ఆమరణ దీక్ష చేస్తున్న జగన్ కు బుధవారం సాయంత్రం అందిన విషాద వార్త షాక్ కు గురిచేసిందంటున్నారు. మంచి మనిషిగానే కాకుండా తన నటనతో ఎందరినో మెప్పించిన నటుడు శ్రీహరి మరణ వార్త జగన్ ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందట. కారణం ఆయన ఈ మద్యనే తన జన్మదిన వేడుకల సంధర్భంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని ప్రకటించారు. అది కూడా వైఎస్సార్ సిపి పార్టీ నుంచే అన్న వార్తలు వెలుబడ్డ విషయం తెలిసిందే. శ్రీహరి వైఎస్సార్ సిపి లోకి వస్తే హైదరాబాద్ లో పార్టీ మంచి బలాన్ని పుంజుకుంటుందని భావించారు.అలాంటిది హఠాత్తుగా శ్రీహరి మరణం వైఎస్సార్ సిపి కి తీరని లోటే అన్న వాఖ్యలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే ఆయన అధికారికంగా వైఎస్సార్ సిపిలో చేరనప్పటికి హైదరాబాద్ లోని కూకట్ పల్లి నియోజక వర్గం నుంచి జగన్ పార్టీ టికెట్ తోనే పోటీ చేస్తాడని భావించారు. ఆయన కూడా ఆ వార్తలను తోసిపుచ్చకపోవడంతో జగన్ పార్టీలో చేరడం ఖాయం అనుకున్నారు. జగన్ జైలు నుంచి రావడంతో ఇక ఆయన చేరుతాడు అనుకుంటున్న తరుణంలో మరణించడం వైఎస్సార్ సిపి ని కూడా విషాదంలో ముంచింది. మంచి మనసున్న మనిషి ప్రజాప్రతినిధిగా వస్తే ప్రజలకు కూడా ఎంతో మేలు కలుగుతుందని భావిస్తున్న తరుణంలో కాలేయ వ్యాధితో మరణించడం రాష్ట్ర రాజకీయాలకు కూడా తీరని లోటే. పిన్న వయసులో మరణించడం అందరిని విషాదానికి గురిచేసింది. ఆయన మృతికి చిరంజీవి, ముఖ్యమంత్రి కిరణ్ తో పాటు పలువురు రాజకీయ, సినీరంగ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
No comments:
Post a Comment