకపోతున్నాను

 సినీ గేయ రచయిత పరుచూరి గోపాలకృష్ణ: శ్రీహరి మరణించడం చాలా బాధాకరమని అన్నారు. ఆయన గొప్ప మానవతావాదని, సినీ పరిశ్రమ ఓ అద్భుతమైన నటుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

 సినీ గేయ రచయిత చంద్రబోస్ : శ్రీహరి గొప్ప నటుడని ఆయన హీరోగా, తాను సినీ గేయ రచయితగా తాజ్ మహల్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశామని చెప్పారు.

 సినీ గేయరయిత సుద్దాల అశోక్ తేజ : శ్రీహరి మరణం చాలా బాధాకరమని అన్నారు. ఆయన నటించిన చాలా సినిమాల్లో పాటలు రాశానని తెలిపారు.

నిర్మాత నట్టి కుమార్.. రియల్ హీరో శ్రీహరి కుటుంబం సభ్యునిగా కలిసిమెలిసి ఉండేవారని వెల్లడించారు. ఆయన మరణం ఊహించని పరిణామమని అన్నారు.

 కోట శ్రీనివాస్ రావు: శ్రీహరి మరణించడం చాలా బాధాకమని అన్నారు. యావత్తు ప్రపంచం మంచి వ్యక్తిని కోల్పోయిందని తెలిపారు.

సంగీత దర్శకులు చక్రి... శ్రీహరి కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే మహా గొప్పవ్యక్తని కొనియాడారు. ఆయన ఎంతో ఆప్యాయతగా పలకరించేవారని తెలిపారు.

 డైరెక్టర్‌ విజయ: శ్రీహరి చిరంజీవి, నాగార్జున లాంటి అగ్రహీరోలకు శరీర ధారుడ్యం గురించి వివరిచించారని తెలిపారు. ఆయన తనను కలత చెందించిందని చెప్పారు.

 సినీ నటుడు మాదాల రవి: శ్రీహరి గొప్పనటుడని, కష్టపడి పైకొచ్చాడని అన్నారు. ఆయన మరణ వార్త తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని పేర్కొన్నారు.

 శ్రీనువైట్ల: శ్రీహరి మరణిండంతో ఓ మంచి స్నేహితున్ని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి విషయంలో తనను ప్రోత్సహించేవారని తెలిపారు. ఆయన మరణించడం చాలా బాధాకరమని అన్నారు.

 ఏవీఎస్ : శ్రీహరి మృతి చెందడం చాలా బాధాకరమని అన్నారు. ఆయన మృదుస్వభావి అని కొనియాడారు. నిర్మాత బండ్ల గణేష్... శ్రీహరి తనతో ఓ సోదరుని గా ఉండేవారని తెలిపారు. ఆయన మరణం బాధాకరమని, తనకు ఆయనతో కలిసి నటించిన అనుభవం ఉందని పేర్కొన్నారు.

 రెంటాల జయదేవ్: శ్రీహరి మరణ వార్త టాలీవుడ్ ను దిగ్భాంతి కలిగించిందని అన్నారు. శ్రీహరి సినీ పరిశ్రమలో తనకు తానుగా పైకి వచ్చాడని చెప్పారు. శ్రీహరి కుటుంబానికి సినీ పరిశ్రమతో ఎటువంటి సంబంధంలేకున్నా కష్టపడి పైకి వచ్చారని అన్నారు.

 డైరెక‌ర్టర్‌ సాగర్ : టాలీవుడ్ లో శ్రీహరి గొప్ప మనిషి అని అన్నారు. ఇండస్ట్రీలో అందరితో స్నేహభావంతో మెలిగేవాడని అన్నారు. సినిమా పరిశ్రమలో కింది స్ధాయిలో పనిచేసేవారిని ప్రోత్సహించేవాడని తెలిపారు.

 నిర్మాత, కాట్రగడ్డ మురారి : శ్రీహరి మరణం తనకు బాధ కలిగించిందని అన్నారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా అనే సినిమాలో శ్రీహరి ప్రదర్శించిన నటన అద్భుతమని అన్నారు.

తమిళనటుడు సూర్య ఆరు లక్షల విరాళం!


ప్రముఖ తమిళ నటుడు సూర్య తమిళనాడు కిడ్ని రిసెర్చ్ (టాంకర్) ఫౌండేషన్ కు ఆరు లక్షల రూపాయలను విరాళమందించారు.

మూత్ర పిండాల వ్యాధికి సంబంధించిన చికిత్సకు ఉపయోగించే డయాలిసిస్ యంత్రాల కొనుగోలు కోసం సూర్య విరాళాన్ని అందించారు. తమిళనాడులోని సూలూరులో డయాలిసిస్ సెంటర్ ను ప్రారంభించిన సూర్య వార్తా ఏజెన్సీతో మాట్లాడుతూ... డయాలిసిస్ యంత్రాల కొనుగోలు కోసం 6 లక్షల విరాళం ఇచ్చాను అని తెలిపారు. ఆర్ధికంగా వెనుకబడిన కుటుంబాలకు టాంకర్ ఫౌండేషన్ సబ్సీడి ప్రాతిపాదికన డయాలిసిస్ పరీక్షల సేవలను అందిస్తోంది. టాంకర్ ఫౌండేషన్ 1993 సంవత్సరంలో ఏర్పడింది.