Thursday, 10 October 2013

Srihari Condolence Photos






























































ఆ అలవాటే బలి తీసుకుందా..?


రియల్ స్టార్ శ్రీహరి మరణం సగటు సినీ అభిమానిని ఆవేదనకు గురి చేసింది. ఆయనకు ఫ్యాన్స్ తో పని లేదు. ఆయన వ్యక్తిత్వం.. మంచితనం.. దానగుణం.. ఎవరైనా కష్టంలో ఉన్నారంటే తాను ఉన్నానంటూ ముందుకు దూసుకెళ్లే వైనం అందరినీ అలరిస్తాయి. చాలామంది యాక్టర్లు వెండితెర మీద హీరోలుగా జీవిస్తుంటారు.

 కానీ.. శ్రీహరి వారందరికీ భిన్నం. ఆయన రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ షేర్ ఖానే. అలాంటి వ్యక్తి ఆకస్మికంగా కన్నుమూయటం అందరినీ బాధిస్తోంది. పుట్టింది కృష్ణా జిల్లాలో అయినా.. తర్వాత జీవితం అంతా హైదరాబాద్ లోనే. కేవలం ఆయన మంచితనం వల్లనేమో.. ఒక ప్రాంతం అంటే మరో ప్రాంతం వారు మండిపడే ప్రత్యేక పరిస్థితుల్లోనూ.. అటు సీమాంధ్రులు, ఇటు తెలంగాణవాదులు ఆయన్ని తమ వాడిగా భావిస్తున్నాయి. సీమాంధ్రులతో పోలిస్తే.. తెలంగాణ వారు.. శ్రీహరి తమ బిడ్డ అని గర్వంగా చెప్పుకుంటాయి.

 ఇలాంటి వ్యక్తికి సంబంధించిన ఒక విషయాన్ని రాయటం కాస్త ఇబ్బందికరమే. కానీ.. ఈ విషయం నలుగురికి తెలియటం ద్వారా.. వేలాదిమంది ప్రాణాలను రక్షించే ఉద్దేశ్యంతో మాత్రమే దీన్ని రాస్తున్నాం. శ్రీహరి అనారోగ్యంతో మరణించారు. దానికి కారణం.. ఆయనకు ఉన్న ఒక్క చెడ్డ అలవాటు. నిజానికి చాలామంది మాదిరే దాన్ని ఆయన సీరియస్ గా తీసుకోలేదేమో. ఆయనకు గుట్కా నమిలే అలవాటు ఉంది. అది కూడా మోతాదుకు మించి గుట్కా తింటారని ఆయన సన్నిహితులు చెబుతారు. అదే ఆయన అనారోగ్యానికి మూలకారణంగా చెబుతారు. అయితే.. ఆయన ఆ విషయాన్ని గుర్తించేసరికే ఆరోగ్యం బాగా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేస్తారు. ఒక మంచి మనిషి నాలుగు రోజులు ఎక్కువ బతికితే.. 400 మందికి లాభం. ఒక్క అలవాటు అలాంటి వ్యక్తిని అందనంత దూరానికి తీసుకెళితే.. అది లక్షలాది మందిని నష్టపరుస్తుంది. శ్రీహరిని నిజంగా అభిమానించే వారు చేయాల్సింది ఒక్కటే. గుట్కా..పాన్ మసాలా అలవాటు ఉన్న వారికి.. రియల్ హీరో ఉదంతం గురించి చెప్పి అయినా మాన్పించాలి. అదే ఆయన ఆత్మకు శాంతిని చేకూరుస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. పీఎస్ – శోకతప్తంతో ఉన్న సమయంలో ఆయనకు సంబంధించిన వ్యక్తిగత విషయాన్ని వార్తగా రాయటానికి కారణం.. సంచలనం చేసేందుకు కాదు. కేవలం సామాజిక స్పృహను పెంచటం కోసం.. లక్షలాది మందిని హెచ్చరించటం కోసం మాత్రమేనని గమనించాలి.

Wednesday, 9 October 2013

Funny Spoof Video Of RAHUL GANDHI


watch this it is very funny about rahul gandhiji

షాక్ కు గురైన జగన్


ఆమరణ దీక్ష చేస్తున్న జగన్ కు బుధవారం సాయంత్రం అందిన విషాద వార్త షాక్ కు గురిచేసిందంటున్నారు. మంచి మనిషిగానే కాకుండా తన నటనతో ఎందరినో మెప్పించిన నటుడు శ్రీహరి మరణ వార్త జగన్ ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందట. కారణం ఆయన ఈ మద్యనే తన జన్మదిన వేడుకల సంధర్భంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని ప్రకటించారు. అది కూడా వైఎస్సార్ సిపి పార్టీ నుంచే అన్న వార్తలు వెలుబడ్డ విషయం తెలిసిందే. శ్రీహరి వైఎస్సార్ సిపి లోకి వస్తే హైదరాబాద్ లో పార్టీ మంచి బలాన్ని పుంజుకుంటుందని భావించారు.

 అలాంటిది హఠాత్తుగా శ్రీహరి మరణం వైఎస్సార్ సిపి కి తీరని లోటే అన్న వాఖ్యలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే ఆయన అధికారికంగా వైఎస్సార్ సిపిలో చేరనప్పటికి హైదరాబాద్ లోని కూకట్ పల్లి నియోజక వర్గం నుంచి జగన్ పార్టీ టికెట్ తోనే పోటీ చేస్తాడని భావించారు. ఆయన కూడా ఆ వార్తలను తోసిపుచ్చకపోవడంతో జగన్ పార్టీలో చేరడం ఖాయం అనుకున్నారు. జగన్ జైలు నుంచి రావడంతో ఇక ఆయన చేరుతాడు అనుకుంటున్న తరుణంలో మరణించడం వైఎస్సార్ సిపి ని కూడా విషాదంలో ముంచింది. మంచి మనసున్న మనిషి ప్రజాప్రతినిధిగా వస్తే ప్రజలకు కూడా ఎంతో మేలు కలుగుతుందని భావిస్తున్న తరుణంలో కాలేయ వ్యాధితో మరణించడం రాష్ట్ర రాజకీయాలకు కూడా తీరని లోటే. పిన్న వయసులో మరణించడం అందరిని విషాదానికి గురిచేసింది. ఆయన మృతికి చిరంజీవి, ముఖ్యమంత్రి కిరణ్ తో పాటు పలువురు రాజకీయ, సినీరంగ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

ప్రణీతని ఎవరూ అడగలేదట!


ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో అప్పుడెప్పుడో ఎంట్రీ ఇచ్చిన ప్రణీతకి ఇప్పటికి కాస్త ఆనందపడే టైమొచ్చింది. ఎన్ని సినిమాలు చేసినా హిట్ రాకపోయేసరికి తన పని అయిపోయిందని బెంగపడిన సుందరాంగికి అత్తారింటికి దారేది పుణ్యమా అని కాస్త మనసు కుదుటపడింది. తనకి మంచి రోజులు వచ్చాయని, ఇకముందు మంచి మంచి అవకాశాలు తలుపు తడతాయని ఆశపడుతోంది.

 అయితే అత్తారింటికి దారేది రిలీజైన కొన్ని రోజులకి... పవన్ తర్వాతి సినిమాలో కూడా ప్రణీతే హీరోయిన్ అన్న వార్త బయటికొచ్చింది. కాజల్, సమంత, శృతీహాసన్ తదితర నటీమణులందరినీ పరిశీలించినా... డేట్స్ కుదరక కొందరు, ఇతరత్రా కారణాల వల్ల కొందరు భాగ్యలక్ష్మి పాత్రకు ఎస్ చెప్పలేదు. దాంతో ప్రణీతను తీసుకుందామని పవన్ కళ్యాణ్ అన్నాడని, దర్శకుడు సంపత్ నంది కూడా అందుకే సమ్మతించాడని అన్నారు. అత్తారింటికి దారేదిలో సమంత కంటే ప్రణీతకే ఎక్కువ మార్కులు పడటంతో, ఇది నిజమే అయివుంటుంది అనుకున్నారంతా.

కానీ అది కేవలం పుకారేనని తేలిపోయింది. గబ్బర్ సింగ్ 2 లో నన్ను తీసుకోవడమేంటి, అసలు నన్నెవరూ అడగందే అంటూ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టింది ప్రణీత. ఇంకా నేనే సినిమాలోనూ బుక్ కాలేదు. మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. కొన్ని అవకాశాలు వచ్చాయి కానీ, ఇంకా ఆలోచనలోనే ఉన్నాను అంటూ చెప్పుకొచ్చిందీ చేపకళ్ల సుందరి. ప్రణీతను కూడా తీసుకోలేదంటే మరి ఈ సినిమాకి మరెవరిని తీసుకుంటారబ్బా. ఎవరైనా బాలీవుడ్ భామను పట్టుకొస్తారో ఏమో!

బాహుబ‌లి ముక్కల‌య్యింది



క్రేజీ చిత్రాల ద‌ర్శకుడు రాజ‌మౌళి అప్‌క‌మింగ్ ఫిల్మ్ బాహుబ‌లిపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంతకాలం ఇది నిజ‌మా, లేక అబ‌ద్ధమా అంటూ డైల‌మాలో ఉన్న సిని ప్రేక్షకుల‌కు ఓ క్లారిటి వ‌చ్చింది. బాహుబ‌లి మూవీ పీరియాడికల్ డ్రామ కావ‌డంతో దీనిని కేవ‌లం రెండున్నర గంట‌ల‌కే ప‌రిమితం చేయాల‌ని రాజ‌మౌళి అనుకోవ‌డంలేదు.

 ఈ మూవీను రెండు పార్టులుగా విభ‌జించాలి క్లారిటికి వ‌చ్చాడు. మొద‌టి పార్టులో, రెండ‌వ పార్లులో ఎటువంటి సీన్స్‌ను పెట్టాలి అన్నదానినై రాజ‌మౌళి క్లారిటిగా ఉన్నాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రానా దగ్గుబాటి ప్రభాస్‌కి తమ్ముడి పాత్రలో కనిపించనున్నాడు. అనుష్క హీరోయిన్‌గా, అలాగే రమ్య కృష్ణ, నాజర్, సత్యరాజ్ మొదలైన సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే మూవీను రెండు పార్టులుగా రిలీజ్ చేయాలంటే మొద‌టి పార్ట్ కంటే రెండో పార్ట్ ఇంకా అద్భుతంగా ఉండాలి. ఇక్కడే రాజ‌మౌళి త‌న ద‌ర్శక‌త్వ ప్రతిభ‌ను క‌న‌బ‌రిచాడు.

 మొదటి పార్టులో రానా,అనుష్కల‌ను ఎక్కువుగా ఫోక‌స్ చేసి, రెండ‌వ పార్టులో ప్రభాస్‌,రానా,అనుష్కల మ‌ధ్య బ‌ల‌మైనా స‌న్నివేశాల‌తో న‌డిపించాల‌ని నిర్ణయించుకున్నాడు. కాని రెండు పార్టుల‌కు సంబంథించిన షూటింగ్‌ను మాత్రం ఒకేసారి పూర్తిచేస్తున్నారు. దీంతో బాహుబ‌లి మూవీ పార్ట్‌1, పార్ట్‌2గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అందర్నీ ఆశ్చర్య పెడుతున్న నాగ్ నిర్ణయం..


గతంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సంస్థ పై నాగార్జున సినిమాలు బాగా తీసేవాడు. కానీ చిత్ర పరిశ్రమలో వచ్చిన మార్పుల నేపధ్యంలో నాగ్ తన సొంత సినిమాలు తీయడం తగ్గించు కున్నాడు. చివరకు తన పెద్ద కుమారుడు నాగచైతన్య కెరియర్ కు సంబంధించి బయట సినిమాలే చేయిస్తూ వచ్చాడు. అయితే హాటత్ గా నాగ్ తన నిర్ణయం మార్చుకుని మళ్ళీ వరుస పెట్టి తన సొంత సినిమాలు తీయడం టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం మళ్ళీ నాగార్జున సొంత సినిమాల నిర్మాణం వెనుక ఒక ఆశక్తికర కధనం వినిపిస్తోంది.

నాగార్జున క్రితం సంవత్సరం నటించిన ‘డమరుకం’ ఆర్ధిక సమస్యలలో చిక్కుకున్నప్పుడు నాగ్ ఆ సినిమా నిర్మాతకు తన పారితోషికాన్ని తిరిగి ఇచ్చివేయడమే కాకుండా ఇంకా అనేక విధాల సహాయం చేయవలసి వచ్చింది అన్న విషయం తెలిసిందే. అదేవిధంగా ప్రస్తుతం నాగ్ చైతూ నటించిన ‘అటోనగర్ సూర్య’ బాధ్యతను కూడా తలకేత్తుకోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇన్ని విధాలుగా సహాయం చేసిన ఆ సినిమాలు ఫెయిల్ అవ్వడంతో ఎవరికో డబ్బు ఇచ్చి నష్టపోవడం కంటే తానే జాగ్రత్తగా అన్నీ చూసుకుంటూ సినిమాలు నిర్మిచడం మంచిది అన్న ఆలోచనతో ఒకేసారి రెండు భారీ చిత్రాలు ‘భాయ్’, ‘మనం’ సినిమాలను నిర్మిస్తున్నాడనే వార్తలు వినబడుతున్నాయి. ఈ సినిమాలకు అప్పుడే ప్రీ రిలీజ్ పోజిటీవ్ టాక్ రావడంతో సినిమాలు ఇంకా విడుదల కాకుండానే ‘గుండెజారి గల్లంతయ్యిoదే’ దర్శకుడు విజయ్ కుమార్ తో మరో సినిమాను ప్రారంభిస్తున్నాడు అనే వార్తలను వింటున్న ఫిలింనగర్ వర్గాలు నాగ్ దగ్గర ఇంత డబ్బు ఉందా? అంటూ సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలలో వ్యాపారం చేయడం బాగా తెలిసిన నాగార్జున ఆలోచనలను పసి కట్టడం అంత సులువైన పనికాదు అనీ, ఆ సెటైర్లు వేస్తున్న వారికి తెలియదు కాబోలు…