Friday, 4 October 2013

సమైఖ్య ఉద్యమం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యంగ్ హీరో ..!!


సామాన్యంగా మన యంగ్ హీరోలు ఆడియో వేడుకల స్టేజీల పైనా టివి షోలలోను హడావిడి చేస్తూ కనిపిస్తూ ఉంటారు. రాజకీయాల పై, రాజకీయ ఉద్యమాల పై సామాన్యంగా ఆమడ దూరంలో ఉంటారు. దీనికి విరుద్ధంగా నిన్నటి కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్ తరువాత ప్రస్తుతం మండిపోతున్న సమైఖ్యాంధ్ర ఉద్యమం పై హీరో నవదీప్ విచిత్రంగా స్పందించాడు.

అతని ట్విటర్ లో పెట్టిన అతడి మాటలు చూద్దాం ‘నేడే చూడండి మీ అభిమాన టివీ ఛానల్లో ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ హైడ్రామా మీరెప్పుడు గతంలో చూడనిది విననిది ఆలసించిన ఆశాభంగం’ అంటూ ఒక టివి ఎడ్వటైజ్ మెంట్ లా హీరో నవదీప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఈనాటి రాజకీయ ఉద్యమ నేపధ్యంలో అందర్నీ ఆకర్షించింది. పెద్దపెద్ద రాజకీయ నేపధ్యంగల కుటుంబాలనుంచి వచ్చిన యంగ్ హీరోలు నోరు మెదపకుండా రోజులు గడిపేస్తూ ఉంటే ఒక చిన్న హీరో ధైర్యంగా ఈనాటి రాజకీయనాయకులు ఆడుతన్న హైడ్రామాను విమర్శిస్తూ తన అభిప్రాయాన్ని తన ట్విటర్ లో పెట్టడం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది....

రూటు మార్చిన స‌ల్మాన్‌


స‌ల్మాన్‌ఖాన్ అంటేనే మాస్ హీరో. ఎట్‌ప్రెజెంట్ స‌ల్మాన్‌ బాలీవుడ్ మాస్ మూవీల‌కు లీడ‌ర్‌గా మారాడు. స‌ల్మాన్ ష‌ర్ట్ మ‌డ‌త‌పెట్టినా, వంద మంది విల‌న్లను చొక్కా కాల‌ర్‌తో దుమ్ముదులిపినా బాలీవుడ్ జ‌నాలు క్లాప్స్ కొట్టేస్తారు. బాలీవుడ్‌లో స‌ల్మాన్‌కు అంత‌టి మాస్ స్టార్‌డం క్రియోట్ అయింది. ఒక‌ప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఎక్కువ‌గా క‌నిపించే ఈ మాస్ ఫార్ములా, ఇప్పుడు బాలీవుడ్‌లో ఓ ట్రెండ్ అయింది. దీన్ని బాలీవుడ్‌కి ప‌రిచయం చేసిన హీరో స‌ల్మాన్‌ఖానే. ‘వాంటెడ్’, ‘రెడీ’, ‘దబాంగ్’, ‘బాడీగార్డ్’, ‘దబాంగ్ 2′, ‘ఏక్ థా టైగర్’ లాంటి మాస్ ఫిల్మ్స్‌తో మిగ‌తా హీరోల‌కు రోల్‌మోడ‌ల్ అయ్యాడు.

 ప్రస్తుతం స‌ల్మాన్‌కి ఆ మాస్ మూవీలంటే బోర్ కొడుతుంద‌ట‌. ‘ ఇప్పుడు మాస్ మసాలా సినిమాలు ఎడాపెడా వచ్చేస్తున్నాయి. ఒకే రకమైన విషయాలతో పదే పదే సినిమాలు తీసేస్తున్నారు. దీనివల్ల సృజనాత్మకత తగ్గిపోతుంది అలాగే జనాలకు విసుగొస్తుంది. ఇలాంటి మాస్ మసాల సినిమాకు త్వరలోనే కాలం చెల్లిపోతుందని’ స‌ల్లూభాయ్ ఓ ప్రెస్‌మీట్‌లో చెప్పాడు. స‌ల్మాన్ చెప్పిన స్టేట్‌మెంట్ కార‌ణంగా త‌రువాత రాబోతున్న మాస్ మూవీల క‌లెక్షన్స్‌పై, ఈ ఎఫెక్ట్ ఉంటుంద‌ని బిటౌన్ బాక్సాపీస్ అంటుంది. దీంతో స‌ల్మాన్ త్వర‌లోనే మాస్ చిత్రాల‌కు గుడ్ చెప్సేస్తున్నాడ‌ని అంద‌రూ అంటున్నారు.

చిరంజీవికి ప్రధాని ఫోన్


న్యూఢిల్లీ: కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవికి ప్రధాని మన్మోహన్ సింగ్ ఫోన్ చేశారు. మంత్రి పదవికి చేసిన రాజీనామా ఉపసంహరించుకోవాలని చిరంజీవిని ప్రధాని కోరారు. రాజీనామాపై పునరాలోచన చేయాలని కోరారు. అయితే ప్రధాని విజ్ఞప్తిని చిరంజీవి సున్నితంతా తిరస్కరించినట్టు సమాచారం.

రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం బాధించిందని చిరంజీవి అన్నట్టు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో కేంద్ర మానవరుల శాఖ మంత్రి పళ్లంరాజు సమావేశమయ్యారు. సీమాంధ్రలో పరిస్థితులను సోనియాకు ఆయన వివరించారు. ఈ ఉదయం ప్రధాని మన్మోహన్ సింగ్ తో పళ్లంరాజు భేటీ అయ్యారు.

'సీఎం పదవిపై మంత్రి ఆనం కన్ను'


నెల్లూరు: ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ ఏకపక్షంగా, నియంతలా వ్యవహరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ నోట్ ను కేంద్ర కేబినెట్ హడావుడిగా ఆమోదించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్ర ఎంపీలు రాజీనామాలు చేసుంటే రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో వెనక్కి తగ్గేదని ఆయన అన్నారు.

 సీఎం పదవిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కన్నేశారని ఆనం జయకుమార్‌రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవి కోసం గడ్డి తింటున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీని, ఆనం సోదరులను ప్రజలు క్షమించరని అన్నారు.

విభజనకు నిరసనగా రేపటి నుంచి జగన్ ఆమరణ దీక్ష


హైదరాబాద్ : కనివినీ ఎరగని రీతిలో రాష్ట్ర విభజన జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం లోటస్ పాండ్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మీ చావు మీరు చావండి అన్న రీతిలో కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరించిందన్నారు. కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట శనివారం నుంచి ఆమరణ దీక్షకు దిగనున్నట్లు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.

Nellore Boy Sucide Post In Facebook..


తన లైఫ్ సీక్రెట్ గుట్టు విప్పిన తాగుబోతు రమేష్ .



“అలా మొదలైంది” సినిమా నుంచి తాగుబోతు ఇమెజ్ సొంతం చేసుకుని తాగుబోతు రమేష్ గా మారిపోయిన ఈ కమెడియన్ ప్రస్తుతం టాప్ కమెడియన్ లిస్టులో ఒకడు. రమేష్ ఇంటిపేరు ఎవరికి తెలియకపోయినా తాగుబోతు రమేష్ అంటే చాలు ఇట్టే పట్టేస్తారు. ఈయన ఈమధ్య మహానంది పుణ్యక్షేత్రాన్నిదర్శించుకున్నప్పుడు అతడి అభిమానులతో పాటు మీడియా కూడా రమేష్ ను పలకరించింది.

 ఈ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ తన గురించి తెలియని విషయాల గుట్టు విప్పాడు రమేష్. తన తండ్రి సింగరేణి కార్మికుడిగా ఉండేవారని, ఆయన నిత్యం మద్యం తాగి ఇంటికి తూలుతూ రావడం, కేకలు వేయడం వంటివి చిన్నప్పటి నుంచి తను చూడటంతో తాగుబోతుల ముఖ కవళికలు ఎలా ఉంటాయి అనే విషయంతో పాటు తాగుబోతుల బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో తనకు చిన్నప్పటి నుంచి అనుభవం అయిందనీ అందుకే తాను తాగుబోతు పాత్రలను బాగాచేసి మెప్పించ గలుగుతున్నానని అన్నాడు. అంతకు ముందు తాను ఉత్సవాల సమయంలో చిన్నచిన్న ప్రదర్శనలు ఇచ్చేవాడినన్నారు.

 2006 నుంచి కొన్నేళ్లపాటు సినిమాల్లో వేషాలకోసం కళ్లుకాయలు కాసేలాగా ఎదురుచూశానని, చివరకు ‘జగడం’ సినిమాలో చిన్నపాత్ర దొరికి తనకు ఆశను చిగురించిందనీ చెపుతూ, కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘మహాత్మా’ సినిమాతో మంచి గుర్తింపువచ్చిందని అన్నాడు. ఇప్పటివరకూ దాదాపు వంద సినిమాల దాకా చేసానని చెపుతూ తన జీవితంలో ఎదురైన చేదుసంఘటనలు తనను హాస్య నటుడిగా మార్చయనీ తన తండ్రిని చూసినతరువాత తనకు తాగుబోతులంటే భయమని అంటున్నాడు రమేష్. తగుబోతులంటే భయపడే రమేష్ తాగుబోతు పాత్రలో రాణించడం యాదృచ్ఛికo అనుకోవాలి...

ప‌వ‌న్ కోసం బాల‌య్య ప్యామిలి క‌దిలి వ‌చ్చింది


అత్తారింటికిదారేది మూవీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న ప్యామిలీను క‌ల‌ప‌డం కోసం ఎంత‌గా శ్రమిస్తాడో అంద‌రూ చూశారు. ప‌వ‌న్ రీల్ లైఫ్‌లోనే కాదు, రియ‌ల్ లైఫ్‌లోనూ ఆ విధ‌మైన ఫీట్ చేశాడు. ప‌వ‌న్ మూవీను చూడ‌టానికి నంద‌మూరి ప్యామిటి ఒక‌టైపోయింది. నంద‌మూరి బాల‌కృష్ణ, త‌న‌ ప్యామిలితో అత్తారింటికి దారేది మూవీను రీసెంట్‌గా చూశాడు. బాల‌కృష్ణతో పాటు అక్క పురంధేశ్వరి కూడ ప్యామిలితో క‌లిసి ఆ మూవీను చూసింది. అత్తారింటికి దారేది మూవీపై వ‌చ్చిన స్పంద‌న తెలుసుకొని ఆ మూవీను చూడాలని బాల‌య్య నిర్ణయించుకున్నాడు. ఇంకేముంది వెంట‌నే మేనేజ‌ర్‌కి క‌బురు పెట్టి మూవీను చూడాల‌ని పుర‌మాయించాడు.

 ఆ త‌రువాత ప‌నులన్ని చ‌కాచ‌కా జ‌రిగిపోయాయి. బాల‌య్య ప్యామిలీ కోసం ప్రసాద్ ల్యాబ్‌లో అత్తారింటికి దారేది ప్రత్యేక షోను వేశారు. ప్యామిలి అంతా ప‌వ‌న్‌ మూవీను చూసి, ఫుల్ హ్యాపీగా ఉన్నార‌ని టాలీవుడ్ చెబుతుంది. బ‌య‌ట జ‌నాలు చెప్పుకున్నట్లుగా హీరోల మ‌ధ్య ఇగోలు ఉంటాయి, స్టేట‌స్ ఉంటుంది అని అంద‌రూ అనుకుంటారు. కాని ప‌వ‌న్ మూవీను స్వయంగా బాల‌య్యే ప్యామిలితో చూడంటంతో ఈ సెల‌బ్రిటీల మ‌ధ్య ఎటువంటి స్నేహ సంబంధం ఉందో అంద‌రూ అర్ధం చేసుకోవ‌చ్చంటున్నారు. ఈ సిచ్యువేష‌న్‌ను పొలిటిక‌ల్ యాంగిల్‌లో ఏ మాత్రం చూడ‌కుడ‌ద‌ని టాలీవుడ్ ఇండస్ట్రీ కూడ చెబుతుంది.