Monday, 7 October 2013

విద్యుత్ అంతరాయంతో నిలిచిపోయిన పలు రైళ్ళు


విజయవాడ,, అక్టోబర్ 7 : విద్యుత్ ఉద్యోగుల సమ్మె కారణంగా ఎన్టీటీపీఎస్ ఏడవ యూనిట్‌లో కూడా విద్యుదుత్పత్తి నిలిచిపోవడంతో రైళ్ళకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. సోమవారం నుంచి రైళ్ళకు కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోవటం వల్ల నగరం నుంచి బయలుదేరే అన్నిముఖ్య మైన రైళ్ళను రద్దు చేశారు. అడపాదడపా డీజిల్ రైలింజన్‌లతో కొన్ని రైళ్ళను నడిపినప్పటికి రైల్వేకి ఈ ప్రక్రియ చాలా భారంగా మారనుంది. తీవ్రమైన కష్టాల్లో ఉన్న రైల్వే శాఖ డీజిల్ ఇంజన్లతో రైళ్ళను నడిపే పరిస్థితి కనిపించటం లేదు.

రద్దయిన రైళ్ల వివరాలు, హెల్ప్‌లైన్ నెంబర్లు

 - విజయవాడ - ఒంగోలు - విజయవాడ పాసింజర్ (రెండువైపులా)

 - తెనాలి - ఒంగోలు,

 తెనాలి - గుంటూరు పాసింజర్ (ఆదివారం)

 - ఒంగోలు - గూడురు పాసింజర్

 - విజయవాడ - గుంటూరు - విజయవాడ పాసింజర్ (ఆదివారం)

- డోర్నకల్ జంక్షన్ - విజయవాడ - డోర్నకల్ జంక్షన్ పాసింజర్ (ఆదివారం)

 - కాజిపేట జంక్షన్ - విజయవాడ పాసింజర్ (ఆదివారం)

 - తిరుపతి - గూడురు పాసింజర్ (ఆదివారం)

 - విజయవాడ- బిట్రగుంట పాసింజర్ (ఆదివారం)

 - బిట్రగుంట- విజయవాడ పాసింజర్ (సోమవారం)

 - బిట్రగుంట - చెన్నై పాసింజర్ (సోమవారం)

 - చెన్నై - గూడూరు పాసింజర్ (సోమవారం) ఎక్స్‌ప్రెస్ రైళ్లు

- చెన్నై సెంట్రల్ - విజయవాడ పినాకిని ఎక్స్‌ప్రెస్ (ఆదివారం)

 - విజయవాడ - చెన్నై సెంట్రల్ జన్‌శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ (సోమవారం)

 - విజయవాడ - చెన్నై సెంట్రల్ జన్ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ (ఆదివారం)

 - చెన్నై సెంట్రల్ - విజయవాడ జన్‌శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ (సోమవారం దారి మళ్లించినవి - తిరుపతి - సికింద్రాబాద్ పద్మావతి ఎక్స్‌ప్రెస్ (రేణిగుంట, గూటి, డోన్, కాచిగూడ మీదుగా) - తిరుపతి - సికింద్రాబాద్ నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ (రేణిగుంట, గూటీ, డోన్, కాచిగూడ మీదుగా)

 రైల్లు రద్దయిన నేపథ్యంలో రైల్వే శాఖ హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేసింది.

వాటి వివరాలు, ఫోన్ నంబర్లు :
విజయవాడ హెల్ప్ లైన్ నెంబర్ : 0866-2576796 (10లైన్స్), 0866-2575038, 9701373073
నెల్లూరు : 0861-234866, 2345864
 ఒంగోలు : 0852-280202, 280203
రాజమండ్రి : 0883-2420541, 24205543

సీఎంతో జరిగే చర్చల్లో పాల్గొంటాం : అశోక్‌బాబు


హైదరాబాద్, అక్టోబర్ 7 : ముఖ్యమంత్రి కిర్‌ణ్‌కుమార్‌రెడ్డితో ఎల్లుండి(బుధావారం) జరిగే చర్చల్లో పాల్గొంటామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు వెల్లడించారు. కేబినేట్ ఉప సంఘంతో ఎలాంటి చర్చలు జరపలేదని, కేవలం మర్యాదపూర్వకంగానే కలిశామని అశోక్‌బాబు తెలిపారు.

రాత్రి వేళలో విద్యుత్ సరఫరా : విద్యుత్ జేఏసీ


విజయవాడ, అక్టోబర్ 7 : సమైక్యాంధ్ర కోసం సమ్మె బాట పట్టిన విద్యుత్ ఉద్యోగులు కాస్త శాంతించారు. సోమవారం ఉదయం సమావేశమైన సమైక్య విద్యుత్ జేఏసీ నేతలు తమ సమ్మెలో కొద్ది మార్పులు చేశారు. ఇకపై ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేసి, రాత్రి వేలల్లో విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించినట్లు విద్యుత్ జేఏసీ సమైక్య నేత సత్యానందం తెలిపారు.

పీడీ యాక్ట్ కింద ఉద్యోగులను అరెస్ట్ చేయాలి: పాల్వాయి


హైదరాబాద్: సమ్మెను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉపేక్షించడం సరికాదని, తక్షణమే పీడీ యాక్ట్‌ కింద ఉద్యోగులను అరెస్ట్‌ చేయాలని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన రెడ్డి డిమాండ్ చేశారు. విద్యుత్‌ సంక్షోభం తలెత్తకుండా ఉద్యోగుల సేవలను తీసుకోవాలని కోరారు.

 అసెంబ్లీకి వచ్చే తెలంగాణ తీర్మానంపై ఓటింగ్‌ ఉండదని ఆయన చెప్పారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను మాత్రమే తీసుకుంటారన్నారు. తీర్మానాన్ని ఓడిస్తామంటూ సీఎం కిరణ్‌ సమైక్యవాదులను మభ్యపెడుతున్నారని విమర్శించారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆస్తుల దాడి వెనుక ఎంపీ లగడపాటి రాజగోపాల్ హస్తం ఉందని పాల్వాయి ఆరోపించారు.

జీవిత రాజ‌శేఖ‌ర్‌ పై నాన్ బెయిల‌బుల్ వారెంట్‌


జీవిత రాజ‌శేఖ‌ర్‌పై నాన్ బెయిల‌బుల్ అరెస్ట్‌ వారెంట్ జారి అయింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కొద్దిసేప‌టి క్రిత‌మే కోర్టు నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఓ ఫైనాన్షియ‌ర్‌కు సంబంధించిన మ‌నీ మేట‌ర్‌లో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. ప‌రందామ రెడ్డి అనే ఫైనాన్షియ‌ర్‌కు ముప్పై ఆరుల‌క్షల రూపాయ‌ల చెక్‌ను ఇచ్చారు. ఆ చెక్ కాస్త బౌన్స్ కావ‌డంతో వ్వవ‌హారం ఇంత వ‌ర‌కూ వ‌చ్చింది.

 చెక్ బౌన్స్ అయిన త‌రువాత ప‌రందామ‌రెడ్డి దాన్ని కోర్టు వ‌ర‌కూ తీసుకువెళ్ళాడు. దీనికి సంబంధించిన విచార‌ణ కొర‌కు కోర్టుకు హాజ‌రు కావాల‌ని జీవితారాజ‌శేఖ‌ర్‌కి నాంప‌ల్లి కోర్టు నోటీసుల‌ను పంపింది. జీవితారాజ‌శేఖ‌ర్‌ రెండు సార్లు కోర్టుకు హాజ‌రుకాలేదు. కోర్టు నోటీసుల‌ను ప‌ట్టించుకోని జీవితారాజ‌శేఖ‌ర్‌ల‌కు ఇప్పుడు నాంప‌ల్లి కోర్టు నాన్‌బెయిల‌బుల్ అరెస్ట్‌ను జారీచేసింది. ఈనెల 29లోపు జీవితరాజ‌శేఖ‌ర్‌ని అదుపులోకి తీసుకొని కోర్టుకు హాజ‌రుప‌ర‌చాల‌ని దీనికి సంబంధించిన ప‌నిని జూబ్లిహిల్స్ పోలీస్‌స్టేష‌న్‌ను అప్పగించింది.

జియాఖాన్ డెడ్ బాడీ ఫోటోలు: ఎక్స్ క్లూజివ్‌


బాలీవుడ్‌లో సంచ‌ల‌నం రేపిన జియాఖాన్ ఆత్మహ‌త్యను పోలీసులు ఛేధించి, జ‌రిగిన ఇన్సిడెంట్ అంతా ఓ ఆత్మహ‌త్యగా కేసును ఫైల్ చేశారు. జియాఖాన్ భాయ్ ప్రెండ్ సూర‌జ్ పంచోలి ఈమెను హ‌త్య చేశాడ‌ని, జియాఖాన్ త‌ల్లిదండ్రులు ఎంత వాధించిన‌, రాజ‌కీయ ఒత్తిళ్ళతో అది ఆత్మహ‌త్యగానే పోలీసులు వ‌ర్ణించారు.

 జియాఖాన్ ఆత్మహత్యకు సంబంధించిన ఫోర్సెనిక్ వివరాల్ని పోలీసులు సైతం బ‌య‌ట‌కు చెప్పటానికి నిరాక‌రించారు. దీంతో జియాఖాన్ మ‌ర‌ణం ఖ‌చ్చితంగా హ‌త్యే అని లోకానికి తెలిసినా, ఎవ‌రూ ఏమి చేయ‌లేని ప‌రిస్థితి. జూన్ 3న జ‌రిగ‌న ఈ సంఘ‌ట‌కు యావ‌త్ ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ దిగ్భ్రాంతి చెందింది. అయితే లేటెస్ట్ ఈ కేసులో మ‌రో కొత్త కొణం బ‌య‌ట‌కు వ‌చ్చింది.


జియాఖాన్‌ది హ‌త్యే అంటూ త‌ల్లి ర‌బియా అమిన్ జియా కొన్ని ఫోటోల‌ను బ‌య‌ట‌కు రిలీజ్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటోలు సంచ‌ల‌నంగా మారింది. ఆ ఫోటోల‌లో జియాఖాన్ మెడ‌పై ఎన్నో ర‌కాల గుర్తులు స్పష్టంగా క‌నిపించాయి. కూతురి మ‌ర‌ణాన్ని ఆత్మహ‌త్యగా మార్చి, దోషి త‌ప్పించార‌నే ఆవేద‌న‌తో త‌ల్లి రబియా ఇప్పుడు అస‌లైన ఆధారాల‌ను బ‌య‌ట పెట్టి, న్యాయాన్ని కోరుతుంది. ఈ ఆధారాల‌ను చూసిన పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి మ‌రి.

దిగ్విజయ్... దిమాఖ్ ఉందా


రాష్ట్రంలోని రాజకీయ నాయకుల్లోనే కాదు, సగటు తెలుగువాడు కూడా తాజాగా అంటున్న మాటలవి, దిగ్విజయ్ నీకు ధిమాఖ్ ఉందా, పిచ్చోడు కూడా ఇలా మాటలు మార్చడు, మీ నోట వెల్లిన ప్రతిమాటతో రాష్ట్రంలో విద్వేషాలు పెరిగిపోతున్నాయి, ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఇప్పడు కేంద్రమంత్రిగా ఉన్న నీలాంటి నేతలు మెంటల్ గాల్లకంటే కూడా హీనంగా ప్రవర్థిస్తే ఏమన్నట్టు’ దీనికి కారణం ఊసరవెల్లి రంగులు మార్చే వేగానికి రెట్టింపు వేగంతో దిగ్విజయ్ సింగ్ మాటలు మారుస్తున్నాడు అన్న వాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. లేటెస్టుగా మాట్లాడుతూ రాష్ట్ర విభజన బిల్లు, ముసాయిదా అసెంబ్లీకి రెండు సార్లు వస్తాయన్నారు. రాజ్యాంగ బద్దంగా విభజన ఉంటుందని చెప్పారు.

 అలా చేయకుండా తాము అపవాదును మూటగట్టుకోమని చెప్పారు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయమని చెప్పారు. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు హైదరబాద్ లో పాలన గవర్నర్ లేదా కేంద్రం చేతిలో ఉండే విదంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. అంతకు ముందు హైదరాబాద్ మూడు ప్రతిపాదనలన్నాడు, ఓ సారి యూటి అన్నాడు, మరోసారి దేశానికి రెండో రాజధాని అన్నాడు, ఇంకో సారయితే ఏకంగా హైదరాబాదే ఒక ప్రత్యేక రాష్ట్రం అంటే ఢిల్లీ తరహాలో చేసే యోచన ఉందన్నారు. ఇక తెలంగాణ విభజన బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ తీర్మాణం అవసరం లేదన్నాడు, డైరెక్టుగా పార్లమెంట్ ద్వారానే చేసేస్తామన్నారు. ఇప్పుడేమో ఇలా మాట మార్చాడు. అందుకే దిగ్విజయ్ సింగ్ ను ఓ పిచ్చోడు అంటూ ఏపి అంతా భావించే పరిస్థితి నెలకొందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు

భ‌యం గుప్పిట్లో రోజా వ్వయ‌హారం


టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో రోజా రూటే స‌ప‌రేటు. టాప్ హీరోయిన్ నుండి స‌పోర్టింగ్ రోల్స్ వ‌రకూ రోజా ఏ పాత్ర చేసినా అది ఓ రేంజ్‌లో ఉంటుంది. సినిమాల‌కు స్వస్తి చెప్పి, పొలిటికల్ ఎంట్రి ఇచ్చిన రోజా అక్కడ కూడ త‌న‌దైన ట్రెండ్‌ను క్రియోట్ చేసుకుంది. త‌ను ఏ పార్టిలో ఉన్నా, ఆపోజిష‌న్‌ పార్టీ లీడ‌ర్స్‌కు త‌న నోటితోనే ద‌డ పుట్టిస్తుంది. ఏవ‌రైనా రోజా జోలికి వెళ్ళాలంటేనే భ‌య‌ప‌డేలా చేస్తుంది. ఇలాంటి ప‌ర్ససాలిటికి ఇప్పుడు భ‌యం ప‌ట్టుకుంది.

 అది పార్టీ లీడ‌ర్స్ నుండి కాదు. ఫిల్మ్ ఆఫ‌ర్స్ గురించి కాదు. త‌న సొంత ప్యామిలీ నుండి రోజాకు ప్రాణ‌భ‌యం ప‌ట్టుకుంది. రోజా త‌మ్మడు ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడంట‌. త‌న ఇబ్బందులు తీరాలంటే డ‌బ్బును అరేంజ్ చేయాల‌ని రోజాపై త‌మ్ముడు ఒత్తిడి తెస్తున్నాడు. అంతే కాకుండా రోజా మేనేజ‌ర్ కూడ త‌మ్ముడితో క‌లిసి బెదిరింపుల‌ను మొద‌లుపెట్టారంట‌. ఈ విష‌యంపై రోజా పిర్యాదు చేసింది.

‘తన సోదరుడు ఏదో ఇబ్బందుల్లో ఇరుక్కున్నాడు, దానిలో నుంచి బయట పడటానికి తనని డబ్బు ఇవ్వమని వేదిస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే తన గురించి తప్పుడు ప్రచారం చేస్తామని రామ్ ప్రసాద్ రెడ్డి, ప్రసాదరాజు బెదిరిస్తున్నారని’ దానికి సంబంధించిన వివ‌రాల‌ను చెప్పి పిర్యాదు చేయ‌డంతో ఇది ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఎట్ ప్రెజెంట్ రోజా సినిమాల్లో కొన్ని కీలక పాత్రలు చేస్తూ,అలాగే టీవీ షో లతో బిజీ బిజీగా ఉంటోంది. ఇటువంటి స‌మ‌యంలో తమ్ముడి నుండి వ‌స్తున్న ఈ త‌ర‌హా బెదిరింపులు త‌న‌ని నిద్రపోనివ్వడం లేదంట‌.